జమ్మూ కశ్మీర్ నేల అడుగడుగునా ఒక వీరగాథ విత్తనమై మొలకెత్తింది. నాగాలాండ్ నుంచి ద్వారక దాకా, నైనిటాల్ నుంచి నాగపట్నం దాకా వేలాది వీరులు తమ తుది రక్త బిందువులతో కుంకుమపువ్వుకు రంగులద్దారు. తమ ఆఖరి ఊపిరితో చినార్ చెట్లకు చిరుగాలుల్ని అందించారు. ఒక్కొక్క వీరుడిదీ ఒక్కొక్క కథ. కాసుల కోసం, కాసింత జీతం కోసం సైనికుడు ఉగ్రవాదంతో పోరాడతాడని అనుకుంటే అంతకన్నా పొరబాటు లేదు. [...]
నాలుగు గంటల హోరాహోరీ పోరాటం…. ఒంట్లో తొమ్మిది బుల్లెట్లు… తలలో…ఛాతీలో, నడుము భాగంలో, తుంటి ఎముక దగ్గర, రెండు చేతులకు, కుడి కంట్లో తూటాలు... పదహారు రోజులు కోమాలో…. పగలు తెలియదు… రాత్రి తెలియదు…. నెలరోజులు ఆస్పత్రిలో …మంచానికే పరిమితం….మందులే జీవితం…. ఒక కంటి చూపు శాశ్వతంగా పోయింది. ఇంత జరిగిన తరువాత ఆ సైనికుడు ఏమంటాడో ఊహించగలరా? “నా జీవితం దేశానికి అంకితం. నేను [...]
రావణుడు భవతీ భిక్షాందేహీ అన్నాడు…… సీత అమాయకంగా గీత దాటింది….. ఆ తరువాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. కానీ ఆధునిక యుగంలో అక్కడెక్కడి నుంచో రావణాసురుడు వచ్చాడు. “భవతి అమ్మాయి దేహీ”అన్నాడు. ఆ అమ్మాయి గీత దాటింది. వాడి చేతుల్లోని ఏకే 47ని లాక్కుంది. వాడిని కాల్చి పారేసింది. “డామిట్ కథ అడ్డం తిరిగింది,” అనుకుంటూ కుప్పకూలిపోయాడు వాడు. ఆ రావణుడి పేరు అబూ ఒసామా. కరడు [...]
మహారాజా హరిసింగ్ కి అన్నీ దుర్వార్తలే వస్తున్నాయి. ఒక వైపు పూంఛ్ లో ముస్లిం సైనికులు తిరుగుబాటు చేశారు. మీర్ పూర్ ను పాకిస్తానీలు చుట్టు ముట్టారు. స్థానిక ముస్లింలు వారితో చేయి కలిపారు. మరోవైపు ముజఫరాబాద్ లో ముస్లిం తెగలకు చెందిన సాయుధ దోపిడీదారులు దొరికిన వాళ్లను దొరికినట్టు చంపుతున్నారు. శత్రువు దగ్గరకి వచ్చేస్తున్నాడు. ఉడి, డోమెల్, బారామూలాలను దాటేస్తే తరువాత [...]
నేటి భాంబ్లా డిసెంబర్ 18, 1947. జమ్మూ కశ్మీర్ ను కబళించేందుకు తెగబడి చొరబడిన పాక్ మూకలను తరిమికొట్టేందుకు భారత సైన్యం ప్రాణాలొడ్డి పోరాడుతోంది. మద్రాస్ సాపర్స్ కి చెందిన ఇంజనీర్ల దళం లెఫ్టినెంట్ ఎఫ్ డి డబ్లు ఫాలన్ నాయకత్వంలో జమ్మూకి వెళ్తోంది. పలు సైనిక వాహనాలు తరలి వెళ్తున్నాయి. జమ్మూ కి అరవై తొమ్మిది కి.మీ దూరంలో భాంబ్లా అనే చిన్న ఊరు ఉంది. ఆ ఊరికి చేరుకోగానే [...]
ఆ సైనికుడు మంచం మీద పడి ఉన్నాడు. కాలు నుజ్జు నుజ్జయిపోయింది. ఎముకలు పొడి పొడి అయిపోయింది. రక్తం ధారాప్రవాహంగా కారిపోతోంది. సైనికుడు స్పృహలోనే ఉన్నాడు. “నాకు మత్తు మందు ఇవ్వండి.” అన్నాడతను. యుధ్దం భయంకరంగా జరుగుతోంది. మత్తు మందు స్టాక్ లేదు. “పోనీ పెథిడిన్ ఇవ్వండి.” కానీ అదీ లేదు. తన తోటి గూర్ఖా సైనికుడిని పిలిచాడు. “ఈ నుజ్జు నుజ్జయిపోయిన కాలును నరికెయ్” అని [...]
అల్తాఫ్ అహ్మద్ దార్ పేరు బుర్హాన్ వానీ పేరులా నలుదిక్కులా మార్మోగదు. ఆయన పేరిట రీములకు రీములు పత్రికలు వ్రాయవు. ఎందుకంటే వేర్పాటువాదాన్ని పాలు పోసి పెంచే కశ్మీరీ పత్రికా రంగానికి, దానిని మోస్తున్న ఢిల్లీలోని కొంతమంది కిరాయి మీడియా జర్నలిస్టులకు అల్తాఫ్ అహ్మద్ దార్ పేరు మిగతా దేశానికి తెలియడం ఇష్టం లేదు. కానీ అల్తాఫ్ పేరు వినగానే కశ్మీర్ ఉగ్రవాదులకు, పాక్ [...]
యుద్ధనౌక రెండు ముక్కలైంది. టార్పిడో దెబ్బకి యుద్ధనౌకలో నిప్పుల కుంభవృష్టి కురుస్తోంది.... సముద్రం భయంకరంగా పడగ విప్పింది. యుద్ద నౌక తాలూకు ఒక పెద్ద భాగం సముద్రంలోకి జారిపోయింది. అలలు ఉవ్వెత్తున లేచాయి. నిప్పు పగబట్టింది. నీరు నోరు తెరిచింది. యుద్ధ నౌక రెండో భాగమూ నెమ్మదిగా నీటిలోకి మునగడం మొదలైంది. కాదు కాదు... మృత్యువు ఒడిలోకి జారడం మొదలైంది. ఈ భీతావహ సన్నివేశంలో [...]
పైజామా పాతబడి చిరిగిపోతే...? నాలుగు సంచీలు తయారు చేసుకుంటాను. నాలుగు సంచీలు చినిగిపోతే...? ఎనిమిది చేతి రుమాళ్లు తయారు చేసుకుంటాను. పొదుపు చేయడం, అనవసరంగా వనరుల్ని వృథా చేయడం ఆయనకు ఏనాడూ ఇష్టం ఉండేది కాదు. ఆఖరికి అది చినిగిన పైజామా అయినా. మీరు లేఖ రాసి పంపితే, ఆ లేఖ వెనుక ఖాళీ స్థలంలోనే చిన్న చిన్న అక్షరాలతో జవాబు వ్రాసి పంపేవారు. ఎప్పుడైనా అడిగితే "వనరులను వృథా [...]
అరవై ఏడేళ్లుగా ఈ దేశంలోనే ఉంటూ, ఈ దేశం తప్ప మరో దేశం లేకుండా ఉంటూ కూడా ఈ దేశ పౌరులు కాకుండా ఎవరైనా ఉండగలరా? హిందువులైన పాపానికి పాకిస్తాన్ నుంచి ప్రాణాలరచేత పట్టుకుని భారత్ కి శరణార్థులుగా వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా పౌరసత్వం లేకుండా ఎవరైనా ఉంటారా? ఏ రాష్ట్రంలో ఒక వర్గం ప్రజలకు సొంత ఇళ్లు కట్టుకునే హక్కు లేదు? ప్రభుత్వం కట్టి ఇచ్చిన తాత్కాలిక ఇళ్లలోనే తరాలు [...]
చాలా ఏళ్ల క్రితం సంగతి. హర్యాణాలో తెలిసిన కుటుంబంలో ఒక జవాను కాశ్మీర్ లో ఉగ్రవాదులతో పోరాడుతూ చనిపోయాడు. ఆ కుటుంబాన్ని పలకరించేందుకు వెళ్లాం. మేం వెళ్లిన రోజు సరిగ్గా ఆ అమర జవాను చనిపోయిన పదమూడో రోజు. జవాను చనిపోవడానికి కొద్ది రోజుల ముందే భార్య ప్రసవించింది. ఆ పిల్లవాడు పుట్టి ఇరవై ఒక్క రోజులైంది. అంతా బాగుంటే వాడిని ఆ రోజు ఉయ్యాలలో వెయ్యాలి. కొడుకు పోయిన [...]
హైదరాబాద్ - విజయవాడ హైవే... రాబోయే శతాబ్దపు వేగాన్ని ఇప్పుడే రప్పిస్తున్నట్టు రయ్ రయ్ మంటున్న కార్లు... ఆధునికత ముఖానికి మేకప్ వేసినట్టు తళతళలాడుతున్న తారు రోడ్డు. మెడలో లావాటి నెక్లెస్ లాంటి రోడ్ డివైడర్.... సూర్యాపేట దగ్గర మరీ ఆధునికంగా ఉంటుంది ఈ రోడ్డు. సరిగ్గా సూర్యాపేట దాటగానే ఎడమ వైపు ఒక రోడ్డు.... కాసేపు తాచులా తిరిగాక తారు రోడ్డు అంతమైపోయి, కొన్ని దశాబ్దాలు [...]
బల్దేవ్ సడక్ నామా, సుర్జిత్ పాటర్, జస్వీందర్, దర్శన్ భుట్టర్, చమన్ లాల్, ఆత్మ జిత్, గురుబచన్ భుల్లర్, అజ్మేర్ ఔలఖ్, వర్యం సంధు, మంగ్లేశ్ డబ్రాలు, గులామ్ నబీ ఖయాల్, శివదాస్, జీఎన్ రంగనాథరావు, రాజేశ్ జోషీ, అశోక్ వాజ్ పేయీ, హర్దేవ్ చౌహాన్, దిలీప్ కౌర్ తివానా ... ఈ పేర్లెప్పుడైనా విన్నారా? వీళ్లంతా ఇప్పుడు వార్తల్లో వ్యక్తులు. తమాషా ఏమిటంటే వీరి గురించి తెల్లారితే తెగ వార్తలు [...]
Raka Lokam: దాద్రీ ... అఖ్లాక్... ఓ హత్య... బోల్డన్ని కట్టుకథల...: భారత దేశం జనాభా కోటి పాతిక లక్షలు. దేశంలో గ్రామాలు దాదాపు ఆరు లక్షలు. కానీ దేశంలోని ఒక వర్గం మీడియాకి, కుహనా సెక్యులర్ రాజకీయ నాయకులకు, ...
భారత దేశం జనాభా నూటపాతిక కోట్లు. దేశంలో గ్రామాలు దాదాపు ఆరు లక్షలు. కానీ దేశంలోని ఒక వర్గం మీడియాకి, కుహనా సెక్యులర్ రాజకీయ నాయకులకు, తమకు తాము మేథావులు అని బిరుదులిచ్చుకున్న ఓ గుప్పెడు మందికి మాత్రం ప్రస్తుతం భారత్ అంటే ఢిల్లీ నేషనల్ కాపిటల్ రీజియన్ (ఎన్ సీ ఆర్) కి చేరువలో ఉన్న ఒక్క గ్రామం మాత్రమే. ఆ గ్రామం పేరు బిసాదా. కానీ మీడియాకి బిసాదా అన్న పేరు పెద్దదిగా [...]
Raka Lokam: నెట్టింట్లో కబుర్లూ ... కాకరకాయలు 4: ఆదిమ యుగంలో అరుపులు, పెడబొబ్బలే మాట్లాడుకునేవారు. అంతగా ప్రేమ పుడితే తాకి, ముట్టి భావాలు కలబోసుకునేవారు. ఆ తరువాత అమ్మలక్కలకు పిట్టగొడలు, అ...
ఆదిమ యుగంలో అరుపులు, పెడబొబ్బలే మాట్లాడుకునేవారు. అంతగా ప్రేమ పుడితే తాకి, ముట్టి భావాలు కలబోసుకునేవారు. ఆ తరువాత అమ్మలక్కలకు పిట్టగొడలు, అన్నలు, అయ్యలకు రచ్చబండలు దొరికాయి. అమెరికా నుంచి అనకాపల్లి దాకా రచ్చబండ చర్చిస్తే, ఆవకాయ నుంచి ఆడబిడ్డ దాకా పిట్టగోడ పార్లమెంటు చర్చించేది. ఇప్పుడు ఇంటర్ నెట్ పుణ్యమా అని గ్లోబ్ మొత్తం ఒక పిట్టగోడ. ప్రపంచం ఒక రచ్చబండ!! కిరాణా [...]
చూస్తూ చూస్తూనే ఇంకో వారం క్యాలెండర్ నుంచి Ctrl Alt Del అయిపోయింది. మరో వారం మరో Window లా Open అవుతోంది. కొత్త Icon పై క్లిక్ చేసి కొత్త Windowని ఓపెన్ చేసేయండి. మళ్లీ ఏడు రోజుల్ని Scroll Down చేద్దాం. మళ్లీ URLogist లుగా మారిపోదాం. మళ్లీ Grtలు, LoLలు, RoFlలు, he he heలు, ASAP లు మొదలు. మళ్లీ Apple తింటూ, Byte కి Byte కి మధ్య Mouse తో ఆడుకుంటూ Viral ఫీవర్ ని ఎంజాయ్ చేద్దాం. సరదాలను
బ్రహ్మ మనిషిని తయారు చేశాడు. అన్ని తెలివితేటలను, సకల సామర్థ్యాలనూ ఇచ్చాడు. ధైర్యం, సాహసం, నమ్మకం, ముందుచూపు, ఆత్మ విశ్వాసం నూరి నూరి నింపాడు. ఆ తరువాత బ్రహ్మకి భయం పట్టుకుంది. వీడు కాలాంతకుడు, ప్రాణాంతకుడు, దేవాంతకుడు అయిపోతాడేమో..... కాబట్టి వీడి బలాన్ని మొత్తం వీడికి దక్కకుండా దాచేయాలి అనుకున్నాడు. "నేను దాన్ని ఆకాశంలో దాచేస్తాను. నాకివ్వు" అంది గద్ద. "మనిషి ఏదో ఒక [...]
వరల్డ్ వైడ్ వెబ్ (డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు) పుట్టినప్పుడు వామనుడిలా అమెరికాలోనే ఉండేది. ఇప్పుడది త్రివిక్రముడై మూడో పాదం ఎక్కడ మోపాలి అని ప్రశ్నిస్తోంది. పిడికిట్లో పట్టే సెల్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచమంతా గుప్పెట్లో ఉన్నట్టే. ప్రపంచంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా ప్రేయసిలా కళ్లలో కళ్లు పెట్టి చూసే డెస్క్ టాప్, ఒళ్లో గువ్వలా ఒదిగి కూచునే లాప్ టాప్, పుస్తకమంత ఉండి [...]
రెప్పపాటులో నెట్ లో ఎనిమిది మంది లాగిన్ అవుతున్నారు. క్షణానికి వంద కామెంట్లు పోస్టవుతున్నాయి. నిమిషానికి 31500 మంది లైకుల బైకులెక్కి నెట్ రూట్ లో పరుగులు తీస్తున్నారు. ఇరవై నాలుగు గంటల్లో నెట్లో అప్ లోడ్ అవుతున్న ఫోటోలు ఏకంగా నాలుగు కోట్లు. ఒక రోజుకి గూగుల్ గోదాములో సమాచారం కోసం 'సెర్చి' లైట్లు వేసుకుని వెతుకుతున్న వారు ఏకంగా 327 కోట్ల మంది. రోజుకి 6,04,800 సెకన్లు. వారం [...]
ఇప్పుడు వారాన్ని ఎలాగోలా నెట్టుకురానవసరం లేదు. నెట్టుందిగా.... అదే ఇంటర్ నెట్టుందిగా! ఇంటర్ నెట్ తో పిడికిట్లో ప్రపంచం. వేలి కొసలపై విశ్వబ్రహ్మాండం!! రెప్ప వేసి తెరిచే లోగా గిగా బైట్లలో సమాచారం అప్ లోడవుతోంది. పిన్ నుంచి ప్లేన్ దాకా ఊహకందని అన్ని విషయాలపైనా బోలెడంత సమాచారం మౌస్ క్లిక్ చేసినా, స్క్రీన్ ను ట్యాప్ చేసినా దొరుకుతుంది. అయితే వీటిలో కొన్ని టాప్ ఆఫ్ ది [...]
అనగనగా ఓ షాదీ లాల్. ఓ శోభా సింగ్. స్వాతంత్ర్యోద్యమంలో వీళ్లది ఓ విలక్షణ పాత్ర! వీళ్లు ఉద్యమాలు చేయలేదు. పోరాటాలు చేయలేదు. వీళ్లు చేసిందల్లా ఒక్కటే. స్వాతంత్ర్య సమరయోధులు భగత్సింగ్, రాజగురు, సుఖదేవ్ లకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. వీళ్లు బ్రిటిష్ ప్రభుత్వానికి తొత్లులుగా వ్యవహరించారు. వీళ్ల సాక్ష్యం వల్లే భగత్సింగ్, రాజగురు, సుఖదేవ్ లు ఉరి కంబం ఎక్కారు. [...]
వానలు మొదలయ్యాయి. నేలలో చిన్న విత్తనం నీరు తగలగానే మేల్కొంది. మొలకెత్తింది. మొలకెత్తడం ఏమిటి... చరచరా పాకింది. బిరబిరా ఎదిగింది. తీగ పచ్చని ఆకులతో పరపరా అల్లుకుపోయింది. వారం పది రోజుల్లో చెట్టు చుట్టూ తీగ పెనవేసుకుపోయింది. చెట్టు కనిపించనంతగా కమ్ముకుపోయింది. కాండం కనిపించడం లేదు. కొమ్మలు కనిపించడం లేదు. తీగ ఎదుగుతూనే ఉంది. తీగ గర్వంగా చెట్టుతో అంది. "నువ్వూ ఉన్నావు. [...]
తొమ్మిది ఎనిమిదిని లాగి లెంపకాయ కొట్టింది. ఎనిమిదికి దిమ్మదిరిగి పోయింది. "ఎందుక్కొట్టావ్?" "నేను నీకన్నా పెద్దదాన్ని. అందుకే కొట్టాను." ఎనిమిది పక్కకి చూసింది. ఏడు నిలబడి ఉంది. ఏడుని లాగి లెంపకాయ కొట్టింది. "ఎందుక్కొట్టావ్?" "నేను నీకన్నా పెద్దదాన్ని. అందుకే కొట్టాను." ఏడు ఆరుని కొట్టింది. ఆరు అయిదుని కొట్టింది. అయిదు నాలుగుని కొట్టింది. నాలుగు మూడును [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు