నిను ప్రేమిస్తే అది నా ఇష్టంనను ద్వేషిస్తే అది నీ ఇష్టంకదనగలవేమో నా ఇష్టాన్నికాని లేదనలేవు నా ఇష్టాన్ని
ఒదిగుండి జూస్తివ ఓరుగల్లు ఇదిపోరాడ జూస్తివ పోరుగల్లు ఇదిరత్నంతో మీటితివ రత్నాలవీణ ఇదిరౌద్రంతో మీటితివ రుద్రవీణ ఇదిసైన్యానికి విప్లవం నేర్పిన శైవం ఇదిజీవితానికి మర్మం నేర్పిన వైశ్నవం ఇదిధర్మానికి శంతిని కలిపిన బౌద్ధం ఇదినాట్యనికి లాస్యం కలపిన లావణ్యం ఇదిఒదిగుండి జూస్తివ ఓరుగల్లు ఇదిపోరాడ జూస్తివ పోరుగల్లు ఇది
కర్మానుసారేన కులంకులానుసారేన ధర్మంధర్మానుసారేన జీవనంఇహలో సర్వం కర్మ సిద్ధంభువిలో నాస్తి జన్మ సిద్ధం
సుదూరాన్న శునకమైన సుందరంగుండుముందరున్న మణిలొనైన మరకగుపించుదూరమెరిగి దరికి చెరిన వాడు ధన్యుడుమధురమవుకున్న మర్మమెరిగినవి మధూవాచకం
పాచికలెందుకు వారి పరాచికాలుండగాచురకత్తులెందుకు వారి చమక్కులుండగాస్వర్గమెందుకు వారి సాంగతూముండగానరకమెందుకు వారి నిరసనుండగాపురషప్రపంచానికి వారు పరుశార్దము కారా
మరణం కంటే దారుణం విస్మరనంమరణం క్షణికం, విస్మరనం ఓ జీవితంనా జీవితం నువ్వు, నీ విస్మరనం నా మరణం
నీ కధను నేనుకధకు కదనం నేనునీ ఎత్తును నేనుఎత్తుకు పైఎత్తును నేనునీ కన్నీటిని నేనుకన్నీటిన తడిసిన రక్తం నేనునీ కధకు నాయకుడు నేనువాడికి ప్రతినాయకుడు నేనునువు కట్టిన కోటను నేనుఅందున మిగిలిన శకలం నేనునీ కాలం నేనుకాలానికి గమనం నేనునీ చరిత్రను నేనునువ్వు స్రుష్టించిన విచిత్రం నేను
నాచుపై తనువుని చాచి పరువళ్ళుతొక్కిన నీటిదెంత అద్రుష్టమో కదాదంత దీప్తులు ఘన కీర్తులుగా కలనీ కంటీ కిరణాములు తన చరణములంటినవనిఅఱ్ఱులు చాచిన నీటిదెంత అద్రుష్టమో కదా
కొన్ని పదాలతో మిన్నార్ధామే కవితయితేపసివాన్ని మించిన భావకుడెవరుశ్రోత మనోరంజనమే గానమయితేతల్లిని మించిన గాయకులెవరుసరళం జననం సరళం గమనంసరళం మననం సమస్తం సరళం
భూమినిచ్చింది, భూమిలో చెట్టునిచ్చింది, చెట్టుపై కాయనిచిందిభూమిలో ఘణులు, ఘణూలలో మనులు, మనులలో సిరులుగాలినిచ్చింది, నీరునిచ్చింది, నిప్పునిచ్చింది నీకు బతుకునిచ్చిందిఇన్నిచ్చిన శూన్యాన్నెమడగలవు బతికి చూపించటం తప్ప 
దేవునిలొ దైవం వెతుకుపూజలొ పుణ్యం వెతుకుఆచరణలో ఔనతయ్యం వెతుకుకానరాని స్వర్గమునకైకనుచూపు మేర నరకం సృష్టించకు
శాస్త్రంలో మతం వెతుకకుమతంతో శాస్త్రం నిరూపించకురహస్యం చేదించ శాస్త్రముమనిషిని నడిపించ మతముమతములోని శాస్త్రం మూఢము
ర్యలుగా వెళ్ళి అర్యులుగా తిరిగి వచ్చినాబానిసలు యూథులుగా మారినాయూథుని బిడ్డ క్రీస్తు అయినాక్రీస్తూని  నమ్మిన క్రైస్తవులయినాబుద్ధునిగా మారిన గౌతముడయినాఆతనిని నమ్మిన బౌధికూలయినాప్రవక్తయినా మహమ్మదు అయినాఆతనిని నమ్మిన మహమ్మదీయులయినాఅంతా మనుజులే, పర ప్రాంత పలాయినులే 
రావణ వధ వరకు, రామం రమణీయం.అయోద్యపతి అయిన రఘుపతి,అదోగతినొందిన సీతాపతి.జననం, గమ్యం పిదప మోక్షం.వాటి నడుమనున్నది కల్పమయినఅది కంచి దాటిన మధుర కధనం.రామావతారం కధాకధనం నేర్పినదిది.  
నీరమై మేఘమైతొలకరి చినుకునైకట్ట వెనుక నీటినైఅది తెంచిన వరదనైనేలలో కలిసిన బురదనైదాహమై, దేహమైవేదమై, సేధ్యమైనీ జీవితాన ప్రతి అడుగు నేనేనా మరణానికి ప్రతి రుజువు నీవే
కట్ట వెనక ఉంచిన నీటిని, మట్టం చూసిమల్లించకపోతే ఉప్పెనై మట్టు పెడుతుంది.కట్టు కోసం పెంచిన కట్టుబాటును,సమయం చూసి సవరించక పోతెకట్టిన వారిని మట్టి కలుపుతుంది
జననం మరణం పుఃనరతి జననం,మనుషులకిది మాయామర్మం,నరాధాముల జన్మల కధనం.తొమ్మిది జన్మలు పైపడ్డా, దశావతారానికైవేచి ఉన్న నర నారాయణుడుప్రధమ నరుడు కాడా?
జన్మించి మనుజుడనై,పోషించి యాదవుడనై,పూజించి బ్రాహ్మనుడనై,ఆర్జించి వైశ్యుడనై,రక్షించి క్షత్రియుడనై,సర్వ కార్యాన్నాసకల కులములనొంది,జీవకోటి మద్య చరాచరముల నడుమ,తనవు మనువు విడదీసి బ్రహ్మత్వమొందుదనునే హిందువుని, పాటించునది హైందత్వము
క్షణం క్షణమయితే అనుక్షణంఆ క్షణం పుష్కరం అయితె అక్షణంరావణం వరకు రామం రమణీయంఅయోద్యాపతి అయిన రఘుపతిఅదీగతినొందిన సీతాపతిజీవిత గమ్యం జీవన రమ్యంఆ పిదప జీవించిన కల్పంకంచిని దాటిన మధుర కధనం
కనులు చూసేది ప్రపంచం చూడలేనిది జ్ణానంకనులు చూసేది ప్రక్రితి చూడలేనిది అందంకనులు చూసేది మనిషిని చూడలేనిది మానవత్వంభ్రహ్మ కనులు సైతం చూడగలిగేది తన శ్రిశ్టిని చూడలేవు తనని శ్రిశ్టించిన పద్మనాభాన్నిరెండు కనులు ఉన్నా చూడలేని సత్యాన్ని చూపగలిగేది ఒక్క మనోనేత్రంబు మాత్రమే
మథ్య తరగతి బతుకులు మావినడి సంవత్సర వేసవి మాదిసుస్తి ఉన్న సిస్తు తప్పని బతుకిదితగ్గు తప్ప హెచ్చు లేని బతుకిదిరొడ్డు మాది కాని రేడు వస్తే వేచి ఉంటాంఖజానలో ప్రతి కాని మాదికాని నెల చివరిన జేబులు ఖాలిమథ్య తరగతి బతుకులు మావినడి సంవత్సర వేసవి మాది
వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు వేరన్నతెలంగాణ నాది, అంధ్ర రాయల సీమ నీదిఎన్నడు మొలిచెనో ఏడకు పెరుగునో ఈ ద్వేశాలుఅన్నీ పంచిన అవని తల్లిని చీల్చెను ఈ విద్వేశాలు
ప్రేమిస్తే కవులవుతారంటేఆ ప్రేమ దేశం లో నే అధి కవినవుత .ప్రేమికుల ప్రతి పలుకు ఒక కావ్యమంటేనే రచియించిన తొలి ప్రేమ కావ్యం నీ పేరు.
ఒత్తయిన తన కురులను తీర్చితీర్చిన కురులలో చంద్ర వంకను పేర్చిఆ వంకను పోల్చే నడువంపును చూపిఆ వంపుల నడుమ వయ్యారము వార్చిఆ వయ్యారంతో నా యద దోచిదోచిన యదను తన మదిలో దాచిఆ మదిలో ఆశను నా బతుకుగ మలిచిఆ బతుకున తోడుగ నిలిచిన ప్రాణమా ..నీ ఎడబాటే ఎరుగనంటూనీ ఆరాధనే మరువనంటూఅసలు నేనే లేనంటూ,నీలో కలిసిపోయిన ఈ నేను...నీ నేను
లోకమెరుగని అమాయకమంట మా మయూఖమంతఅంతెరుగని ఆగమంట దాని అల్లరంతపొద్దు పూచినంత పొద్దు గడవనివ్వదంటఅమ్మ అమ్మ అంటు అమ్మ కొంగు వెంటచేతికందినంత చేతి వాటమంటదైవ మందిరమయిన దాని ఆధీనమంట పాల బువ్వ వేళ భావ కవితలంటలాల పోసు వేల లాలి పాటలంటలోకమెరుగని అమాయకమంట మా మయూఖమంతఅంతెరుగని ఆగమంట దాని అల్లరంత
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు