విజయవాడలో ఈ నెల 12 న జరగబోయేబివివి ప్రసాద్ కవిత్వ సంపుటి 'నీలో కొన్నిసార్లు', హైకూల సంపుటి 'బివివి ప్రసాద్ హైకూలు' పుస్తకాల పరిచయ సభకు ఇదే ఆహ్వానం.  
'బివివి ప్రసాద్ హైకూలు' సంపుటి పై ఆంధ్రభూమి దినపత్రిక లో 5.9.2015 న బులుసు సరోజినీదేవి గారి సమీక్ష.. ఆంధ్రభూమి లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బి.వి.వి. ప్రసాద్ కవిత్వం లో ఏముంటాయి? ఈ లోకంపై కాస్తంత దయ, సన్నజాజి తీగలా చుట్టుకొన్న తాత్వికత, గొంతు విప్పి హాయిగా గానం చేసే జీవనానుభవాలు. ఇంతే! ఇంకేమీ కనిపించవు. మరీ ముఖ్యంగా వాక్య వాక్యంలోంచి దూసుకొచ్చి, పీకపట్టుకొని నులిమేస్తూ ఊపేసే ఉద్రేకాలు, భీభత్సాలూ, వాదాలు వంటివి. బి.వి.వి నాకు ఒక హైకూ కవిగానే ఎక్కువ పరిచయం. నిమ్మముల్లులా గుచ్చుకొనేవి అతని హైకూలు. బాధగా [...]
'నీలో కొన్నిసార్లు' పుస్తకం చేతుల్లోకి తీసుకొని ఈ కవిత్వం ఏం చెబుతోంది అని ఒకటికి రెండుసార్లు ప్రశ్నించుకొన్నాను. ఈ కవిత్వం ఈ కవి ద్వారా అక్షర రూపం దాల్చిందే అయినా, ఒక సంపుటంగా సమగ్రరూపం పొందినపుడు ఈ కావ్యానికి ఇక తనదైన అస్తిత్వం ఉంటుంది.మనిషి తననీ, సమాజాన్నీ, ప్రపంచాన్నీ, జీవితాన్నీ అన్నిటినీ ప్రశ్నించే, నిందించే క్రమంలో తనలోతుల్లో దేనికోసం వెంపర్లాడుతున్నాడు [...]
http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/07062015/13 బివివి ప్రసాద్ హైకూలు డౌన్లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. http://www.newaavakaaya.com/Short-Stories-Poetry-Essays/ebooks-bvvprasad-haiku.html ఆన్ లైన్ లో చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి:  http://bvvprasad.blogspot.in/2014/08/blog-post_9.html
ఆమె నాకు కవిత్వంరాయిలాంటి జీవితంలో కోమలత్వం చూపుతోన్న శిల్పం దయనీ, సౌకుమార్యాన్నీ, పసిదనపు ఆశ్చర్యాలనీ వెదజల్లే రసమయలోకంఉదయాస్తమయాకాశాల్లో  సూర్యుడు వెదజల్లే ఊహల్లోపలి ప్రపంచంవెన్నెల కాయటం, రుతువులు మారటం, కాలం మృదువుగా కరిగిపోవటంఆమెని దర్శించాను పలుమార్లుపూలు దయగా పూయటంలో, వికసించటంలో,రేపటి పూలకి దయగా చోటువిడవటంలోఆమె ఆకాశమనీ, నేను దానిలో [...]
ఎప్పుడైనా, ఏ పనిలోనున్నాఅంతకన్నా అపురూపమైనదొకటి నీలోంచి నిన్ను పిలుస్తూవుంటుందిపూలరేకులకన్నా సుతారమైన శూన్యమొకటిసీతాకోకపై ఊగే రంగులకన్నా కోమలమైన ఖాళీ మెలకువ ఒకటితల్లికి పసిపాప నవ్వు స్మృతిలో నిలిచినట్టు నీలోపలి నేపధ్యమై చలిస్తూవుంటుందిఆకలితో కనలే కళ్ళలోని, స్పర్శలోని దైన్యంకన్నా మృదువుగానీలోపలి దయాగుణాన్ని తడుముతూ వుంటుందిఎప్పుడైనా, ఏ పనిలో [...]
అందరూ ఉన్నట్లే వుంటుంది, అకస్మాత్తుగా ఒంటరితనం పరుచుకొంటుందిడాబామీది పావురాయి రెక్కల్నీ, కువకువల్నీ, నీడనీ వెంటపెట్టుకొని ఎగిరిపోతుందిపావురాయి ప్రపంచం ఖాళీ అయినచోట శూన్యం సుడితిరుగుతూ తనలోనికి లాగేస్తుందిలోకం ఎప్పట్లా మరోసారి దు:ఖమయమై కనిపిస్తుందినీతో ఏంపని చెట్లకీ, పిట్టలకీ, వాటిపై అలుపెరుగక ఎగిరే ఆకాశానికీ,మనుషుల నీడలకీ, గోడలకీ, తలక్రిందుల తెలివికీ [...]
గర్భంలో ప్రశ్నార్ధకంలా జీవం నింపుకొంటాము భూగోళం బిందువుపై ఆశ్చర్యార్ధకమై జీవిస్తాము జవాబునిచ్చే వాక్యంలా మేనువాల్చి మరణిస్తాము ప్రశ్న జీవం నింపుతుంది ఆశ్చర్యం జీవింపచేస్తుంది జవాబు మృత్యువవుతుంది మృత్యువంటే ఏమిటనే ప్రశ్న జవాబు తరువాత మిగిలే ఖాళీకాగితంలా ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది 13.04.2013
అందమైన దృశ్యమొకటి మేకుకి తగిలించినట్టు కవిత రాసాక ఒక పేరుకి తగిలించటం అలవాటు పేర్లెపుడూ ఎందుకో ఆకర్షించవు తరచూ చూసే మనిషైనా పేరు గుర్తురాక లోపలి మైదానంలో తడుముకొంటూ తిరుగుతుంటావు జీవించటంకన్నా, పేరు తెచ్చుకోవటం ముఖ్యం గనుక   పేర్లని గుర్తుంచుకొనే ప్రపంచంలో నువ్వొక వింతమనిషివి ఒక మనిషి ఎలా నవ్వుతాడో, స్పందిస్తాడో గుర్తున్నట్టు అతని పేరు [...]
గది బయటి అలికిడి ఎవరినో నీలో ప్రవేశపెడుతుందితలుపులు తెరిచి ఒక జీవితాన్ని ఆహ్వానిస్తావుఒక మనిషి, ఆయనతో కొంత కాంతి, కొన్ని రంగులూ, నీడలూఆయనలో కొన్ని శబ్దాలు, వాటిలోపల అగాధమైన నిశ్శబ్దంఒకరినొకరు చూస్తారురెండు మూలాల నుండి, అనంతయాత్రల నుండి,రెండు దహనక్రియల నుండి,పూవులా వికసించే, ముకుళించే చూపులతో ఒకరినొకరు తాకుతారుమాటలేవో చెబుతాయి, మౌనమేదో వింటుంది, అలలు [...]
నువ్వు వచ్చావని గుర్తుపట్టినట్టు తలవూపింది ఆమెఈ లోకంలో చివరి నిముషాలలో చివరి విశ్రాంతిలో వుందిఏయే నవ్వుల వెనుక ఏయే విషాదాల్ని దాచవచ్చోఆమె ముఖంలో పలుమార్లు దర్శించావు జీవితం పొడవునాఆమె ఎంత అమాయకురాలోఆమెని గాయపరిచిన ఎవరెవరు ఎంత అమాయకులోఅందరినీ గాయపరుస్తున్న జీవితమెంత అమాయకమోకాలం కన్నీటినదిపై నీ పడవప్రయాణంలో తెలుసుకొంటూనే వున్నావు  రాత్రి ఒక నిశ్శబ్ద, ఏకాంత [...]
మానుషప్రపంచం మరీ అంత భయావహమైంది కాదని నీ కలలోని భూతమే నిన్ను మ్రింగబోయినట్లునువ్వు విలువిస్తే బ్రతికే సమూహం నిన్ను కమ్ముకొంటుందని సమూహాన్ని చెరిపేస్తూ నిన్ను గుర్తుచేయాలనే ఇతను మాట్లాడుతున్నాడునీదైన ఆకాశం కిందికి, సూర్యకాంతిలోకి, నీవైన గాలితెరల్లోకి, శ్వాసల్లోకి,నీ చుట్టూ వాలుతూ, మాయమౌతున్న వెలుగునీడల రహస్యలిపుల్లోకినీవి కాని రణగొణధ్వనుల్లోంచి రహస్యంగా [...]
పనులన్నీ ప్రోగుపడి ఏంచేయాలో తోచని ఉక్కపోతలో ఉన్నట్లుండి, ఎన్నడూ తెరవని కిటికీ తెరిస్తే ఆకుపచ్చని చెట్లగుంపు బడిపిల్లల్లా కుదురుగా కళ్ళముందు వాలింది ఏమంత తొందర లోకమంతా తిరగాలని ఉత్సాహం చూసిందంతా అనుభవించాలనిప్రతిక్షణమూ పవిత్రంగా వెలుగుతోందనిప్రతిస్థలమూ స్వంత ఇల్లై పిలుస్తోందని గ్రహిస్తే ఇలా అల్లల్లాడవని, వెళ్ళే ప్రతి గాలికెరటాన్నీ ఆకుల అరచేతుల్తో [...]
నీ ప్రాణం కన్నా ఎక్కువని దు:ఖపడే స్త్రీ కూడానీ బలమైన ఊహ తప్ప నువ్వు కాలేవు సాలెపురుగు తనలోంచి సృజించిన గూడులా ఆమె చుట్టూ నీలోంచి ఒక ఊహ అల్లుతావు నీ ఊహలా ఉండాలని ఆమెని నిర్బంధించటం మినహానీ ఊహపై మేనువాల్చి విశ్రాంతి కోరుకోవటం మినహా నీకు నిజంగా ప్రేమంటే తెలియదు శ్వాసల కెరటాల్లో పడిలేస్తూ జీవించే నువ్వుకాస్త విశ్రాంతి కోరుకోవటం సహజమే కానీదానికోసం అలలనుండి [...]
ఎవరో నిన్ను పలకరిస్తే బదులిస్తావుతరువాత ఏమన్నా చెబుతారని చూస్తావా, ఏ మాటా అటునుండి రాదునీ ఎదురుచూపు వంతెనపై ఎవరూ నడిచిరారునీకూ, తనకీ మధ్యనున్న ఖాళీని చూస్తావు అప్పుడుమనుషులందుకే వస్తారు, సందర్భాలందుకే వస్తాయినీతో నువ్వుండిపోయినప్పుడు, నీలో నువ్వే ఇరుక్కున్నపుడునీలోంచి నిన్ను బయటికి లాగేందుకూ,వాళ్ళలోంచి వాళ్ళు బయటపడేందుకూ వస్తారుఒక మాటని వెళ్ళిపోయాక, ఒక [...]
           ఈ శీతాకాలపు ఉదయం. రాత్రంతా మంచుముక్కలా బిగుసుకొన్న ఆకాశంలో కదల్లేని నక్షత్రాలు వెండితెరల కాంతిలోంచి జారుకొంటూ గడ్డిపరకలపై కన్నుతెరిచాయి. ఇక చాలనుకొంటూ కాంతిబాజా మ్రోగిస్తూ కనిపించనిచోటికి నిన్ను పిలుస్తూ మాయమయ్యాయి. ఈ ఉదయం తొడుక్కొన్న చలివస్త్రంలోంచి చెట్లు చల్లని పచ్చసిరాతో జీవితం కాగితమ్మీద కొత్తసంతకాలు చేస్తున్నాయి. మనుషులు సరే. ఎప్పట్లానే [...]
సూర్యదేవుని దివ్యరథం దక్షిణ పొలిమేరల్లో ఆగింది ఏడురంగుల గుర్రాలు ఉత్తరానికి చూస్తున్నాయి   తండ్రీ, ఎందుకు దిశ మార్చి వెనుకవైపు తిరిగావంటాడు కవి కాంతిలా ముందుకు చూసే క్రాంతదర్శి కవి  కాంతిని ప్రసరించే సూర్యుడతని ఆత్మకు తండ్రి కుమారా, ఇది భగవంతుని నిర్ణయం సృష్టి సమస్తం ఆయన స్వప్నం దక్షిణదిశగా స్వప్నం విస్తరిస్తూ వుంది  ఆయన ఉత్తరాన విశ్రాంతిగా [...]
కవిత్వం చదవబోతున్నపుడైనా నీలో మెత్తదనం ఉండాలివెలితిగా వున్న ఆకాశంనిండా మెలమెల్లగా విస్తరిస్తున్న మేఘంలాంటి దిగులుండాలిఅక్షరాలపై సంచరించే చూపు వెనుక ఒక వర్షం కురిసేందుకు సిద్ధంగావుండాలికవిత్వాన్ని సమీపిస్తున్నపుడైనావానకాలువలో పరుగెత్తే కాగితం పడవలో ప్రయాణిస్తూసుదూరదేశాల మంత్రనగరుల్ని చేరుకొనేఅమాయకత్వం నీలో మేలుకోవాలికవి ఏమీ చెయ్యడు కన్నీటిలోకో, [...]
పగటి కాంతిరేకలు చీకటుల సోలినటు మధురస్వప్నమొకటి మెలకువన జారినటు ఆమె వెన్నెలనవ్వు నీలోకి వాలినటు పూవురాలేను పూవువలె నెమ్మదిని గాలివాలువెంట ఒంపు తిరిగి గాలినొక పూవుగా హొయలు దీర్చి రంగురంగుల గిరికీలు చుట్టి కాంతినొక పూవుగా చిత్రించి విడచి నేలపై మృదువుగా మేనువాల్చి నేల నొకపూవు రేకులా మలచి పూవొకటి రాలేను ఇచట ఈ స్థలములో తననీడపై తాను సీతాకోకయ్యి [...]
తోటివారిని గాజులానో, పూలలానో, కదలని నీటిపై నిదురించే చంద్రునిబింబంలానో చూడలేమా బహుశా, గ్రహాంతరాలలో ఏకాకులమై ఎదురైతే    అద్దంలో ప్రతిబింబంలా మృదువుగా చూసుకొంటాం ఒకరినొకరం నిజంగా, తెలియనిచోట ఉన్నాం కదా భూమి ఏమిటో, ఆకాశం ఏమిటో, మెరిసే ఉదయాస్తమయాలూ, దిగులు కురిసే నల్లని రాత్రులూ ఎందుకున్నాయో, ఏం చెబుతున్నాయో [...]
'ఆకాశం' సంపుటి నూతలపాటి కవితా సత్కారం - 2011 కు ఎంపికైంది. ఈ మేరకు 'ఆకాశం' కవితాసంపుటి కవి బివివి ప్రసాద్ ని నవంబరు 15 న తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో గంగాధరం సాహితీ కుటుంబం వారు ప్రశంసా పత్రం, నగదుతో సత్కరించారు.  ఆచార్య నాగోలు కృష్ణారెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో గంగాధరం సాహితీ కుటుంబం అధ్యక్షులు విద్వాన్ ఎస్.మునిసుందరం, కార్యదర్శి ఆచార్య [...]
సముద్రంపై ఎగిరి ఎగిరి మళ్ళీ నౌకపైనే వాలిన పక్షిలా లోకమంతా తిరిగి మళ్ళీ అక్షరాలపై వాలతావునీ కెంతమేలు చేస్తున్నాయో ఎపుడూ గమనించలేదు కానిభూమ్మీద అక్షరాలు మినహా నీకు తోడెవరూ ఉన్నట్టులేరుదు:ఖంలోకీ, వెలితిలోకీ ఘనీభవించినపుడుఏ శూన్యం నుండో పుట్టుకొచ్చిన కిరణాల్లా అక్షరాలునీ ఉద్విగ్న హృదయాన్ని చేరి మెల్లగా నిన్ను కరిగిస్తాయిఇంత దయా, శాంతీ నీ అక్షరాలకెలా [...]
1  ఒక గాయం ఎటూ కదలనివ్వక నిలబడినచోటనే కూలబడేలా చేస్తుంది చూస్తున్న దిక్కులోని శూన్యంలోకి వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపొమ్మంటుంది  గాయం ఏమీ చెయ్యదు  అప్పటివరకూ అల్లుకొన్న తెలిసీ, తెలియని స్వప్నాలనీ స్వప్నాలకి సుతారంగా పూయబోతున్న సంతోషాల పువ్వులనీచిందరవందర చేయడం మినహాపాలుగారే వెన్నెలల్నుండీ, ఉభయసంధ్యల వర్ణాలనుండీసేకరించుకొన్న జీవనలాలసని ఒకేసారి చెరిపేయడం [...]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు