కవిత్వమంటే ఏమిటో ఇంకా తెలీని రోజులనుంచి, నన్ను ఎంతో ప్రభావితం చేసిన కవి సినారె. కాస్తో కూస్తో రాయడం మొదలుపెట్టాక మెల్లమెల్లగా ఆయన విశ్వరూపాన్ని వీక్షించగలిగాను. కొందరి కవిత్వం ఉత్తేజపరుస్తుంది, మరికొందరిది లాలిస్తుంది, ఇంకొందరిది ఆలోచింపచేస్తుంది.. ఇలా ఎన్నో.. నాకు అర్థం అయినంతవరకూ సినారే విశిష్టత ఏంటంటే ఏ కోవలోకి ఆయన్ని నెట్టలేం. ఆయన కవిత్వం ఒక జీవితం. అందులో [...]
ఈ ప్రయాణం గమ్యంతో అంతమవ్వదు.. ఈ పయనానికి అంతమే గమ్యం. ఏ విరామం, విశ్రాంతి నాకు ఆటవిడుపు ? కళ్ళు వెతుకుతూనే ఉంటే, కాళ్ళు చతికిలబడ్డా, ఆలోచనలు ఆగక అలసిపోతుంటే, కళ్ళు మూతబడ్డా.. "నేను" లేని ప్రపంచం కోసం నేను మథనపడతాను. "నా" లోనే. "నా" అంతా. ఏ సందు చివరో నేను ఆగిపోతాను. ఏ తెలియని మలుపు వద్దో. అది నాకు ఇష్టమైనదో కాదో.. నేను ఓడినట్టో, లేక గెలిచినట్టో.. నా వెంట ఇకా రాని "నా" [...]
చాలా యేళ్ళ క్రితం నిన్నే పెళ్ళాడుతా చిత్రం చూసి, ఇదేం అంత గొప్ప సినిమా కాదే అని నిట్టూరుస్తుంటే, నలుగురూ మొత్తబోయారు. అప్పట్లో అదో కళా ఖండం మరి. ఓ సాయంత్రం కాఫీ తాగుతూ, ఆ చిత్రం గురించి నాలానే ఫీల్ అయిన మా శారద పిన్ని ఏం తేల్చారంటే, మనలోనే లోపముంది అని.. జనాలకి అలా తీస్తేనే నచ్చుతున్నాయనీ..మరి అందరూ అలా నచ్చుకుని మెచ్చుకున్న చిత్రం, నాకు మాదిరిగానే రుచించడాన్ని నేను [...]
కవిత, కవి చేతి రాతలోనో, కవి గొంతులోనో, ఇంకా అర్థవంతం గా ఉంటుంది. కొన్ని సార్లు మాటలే కాదు, మౌనాన్ని కూడా వినాలి. ప్రపంచ పదులు, గుల్జార్ కవితలు, కవి గొంతులో విని ఎన్ని వందల సార్లు మురిసిపోయానో నేను. కవి యొక్క గాత్ర ధర్మం కంటే, భావాన్ని వినగల్గితే, కవిత ఇంకా అందంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఎప్పటినుంచో, పోస్ట్ చేసే కవితలకి శబ్ధాన్ని జోడిద్దామనే ఆలోచన ఉన్నా, పెద్దగా [...]
బ్రతికేస్తున్నా ఇరవై నాలుగు గంటలూ, మనసుకి దగ్గరైన క్షణాలెన్ని.. అడుగులతో వేల మైళ్ళు దాటేసినా, తగ్గిన దూరాలెన్ని.. అర్థం లేని మాటలు, అక్కర్లేని కన్నీళ్ళు, ఎన్ని పారేసుకున్నా, గుండెకి తోడుగా దొరికిన నేస్తాలెన్ని.. ఏం ప్రయాణమో ఇది, సాగే కొద్ది సన్నమైపోతోంది. ఎదిగే కొద్ది ఒంటరైపోతోంది.. ఇదే జీవితం అని సరిపెట్టేసుకున్నా, ఇలా కాదు, మారోలా అంటూ అనుక్షణం [...]
జ్ఞాపకాల జ్ఞాపకాలు.. కొన్ని క్షణాలు, గుర్తే కాదు.. అనుక్షణం గుర్తుకు రావడమూ గుర్తే. మనసు తలుపు తీసి తొంగి చూస్తే, ఎంత తడో, గుండె నిలువెల్లా సేద తీరడానికి. రేపు ఉందో, లేదో, ఎవరికైనా.. ఎవరికి తెలుసు ? ఈ రోజంతా, నిన్నను గుర్తుకు తెచ్చుకుని బ్రతికేసాను. అదే నేను. కన్నీళ్ళ సావాసమే అయినా, గతం ఓదారుస్తుంది. బహుశా నేనూ జీవించానని గుర్తు చేసి.. నిన్న, మొన్నల లెక్కలు ప్రక్కకు [...]
కొన్ని నెలల క్రితం నేను కౌముదికి పంపిన కవిత "గుప్పెడు చీకటి" ఈ నెల సంచికలో ప్రచురింప బడింది. వీలు చూసుకుని ఓ లుక్కు వేయండి. కౌముది
కొన్ని చిత్రాలు చూసిన తరువాత చాలా కాలం మన ఆలోచనల్లో వెంటాడుతూ ఉంటాయి. ఈ మధ్యే వచ్చిన "తల్వార్" అలాంటిదే. కొన్నేళ్ళ క్రితం నొయిడా జంట హత్యల ఉదంతం తెలిసిందే. ఆ కేసు నేపధ్యాన్నే కథగా చేసుకుని మలచబడింది తల్వార్. నేరం, పోలీసు, పరిశోధన, వ్యవస్థ, దాని అవస్థ, ఈ అంశాలన్నిటి వెనుక, ఎక్కడో నక్కే న్యాయం. ఈ పరిస్థితి ని ఎలాంటి అనవసర హంగులు లేకుండా వీలైనంత నిజయితీగా చిత్రీకరించారు. [...]
గుండెని తడిమే చిత్రం - "పీకు" హీరోలు, అనవసరపు పాటలు, అతికించిన కామిడీ, అర్థంలేని కథ.. ఈ గొడవలు ఏమీ లేకుండా, ఒ చిత్రం చూద్దామనుకుంటే, తప్పక చూడాల్సిన చిత్రం "పీకు". సున్నితమైన కథాంశం, మనలాంటి మామోలు పాత్రలు, ఇది నిజమే అనిపించే చిత్రీకరణ వెరసి "పీకు". కొన్ని కథలు, నవ్విస్తూనే ఆలోచింప చేస్తాయి. పాత్రలతో పాటు, మనల్నీ కథలో కలిపేసుకుని, మనసంతా తడిమి, భాదో, సంతోషమో తెలియని [...]
నిన్న మా అన్నయ్య పంపితే చదివాను, "ఆంధ్రప్రదేశ్" అనే పత్రికలో ప్రచురితమైన "మా నాన్న" అనే కవిత. మమోలు మాటల్లోనే చెప్పినా ఎంతో లోతైన అనుభూతిని మిగిల్చింది ఈ కవిత. అమ్మ గురించిన కవితలు ఎన్నో చదివాను కానీ, నాన్నని వర్ణిస్తూ రాయబడ్డవి కాస్త తక్కువే అని చెప్పాలి. భావుకత, అనుభవం సరైన పాళ్ళలో మేళవించిన కవయిత్రి తిరుమలాదేవి గారికి హృదయపూర్వకమైన అభినందనలు. http://ipr.ap.nic.in/AndhraPradeshPatrika/
ఎంత వేగం అందుకోను.. నానుంచి నేను పారిపోడానికి. ఎంత కాలం వేచిచూడను.. నిన్నను మళ్ళీ తెచ్చేసుకోడానికి. ఎన్ని పుట్టిన రోజులు.. తిరిగి పుట్టేయడానికి. ఎంతటి బంధాలు.. చావుని ఆపేయడానికి. ఇంకా ఎన్ని జీవితాలు. నేను లేకపోవడానికి.
విషయం లోకి వెళ్ళేముందు చిన్న ఉపోద్ఘాతం ఇస్తాను. ఫాథర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ సైన్స్ గా చెప్పుకోదగిన శాస్త్రజ్ఞుడు అలెన్ ట్యూరింగ్. ఆయన దశాబ్ధాల క్రితం ఒక చిన్న పరీక్షను ప్రతిపాదించాడు, దాని ముఖ్యోద్దేశం కంప్యూటర్ ని ఇంటెలిజెంట్ అని ఎప్పుడు అనచ్చు అని. మరీ లోతుల్లోకి వెళ్ళకుండా క్లుప్తం గా చెప్పుకుంటే, ట్యూరింగ్ ఏమన్నాడంటే, ఏ రోజు అయితే ఒక మనిషి తను నేరుగా చూడకుండా [...]
మనిద్దరం.. మనిద్దరం కలిసి నడుస్తుంటే, మధ్య దారిలో ఎక్కడో, కాలం తప్పిపోయింది. మనం వెతుక్కుంటూ.. చెరో దారీ అయ్యాం. కాలం ఇద్దరికీ దొరికింది. జీవితం ?  
ఏప్రిల్ నెల సంచికతో "కౌముది" సెంచరీ మైలు రాయి దాటేసింది దిగ్విజయంగా. నెల నెలా తెలుగు సాహితీ వెన్నెలని విరజిమ్ముతూ, ఎన్నో ఖండాంతరాలను పలకరించి, పులకరింప చేసిన మన కౌముది మరెన్నో మైలు రాళ్ళు దాటాలని మనసారా కోరుకుంటున్నాను. కొన్నేళ్ళ క్రితం, ఓ రోజు అంతర్జాలం లో తెలుగు వెలుగు ఎక్కడైనా కనిపిస్తుందా అని వెతుకుతుంటే దర్శనమిచ్చింది కౌముది. ఆ క్షణం నా అనుభూతి నాకు ఇంకా [...]
మా బుడ్డోడు నేర్పినవి.. పడిపోయినా అడుగు ఆపక్కర్లేదని.. ఎగిరే పక్షికే కాదు.. అస్తమించే సుర్యుడికీ టాటా చెప్పాలని.. పాట ఏదైనా మనకొచ్చిన నాట్యం చెయ్యొచ్చని.. అప్పుడప్పుడు సరదాగా నాలుగడుగులు వెనక్కి వెయ్యచ్చని.. చిరునవ్వులు పంచడానికి పరిచయం అక్కర్లేదని.. గాయాలని తడుముకుని ఏడవద్దని.. చందమామని క్రిందకి రమ్మని రోజూ పిలవచ్చని.. చెప్పడానికి మాటలెందుకని..
--- గతానికి ఎదురీత. చీకట్లో.. కలలో. కలవరింతతో. --- నీ కళ్ళతో ఏంచూస్తాను.. నా లోపల్లోకి. గుడ్డి చూపులు. --- నువ్వు నేను గెలిచానన్నావ్.. ఇంకో నువ్వు నేను ఓడానన్నావ్.. నేను బ్రతికి.. పొయాను.. అంతే. --- వెతకడమే సుఖం. భయం లేదు. ఏదో పోగొట్టుకుంటానేమో అని. --- జీవితం లో అన్నీ రెండే.. నిండా భిన్నమైనవి.. వెలుగు చీకట్లు.. సుఖ దుఖాలు.. నేను, నీ దృష్టిలో నేను. --- తేదీలు మారాయి.. మనుషులూ..
మొన్నెప్పుడో అల్లు అర్జున్ చిత్రం ఆడియో విడుదల వేడుకలో, కమీడియన్ ఆలీ అన్న వెకిలి మాటలకి నొచ్చుకుని, ప్రోగ్రాం అయ్యాక యాంకర్ సుమ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అని గాలి వార్త. ఈ సంఘటన నిజా నిజాలు మనకు తెలీదు కానీ, నా మటుకు మాఇంట్లోనే చాలా సార్లు ఆలీ మాటలకి, చేష్టలకి ఇబ్బంది పడ్డాం, విసుక్కున్నాం, ఛీ అనుకున్నాం. కుటుంబం అందరం కలిసి చూసే కార్యక్రమాల్లో అక్కర్లేని, వెకిలి [...]
శీర్షిక చూసి అదేదో డబ్బింగ్ సినిమా టైటిల్ అనుకునేరు, అలాంటిదేం కాదు. ఉదయం కాఫీ తాగుతున్నప్పుడు, కంటికి కనిపించిన వార్త చదివేయడమే తప్ప, అది మనకి అవసరమా కాదా అని ఆలోచించే అలవాటు నాకు బొత్తిగా లేదు. అలానే ఈ రోజు ఈనాడు లో ఓ కధనం చదివా.. అదేదో దేశం లో శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి, ప్రేమ లో ఉన్న వాళ్ళ మెదడులో అవేవో భాగాలు బాగా చురుగ్గా ఉన్నాయి అని నిర్ధారించారంట. చెప్పకనే [...]
నిన్న జరిగిన ఫుట్ బాల్ మాచ్ లో అల్జీరియా జర్మనీ చేతిలో ఓటమి చవి చూసింది. చివరిదాకా ఎంతో ఉత్కంఠతో జరిగిన పోరాటంలో, జర్మనీ మొత్తానికి గట్టెక్కింది. ఇంతవరకూ బానే ఉంది, ఇందులో నాకు "హమ్మయ్యా" విషయం ఏంటా అనే కదా మీ పెను అనుమానం. చెప్తా.. చెప్తా.. పేరుకి పారిస్ లోనే ఉంటున్నా, నిజానికి నేను ఉన్న ఏరియా పేరు పోంథన్. అది ఒకప్పుడు పాపం ఓ చిన్న వూరు, పారిస్ పెద్దది అయ్యి, అయ్యి, ఇలా [...]
అదేదో సినిమాలో వెంకటేష్ చెప్పినట్టు, నాకూ ఒక కల ఉంది. అంటే, వీడియో కాంఫరెన్సు లో చంద్ర బాబు తో మాట్లాడుతుంటే, చంద్ర మోహన్ పిలవడం కాదు లెండి. ఏదో ఫామిలీ టైపు కల .. మా చెర్రీ గాడి ఫస్టు బర్త్ డే ప్యారిస్ లో జరుపుకోవాలని. వాడి పేరు చెప్పుకుని మనం కేకులు లాగించడానికి ఎక్కడైన ఒక్కటే అయినా, నేను మళ్ళీ ఇండియా వెళ్ళొస్తా అంటే, మా ఆఫీసు వాళ్ళు నా పాస్పోర్ట్ నాకే తెలియకుండా [...]
నాకు నడక రానే లేదు. అడుగు అడుగులో పడిలేస్తూ ఉంటాను.. కానీ నా నడక ఆగలేదు. నా పరుగు వేగంగా లేదు.. మలుపు మలుపులో చతికిలబడిపోతాను. కానీ పరుగు మానలేదు. నా ప్రయాణానికి దిశ లేదు. ప్రతీ మజిలీలో దిక్కు మారిపోతాను. కానీ పయనం ఆపేయ్యలేదు. నాకు గమ్యమంటూ లేదు.. అనుక్షణం... లేని అర్థమేదో వెతుకుతుంటాను.. కానీ కలల్ని చిదిమెయ్యలేదు. నాకు జీవితం అక్కర్నే లేదు.. ప్రతిపూటా భారంగా [...]
అడుగడుగునా.. ఇందాకే "ఒక్కడున్నాడు" చిత్రంలోని "అడుగడుగునా" పాట విన్నాను. ఎంతటి చక్కని భావం. ఈ పోస్ట్ రాయడం మొదలు పెట్టాను.. "అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు.. కోరిన తీరాన్నే చేరుకునే వరకు.." "ఓ నిమిషమైన నిదరపోవా.. నిలవనీవే.. నిరీక్షణమా... నే వెతుకుతున్నా ఎదుట పడవేం తొలి వెలుగు తీరమా.." "నా దిగులు మంటే తగులుతుంటే.. రగలవేం కాలమా.." గుండెల్ని హత్తుకునేలా లేవూ [...]
నాలా నేను.. నా ఒంటరితనం, నేను ఒక్కణ్ణే.. నాతో ఎవరూ లేరని కాదు.. నేను ఒక్కణ్ణే.. నాకు ఎవ్వరూ వద్దని కాదు.. కానీ.. నేను ఒక్కణ్ణే.. ఎందుకంటే.. నేను ఒక్కణ్ణే.. వెనక్కి తిరిగి బాగా చూసుకుంటే.. మొదలయ్యిన చోట.. నేను ఒక్కణ్ణే.. ముందుకు వెతుక్కుంటే.. అలసి తుదిగా మిగిలేచోట.. నేను ఒక్కణ్ణే.. ఎందుకంటే.. నాలో ఇంకెవ్వరికి చోటుంది.. నేను నేను గానే మిగిలాక.. ? ఎందుకంటే.. నాతో వేసే మరో అడుగు [...]
నువ్వు నీకు దగ్గరవ్వడం ఎంత తేలికో... నీ వైపుగా వేసే అడుగులు అన్నీనావేగా మరి.. అందుకేనేమో నీకు దూరమవ్వడం కూడా అంత తేలిక... కెరటాల మీద ఒడుపుగా, నేను నడిచిపోతుంటే.. ఒంటరిగా.. పండు వెన్నెల్లో.. మండుటెండల్లో.. విస్పోటనంలో.. నిశ్శబ్దంలో.. మౌనంలో.. మధనంలో.. నాలో.. ఆకాశం చివరన సముద్రాల్ని తడుముకుంటూ.. నీ వెంట నేను చేసేది ఆరని పరుగు. ఎవరో నన్ను తరుముతున్నట్టు.. నీ వెంట. ఒంపైన [...]
నాన్న నాన్నని అయిన ఎనిమిది నెలలకి  అర్థం అయ్యింది.. ఎనిమిదేళ్ళ వయసులో నేను పోగొట్టుకున్నదేమిటో.. కొన్ని మళ్ళీ మళ్ళీ పొందగలం.. కొన్ని ఒక్కసారే.. పొందినా.. చేజారిపోయినా... కోల్పోయిన బంధానికి... రుచే చూడని కొన్ని అనుభవాలకి.. ఆ దైవాన్ని ప్రశ్నించాలనిపిస్తున్నా.. ఇన్నేళ్ళ ప్రయాణంలో ఆ లోటే తెలియనివ్వని అమ్మకి.. దాసోహం అనాలనిపించింది. ఈ క్షణం నాలో ఉప్పెనై వెల్లువెత్తిన ఈ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు