శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 11 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - ఎదను జీల్పఁ గనంబడు హేమమణులు.  తేటగీతి:  బీరువాలోని 'చెస్టు'లో బీరుబోక  దాచియుంతురు సంపదల్ దారుణముగ  నల్ల ధనమును మార్చుక, నయమునట్టి  యెదను జీల్పఁ గనంబడు హేమమణులు.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 11 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్ కందము:  మన్నున కష్టము బడుచును  అన్నియు ఫలితములిక పరమాత్మునివనుచున్  అన్నము జగతికి నిడు రై  తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్. 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 11 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - పడ్డవాఁడు కాఁడు చెడ్డవాఁడు ఆటవెలది:  గాటనున్నపశువు కాలుదువ్వుటగని మోరనెత్త జూచి మోజుగనుచు  దున్న తోడు బంప తోషమున దలచె  పడ్డ, "వాఁడు కాఁడు చెడ్డవాఁడు".
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 11 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - భామా రమ్మనుచు ముదిత భర్తను బిలిచెన్. కందము:  శ్రీమతి శ్రీవారు కలిసి  రేమో మొగమటుగద్రిప్పి, యిట్టుల తుదకున్   బామాలుచు భర్త పిలిచె  భామా రమ్మనుచు, ముదిత భర్తను బిలిచెన్.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 11 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - విప్రుఁడు మద్యమాంసముల విందనగాఁ దల యూపి వచ్చెనే.  ఉత్పలమాల:  సుప్రజ పెండ్లిగాగ తగుచోటుకు మిత్రుల జేర బిల్వగా  విప్రులుగానివారు తగ వేడ్కను నిల్వుగ నూపగా తలల్  విప్రకులమ్ము నాదనుచు పెద్దగ నడ్డముగానె చక్కగా  విప్రుఁడు మద్యమాంసముల విందనగాఁ దల యూపి వచ్చెనే. 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 11 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్. కందము:  మొగ్గుచు ధర్మము వైపున  తగ్గట్టుగ పేదవారి దయతో గనుమా  దగ్గరకే రానీయకు  సిగ్గెగ్గులు లేని మనుజు, సిరి తా వలచున్.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 11 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే. కందము:  గుండా సుబ్బారాయుడు కండలవీరుండు బూని ఘనమౌ ప్రతినన్  దండిగ పునుగులు బజ్జీల్  బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 11 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - హారము గొలిచిన నది పది యామడలుండెన్. కందము:  తీరగు ' నెక్లెస్ ' రోడ్డది యారహదారియె పురమున కావలనుండెన్  మీరిన పట్టణ కంఠపు  హారము,గొలిచిన నది పది యామడలుండెన్.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 11 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - దేవుడు లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్. కందము:  దేవుళ్ళాడక బయటే దేవుని మదిలోననిలిపి దేహీ! పాహీ! దేవుడ ! యన రక్షింపని  దేవుడు లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 11 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - కారాగారమున ఘనసుఖంబులు దక్కున్.  కందము:  గారాబము తో తల్లియె  మీరుచు తన సుతుల జేరి మెత్తని బుగ్గల్  తీరుగ నిమిరిన తోషులు  కారా? గారమున ఘనసుఖంబులు దక్కున్.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 11 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - అయ్యను గని విరహమందె నతివ సహజమే.   కందము:  అయ్యడవిలోన నుండగ  తొయ్యలి యా శూర్పణఖయె తొందరబడెగా  నయ్యతి సుందరుడౌ రా  మయ్యను గని విరహమందె నతివ సహజమే. 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 10 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - రణమే సుఖశాంతు లిచ్చి రంజిల జేయున్. కందము:  రణమే కనుడిది సరి ప్రే  రణమును తానీయ గురుడు రంజిలునటు ధా రణమంది సమస్యా పూ  రణమే సుఖశాంతు లిచ్చి రంజిల జేయున్.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 10 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - ఫాల్గుణమున దీపావళి పండుగ కద. తేటగీతి:  రాముడనదేవుడేగద, రాజధాని  హస్తినాపురమేగద, హాస్యమొక్క  రసము గాదామరియు శిశిరమ్ము గాద    ఫాల్గుణమున, దీపావళి పండుగ కద. 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 10 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - రైకను విప్పి కలిసినది రణనిహతుఁ బతిన్. కందము:  పాకీల పారద్రోలగ  దూకిన మన సైనికుండు దుర్ మృతినొందన్  వ్యాకులత నెలత కన్నీ  రై, కనువిప్పి కలిసినది రణనిహతుఁ బతిన్.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 10 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - నడిరేయిన్ రవిఁగాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్.  మత్తేభము:  వడిగా పద్యములెన్నొ వ్రాయ మదిలో భావించగా భావనల్  సుడిగా ముప్పిరిగొన్నవాయె తుదకున్ చూడంగ ధీశక్తితో  నొడిలో పుస్తకముంచివ్రాయ రవి,  తా ' మో ' యంచు ధారాగతిన్  నడిరేయిన్ 'రవిఁ' గాంచి యుత్పలము లానందంబునన్ [...]
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 10 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - సీతను బెండ్లాడి శివుఁడు శిశువుం గనియెన్. కందము: కోతలరాయుడు జెప్పెను ప్రీతిగ నేభాగవతము పిప్పిని జేస్తిన్ తాతా !వినుమాయందున సీతను బెండ్లాడి శివుఁడు శిశువుం గనియెన్.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 10 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - అంగమ్మునుఁ జేతఁ బట్టి యాడిరి విబుధుల్. కందము:  రంగముపై శివరాత్రిని  జంగమదేవరలవోలె శంకర యనుచున్  లింగని రూపము స్పటిక శు  భాంగమ్మునుఁ జేతఁ బట్టి యాడిరి విబుధుల్.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 10 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - జారుల మాటలను వినని జాతి నశించున్. కందము:  దూరముగ బెట్టమందురు   కోరుచు సత్పురుషులెల్ల, ఘోరమొనర్చే క్రూరుల,జూదరులను మరి   జారుల, మాటలను వినని జాతి నశించున్.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 10 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే. కందము:  ఆంధ్రుడ శతకమ్మిట సై రంధ్రీ! యని వ్రాసినావురా పద్యములన్  ఆంధ్ర నిఘంటువు వెదకెద   రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 10 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్. కందము:  మేలుగ నీరే పారగ  కాలువనేతీయ తండ్రి గబగబ వెడలెన్ వీలగు వస్తువులివి గున  పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 10 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - విదియ నేడు వచ్చె విజయ దశమి. తొమ్మిదవరోజు ఊరికి వెళ్తానంటున్న కూతురుతో తల్లి.  ఆటవెలది:  వినుమ వెడల రాదు వెనుక వచ్చిన యూరు తొమ్మిదవదినమ్ము తొందరేల  నేనుచెప్పుచుంటి, నీవువచ్చినరోజు  విదియ,నేడు వచ్చె విజయ దశమి. 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 10 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - అతఁడు నా పతి మఱి మగఁ డౌ నితండు తేటగీతి:  ప్రక్కనిద్దరుపురుషులు బరగ నిలువ టీవి సీర్యలు నటిజెప్పె ఠీవిగాను  మందమతియను నాటకమందు జూడ  నతఁడు నా పతి, మఱి మగఁ డౌ నితండు. 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 10 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - మొయిలు రక్తమ్ముఁ గురిపించె భూమిపైన. తేటగీతి:  మేఘనాధుడు దాగగా మేఘమందు  గురినిజూచుచు సౌమిత్రి చురుకుగాను  శిరముద్రుంచగ శరముతో, జివ్వుమనుచు  మొయిలు రక్తమ్ముఁ గురిపించె భూమిపైన.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 09 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - కవియే మఱి పతనమునకు కారణమగురా.  కందము:  భువిలో నెవ్వడును పరుల యువిదల సంపత్తుగోరు టొప్పనితనమే  చెవినివి బెట్టనిచో మన  కవియే మఱి పతనమునకు కారణమగురా. 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 09 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - నకులుఁజంపె రామ నరవిభుండు. ఆటవెలది:  బాధబెట్ట సురల భార్యనే చెఱబట్ట చెప్ప హితమును పెడ చెవిని బెట్ట  బ్రహ్మ హత్య యయ్యు రావణాధిపు డహీ  న కులుఁజంపె రామ నరవిభుండు.
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు