అంతకుముందు వరకు చాలా frequnetగా మాట్లాడుతూ ఉండి, ఈ మధ్య పెళ్లి అవడం వల్ల (?) మాట్లాడుకోవడం కుదరని ఒక friend, మొన్నామధ్య call చేసి, "ఎలా ఉన్నావ్ రా?" అని అడిగాడు. అపుడు ఆలోచించా, "one lineలో, అసాధారణంగా అమామూలుగా  (అనగా, poeticగా) చెప్పడం ఎలా?" అని. అక్కడే, పోతనగారి దయ వలన తట్టింది ఈ title, "మెఱుగు చెంగట లేని మేఘంబు కైవడి1". After all , sincere conversations కోసం call చేసే friendsకి కొంచెం
ఎంతోసేపు pen పట్టుకుని కూర్చున్నాగానీ మాటలు పెగలడంలేదు. ఎలా మొదలు పెట్టాలో తెలియక మనసు మూగపోయింది పాపం. తన జ్ఞాపకాల్లోని నీ charming personalityని, తనకొచ్చిన simple మాటలు సరిగ్గా చూపించలేవేమోనని చిన్నబుచ్చుకుంది. అయినా, చూపించితీరాలన్న కోరిక వల్ల కలిగిన అలజడి ఆగక చేసిన ప్రయత్నమిది. "ఏంటీ పిచ్చిమాటలు" అనిపించొచ్చేమో, సాయంత్రం ఇంటికెళ్ళి, స్నానమయ్యాక, singleగా చదువుకో, నీవల్ల బద్ధలైన [...]
అవును, bad formలో ఉన్న batsmen తమకి తాము పదే పదే చెప్పుకునే phrase. In fact, ఈ మధ్య match కోసం room నుంచి బయల్దేరినప్పటి నుంచి groundకి reach అయ్యేదాకా దాన్నే జపిస్తున్నా, మంత్రం లాగా. Stupid shotకి out అయ్యాక ఆ రోజంతా ఎంత చిర్రాగ్గా ఉంటుందో, అంతో ఇంతో cricket ఆడిన మనదరికీ అర్థమైపోతుందనుకుంటా. "అలా ఎలా ఆడాన్రా?" అని department toilet లోపలి అద్దం ముందర ఎన్నిసార్లు అడిగానో, house keeping
రిలీజ్ రోజునే సినిమా చూడ్డం మానేసి కొన్నేళ్ళయింది, పెద్దోళ్లం అయిపోయంగా. కానీ ఈ మధ్యనే ఆ పనిచేసి మళ్ళీ బాల్యంలోకెళ్ళొచ్చా. అంతా ఆ దేవుడి దయ! అందరూ కేరళ వెళ్లి FBలో post చేస్తారు, "Landed in God's own country!" అని. కానీ, నేను, Mumbai వెళ్ళినపుడు చెప్పా, "God's own cityలో ఉన్నా" అని. ఈపాటికి అర్థమై ఉంటుంది మీకు, ఆ నా  దేవుడు సచిన్ టెండూల్కర్ అని. ఇప్పటికే చాలామంది చెప్పేసున్నారు, ఆయనెందుకు
ఈ seriesలో "ఇదో" outlier అవుతుందేమోనని అనుమానమున్నా, ఎవరో ఒకరు చదువుకునేలా, కనీసం ఇక్కడన్నా రాయకపోతే, రాయైపోతానేమోనని రాస్తున్నా. అంత సింపులేం కాదు, కానీ మంచి శార్మింగ్. ఈపాటికే ఎన్ని "కొండ"లెక్కేసిందోననే అనుమానం కలిగేలా అ(క)నిపిస్తుంది. ఏం మంత్రమో వేసేసింది. (ఏం మంత్రమో తెలీదనేం కాదు). లేకపోతే ఇదేంటి? ఇలాగ అరెష్టయి పోతున్నాను, వరష్టుగా. పక్కనెవరు కూర్చుంటారో నాకు తెలీదా, [...]
ఒకడు    :  ఓరి బాబో, next week నుంచి వీణ్ని పిలవద్దురా. "అమ్మాయి", "అమ్మాయి" అని అస్తమానం bore కొడుతున్నాడు. ఇంకోడు :  భయ్యా, నీకర్థం కావడం లేదు భయ్యా! ఇప్పుడూ, అమ్మాయి లేని జీవితం అంటే, tune చేయని lyric లాంటిది; నీకంత రసం లేదుగదా! పోన్లే, సచిన్ లేని cricket లాంటిది భయ్యా; నీకదిగూడా తెలీదు కదా! అయ్యో! ఇలాగాదుకానీ, water కలపని పెగ్‌లాంటిది భయ్యా, అమ్మాయి లేని జీవితం. ముందోడు : ఇదిగో
దేశ భాషలందు తెలుగు లెస్స! ఎన్నోసార్లు విన్నా, అన్నేసార్లు గర్వంగా చెప్పుకున్నా (జనాలకి). అసలింతకీ, అది నిజమేనా? లేక, కావ్యానుసారంగా చెప్పినదేనా?  ఆ చెప్పిన కృష్ణదేవరాయలకైనా దేశంలోని అన్ని భాషలూ తెలుసా? ఆయన దేశంలో నాలుగైదు కంటే ఎక్కువ భాషలు లేవనుకుంటా, కానీ ఇప్పుడో? ఇప్పుడు లోకమంతా ఒకే భాషనుకుంటాగా! ఇప్పుడు కూడా తెలుగు భాషే లెస్సా? ఎవరి మాతృభాష వారికి తీపి [...]
ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తానని అనుకుంటున్నావు కదూ! లేదు లేదు, నువ్వు లేని నాగురించి జాలిపడతాను. నీకంటే ముందే నన్ను ప్రేమించడం మొదలుపెట్టానుగా మరి!! --------------------------------------------------------------------------------------------------------------------- 1
నాకు పుట్టిందే. నా రక్తమాంసాలు తింటుంది. కానీ, నన్ను బ్రతికిస్తుంది.
ఏది నేనో?, ఏది కానో? నాదేదో?, కానిదేదో? తెలుసుకోడానికి ఇరవయ్యేళ్లు నిజంగా సరిపోతాయా? నాకైతే ఇప్పటికీ అనుమానమే, నాకేం కావాలో?, నేనేం ఇవ్వగలనో? ఇండియాలో ఇంజినీరయ్యాకే జనాలు ఏదోటి అవ్వాలని అనుకోవడం మొదలెడతారంట! నేను ఇంజినీరయి అఫిషియల్‌గా ఆరోఏడు. కాలిబాటనొచ్చానో, గాలివాటునొచ్చానో ఇంకా వెదుక్కుంటున్నా, నాలోపలే, చీకట్లో.  ఇంతలో, అల వైకుంఠపురంబులో, ఆమూల [...]
"ఏరా సంటీ, ఈమధ్య కవితలు రాయడం లేదు ?" "మరి తనక్కడ కళ్లలోకి చూస్తేనేగద, మనకిక్కడ కాగితాలు నిండేది!" "ఎక్కడ ?" "ఇక్కడనేం లేదు, ఎక్కడ ఎదురైనా చూడొచ్చు." Juice cornerలో కనిపించిందనుకో, జీవితం తగలడాలసిందే. Dairy Milk chocolate తీసుకుంటునప్పుడు తన చేతివేళ్లు చూశావనుకో(నేంజూశాలే!), కళ్లలో పొడిచి, గుండెలో కెలుకుతాయి. ఆ RPM ముందు, Juice cornerలోని mixer grinderలు కూడా 'అబ్బే, light తీసుకోవాల్సిందే
యండమూరి వారిని, వారి 'వెన్నెల్లో ఆడపిల్ల' ఓ లేఖ రాయమంటుంది తనకి. తీరా రాశాక, Fianl Draft కంటే, ఆ ప్రయత్నంలో Dustbinలో పడిపోయిన చిత్తు కాగితాల్ని ఇష్టంగా పట్టుకెళ్తుంది. అలాగే, నిన్ను(అంటే ఈ Blogని) చేరలేక, నాలోపలే దాగిపోయిన stockని ఇక్కడ present చేస్తున్నా,  పరికించు. 1. అయ్యో, మనకి ముహూర్తాలూ, మంగళసూత్రాలు ఎందుకూ ?     మెడ చుట్టూ పెట్టే మూడు ముద్దులే, నే కట్టే మూడు ముళ్లు.    
కృష్ణశాస్త్రి వారికి ఆ యొక్క అప్రాప్త మనోహారిణి ప్రసాదించిన                                                హృదయ దళనములొక్క శతము, అరుదెంచిన జగద్పతిని అలుకబూని తాచిన ఆ సత్యభామ ఆపై  సైచిన                                                వేదనయందొక్క సహస్రాంశము, ఇవి, ఊహించని నిన్నటి మీ దర్శన భాగ్యమున మాకొరిగిన వరవిశేషములు!!
నీ రాకకై రోజులు వేచి, హృదయాన కవన లతావితానముల పెంచి, విరహపు విరులు పూయగా తుంచి, నీవొస్తావని దారంతా పరచి, మాలగా కూర్చి, తోరణాలు తీర్చి, ఉన్నాను వేచి,  నీకై కాచి !!                            -/2/11.
పిలుద్దామనుకుంటాను, పలకవేమొనని ఆగిపోతాను. కలుద్దామనుకుంటాను, కరగవేమొనని కదలిపోతాను. కవన కన్నీళ్లతో కాగితంపై ఇలా కాలమంతా కుమిలిపోతాను ! మరువ యత్నిస్తాను; విఫలమేనని తెలిసినా,  మరళ మరళ యత్నిస్తాను.  మది గది తలుపుల తరలే నీ తలపుల తరంగిణిలో ఇలా తరలిపోతాను !!                                                                     -/9/10.
తమ్ముళ్లూ, తొందర పడండ్రోయ్ !, లేకపోతే సముద్రమంత  ప్రేమ, సాములోరి సెంబులో నీరైపో గలదు సుమా!! -------------------------------------------------------------------------------------------- 1 అబ్బే, నల్లపూసలు గుచ్చుకోకుండా నిద్దరెలా పడుతుంది చెప్పు !!  ************************************** జనాభీష్టం మేరకు, జరిగిన కథ: ఒకానొక sitting setting పీకేసి, pack-up చెప్పాక : మావోడికి నిద్దరట్టడం లేదు,
శాన్నాల్లనుంచి అనుకుంటూన్నారా శివగా, నీకో post dedicate చేద్దామని. మరెందుకు late అయిందంటావేమో.... నిన్ను రాయడామంటే నన్ను రాసుకోడమేగదా!! (ఏంటి నమ్మవా ?  కింద చదివితే నువ్వే నమ్ముతావులేరా..!!) పైగా మనకు publicity ఇష్టముండదు (ప్చ్, జనాలకు తెలిసిందేగదా). అలా అయితే, ఇప్పుడు రాయడమెందు కంటున్నావా? అంటావ్ రా,  ఈమధ్య ఎక్కువ సదువుతున్నావుగదా!! అడుగుతావ్. ప్రతి శుక్రవారం సాయంత్రం cell phone లో balance
సినిమాలూ,నవలల్లోనన్నా లవ్ సీన్లు చూన్నీవేఁ నన్ను, చూసేంతవరకూ ఓటి,  చూస్తున్నంత సేపూ ఇంకోటి, చూశాక మరో.....బాధ. సంపుతున్నావుగదే...! అసలు ఏ ఉద్దేశంతో మొదలెడతానోగానీ, చూస్తున్నంతసేపు నా లోపలి అవ్యక్తాస్పష్ట శూన్యం నా రక్తమాంసాల్ని మరింత తిని, తను విస్తరిస్తున్నట్లు తోస్తుంది. కసిగా, కనీ...సం కనికరమైనా లేకుండా, ఆ కోల కళ్లతో కాటేసినపుడే కక్కుదామనుకున్నా, కుదర్లేదు. ఆ నీ [...]
బెంగుళూరు, 13/8/13. ఇదిగో నిన్నే, ఎన్నెల్లో ఆడుకునే ఆడపిల్లల్ని నేంజూల్ల (నీకసైన్మెంట్లతోనే తీరిక లేదనుకుంటాలే, ఇంక ఆటలేమాడుకుంటావ్ !), వర్షంలో తడిసే సంద్రాన్నీ నేంజూల్ల (గొడుగున్నట్టుందిగా మనకు), నడిరాత్రి సంద్రపు సడిగూడ నేనిన్ల (మాటాడి సస్తేగా ఎపుడన్నా; నన్నేలే!!). పాలకడలి కెరటాల్నేంతాకల (ఆ నీ చెప్పులేంజేసుకున్నాయో గదా!), పైడి కొండన్నేంతడమల (ఆ చూడిదార్ సంగతేం [...]
అదేదో చిరునవ్వు లాగా...నే ఉంటుంది.కానీ Actualగా చిరునవ్వు కాదు. మొదట్లో కళ్లతో నవ్వుతోందేమోలే అనుకునేవాణ్ణి, అట్టే తెలిసిపోయింది, అదికూడా కాదని. అబ్బే, ఇదేదో Abstract material అనుకున్నా, అందువల్లే అందంగా ఉందేమో అని కూడా అనుకున్నా. కానీ, చాలా తేలిగ్గా(అంటే lightగా అనమాట), నెమ్మదిగా, చల్లగా ఉంటుంది. And భలే మెల్లగా గిల్లుతుంది కూడా. simpleగా (క)అనిపించే గొప్ప సంపద అనమాట, మట్టితో చేసిన దేవుడి
ఎన్నో చెబుదామనుంటుంది, అంతా చెప్పినా  I Love you అనే అవుతుంది. అందులో కొత్తేముందని ఆగిపోతాను. అందరు మీ(అమ్మాయిల) కళ్లని చూడమంటారు, నాకేమో నీ పాదాలు చూస్తూ  Propose చేద్దామనుంటుంది. పిచ్చోడనుకుంటావేమో అని ఆగిపోతాను. నా ప్రేమ కనిపించీ కనిపించకుండా మాటలు కడదామనుంటుంది. తీపి కాస్తా వెగటైపోతుందేమో అని ఆగిపోతాను. ఇలా, ఆగి,పోతూ......నే ఉన్నా, నీవైపుకే. 
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు