"ఎలాగూ బయటే ఉన్నారుగా . ఇంట్లో పాలైపోయాయి. టెన్నిస్ ఆడటం  అయిపోయాక వీలయితే షాపుకెళ్లి పాలు తెమ్మని" ఇంటినుంచి ఫోన్."వీలయితే','నీ కిష్టమైతే ' లాంటి పదాలకు సంసారపు నిఘంటవులో బోల్డన్ని అర్ధాలు కదా?(ప్రస్తుతానికీ విషయం అప్రస్తుతం అనుకోండి)టెన్నిస్ కోర్టు పక్కనే ఓ రెండు నిమిషాల దూరంలో షాపు.ఒక్క పాల డబ్బానే కదా అని తోపుడుబండి లేదా కనీసం అక్కడుండే ప్లాస్టిక్ [...]
అహంకారంతో విర్రవీగి సౌదీ ప్రస్తుతానికైతే బొక్కబోర్లా  పడింది.  డబ్బుతో దేన్నైనా కొనొచ్చు అనే సూత్రం వ్యక్తిగత  స్థాయిలో మాత్రమే  కాకుండా దేశాల స్థాయిలో కూడా భేషుగ్గా పనిస్తుంది కాబట్టి ఇంకొన్ని వారాలకి బహుశా ఇది మరుగున పడి పోవచ్చు. కానీ జరిగిందేమిటో పరిశీలిస్తే మనసు కకావికలం కాక  తప్పదు.సౌదీ రాజకుటుంబానికి ఒకప్పుడు దగ్గరగా మెలిగి ప్రస్తుతం వారి తీరు [...]
ఉన్నమాటే చెప్తున్నా... తన ఇండియా  ప్రయాణం ఖరారు కాగానే మొదట్లో నేను కొద్దిగా భయపడ్డ మాట నిజం. ఆఫీసుపని చూసుకుంటూ ఇద్దరు  పిల్లల్ని నేనొక్కడినే దాదాపు ఒక నెల పాటు,   పొద్దున్న వాళ్ళని  స్కూలుకి పంపడం దగ్గర్నుంచి రాత్రి నిద్రపుచ్చే వరకూ వాళ్ళ అవసరాలన్నీ ఏ లోటు లేకుండా చూసుకోగలనా లేదా అని.ఆఫీసుపని మీద దీని తాలూకు ప్రభావం తప్పకుండా ఉండేతీరుతుందన్న భయం [...]
( నా వయసుముచ్చట్లు కి కొనసాగింపుగా......) . సంజె చీకట్లు ముసురు కుంటున్నాయి .వీధిలో సోడాలబ్బాయి ఎదురింటి సీతారావమ్మకి సోడా ఇచ్చి వాళ్ళింటి గోడ మీద పెన్సిల్ తో లెక్క  రాస్తున్నాడు . లెక్కంటే ఏమీ లెదు. ఇఛ్చిన  ప్రతి సోడాకో నిలువు గీత. ఓ వారానికో పదిరొజులకొ రొక్కం  పుచ్చుకొని ఇచ్చిన వాటి మేరా వాటి మీద అడ్డగీతలు.వంటింటి గడప మీద కూర్చొని మసిపట్టిన  లాంతరు  [...]
ఇది కూడా దాదాపు ఓ ముప్పై ఆరేళ్ళ  క్రితం సంగతే.అప్పటికి నా ఎనిమిదో తరగతి క్లాసులు మొదలై రెండు రోజులే . కొత్త యూనిఫాం ,కొత్త నోటు పుస్తకాలు. అప్పటికి ఇంకా టెక్స్ట్ బుక్స్ చేతికందలేదు. అయినా ఆసక్తి కొద్దీ నాకంటే ఒక తరగతి పెద్దదైన రవణమ్మ ( రమణమ్మ) దగ్గరున్న తెలుగూ,సోషలూ పుస్తకాలు తీసుకొని అసలు పాఠాలేమున్నాయా  అని అలా బొమ్మలు చూస్తూ పైపైన తిరగేసా. కొత్త  టెక్స్ట్ [...]
దాదాపు నలభై ఏళ్ళ కిందటి మాట. ఎక్కడికో గుర్తులేదు గాని అమ్మతో  బయటికి వెళ్తున్నాను. బహుశా గుడికి  అయుండొచ్చు. మా ఇంట్లోంచి బయటకొచ్చి ఓ పదడుగులు వేస్తే వస్తుంది మెయిన్ రోడ్డు.  దానిమీద కుడివైపుకి తిరిగి ఇంకొక పదడుగులేస్తే వస్తుందొక పెద్ద వాణిజ్య కూడలి. ఒక రిక్షా స్టాండూ,మెడికల్ షాపులూ,కిరాణాదుకాణాలూ,పళ్ళ బండ్లూ,సినిమాహాలూ ,హొటళ్ళూ,సైకిళ్ళ  రిపేరూ షాపులూ, [...]
"ఏమైనా మాట్లాడొచ్చుగా?"ఈ పదేళ్ళలో లెక్కలేనన్ని సార్లు వినుంటానీ  మాట. ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తరచుగా.  ఏం మాట్లాడాలి? ఈ ప్రశ్న నెదుర్కొన్న ప్రతిసారీ కాకపోయినా కొన్ని కొన్ని సార్లు  ఈ అభియోగాన్ని తిప్పి కొట్టడానికి  చేసే ప్రయత్నంలో ఏదో మాట్లాడుతాను.ఆ మాటలు చాలా వరకు అప్పటి మా ఇద్దరి మనస్థితికీ , నేను (తెచ్చి పెట్టుకొని) మాట్లాడే మాటలకీ  పొంతన [...]
మేమందరం తనని మూగమ్మ అని  పిలిచేవాళ్ళం.మా అమ్మమ్మ తరపు బంధువు.అమ్మమ్మ తరపు బంధువులంతా చాలా వరకు ఏదో కూలీ నాలీ చేసుకొనే వారే. అతి కొద్ది మందికి మాత్రం ఏదో ఎకరం అరెకరం పొలాలు అంతే. అయితే వాళ్ళు కూడా చాలావరకు వాటిని కౌలుకిచ్చి పొలం పనులకెళ్ళేవాళ్ళే .తన అసలు పేరు ఇప్పటికీ తెలీదు.మాటలు రావు  పైగా పుట్టెడు చెముడు కూడా.మొదటిసారి తనని [...]
 రెండో ప్రపంచ యుద్ధం.  టూకీగా WW-IIదాదాపు ఐదేళ్ళ పాటు(1939-1945), రోజుకి సగటున ఇరవై ఏడు వేల మంది ప్రాణాలు  బలితీసుకున్న మారణహోమం.                                       ***********************యుద్ధరంగాన్నుంచి అప్పుడే తిరిగొచ్చిన బ్రిటీష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ పైలట్ డేవిడ్ క్రూక్,అంతకు క్రితమే మరణించిన తన సహచరుడిని తలచుకొని, తన డైరీలో రాసుకున్న [...]
రాత్రి ఎందుకో అస్సలు నిద్రపట్టలేదు.అలవాటుగా పక్కనే టేబుల్ మీదున్న రేడియో ఆన్ చేసాను.ఎప్పుడూ వినే స్టేషనే . NPR. అయితే రాత్రుళ్ళు మాత్రంఅదే స్టేషన్లో BBC ప్రసారాలు వస్తాయి.వార్తలు.ఉక్రెయిన్ గురించి ఏదో వార్త.అసలీ పుతిన్ కేమయింది? అంది వచ్చిన అవకాశాన్ని దొరకబుచ్చుకొని క్రీమియాని ఆక్రమించుకుందామనుకుంటున్నాడా లేక ఉక్రెయిన్లో  యురోపియన్ యూనియన్ ప్రాబల్యం ఎప్పటికైనా [...]
ఇల్లు మారాలి.ఇప్పుడున్న ఇంట్లోంచి కొత్తగా కొన్న ఇంట్లోకి.  పెద్ద దూరమేమీ కాదు.ఇప్పుడున్న ఇంటినుంచి ఒక పది మైళ్ళు అంతే.వీలైనంత వరకు అన్ని వస్తువుల్నీ అట్టపెట్టెల్లోకి సర్దేసాం. ఇక సామాన్లని మేమున్న నాలుగో అంతస్తు నుంచి దించి ఆ యు-హాల్ వేన్ లో పెట్టడమే.అది మా వల్లయ్యే పని కాదని తెలుసు. ముందే అనుకుంటున్నట్టు, ఆ పనిని , గంటకింతని మాట్లాడుకొని ఇద్దరు,లేక ముగ్గురు [...]
1. రాత్రిటి వంట తాలూకు సగం తరిగి వదిలేసిన ఉల్లిపాయ కిచెన్ కౌంటర్ మీద అలానే ఉంది . దాని పక్కనే తరిగిన కూరగాయల తాలూకు తొడిమెలూ,ఫ్రిజ్ లో పెట్టడం మరిచిపోయిన పెరుగు గిన్నె, ఆ పక్కనే సింక్ లో ఉండాల్సిన భోజనం ప్లేటూ. 2. ఈ మధ్య కార్ ప్రయాణం చాలా నిశ్సబ్దంగా,బోరింగ్ గా ఉంటోంది . వెనకున్న రెండు కార్ సీట్లూ నాలాగే వంటరిగా. ఇక పక్క సీటు సంగతంటారా , ఉమ్మ్మ్... సో సో ..  ఆ సీటు అలా కామ్ [...]
Friend seems to be a small ,superficial word until you get older.Then friendship takes on a deeper meaning as you lose your friends....As you get older friendship becomes more important and memories more precious.Don't take true friends for granted."Grapple them to thy soul with hoops of steel". Appreciate them before it's too late.చదువుతున్న పుస్తకం లోని ఈ లైన్లు నన్ను రోజంతా  వెంటాడాయి.దిగాల్సిన స్టాప్ మర్చిపోయేంతగా ఆలోచనలు.చాట్ లో  "ఎలా ఉన్నారు?" అని ఆప్యాయంగా అడిగిన వారికి ఒక వారం తరువాతో,ఒక నెల తరువాతో  "బావున్నాను, మీరెలా ఉన్నారు" అనే నా సమాధానాన్ని [...]
* In the country of the blind, the one-eyed man is king *  ఏమీ తోచక, శుక్రవారపు అందమైన  సాయంత్రాన్ని వృధా  చేయటం ఇష్టం లేక ఏం  చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తుంటే అకస్మాత్తుగా గుర్తొచ్చింది "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ " రిలీజయి మాఇంటికి ఒక అరమైలు దూరంలో ఉన్న థియేటర్లో ఆడుతున్నట్టు. ఒక గంటలో థియేటర్లో ఉన్నా.పరమభీభత్సమైన,నికార్సయిన పదారణాల తెలుగు  మాస్ మసాలా చిత్రాన్ని సైతం వాతాపి జీర్ణం [...]
శ్రీకాంత్,అబ్దుల్ ఖాదిర్, మంజ్రేకర్ ఇంకా చాలామంది  పాపం చాలా బెంగపెట్టుకున్నారు ఆయన ఎక్కడ రిటైర్ అయిపోతాడేమో అని. ఇంకొంతమంది ఏమంటారంటే ఆయన దేవుడట. మినహాయింపు ఇవ్వాలట. ఎప్పుడు రిటైర్ అవ్వాలి అనేది ఆయనే నిర్ణయించుకోవాలట.అసలెందుకు రిటైర్ అవ్వాలండీ? ఆయన్ని ఆడుకోనివ్వండి.నలభై కాదు యాభై ఏళ్ళు వచ్చే వరకూ ఆడుకోవివ్వండి.మరీ అంత వయసుమీదపడి ఫీల్డింగ్ చెయ్యలేకపోతే  [...]
ఒక పేద్ద కంపెనీలో పేద్ద ఉద్యోగం. వడపోత తరువాత ఆ పోస్టుకి ఎనిమిదిమంది అభ్యర్ధులు మిగిలారు. అభ్యర్ధులందరూ పరీక్ష గదిలో ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో టేబిలూ,ఒక కుర్చీ, ఆ టేబిలు మీదొక పేపరు.ఇన్విజిలేటరు గదిలోకొచ్చాడు. గది లోపల డోరు పక్కన ఒక సెక్యూరిటీ  గార్డు. ఇన్విజిలేటరు పరిక్ష తాలూకు నియమాలు చెప్పాడు.ఒకే  ఒక ప్రశ్న , దానికి సరైన సమాధానం రాయాలి అంతే. ఇకపోతే ఈ [...]
కొన్ని సినిమాలు చూద్దామనుకొని అలా అలా వాయిదావేస్తూ ఉంటాము కారణం లేకుండానే.నెలల తరబడి అవి అలా మన లిస్టులో నానుతూ ఉంటాయి.చివరికి ఏదో ఒకరోజు వాటికి మోక్షం ప్రసాదిస్తాం.అయ్యో ఇంతమంచి సినిమా ఇన్నాళ్ళు చూడకుండా ఇలా ఎలా వదిలేసాం?  అని కొంచెం ఆశ్చర్యపోతాం.ఇదొక పోలిటికల్ థ్రిల్లర్ అనొచ్చేమో. సద్దాం హుస్సేన్ పెద్దకొడుకు ఉదయ్ హుస్సేన్ చుట్టూ తిరుగుతుంది కథ. ప్రాణహాని [...]
పుస్తకాల దుకాణానికెళ్ళి నప్పుడల్లా ఓ పట్టాన బయటికి రాబుద్ది కాదు. ఎన్ని గంటలైనా అలా తెలియకుండా గడిచిపోతాయి.వివిధ వెబ్ సైట్లలో అప్పటికే సమీక్షల పరంగా మంచి మార్కులు కొట్టేసిన పుస్తకాల్ని వెతికి రాసిపెట్టుకొనే అలవాటు ఉండడం మూలాన, అలాంటి  ఓ రెండు పుస్తకాలు  తీసుకొని, ఓ కుర్చీ లాక్కొని,    అలా కొన్ని పేజీలు  చదివేయటం  అలవాటు బ్రహ్మచారి గా ఉన్నప్పుడు. ఇప్పుడంత [...]
మా రమేష్ గాడి నోట్లో రహస్యం ఎంతోసేపు దాగదు. రెట్టించి అడిగితే వెంటనే కక్కేస్తాడు. చాలా సార్లు అలా అడగాల్సిన అవసరం కూడా ఉండదు.పది నిమిషాల్లో స్నానం చేసి రెడీ అయి వస్తా అని బాత్ రూం లోకెళ్ళి తలుపేసుకున్నాడు.ల్యాప్ టాప్ తెర మీద ఒక్కొక్కటిగా అలుముకుంటున్న పాప్ అప్ విండో లను భయ భయంగా చూస్తూ , ఇండియా కాల్ చేసి నాన్నతో ఓ పది నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేసా. ఈలోపు రమేష్ రెడీ [...]
శనివారం తెల్లవారుజాము తొమ్మిదింటికి రమేష్ గాడి దగ్గిర్నుంచి ఫోన్."ఏంట్రా""రేయ్ నేను రమేష్ ని. ఆ ఏంలేదు చిన్న హెల్ప్ కావాలి"రమేష్ గాడి సంగతి నాకు బాగా తెలుసు. ఫోన్ చేసి ,విషయం పూర్తిగా చెప్పకుండా "ఆ ఏంలేదు" తో మొదలెట్టాడంటే ఏదో దాస్తున్నట్టే లెక్క."ఏమిటి?""ఆ ఏంలేదు .నా కారు సర్వీసింగ్ కివ్వాలి"నాలో అనుమానం బలపడింది. మళ్ళీ "ఏంలేదు" అన్నాడంటే డెఫినెట్ గా ఏదో [...]
తను నావైపు చూసి సన్నగా నవ్వింది.నాలో క్షణకాలపు తడబాటు.నన్నేనా లేక నా పక్కనున్న తన పరిచయస్తులెవరినైనా ఉద్దేశించి నవ్విందా?సమాధానంగా నేను తిరిగి నవ్వితే,ఒకవేళ ఆ నవ్వు నున్నుద్దేశించింది కాకపొతే ?సమాధానంగా నేను నవ్వీ నవ్వనట్టు నవ్వినా, నా తడబాటు కలిగించిన ఆ క్షణకాలపు ఆలస్యం నా సమాధానాన్ని తనవరకూ చేరనిచ్చినట్టు లేదు. ఆసరికే తను తలకిందికి దించుకొని కుడి చేతి [...]
శ్రీకృష్ణ జన్మస్థానం అలా అల్లంత దూరంలో కనపడగానే మన నాయకులకి ఏ గుండెనోప్పో , బీపీ లాంటివో, ఇంకేవేవో వచ్చేసి అమాంతం స్ట్రెచెర్ మీద పడుకుండి పొతారు. అప్పటిదాకా టీవీ కేమెరాలముందు వేసిన వీరంగం,వాగిన వెధవ వాగుడు కట్టిపెట్టి మాట మాత్రం పెగలని ఆస్కార్ నటులవుతారు. ఇక ఆస్పత్రి కెళ్ళాక లొపలేం జరుగుతుందో ఆ దేవుడి కెరుక. ఫాపం వాళ్ళలొ కొద్దిమంది దురదృష్టవంతులుంటారు కల్మాడి [...]
ఎప్పుడు చూసినా నా ఫ్రెండ్ కార్లో ఈ పాట మోత మోగుతూ ఉండేది. ఏదో సినిమా పేరు చెప్పాడు గాని మనకి తమిళం అస్సలు రాదు కాబట్టి , ఏ సినిమా అయితే ఏం అని పాటని ఎంచక్కా ఎంజాయ్ చేసేవాడిని.పాట ట్యూన్ చాలా కేచీ గా ఉండేది. ఆ తరువాతెప్పుడో యు ట్యూబ్ లో ఏదో వెతుకుతూ ఉంటే ఆ పాట నా కంట పడింది. వినటానికే కాదు చూడటానికి కూడా చాలా బాగుంది. మంచి కోరియోగ్రఫీ, కేమెరా, అన్నిటికీ మించి చలాగ్గా [...]
కొన్ని ఉదయాలు మొదలవడమే ఎంతో ఉత్తేజపూరితంగా మొదలవుతాయి. మిగతా రోజులు నీరసంగానూ, నిస్తేజంగానూ.ఎందుకలాగ అని కొన్ని సార్లు అనిపిస్తుంది. క్రితం రోజు ఏమేమి పనులు చేసానా, ఈ ఉల్లాసానికీ, ఉత్సాహానికి కారణమేమిటా? అని ఆలోచిస్తే , ఆ క్రితం రోజు మిగతా రోజుల్లాగే సర్వ సాధారణంగా గడిచి ఉంటుంది.పేద్ద చెప్పుకోదగ్గవేమీ ఉండవు.నీరసంగా మొదలైన రోజుల్లో మాత్రం ఉదయాన్నే లేవగానే , కాఫీ [...]
మొన్నీ మధ్యే బ్లాగుల్లో చదివాను మనలో చాలా మందికి టీవీ చూడ్డం మా చెడ్డ చిరాగ్గా ఉందనీ, దానికి బదులు ఏపనీ చేయకుండా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడం కూడా చాలా ఉత్తమమనీనూ. ఎందుక్కాదూ?దేశం కాని దేశంలో ఉన్నాం కదా, ఎంతైనా మన దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే ఎలా అని ఏదో ఒక న్యూస్ చానల్ పెడతానా, అందులో న్యూస్ ఏమాత్రం ఉండదు, అంతా న్యూసేన్సే. నేను చూసేదే కంప్యూటర్లో , చిన్న [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు