కాలంలో వెనక్కి వెళ్లి చూడవలసిన కథలు కొన్ని వుంటాయి. ఇప్పటి పరిస్థితులతో, విలువలతో బేరీజు వేస్తే అవి చిత్రంగానూ, హాస్యాస్పదంగానూ అనిపించవచ్చు. కానీ మనుషులు, వారి స్వభావాలు, ప్రవర్తనలు కాలావధులను అధిగమించి నేటికీ ద్యోతకం అవుతూనే ఉంటాయి. అలాంటి పాత్రలతో రూపుదిద్దుకున్న కథలు, కాల పరిణామాలు ఎలా వున్నా కాలం వెంట నిలిచే కథలే. కన్యాశుల్కం అనే సమస్య యథారీతి ఈనాడు ఏ [...]
పాడుకాలం  భార్య: నేనే కాలాన్ని అయ్యుంటే అంతా నాకోసం ఆసక్తిగా  ఎదురుచూస్తారు కదండీ! భర్త : నిన్ను చూసి అంతా భయపడతారు  భార్య:అదేంటీ? భర్త: చూడు 'పాడుకాలం దాపరిస్తోంది' అని.  ***** పోస్టర్  'నేను యజమానిని [...]
తెలుగు సమాజం - మార్క్సిజం(వ్యాస స్రవంతి)సంపాదకుడు: డా.ఎస్వీ సత్యనారాయణనవచేతన పబ్లిషింగ్ హౌస్12-1-493/విఎ, గిరిప్రసాద్ భవన్బండ్లగూడ (నాగోలు)హైదరాబాద్-68వెల: రూ.75/- * ‘సమాజ రుగ్మతల కన్నింటికీ మార్క్సిజమే - మందు’ అనే భావన ప్రచులితంగానే వున్నవారున్నారు. మార్క్సిస్టు దృక్పథంతో చూసినప్పుడే, ఆ చూపునకు అది నిలిచినపుడే దేనికయినా సార్థకత! ప్రయోజనం! సంపదకు మూలం శ్రమ. శ్రమలో సమష్టి [...]
కీ.శే.కోట శ్రీనివాస వ్యాస్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు గానీ కె.పి.వ్యాస్- ఐ.పి.ఎస్ అంటే తెలియని వారు లేరు.రాజధాని రోడ్ల మీద వాహన సంచారాన్ని గీతలు గీసి నిబంధనల్లో నియంత్రించి ట్రాఫిక్ సెన్స్ అంటూ కలిగించింది ఆయనే!నిఖార్సయిన పోలీస్ ఆఫీసర్ గా ఖ్యాతిగాంచి హైదరాబాద్ లాల్ బహద్దూర్ స్టేడియంలో దారుణ హత్యకు గురి అయినది ఆయనే!ఆయన పేర పోలీస్ అకాడమీలో ఏటా [...]
‘కవి భిషక్కు’ - ఈ మాట ఒకప్పుడు చాలా ప్రాచుర్యంలో వుండేది. ఆయుర్వేద వైద్యానికి, కవిత్వ రచనకు అవినాభావ సంబంధం వున్నట్లుగా బాగా దాఖలాలున్న ఆ రోజుల్లో- అలాంటి మహనీయులను ‘కవి భిషక్కు’లనేవారు. సాహిత్య సృష్టిలోనూ, వైద్య చికిత్సలోనూ ఆరితేరినవారు ‘కవి భిషక్కు’లు. ఆధునికంగా అలాంటి ‘కవి భిషక్కు’ అనడానికి నిలువెత్తు నిదర్శనంగా వుండేవారు డాక్టర్ ధేనువకొండ శ్రీరామమూర్తి.గత [...]
Saturday, September 02, 2017 06:47 అక్షర S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage. * కథ, కవిత అనుసంధానం చేసే ఒక ప్రక్రియకు డా.బి.వి.ఎన్. స్వామి శ్రీకారం చుట్టారు. తానొక కథ అల్లుకుని, ఆ కథాసారానికి అనువైన మకుట సహితమైన ఒక శతక పద్యాన్ని జంటించారు. మరో విశేషం - ఆ పద్యంలోని మూడవ పాదంలోని ఒక పదమే ఆ చిన్న కథకు శీర్షికగా నిలపడం, ఆ పదం
‘అయ్యయ్యో! మన భాషయే -  మకరంద బిందు బృందరస స్యందన సుందరమగు మాతృభాషయే -  మహానంద కందళ సందోహ సంధాన తుందిల మగు మాతృభాషయే -  కమ్రతకు గమ్రత, కఠినతకు కఠినత - వదలునకు వదలు, బిగికి బిగి, జోరునకు జోరు, నెదురెక్కున కెదురెక్కు - మందతకు మందత - ధాటికి ధాటియు -  నన్ని వనె్నలు, నన్ని చినె్నలు, నన్ని వగలు, నన్ని వద్దికలు, నన్ని తళుకులు, నన్ని బెళుకులు - నన్ని హొయలు, నన్ని యొయ్యారములు గలిగిన [...]
                                     12.8.2017 శనివారం  అక్షర భావితరాలకు ఆదర్శనీయ సందేశం S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage. ** వేద విద్యా వైశిష్ట్యాన్ని, భారతీయ ఆర్ష సంస్కృతిలోని ఆచరణయోగ్య విషయాలను అవధూత దత్తపీఠ విద్యాధికారి కుప్పా వేంకట కృష్ణమూర్తి గారు ముఖ్యంగా విద్యార్థులకు ప్రదర్శన యోగ్యంగా వుండేటట్లు హాస్యరస
ఓయ్ ..! నేనూ ఓ.యూ విద్యార్థినే........ ఒకటో తరగతి నుంచి రీసెర్చి  వరకూ నా చదువంతా  హైదరాబాద్ లోనే జరిగింది.  సుల్తాన్ బజార్  గంటస్తంభం ఎదురుగా వుండే ప్రైమరీ స్కూల్ లో నాల్గవ తరగతి వరకూ చదివి, ఆ తర్వాత కేశవ్ మెమోరియల్ పాఠశాలలో ప్రవేశపరీక్షరాసి,  డబుల్ ప్రమోషన్ పై ఆరవ తరగతిలో చేరి చదువుకున్నాను.ఇంతలో మా నాన్నగారికి మలకపేట గవర్నమెంట్ క్వార్టర్ [...]
హాస్యావధానాలపేరిట సభల్లో ఆడవారిమీద కొన్ని పిచ్చి జోకులు వేస్తారనే అపప్రధ కొంత ఉన్నమాట నిజమే గానీ శంకరనారాయణ డొక్కశుద్ధి ఉన్నవాడు. భాషమీద మంచి పట్టు ఉంది కనుకనే ‘పన్’డితుడుగా రాణించడమే కాదు హాస్యబ్రహ్మ బిరుదాంకితుడయ్యాడు. శంకరుడు నారాయణుడు ఎలాగూ పేరులోనే వున్నారు కనుక బిరుదులో అభిమానులు బ్రహ్మను చేర్చారు. అందుకే బ్రహ్మాండమైన భాషా సాహిత్య విమర్శలు [...]
మనకున్న మంచి కథా రచయిత్రులలో  శ్రీమతి .గంటి భానుమతి గారు ఒకరు. ఇప్పటిదాకా ఎనిమిది నవలలు ,అయిదు కథాసంపుటాలు  వెలువరించిన భానుమతి గారు  వందకు  పైగా వ్యాసాలు,కవితలు కూడా రాసారు. 2012 లో తెలుగు విశ్వవిద్యాలయం  ఉత్తమరచయిత్రి గా సాహితీ పురస్కారం  అందుకున్నారు . శ్రీమతి గంటి భానుమతి గారి  అయిదవ కథా సంపుటి  ' సాగర మథనం ' కు   గౌరవాదరాలతో [...]
రేడియో నాటకం అనగానే  శ్రీమతి .శారదా శ్రీనివాసన్ గారే గుర్తొస్తారు.  చలం గారి ' పురూరవ ' కు జీవం పోసి స్వయానా ఆయన ప్రశంసలకు  పాత్రమైన ఖ్యాతి ఆవిడది. ఆకాశవాణి లో వారితో కలసి పనిచేయడం ,వారి పక్కన  రేడియో నాటకంలో నటించడం ఓ అదృష్టం [...]
  శ్రీమతి శారదా అశోకవర్థన్ తెలుగు పాఠకులకు,శ్రోతలకు తెలిసిన పేరే ఇది. కవయిత్రిగా,కథా,నవలా రచయిత్రిగా,నాటక కర్తగా, వ్యాఖాత్రి గా బాల సాహిత్యవేత్తగా పేరొందిన వారామె.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమాచార [...]
1960 ల్లోని ప్రముఖ రచయిత్రులలో  శ్రీమతి తమిరిశ జానకి గారు ఒకరు. విశాలి,వీడిన మబ్బులు ,అశోకవనంలో సీత వంటి నవలలతో పాఠకులను ఆకట్టుకున్నవారావిడ.  విశాలి చలనచిత్రంగా కూడా వచ్చింది.  పదిహేను నవలలు, అయిదుకథా సంపుటాలు, రెండు కవితాసంపుటులు  వెలయించిన జానకి గారు  తమ సరికొత్త మినీ కథా సంపుటి  " తమిరిశ జానకి మినీ కథలు" కు  మీ సుధామ ను ముందుమాట రాయమని కోరడం  వారి [...]
'ఎలనాగ 'అనే పేర ప్రసిద్ధులైన  డాక్టర్ .నాగరాజు సురేంద్ర గారు వృత్తిరీత్యా వైద్యులే  అయినా  ప్రవృత్తి రీత్యా మంచి సాహితీవేత్త.  పద్య,గేయ ,వచన కవితా రచనలోనూ, కథకునిగానూ,అంగ్లానువాదకునిగానూ  పేరెన్నికగన్నవారు.  ఇప్పటికి పలు కవితా  సంపుటు లు ,అనువాద గ్రంథాలు వెలయించిన ఎలనాగ తమ పదహారవ ప్రచురణగా సరికొత్తగా 'కొత్తబాణి 'పేర ప్రయోగపద్యాల సంపుటి ప్రచురిస్తూ అపార [...]
మీ సుధామ  వారాంతపు కాలమ్ '' సుధామ'యోక్తి ' నేటి శనివారం 2.4.2016 ' మన తెలంగాణ ' దినపత్రిక లో....
సందుపట్ల భూపతిగారి జీవనవలయాలు రేడియో నాటికల  సంపుటిలో పదమూడు నాటికలు వున్నాయి. ఇవన్నీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రచాసరమయ్యాయని చెప్పడానికి సంతోషిస్తున్నానంటూ ‘నామాట’లో పేర్కొన్న రచయిత,  ఎందరెందరికో కృతజ్ఞతలు ప్రకటిస్తూ, ఆకాశవాణిలో ప్రసారానికి ప్రోత్సహించిన రేడి యో ప్రముఖులను పేర్కొనకపోవడం సముచితంగా లేదు. ముందుమాటలు రాసిన అయిదుగురులోనూ [...]
- ఆకాశవాణిలో లలిత సంగీత కళాకారిణిగా,  కర్ణాటక సంగీత విద్వాంసురాలిగా పేరెన్నికగన్న శ్రీరంగం గోపాలరత్నం  అశేష శ్రోతలకు చిరపరిచితమైన పేరు. విదుషీమణి సంగీత చూడామణి కుమారి శ్రీరంగం గోపాలరత్నంగారి జీవితం-సంగీతం గురించి శ్రీమతి ఇంద్రగంటి జానకీబాలగారు ఓ గ్రంథాన్ని సంతరించటం ఎంతైనా అభినందనీయమైన సంగతి.  వారితో జానకీబాలగారికి సన్నిహిత పరిచయం వుండటం కూడా ఈ [...]
కీలుగుర్రాలూ, మాయ తివాచిలు  ఫాంటసీ బాల సాహిత్యం అనుకోనక్కర్లేదు. వై.రామకృష్ణారావు మాయతివాచీ పేరుతో సంతరించిన దీర్ఘకవిత  సహజ దర్పణంగా వుంటూనే త్రిలోక సంచారం చేయిస్తుంది.  పాదలేపనం ఏమీ లేదు. ఆ పసరేదో మనసుకే ఉంది.  మాయతివాచి మీద కూచుని లోకాలోకనం చేయడంలో  నరకలోకం, స్వర్గం ముందు చూసి ఆ తర్వాతే  భూలోక సంచారం కావించేలా చేస్తాడు.  నరకసీమ అంతా హైదరాబాద్ వీధుల్లో [...]
‘‘కవిత్వంలో, కథల్లో గణాంకాలు పోలికలు ఎక్కువైతే రసం తక్కువవుతుందని తెలిసీ, సమాచారాన్ని అందించే వాహకంగా నేను నా కవిత్వాన్నీ, కథల్నీ రూపొందించాను’’ అంటున్న డాక్టర్ లంకా శివరామ ప్రసాద్ గారి ఏడవ కవితా సంపుటి ‘మరణ శాసనం’. యాభై కవితల ఈ దీర్ఘ సంపుటిలో అందుకే వచనత్వం భాసించి రాణించడమే కనిపిస్తుంది! కవిత్వమంటే కబుర్లు కావుగానీ, కబుర్లు చెప్పినట్టుగా కవిత్వం రాయడం [...]
: నిజాంను పొగిడి పొగిడి ఇప్పుడు తన రక్షకభట యంత్రాంగాన్ని కూడా రజాకార్లలాగా మార్చి నియంతగా రాణించాలని గద్దెనెక్కిన బంగారు తెలంగాణ పెద్ద భావిస్తున్నాడేమోనని అనుమానాలు పొడచూపుతున్నాయి అంటే పరిస్థితుల తీరు అలానే పొడగడుతోంది మరి! ఉద్యమస్ఫూర్తితో ఎదిగి చిరకాల స్వప్నాన్ని నెరవేర్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిందనుకున్న పార్టీ, తద్వారా పాలనాపగ్గాలు చేపట్టిన [...]
శనివారాల్లో  ప్రచురితమౌతున్న నా  వారం వారం కాలం  'సుధామ'యోక్తి  ఈ 12.9.2015 శనివారం సంచికలో ....
ప్రతి శనివారం  ప్రస్తుతం  మన తెలంగాణ దినపత్రికలో  వస్తున్న  ' సుధామ ' యోక్తి  కాలం లో  ఈ శనివారం 22.8.2015 నాటి  సంగతులు
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు