బివివి ప్రసాద్ కవిత్వం పుస్తకాలు గూగుల్ డ్రైవ్ నుండి ఈ లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేయవచ్చును. పుస్తకాలన్నీ : https://drive.google.com/drive/folders/1UXzNEUxFt-HSPoiUodhtBahhyulVInMJ?usp=sharing ఆరాధన : https://drive.google.com/open?id=1hW-IuRzeqCiOLp5qsak9MhTXX8ZX3V45 హైకూలు : https://drive.google.com/open?id=1uQajfLXhLXYYQ7xgIvb2dXnKiC61vK48 నేనే ఈ క్షణం : https://drive.google.com/open?id=
ప్రచురణ: నవ్య వారపత్రిక 16.6.2018
మనస్సు సందేహాల పుట్ట, కాస్త తర్కమూ, ఊహా కూడా బాగా తెలిస్తే, ఇక అది పుట్టించే సందేహాలకి అంతే వుండదు. పెద్దగా తెలివిలేనివారికి ఇలా చెయ్యి అని చెబితే చాలు , దానినే పట్టుకొని వెళతారు, తెలివైనవారికి ఒకటి చెబితే, పది సందేహాలు వస్తాయి అంటారు శ్రీ రమణమహర్షి. చాలా సందర్భాల్లో ఆయన 'నీ సందేహాలన్నీ సరే, అవి ఎవరికి కలుగుతున్నాయంటే, నాకు అంటావు కదా, ఆ నేనెవరో చూడు' అని చెప్పేవారు. [...]
మౌలికంగా, మనకు జీవితం లో రెండు ప్రశ్న లుంటాయి. మనకు ఊహ తెలిసిన మొదట్లో ఈ రెండూ మనకి ఆశ్చర్యాన్ని గొలుపుతాయి. రాను, రానూ జీవించటం మానేసి, బతకటం ఒక అలవాటుగా మారిపోయే మొరటుదనంలో ఈ ప్రశ్నలు మరుగునపడిపోయి, తత్కాల ఘటనలకి తోచిన విధంగా స్పందిస్తూ కాలం గడుపుతాము మనం. ఆ ప్రశ్నలు నేనేమిటి, ఈ ప్రపంచం ఏమిటి. ఇవి ఇట్లా పద రూపంలో కాకపోయినా, మన బాల్యంలో మనలోంచి ప్రకటమయ్యే ఆశ్చర్యం [...]
 భారతీయఋషుల గురించి మనకి చాలా తక్కువ మాత్రమే తెలుసనుకొంటాను నేను. వారి అన్వేషణ, దాని ద్వారా వారు గ్రహించిన సత్యాలు అద్భుతమైనవి. జీవన మౌలిక వాస్తవికతని గ్రహించటానికి వారు తమ అంతస్ఫురణను ఆశ్రయించినట్టు కనిపిస్తుంది. అది మేథ కన్నా లోతైనది, ఖచ్చితమైనది. కాలక్రమంలో అనేక సామాజిక, రాజకీయ ప్రయోజనాలతో నిండిన అంశాలు మాత్రమే జాతిపై పెత్తనం చేసినపుడు, భారతీయ దర్శనం అంటే అది [...]
జ్ఞానం, మరీ గంభీర పదమైతే, 'మెలకువ' అందాం, ఎవరికి ఎలా ప్రాప్తిస్తుందో తెలియదు. ఎకార్ట్ టోలీ తీవ్రమైన నిస్పృహలో నెలల తరబడి జీవించాడు. 29 వ యేట ఒకరాత్రి చాలా రాత్రుల్లాగే సరిగా పట్టని నిద్రనుండి తటాలున మేలుకొన్నాడు. ఇక నన్ను నేను ఎంతమాత్రమూ భరించలేననిపించింది ఆయనకి. అంతలో ఒక ప్రశ్న. నన్ను నేను భరించలేను అంటున్నానేమిటి, అంటే భరించే నేనూ, భరించబడే నేనూ రెండున్నాయా [...]
 ఓషో రచనలలో నేను చదివిన మొదటిపుస్తకం ఇది. ఓషో జీవిత విధానమూ, ఆయన బోధ గురించి జరిగిన దుష్ప్రచారాల వలన చాలా కాలం ఆయన్ను దూరంగానే పెట్టినా, మిర్దాద్ కు ముందు కనిపించిన ఆయన నాలుగుమాటలూ, భిన్నంగా ఆలోచించేలా చేసాయి. ఒక మిత్రుడి దగ్గర ఈ పుస్తకం చూసి, చదువుకొని, ఏ పుస్తకమూ రెండోసారి చదివే అలవాటు లేకపోయినా, స్వంతంగా ఒక పుస్తకం ఉండాలని కొనుక్కొన్న కాపీ ఇది.తన శిష్యురాలు [...]
మైకేల్ నేమీ అనే రచయిత (కవి?) రాసిన నవల ఇది. జిబ్రాన్ ప్రాఫెట్ ని పోలిన ప్రబోధాత్మక రచన. ఒక మనిషి జీవితాన్ని, దానిలో తోచే అన్నిదోషాలతో సహా ఇంతగా ప్రేమించవచ్చా అని ఆశ్చర్యం కలిగింది చదువుతుంటే. ఇది ఒక పవిత్రమైన రచన అనిపిస్తుంది. కవరు మీది మాటలు ఓషో అన్నవి అనుకొంటాను. అప్పటికి ఓషోని చదవలేదు గనుక చదివే ముందు పట్టించుకోలేదు. చదివాక వాటినీ, ఓషోనీ కూడా [...]
 శ్రీ రమణమహర్షి సన్నిధిలో జీవించినవారి అనుభవాలని చలం రికార్డు చేసిన పుస్తకం ఇది. ఇది చదివేనాటికి జీవితం గురించీ, మనుషుల గురించి తీవ్రమైన అయోమయంలో ఉన్నాను. ఇది చదివాక, జీవితానికి ఒక అద్భుతమైన లక్ష్యం ఉందనీ, భూమ్మీద దురదృష్టకరమైన మానవజాతిలో నూరుశాతం ప్రేమించదగిన, నమ్మదగిన మనిషి ఒకరైనా జీవించి వెళ్ళారనీ అర్థమైంది. ఈ పుస్తకం ఇప్పుడు ప్రియదర్శిని ప్రచురణలు, [...]
శరత్ బాబు రచనలతో మొదలైన సీరియస్ సాహిత్య పఠనం దాదాపు రెండు దశాబ్దాలు సాగింది. తరువాత ఒక దశాబ్దం ఎంపిక చేసుకొన్న పుస్తకాలు మాత్రమే చదవగలిగాను. చివరగా ఇష్టంగా చదువుకొన్నది నిసర్గదత్త మహరాజ్ సంభాషణల పుస్తకాలు. సుమారు ఏడెనిమిదేళ్ళుగా చదవటం ఆగిపోయింది. ఇప్పుడు చదవమంటే, బడి పుస్తకాలు చదవమన్నంత బాధ.చదవటం కన్నా చూడటం, స్పందించటం ముఖ్యం. వాటికన్నా లోనికి చూసుకోవటం ముఖ్యం. [...]
చేతనకి వెళ్తున్నాము, మీరూ వస్తే బావుంటుంది అన్నారు జయతి. జనవరి రెండున బస్సులు మారి గుంటూరు జిల్లా, చౌడవరంలోని చేతనని చేరుకొన్నాను. జయతీ, లోహితాక్షన్ దంపతులతో, చేతన ఫౌండర్ మంగాదేవిగారితో పలకరింపులయ్యాక, లోపలికి వెళదామా అన్నారు మంగాదేవిగారు. చేతన ఆవరణలో నడక మొదలుపెట్టాము. సుమారు పది ఎకరాల స్థలంలో, అక్కడక్కడా ఒక్కొక్క విభాగానికి చెందిన భవనాలు, ఖాళీ స్థలమంతా [...]
1 నిద్రలో ఎక్కడుంటావు నువ్వు మెలకువలో నీ దేహాన్ని మోసీ మోసీ అలసిపోయాక దానిని ఎక్కడకు విసిరేసి, ఎటు వెళ్ళిపోతావు సృష్టికి పూర్వం ఉన్న ఏ శీతల నిశ్శబ్ద ప్రశాంతతలోకి నిదురించేవేళల రహస్యంగా ప్రవేశిస్తావు గాయపరిచే ప్రపంచాన్ని చెరిపేసి, భౌతిక వ్యాకరణానికి లొంగని రంగుల లోకాలని నీ నిశ్శబ్దసీమలో ఎగురవేస్తూ ఆడుకొంటావు 2 మెలకువ ఉత్త ఉలికిపాటు చిరంతన శాంతిలో [...]
పదిహేడేళ్ళ వయసులో చలం పరిచయం. కవిత్వం ఇంకా బాగా రాయాలనుకొంటూ, మహాప్రస్థానం పుస్తకం తెరిచినపుడు ముందుమాటలో పరిచయమయ్యాడు. ఎవరీయన, ఈ వేగమేమిటి, మాటల్లో తొణికిసలాడుతున్న నిజాయితీ ఏమిటి, ఆలోచనలో నైశిత్యమేమిటి.. ఇలా అనుకోగల స్పష్టత అప్పటికి లేకపోయినా, ఇలా అనిపించే విభ్రాంతి కలిగింది. తరువాత చాలాకాలం చలం, శ్రీశ్రీలు జోడుగుర్రాల్లా హృదయంలో దౌడుతీసారు. వారి రచనలు [...]
గాలికి గుమ్మంతెర కదిలినా చెట్ల ఆకులు జలజలా రాలినట్టు నువ్వు కవిత్వమై రాలవచ్చు గాలిలో గాలి మాత్రమే ఉన్నట్టు శబ్దంలో శబ్దం మాత్రమే ఉన్నట్టు కదలికలో కదలిక మాత్రమే ఉన్నట్టు నీలో జీవితం మాత్రమే ఉంటే  గుమ్మంతెర కదిలినా నువ్వు జీవితమై స్పందించవచ్చు  మరేమీ కాని జీవితానివి మాత్రమే అయినప్పుడు మరేమీ కాని స్వేచ్చవి మాత్రమే అయినప్పుడు వెర్రిబాగుల [...]
బివివి ప్రసాద్ కవిత్వం, హైకూల పుస్తకాలన్నీ  ఇప్పుడు కినిగే.కాం నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చును. కవి అన్ని రచనల కోసం ఇదీ లింక్ :  http://kinige.com/author/B.V.V.Prasad మొదటి వచన కవితాసంపుటి 'ఆరాధన' (సవరించిన ప్రతి) కోసం :  http://kinige.com/kbook.php?id=8528 రెండవ వచన కవితాసంపుటి 'నేనే ఈ క్షణం' కోసం :  http://kinige.com/kbook.php?id=8504 మూడవ వచన కవితాసంపుటి ' ఆకాశం' కోసం
వేర్పాటు భావమే మనస్సు, ఏకత్వ భావమే హృదయం.మనస్సు భయాన్నీ, కోరికనీ పుట్టిస్తుంది,హృదయంనుండి ప్రేమా, పంచుకోవటం వికసిస్తాయి.హృదయం ఆనందాన్ని మిగిల్చే బాధ కలిగిస్తే,మనస్సు బాధని మిగిల్చే సంతోషాన్నిస్తుంది.నువ్వు కదిలినపుడు మనస్సువి, నిశ్చలంగా ఉన్నపుడు హృదయానివి.నేను అది, నేను ఇది అనే భావాలే మనస్సు, 'నేను' అనే స్వచ్చమైన స్పురణయే హృదయం.పరిశీలించుకొని చూస్తే మనస్సుగా [...]
పేరూ, ధనం, విజ్ఞానమూ, అధికారం బలప్రదర్శన వేదిక ఏదయినా కావచ్చును సంపాదించి, మరింత బలం సాధించి ఏంచేయాలి జీవనానందం చుట్టూ సమాధి నిర్మించి ఏంచూడాలి  చిననాటి చల్లని వెన్నెల చూపులు జారిపోయినపుడు నిష్కపటంగా, నిస్సంకోచంగా ఇక నవ్వలేనపుడు ఆనందంలోకి హాయిగా ఎగిరే మంత్రం మరిచినపుడు అనుకోగానే సులువుగా నిద్రలోకి మాయంకాలేనపుడు  సాటివారి దైన్యం సదా నిందితుడిని [...]
నాకు నచ్చిన భావాలను నీకు నచ్చిన మాటలలో చెప్పటం కవిత్వంనీకూ, నాకూ మధ్యనున్న ఖాళీలో శతకోటిభావాలను దర్శించటం కవిత్వంభావాల పంచరంగుల బొమ్మలతో కాసేపు ఆడుకోవటం కవిత్వంపంచ మహాభూతాలని తోచినట్లు కలిపి, తోచినట్లు విడదీసే ఆటలలోనిన్ను నువ్వూ, నన్ను నేనూ మరిచిపోవటం కవిత్వందాక్కోవటం కవిత్వం, దొరికిపోవటం కవిత్వందాక్కొంటూ, దొరికిపోతూ అలసిపోయిన నువ్వూ, నేనులుఒకటిగా [...]
'కొన్ని సమయాలు' పత్రికలో చదివిఎవరో మాట్లాడుతూ ఏ సందర్భం ఉద్దేశించారన్నారుఏ ఉద్యమం మీద అక్షరాల నీళ్ళు చల్లుతున్నారని వారి ఉద్దేశ్యంఅది ఏ ఉద్యమం గురించీ కాదుమన అందరి జీవితోద్యమం గురించని కవి చెప్పాడుబాగానే ఉంది కాని, సమాజస్పృహ కావాలి కదా అన్నారు ఆకాశంలో ఎగిరే పక్షినిపంజరంలోని పక్షి ఊచలచాటు నుండి చూస్తూపాపం అది ఆకాశంలో బంధించబడింది ఏంచేయాలో తెలియక [...]
బాగా చిన్నపుడు, ఆలోచించటం నేర్చుకొంటున్నపుడు ముక్తికోసం మునులు తపస్సు చేస్తారని చదివి జీవితం ఇంత అందమైంది కదా, ఆనందనిధి కదా జన్మ ఒక శాపమైనట్టు, పాపమైనట్టు వాళ్ళెందుకు స్వేచ్ఛకోసం తపించారని జనం మధ్య వెచ్చగా బ్రతకటం మాని అరణ్యాలకి వలసవెళ్ళారని అమాయకంగా, వాళ్ళంటే దయగా తలుచుకొనేవాడిని నిద్రపోతున్నపుడు ఊరిలో సడిలేకుండా ప్రవేశించిన వరదలా కబుర్లలో మునిగి [...]
ఒకరోజు రోజువారీ పనుల్లోంచి బయటపడిచూడాలిమన వలయం మీద మనమే తిరుగుబాటు చేసి స్వేచ్ఛను ప్రకటించాలివాహనం విడిచి కాలినడకన తిరగాలిరోజూ చూసే తెలియని మనిషిని మొదటిసారి పలకరించాలిబరువులన్నీ కాసేపు గాలికొదిలి, పగలంతా నిద్రపోవాలి. ఒక రాత్రి మేలుకోవాలిఆకాశాన్ని ఈ చివరనుండి ఆ చివరికి కొలిచి చూడాలిదేవుడేమైనా ఇటీవల ఆకాశం కొలత మార్చాడేమో ఆలోచించాలిచిననాటి నక్షత్రాలకీ, [...]
పొలంలో కట్టుతాడు విప్పగానే గేదెలునిధి ఏదో దొరికినట్టు గంతులేస్తూ పరుగు తీసాయివాటి పట్టరాని సంతోషం చూస్తే దేవుడు కాసేపు వాటికి రెక్కలిస్తే బావుండుననిపించిందిఎందుకంత గెంతుతున్నాయి అని మిత్రుడినడిగితే అవి స్వేచ్చ దొరికిందని సంబరపడుతున్నాయి తీరా ఇంటికి వెళ్ళాక మళ్ళీ కట్రాళ్ళ దగ్గర నిలబడతాయని చెప్పాడు కొంచెం దూరం పోయాక వాటిని చూస్తే గంతులాపి వెనక్కి [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు