చరిత్రంటే నాకిష్టం.చరిత్రకి సంబంధించి ఏమైనా చదివినా, టీవీలో ఏదైనా ప్రొగ్రాము చూసినా వెంటనే దానిలో లీనమైపోతాను. కవితా సౌరభాలు వెల్లి విరిసిన రాయల వారి కాలం గురించి చదివినా, రాజ్య కాంక్షతో జీవితాంతం యుద్దాలతో గడిపేసిన అలెక్జాండరు జ్ఞప్తికి వచ్చినా, ఉన్మాదంతో ప్రపంచాన్ని అగ్నిగుండంగా మార్చేసిన హిట్లర్ మీద ఏదైనా ప్రోగ్రాము చూసినా ఏదో అవ్యక్తానుభూతి. అది దుఃఖమూ [...]
వారం క్రితం "హమ్మయ్య , సమస్యలన్నీ తీరిపోయాయి. ఇక రాయడం మొదలెట్టొచ్చు" అనుకున్నా. వారం గడిచినా అక్షరం ముక్క కూడా రాయలేదు. కొత్త ఊరు.కొత్త ఆఫీసు. పని ఎక్కువ.కానీ ఇవన్నీ కారణాలు కావు. అసలు తప్పంతా రోజుకి మూడు గంటల పైనే తినేస్తున్న ఆఫీసు ప్రయాణానిదే. ఒక నాలుగు మైళ్ళ కారు ప్రయాణం, అక్కడి నుంచి ఒక ఇరవై ఐదు నిమిషాల బస్సు ప్రయాణం. అక్కడినుంచి మళ్ళా ఇంకొక ఇరవై నిమిషాల రైలు [...]
మీడియా మీద మళ్ళీ మరో పోస్టు. మీడియా మీదే ఎందుకు అంటారా? ఏదో నా అభిమానం.ఇది మళ్ళీ నా అభిమాన దినపత్రిక "ఈనాడు" గురించే.ఏంచేస్తాం, నేను వేరేవి అంతగా చదవను.అప్పుడప్పుడూ జ్యోతి,సాక్షి చదవటం అలవాటు చేసుకుంటున్నా.కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కొన్నాళ్ళకి అసలు పేపరు చదవటం మానేస్తానేమో. ఎందుకంటే చాలా రోజులయింది చూసి కదాని కొన్ని రోజుల క్రితం జ్యోతి పేపర్ చూసా. నా ఖర్మ [...]
మరీ ఎంత అభిమాన పత్రికైనా ఈరోజు "ఈనాడు" లో సచిన్ డబుల్ సెంచరీ సందర్భంగా రాసిన వార్త చదవగానే భలే చిరాకేసింది. వార్త మెదటి పేరా చదివి నోరెళ్ళ బెట్టాను. ఆ మొదటి పేరా ఇలాఉంది."అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ తో మానవాళి చరిత్రను మరో మలుపు తిప్పినప్పుడు, రైట్ బ్రదర్స్ విమానంతో మనిషి ఊహలకు రెక్కలు తొడిగినప్పుడు, నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చందమామ పై తొలిసారిగా [...]
మొన్న లైబ్రరీకెళ్తే అక్కడ కనపడిందీ నలుపు-తెలుపు ఇంగ్లీషు సినిమా. పేరు 12 Angry men.తన తండ్రిని హత్య చేసిన నేరం మీద పట్టుబడ్డ ఒక పద్దెనిమిదేళ్ళ బాలుడి మీద కోర్టు విచారణతో సినిమా ఆరంభమవుతుంది. వాదోపవాదాలు ముగిసాక, కేసు ఎటూ తేలక, బాలుడు ముద్దాయా కాదా అనేది నిర్ణయించాల్సిందిగా జ్యూరీ సభ్యులని కోరతాడు జడ్జి. మొత్తం పన్నెండు మంది సభ్యులున్న జ్యూరీ సభ్యులు అందరూ ఒక రూములో [...]
అప్పుడెప్పుడో జంధ్యాల, విశ్వనాథ్ , ఆ తరువాత మణిరత్నం సినిమాలు మినహాయించి గత కొన్నేళ్లుగా పలానా సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూసిన గుర్తు లేదు. ఈ "అవతార్" సినిమా కోసం మాత్రం డిసెంబరు మొదటినుంచే ఎప్పుడు రిలీజవుతుందా అని ఎదురుచూసా. రిలీజయిన రోజే చూసేసా. మొత్తానికి నిరాశే మిగిల్చింది. బహుశా మరీ ఎక్కువ ఊహించుకున్నందువల్లనేమో అనిపించింది మొదట్లో. తరువాత [...]
మొన్న ఇండియన్ షాపులో వెచ్చాలు కొనుక్కొని చేతిలో ఉన్న క్రెడిట్ కార్డుని కౌంటర్లో ఉన్నాయనకిచ్చి పక్కకి తలతిప్పి చూస్తే అక్కడ షెల్ఫ్ లో కనపడిందొక తెలుగు సినిమా డీవీడి. ఆ సినిమా గురించి విన్నదీ, చదివిందీ గుర్తొచ్చింది. ఇంతమంది దానిగురించి అంతలా రాసారంటే అది ఎలా ఉన్నా చూడాలనే మొండి ధైర్యం కలిగిందా క్షణాన. కౌంటర్ దగ్గరున్నాయన్ని వారించి ఆ డీవీడీ ధర కూడ బిల్లులో [...]
కవితనుకున్నారా? అబ్బే కాదు. :)ఉద్యోగాన్వేషణలో నా ఈ-మెయిల్ , జాబ్ సైట్లూ, లేదా నా రెజ్యుమే తప్పితే వేరేవేమీ చూడటంలేదు ఈ మధ్య. పోయిన వారం వాతావరణ వార్తల్లో ఈ వారం మంచు పడొచ్చు అని చూచాయగా చెప్పగా విన్నాను. ఆ తరువాత మర్చేపోయాను. ఈరోజు పొద్దున్నే లేచి అలవాటుగా కిటికీలోంచి చూస్తే , ఎటుచూసినా దాదాపు అరడుగు ఎత్తున పరచుకున్న తెల్లటి మంచు. ఉద్యోగాన్వేషణలో ఉన్నానని తెలిసి [...]
"ఏమిటి, వెళ్ళక తప్పదా?""నీ ఇష్టం"మూడక్షరాల సమాధానమైనా , ముప్పై మూడు విరుపులు వినపడ్డాయి నాకు.అలవాటు ప్రకారం టీవీ కింద డీవీఆర్ కి ఉన్న ఎలక్ట్రానిక్ క్లాక్ వైపు దృష్టి సారించాను. సమయం సాయంత్రం ఏడు గంటలు.కిటికీ వైపు తల తిప్పాను. నవంబరు నెల. అప్రయత్నంగా పొద్దున్న చూసిన వెదర్ రిపోర్ట్ గుర్తుకొచ్చింది. సన్ సెట్ ఎట్ 4:30. నాలుగున్నరకే సూర్యాస్తమయం. ఏడింటికే దట్టమైన చీకట్లు. [...]
నిన్న ఇంటర్నెట్లో ఏదో వెతుకుతూ ఉంటే తెలుగు FM రేడియో తాలూకు లింకు కనపడింది. మూడో నాలుగో స్టేషన్లు కనపడ్డాయి. నాకుగుర్తుండి "రేడియో మిర్చీ" లింకు నొకినట్టున్నాను. రేడియో జాకీ ఇంగ్లీషూ, తెలుగూ కలగలపిన సంకర భాషలో ఏదేదో వాగేస్తోంది. నిన్న ఇక్కడ అమెరికాలో హేలోవిన్ ( దెయ్యాల పండగ). ఆ రేడియో జాకీ కూడా ఈ పండగ గురించే చెప్తోంది."You can wear any costume ..like...witch, vampire, or a "hot nurse" " అంటూ ఏదేదో చెప్తోంది. [...]
ఈరోజు ఏవో కొన్ని పాత తెలుగు పాటలు వింటున్నప్పుడు "అదృష్టవంతుని ఆత్మకథ" లో దాశరధి గారి గురించి నరసరాజు గారు రాసిన ఒక విషయం గుర్తుకొచ్చింది."నడిరేయి ఏ ఝాములో , స్వామి నినుచేర దిగివచ్చునో " ( సినిమా: రంగుల రాట్నం ) పాట రికార్డింగు టైములో , ఆ పాట రచయిత దాశరధి గారికి ఉన్నట్టుండి ఒక సందేహమోచ్చిందట. పక్కనే ఉన్న నరసరాజు గారితో "నడిరేయి ఏ ఝాములో ఏమిటండీ, నడిరేయి అంటే ఒకటే ఝాము [...]
కొన్నెందుకో అలా గుర్తుండి పోతాయి. ఎన్నేళ్ళయినా మసకబారవు.కారణం తెలీదు.ఎర్లీ ఎనభైల్లో మాట అన్నమాట. నేనప్పుడు ఆరోతరగతి. మా తెలుగు మాష్టారింటికి ట్యూషను కెళ్ళేవాడిని . ఆయన పేరుకు తెలుగు మాష్టారయినా ఒక్క లెక్కలు తప్ప అన్నీ చెప్పేవారు. అదే ట్యూషనుకి లెక్కలు చెప్పడానికి సత్తార్ అనే మాష్టారింకోకాయన వచ్చేవారు. వారి గురించి ఇంకెప్పుడైనా.పొద్దున్నే ఆరింటికి ట్యూషను. ఐదు [...]
మొన్న వార్తలు చూసి చూసి బోరుకొట్టి అలా అన్ని ఛానళ్ళు తిరగేద్దామని చూస్తుంటే ఈ సినిమా తగిలింది. సినిమా పేరు " Some like it hot". ఏ సినిమా అయినా దానిగురించి ఏ,బీ,సీ లు తెలియకుండా చూడడం నా స్వభావానికి విరుద్దం. వెంటనే గూగులమ్మని అడిగితే ఇదొక కామెడీ సినిమా అని చెప్పింది. అప్పుడే పేర్లు పడుతున్నాయి. కామెడీ కదా చూద్దాం అని కూర్చుంటే సినిమా పూర్తయే వరకూ కన్నార్పకుండా చూస్తూ [...]
The Brethren by John Grishamనాలుగు నెలలనుంచి అప్పుడొక పేజీ ఇప్పుడొక పేజీ చదివి మొత్తానికి ఈ నవలని పూర్తి చేసాను. అదేమిటో ఏ నవలయినా మొదలెడితే అదే ఊపులో పూర్తయిపోవాలి . లేకపోతే ఒక పట్టాన ముందుకు కదలదు. ఇలా నన్ను విసిగించి విసిగించి , పూర్తయ్యాక "హమ్మయ్య" అనిపించిన ఇంగ్లీషు నవలలు రెండుమూడు ఉన్నాయి. వాటి గురించి తరువాత. ప్రస్తుతానికి John Grisham రాసిన The Brethern గురించి ఓ నాలుగు ముక్కలు.నవల [...]
ఈరోజు కాస్త తీరిక దొరికి మొత్తానికి నా కొత్త బ్లాగు పని కొంత పూర్తి చేశాను. పన్లో పనిగా రెండు టపాలు కూడా రాసేసా. ప్రస్తుతమున్న ఈ బ్లాగు ఫార్మాట్ ని కొద్దిరోజుల్లో మారుస్తాను.బ్లాగు పేరు నీలి మేఘాలలో . త్వరలోనే దీన్ని కూడా కూడలి, జల్లెడలలో చేరుస్తాను.
పోయిన వారాంతం ఫాల్ కలర్స్ చూద్దామని మాకు దాదాపు మూడున్నర గంటల దూరంలో ఉన్న న్యూ హాంషైర్ లోని వైట్ మౌంటైన్స్ అనే ప్రదేశానికి వెళ్ళాం. ఇక్కడ కనెక్టికట్ లో ఉన్న మూడేళ్లలో వెళదామనుకున్న ప్రతిసారీ ఏదో అవాంతరం ఏర్పడి కుదర్లేదు. ఈసారి వెళ్లి అక్కడి ప్రకృతి అందాలు చూస్తున్నప్పుడు , ఇన్నేళ్ళు ఇక్కడే ఉండి , వీటిగురించి విని కూడా వైట్ మౌంటైన్స్ ని దర్శించకపోవడం క్షమించరాని [...]
ఒక ఐదారు నెలల క్రితం ఒక వార్త చదివాను. సరిగా గుర్తు లేదుగాని, హిందీ నటి రేఖకి ఆమధ్య ఎవరొ "లైఫ్ టైం అచీవ్మెంట్" అవార్డు ప్రదానం చేస్తామంటె ఆమె వారిమీద చిర్రు బుర్రు లాడిందట. "అసలు నావయసెంతనుకుంటున్నారు, అలా "లైఫ్ టైం అచీవ్మెంట్" అవార్డులిస్తే నా అభిమానులు నేనేదో ముసలిదాన్నయి పోయినట్టూ , నేడో రేపో నేను ఈ సినిమా రంగం నుంచి నిష్క్రమిస్తున్న్నట్టూ అనుకోరూ" అంటూ ఆ [...]
ఇక నేడో రేపో Its nice working with you all అనే ఈ-మెయిలు పంపాలి అందరికీ. అసలు ఈ ప్రాజెక్టుకి రావడమే ఒక వింత. మొదట్లో వద్దనుకున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడో పనిచేసి వదిలేసిన పురాతన సాఫ్ట్వేర్ వర్షను మీద పని. ముందుకొచ్చాక మళ్ళా వెనక్కి వెళ్ళాలంటే కష్టమే . ఈ సాఫ్ట్వేర్ ఫీల్డులొ అది మరీనూ. అయితే కొన్ని వృత్తిపరమైన మొహమాటాలూ, ఎలాగు ఆర్నెల్ల ప్రాజెక్టు కదా , కన్నుమూసి తెరిచేలోగా ఆర్నెల్లు [...]
ఇంకా పేరు నిర్ణయించుకోలేదుగాని , "అనంతం" కి అనుబంధంగా మరొక బ్లాగు మొదలెడదామని అనుకుంటున్నాను. "అనంతం" లానే ఇందులో కూడా సుత్తే ఉంటుంది ,అయితే కాస్త సూటిగా ఉంటుంది. చేట భారతాలు కాకుండా , కట్టె, కొట్టె, తెచ్చె రీతిలో రాయాలని ప్లాను. Casual blogging అన్నమాట. ఒక్కొక్క పోస్టు క్లుప్తంగా ఒక పది పదిహేను వాక్యాల్లో, నేను చదివిన పుస్తకం గురించో , చూసిన సినిమా గురించో, నిద్రపట్టక పక్క మీద [...]
అవి నేను హైదరాబాదులో ఒక బహుళ జాతి సంస్థ లో పనిచేసే రోజులు.నేను పనిచేసే ప్రాజెక్టు చాలా పెద్దది. దాంట్లొ దాదాపు 70 మంది పనిచేస్తూ ఉండేవారు . అన్ని రకాల భాషలూ వినపడేవి . వాటిల్లో తమిళందే పైచేయి. వాళ్ళది చాలా పెద్ద గ్రూపు. ఇచ్చుకున్నా, పుచ్చుకున్నా వాళ్ళలో వాళ్ళే.వాళ్ల ఐకమత్యం చూసి బాగా ముచ్చటేసేది. అయితే వాళ్ళలో తప్పుపుట్టాడొకడు. పేరు పరమ్ గురు. తనకి తెలుగు [...]
ముచ్చటగా మూడు విషయాలు.మొదటిది..ఒక రెండు వారాల క్రితం...బోస్టన్లో ఉండే స్నేహితున్ని కలుద్దామని కారెక్కా. హైవే ఎక్కిన పదినిముషాలకే చిన్నపాటి చిరుజల్లు మొదలయింది. బయటికి వెళ్ళే పని ఉన్నా లేకున్నాప్రతిరోజూ వాతావరణం ఎలా ఉంటుందో అని నెట్లో కుతూహలంగా చూసే నేను ఈరోజు బయటికి వెళ్ళే పని పెట్టుకొనికూడా దాన్ని పట్టించుకోనందుకు నన్ను నేను తిట్టుకున్నాను. కాసేపలా అద్దం మీద [...]
వెకిలితనానికీ, అవకాశవాదానికీ తావివ్వని అమాయకత్వం మూర్తీభవించిన వయసది. ఆ భావనల పరంగా అ ఆ లు దిద్దుకుంటున్న అందమైన వయసది..********************************************************************మొదట్లో అస్సలు అర్ధమయ్యేది కాదు.వారంలో కనీసం ఒక్కసారైనా అమ్మకానీ నాన్నకానీ ఆ మాట అంటూనే ఉండేవారు. అప్పుడప్పుడు కోపం వచ్చేది కూడా. ఏమీ అనలేని అశక్తతతో కోపంగా విసవిసా మేడమీదకి వెళ్ళి, ఎత్తైన ఆ పిట్టగోడ మీద తలవాల్చి ఆ [...]
కొన్ని కొన్ని సార్లు మనం కలలో కూడా ఊహించని సంఘటనలు ఇలలో ఎదురై మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటాయి. వీటిల్లో కొన్ని అప్పటికి సీరియస్ యవ్వారాలే. కానీ కాలం గడిచేకొద్దీ అవి కామెడీగా మారి తలచుకున్నకొద్దీ మాంఛి కిక్ ఇస్తుంటాయి. అలాంటివి కొన్ని....*************************************************************************************** చానాళ్ళ..కాదు కాదు చానా ఏళ్ళ కిందట సంగతి. నేను అప్పుడప్పుడే ఒక సాఫ్టువేర్ ఇంజనీరుగా [...]
పోలికలు తేకూడదు అని ఎంత అనుకున్నా కొన్ని విషయాల్లో నిభాయించుకోలేను. అలాంటివార్తొకటి ఈరోజు చదివాను. ఆ వార్త ఇదిగోండి . అమెరికాలో గత తొంభయ్యారేళ్ళలో పార్టీ ఫిరాయించిన వారు 13 మంది.సొంత పార్టీ తీర్మానానికి వ్యతిరేకంగా చట్టసభల్లో ఓటేయడం వేరేవిషయం. దాన్ని వదిలేస్తే, రిపబ్లికన్ నుంచి డెమొక్రటిక్ పార్టీకి లేదా ఇటు నుంచి అటుకి మారినవారు మొత్తం 13 మంది.దాదాపు వందేళ్ళలో....13 [...]
ఈయన అప్పుడెప్పుడో "అసలు రాముడున్నాడా?" అనీ , "రాముడు తాగుబోతు" అనీ, అనేసి కొట్టుకుచావండ్రా అని చేతులు దులిపేసుకున్నారు. అప్పటి బాధపడ్డ హృదయాలకు ఇప్పుడిదిగో సమాధానం. ప్రభాకరన్ ఉగ్రవాది కాడు. ఇన్నాల్టికి ఆయన మనః స్థితి మీద ఒక అంచనా లాంటిది దొరికినట్టయి మనసు ప్రశాంతంగా ఉంది నాకు. ఇప్పుడీయన రాముణ్ణెన్నన్నా నాకేమాత్రం బాధ లేదు. నిజానికి ఎప్పుడంటాడా అని [...]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు