"అమ్మమ్మగారూ, మీరేం చదూకున్నారండీ?" పదకొండేళ్ళ పిల్ల నిలదీస్తోంది.  అట్నుంచి సమాధానం రాలేదు. బాదం చెట్టు నీడ అరుగుమీదకి వాలుతోంది. మధ్యాహ్నపు దాహానికి కాకి కావుకావుమంటోంది.  పెరటి గుమ్మానికి పక్కనే అరుగు మీద పీట వాల్చుకుని, గోడకానుకుని సొట్టకాళ్ళు జాపుకు కూర్చున్నారావిడ. కొద్దిగా పొట్టైన పరికిణీ జాకెట్టు వేసుకున్న పిల్ల, రెండుజడల్నీ ఇట్నుంచటుతిప్పి పీకకి [...]
పొద్దు గుంకిపోతోంది.  ఆ పాడుబడిన దేవాలయం ఆవరణలోగడ్డి కోసుకుంటున్న పిల్లలు, గరికచెక్కలు విదిలించి, పచ్చికతో తట్టలు నింపుకుని.. ఇళ్ళదారి పట్టారు. పగలంతా తాము దాచుకున్న తిండికోసం వెతికి, పరుగులు పెట్టిన ఉడుతలు.. అలసి కలుగుల్లో చేరాయి. మునిమాపున బోసిపోయినట్టూ ఒంటరిగా మిగిలిందా కోవెల.  కూలిన రాతిగోడలు, ఒరిగిపోయిన శిల్పాలు.. పలుచని శిథిల సౌందర్యరేఖల్ని [...]
వాణి పెళ్ళికూతురయ్యింది.   'రేపు పెళ్ళి పీటలమీద కాస్త ఒద్దిగ్గా కూర్చో.. మరీ చిన్న మధుపర్కాలు! నెరువు సరిపోకపోతే ఎలాగో ఏవిటో!' అమ్మమ్మ మాట వాణికి పెళ్ళి ముందురోజు నిద్రలోకూడా గుర్తొస్తూనే ఉంది. నారింజరంగుకి ఆకుపచ్చ అంచున్న పట్టుచీరలో ముస్తాబయ్యింది. గౌరీపూజ, కన్యావరణం అవగానే బుట్టలో కూర్చోబెట్టారు. మేనమావలు తీసుకొచ్చి పెళ్ళి మండపంలో దింపారు. అమ్మమ్మ [...]
నీ ఒక్కో ప్రశ్నా వేల డాలర్ల విలువైనది. దోచిపోసినా తీరని ప్రశ్నలు కాదో! గతవారం 'రాముడూద్భవించినాడూ రఘుకులమ్మునా..' అన్నానో లేదో, 'రాముడ్లాంటి వాడు కావాలీ, అక్కర్లేదూ కూడా.. కదా?' అని ఓ ములుకు వేసిపారేశావ్.  కావాలా, అక్కర్లేదా? 'సీతా అండ్ హర్ షివల్రీ' అని ఉపన్యసిస్తే ముక్కున వేలేసుకుంటారో, ముక్కుకోసేస్తారో కానీ నువ్వన్నది మాత్రం నిజం. కన్న కొడుకుగానో, విల్లువిరిచే [...]
ఒక్కోసారి మనం ఏమాత్రం ఊహించని మనుషుల దగ్గర ఊహకందని కథలుంటాయ్. సుచిత్ర దగ్గర విన్నానిది.  *** "The last thing I want now is to talk about Suchitra and her project." విశ్వ మొన్నరాత్రే అన్నాడీమాట.    తనకాలిగోరు నా అరికాలిని పలకరిస్తూ ఉండిఉండకపోతే 'నేను వినట్లేదా నీ ఆఫీస్ కబుర్లన్నీ..' అనేదాన్నే.  సుచిత్ర టీమ్ లో చేరి ఎనిమిదినెల్లవుతోందేమో. తనపేరు వినగానే బంగాలీ అనుకున్నాను. ఇంటిపేరు
చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి చెప్పానాయనతో.. "నాకు ఈవిడ మరీ నచ్చేస్తోంది.." అని. ఆవిడ డా.సోమరాజు సుశీల. ఆ పుస్తకం "ముగ్గురు కొలంబస్ లు". అమెరికా ట్రావెలాగ్ అంటే చర్వితచర్వణమే! ఈ దేశమూ పెద్దగా మారినదేమీలేదు. పాతికేళ్ళనాటి "పడమటి సంధ్యారాగం" లో చూపించిన పాల డబ్బాలే ఇవాళ్టికీ కనిపిస్తాయి. పిల్లల కార్టూన్ 'బార్నీ'తో సహా ఏమార్పూ లేదని ఘంటాపథంగా చెప్పొచ్చు. తేడా [...]
"గాడ్.. ఐ మిస్ హర్." మంచం మీద నుండి లేచి పేటియోలోకి నడిచి సిగరెట్ వెలిగిస్తూ అనుకున్నాడు ఏడెన్.  "జస్ట్ యూ.. నో బడీ ఎల్స్ బట్ యూ.. " మంచం మీద నిలబడి మారిలీన్ ని అనుకరిస్తూ, లేతాకుపచ్చ కళ్ళను మెరిపిస్తూ.. పాడే వికా గుర్తొస్తోంది. ముదురు నీలిరంగు స్టిలెటోస్ వేసుకుని గదిలో గిరగిరా తిరిగి డాన్స్ చేస్తూ, జారుతున్న శాటిన్ లాంటి నవ్వుతో విరబూసే వికా.. వికా..  "మిసింగ్ [...]
ట్రైన్ దిగి బయటికి వస్తూ జేబులోంచి ఫోన్ తీసి టైం చూసుకున్నాడు హరి. "ఐదున్నర.. అంటే ఏడవుతుంది వాళ్ళ టైం. ఇంకా నిద్ర లేవలేదా..?" అనుకుంటూండగానే స్కైప్ లో మెసేజ్ పాపప్ అయింది. "హాయ్, గుడీవినింగ్ హరీ.. " "గుడ్మాణింగ్..." కోలన్ కి రైట్ పెరాంథిసిస్ తగిల్చి నవ్వాడు. "కాల్?" "రెడీ.." "దెయ్యం నిద్ర పట్టేసింది హరీ.. అసలు అలారం టోన్ గా  స్కైప్ రింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎంత నిద్రలో [...]
నీలి తెరలను దాటి కిటికీలోంచి పడుతున్న వెలుగుకి కళ్ళుతెరిచింది వికా. తలగడ కిందకి పెట్టుకున్న కుడిచేయి తిమ్మిరిగా అనిపించి.. నెమ్మదిగా చేతులు సాగదీసుకుంటూ ఒళ్ళువిరుచుకుంది. బీజ్ రంగు గోడకి ఆన్చి ఉన్న వాలుకుర్చీని చూడగానే నిద్రమత్తంతా వదిలిపోయిందామెకు. ఇష్టంలేని విషయాన్ని వాయిదా వేయాలనే ప్రయత్నమన్నట్టూ కళ్ళు మూసేసుకున్నా...  క్షణాలు గడుస్తున్నకొద్దీ నిజం [...]
"రావుడు నాస్తానివిట్రా అయితేనూ.. ఈ పూటకి తినే వెళ్దువులే. వారం సంగతి ఆయనకోమాట చెప్పి, రావుడిచేత కబురంపుతాను.. ఏం?" ఎటూ తేల్చకుండా లోపలికి వెళ్ళిపోయారావిడ. దిక్కులు చూసాడు బొజ్జన్న. తల్లి వెనకే లోపలికెళ్ళిన రామం వస్తే బావుండునని ఎదురుచూస్తున్నాడు. ఎదురుగా ఉన్న పంచపాళీ గుమ్మంలోంచి తప్పడడుగులువేస్తూ వస్తున్న పాపాయిని చూసి పలకరింపుగా నవ్వాడు.  "గోపన్న [...]
"ఇదేవిట్రా! నేనుండగా చూడాల్సినవా ఇవన్నీ.." లక్ష్మికి టైఫాయిడ్ తిరగబెట్టి ఎమర్జెన్సీలో ఉందని తెలిసినరోజు, బస్ దిగుతూనే నన్ను చూసి బావురుమన్న అక్క మొహం ఇంకా కళ్ళముందే కదులుతోంది. ఎంత బెంగ పెట్టేసుకుందని! తన కాళ్ల నొప్పుల్ని కూడా లెక్కచేయకుండా పసిపిల్లకి చేసినట్టూ సేవచేసి, మంచానికి అతుక్కుపోయిన లక్ష్మిని మళ్ళీ మనిషిని చేసింది. బావ నెలల తరబడి ఒక్కడే ఉండి వండుకు [...]
"కృష్ణశాస్త్రి ఒక్ఖ కథో, నవలో రాసి ఉంటేనా!" అని గింజుకున్నాను "అప్పుడు పుట్టి ఉంటే" పూర్తి చేశాక. ముందు మాటలో ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి మాత్రం "కృష్ణశాస్త్రి కథ, నవలల జోలికి పోలేదు. ఆయన రుచే వాటి మీదకు ప్రసరించలేదేమో!" అని ఊరుకున్నారు. తెలుగు సాహిత్యానికి నిజంగా లోటే.. కృష్ణశాస్త్రి కథ లేకపోవడమనేది. ఏడువారాల నగలున్నా మరో ముద్దుటుంగరం చేరినట్టయ్యేది [...]
సమస్య.. తాళం వేసానా? కుడా ఎడమా.. ఎటు తిప్పాను? ఉహూ.. ఎప్పుడూ నాలుగడుగులు వేసాక ఇదే అనుమానం.. ఎప్పుడూ ఉండేదే. ముందుకే పోదాం. పదండి ముందుకు పదండి తోసుకు.. ఎవర్ని తోసుకునీ.. 'రా రా చిన్ననా.. రారోరి చిన్నవాడ..' ఎమ్మెస్. 'రా రా ముద్దులాడ.. రారోరి..' నెహ్రూ తలవంచి 'హూ యామై? నీ ముందు నేను మియర్ ప్రైమ్మినిస్టర్నన్న..' ఎమ్మెస్. అనడూ మరి! ఎమ్మెస్.. బంగారానికి తావి?  వీధి చివర
ఇదే వేసంగి.. అయితే ఇప్పట్లా ఉస్సురస్సులేం తెలుసూ! చిన్నతనపు భాషలో వేసవంటే.. సెలవులూ, మామిడిపళ్ళూ, మల్లెపూలజడలూ, ఎండావకాయ, దొంగచాటున తినే తాటిముంజలూ, బొమ్మల ప్రింట్ కాటన్ గౌన్లూ. కరంటంటే మునపటి తరం నుంచీ ఉన్నా, కరంటుకోత మాత్రం మా చిన్నతనాల్లోనే వచ్చిందని చెప్తారు. కాకపోతే అప్పటి నెలజీతంలాగే, పవర్కట్టూ పరిమితంగానే ఉండేది.  సాయంకాలాలు వీధిలో దొంగాపోలీసో, [...]
"జీవించినందుకు రెండే ఫలితాలు. తీవ్రమైన ప్రేమతో జీవితం వెలగాలి. లేకపోతే విరహంతో కాలిపోవాలి. అంతేకాని ధనము, సుఖము, భోజనము.. ఇవన్నీ కలిగి బతకడం యెందుకు!" అంటాడు.. రగిలే ప్రేమికుడొకడు. ప్రేమ ఉండి.. ధనము, సుఖము... భోజనమూ లేకుండా 'బతకడం' సాధ్యమేనా? అని అడిగితే మల్లెల నవ్వొకటి విసిరి మౌనంలోకి జారిపోతాడేమో. "ప్రేమలేఖలు" చదివిననాటి నుండీ.. ఇంత ప్రేమ సాధ్యమా అనే ఆలోచన. [...]
కౌముదిలో ప్రచురింపబడుతున్న "గాలిసంకెళ్ళు"  ఇక్కడ..  'కౌముది'కి ధన్యవాదాలతో..
గొంతుక్కూర్చుని మౌంజి పేనుతున్న నరసింహం దృష్టి అదాటున వీధి వైపు మళ్ళింది. అనంతప్ప సకుటుంబంగా కోరడి వెలుపల చెమటలోడుకుంటూ నిలబడి ఉన్నాడు. నరసింహం చాటంత మొహం చేసుకుని "బావా.." అని సంతోషంగా కేక వేసాడు.  వెనగ్గా నిలబడ్డ వసంతలక్ష్మి అన్నగారి వైపు చూస్తూ పలకరింపుగా నవ్వుతోంది. ఆ పక్కనే ఉన్న చిన్నారిపై నరసింహం చూపు ఒక్క క్షణం తారట్లాడింది. పీట మీద నుండి గభాలున
కౌముదిలో ప్రచురింపబడుతున్న "గాలిసంకెళ్ళు" పద్నాలుగో భాగం ఇక్కడ.. 
కౌముదిలో ప్రచురింపబడుతున్న "గాలిసంకెళ్ళు" పదమూడో భాగం ఇక్కడ..
నేలపై పారాడుతూ వెతుకుతోంది ఇళై. ప్రాతస్సంధ్యావందనం పూర్తి చేసుకుని, దేవతార్చన మందిరానికి అటుగా వెళ్తున్న కులశేఖరుడు కుమార్తెని చూసి ఆగాడు. దీక్షగా మూలమూలలా వెతుకుతోందా అమ్మాయి. "ఏం వెతుకుతున్నావమ్మా?" "ఉహూ.." "నాకు చెప్పు.. నేనూ వెతుకుతాను." తానూ మోకాళ్ళమీద కూర్చుని పచ్చలు తాపడం చేసిన నేలపై ప్రతిఫలిస్తున్న ఆ చిన్నారి మోముని చూసి మురుసుకుంటూ [...]
చిరచిరలాడించే చుఱుకుటెండ. గుండిగలతో సేవకులు మోసుకొస్తున్న చల్లని నీళ్ళు ఎన్నైనా చాలడం లేదు.. ప్రాసాదం చుట్టూ వేలాడదీయబడిన వట్టివేళ్ళ చాపలపై ఇలా చల్లితే అలా ఆవిరైపోతున్నాయి. లోపలి గదులలో వట్టివేళ్ళ సువాసనలు, కవాటాలకి ఆవల వార ఏపుగా పెరిగిన మరువపు గుబాళింపులూ కలగలిసి గాలిలో తేలివస్తున్నాయి.  రత్నపీఠం పై కూర్చున్నాడతను. ముత్యాల బాహుపురులు, రత్నకంకణాలతో [...]
కౌముదిలో ప్రచురించబడుతున్న గాలిసంకెళ్ళు పన్నెండవ భాగం ఇక్కడ..
కౌముదిలో ప్రచురించబడుతున్న "గాలిసంకెళ్ళు" పదకొండవభాగం ఇక్కడ..
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు