కలలేమి రాకపోయినా తెల్లారిపోతూనే ఉంటుంది మరో రోజుగా మారిపోతూ ఆత్మకు శరీరానికి అవసరమైన అనుసంధాన వేళప్పుడు ఏకాంతానికి స్వాగతం పలుకుతూ ముహూర్తాలు కుదరలేదన్నా ముద్దుముచ్చట్లు తీరలేదన్నా ఎవరి కోసమూ కాలమాగనంటుంది  అస్పష్టపు నీడలకు కప్పిన ముసుగు తెరలను తొలగించాలని వాస్తవాన్ని ఆదేశిస్తూంటే వెలుతురు పొద్దు సెగకు తాళలేక వెన్నెల చల్లదనానికై చూస్తూ కలల లేమి [...]
సముద్రాన్ని చూడు ఎంత గుంభనంగా ఉంటుందో లోలోపల ఎన్ని బడబానలాలున్నా పైకి ప్రశాంతంగా కనిపిస్తూ చూస్తూనే ఉన్నావుగా   చీకటంతా నా చుట్టమైనా  వెలుగుల కోసం వేగిరపడని  నిశ్శబ్ద నిరీక్షణ నాదని  నీకు తెలుసు కదాకాలమాడుతున్న దోబూచులాటలోమనసుకు దేహానికి కుదరని సమతూకంమారణాయుధమై వెన్నంటే ఉందనిక్షణాల ఆశల ఆరాటానికియుగాల ఎదురుచూపుల  ఏకాంతాల సహవాసానికి [...]
                       అక్షర భావాలను మెరిపించి మెప్పించిన " వాన వెలిశాక..."         సాహిత్యం, కళారంగాలలో విశిష్ట సేవలందిస్తూ ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించినా పరిచయం అక్కర్లేకుండా సామాన్యునిగానే అందరికి 'సు'పరిచితులు కళారత్న బిక్కి కృష్ణ రాసిన వా"న వెలిశాక..."    చెదిరిన రంగుల కల కవితలో గద్దదలను తరిమేసి కాకులకు పట్టం కట్టడం, ఏడాదికోపాలి కలలు ఎండమావులని  పండుగలు చేసుకోవడం [...]
                            పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు, రైతు రాజ్యమే మా లక్ష్యం, రైతన్న అన్నం పెట్టే దేవుడు ఇలా వగైరా వగైరా మాటలన్నీ ఎక్కడో విన్నట్టుగా ఉంది కదూ. పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఓట్ల కోసం చెప్పే మాటలే ఇవి... హమ్మయ్య అందరికి గుర్తు వచ్చాయనుకుంటాను. ఇక అసలు విషయానికి వస్తాను. మాది కృష్ణాజిల్లా దివితాలూకాలోని కోడూరు పక్కన ఓ మారుమూల [...]
1.  ప్రణయం.. పరిచయమయ్యాకే తెలుపుతుందనుకుంటా బంధాల నడుమ బాంధవ్యాన్ని...!!
కలల ప్రపంచం కాలిపోతోంది నైరాశ్యపు నీడలలో పడి మనోసంద్రం ఘోషిస్తోంది మౌనపు అలల తాకిడికి కాలం కనికట్టు చేస్తోంది ఊహలకు ఊతమిచ్చే క్షణాలకు లొంగి రెప్పల కవచం అడ్డు పడుతోంది స్వప్నాల మేలిముసుగు తొలగించడానికి తెలియని చుట్టరికమేదో పలకరించింది గతజన్మ బాంధవ్యాన్ని గుర్తు చేయడానికి ముచ్చట్లకు మనసైనట్లుంది శూన్యాన్ని నింపేయడానికి ముగింపునెరుగని [...]
                                         సినీ రంగంలోని చీకటిని చీల్చిన "సినీవాలి"..!! ప్రముఖ నవలా రచయిత, సినీ దర్శకులు ప్రభాకర్ జైనీ రాసిన "సినీవాలి" నవలా సమీక్ష సంక్షిప్తంగా..     " ఒక చిన్న స్వప్నం సాకారమౌతుంటే కలిగే ఆ ఆనందమే వేరు . "  అంటూ ప్రభాకర్ జైనీ తన స్వప్న సాకారాన్ని గురించి చెప్పిన ఈ మాటలు నిజంగా అనుభవానికి వస్తేనే ఆ అనుభూతి, ఆస్వాదన తెలుస్తాయి.  'సినీవాలి' అంటే అమావాస్య నాటి
ఆది గురువు అమ్మతో మెదలు... విద్యాబుద్దులు, జీవిత పాఠాలు నేర్పిన, నేర్పుతున్న ప్రతి ఒక్కరికి వందనాలు.. గురువులందరికి గురుపూజోత్సవ శుభాకాంక్షలు...
పాత్రధారులుగా ప్రవేశించి పాదచారులమై పయనిస్తున్నాం గమనానికి దిశలను వెదుకుతూ గమ్యానికై పరుగులు తీస్తున్నాం పదబంధాలతో పలుకులు నేరుస్తూ పలకరింపుల ప్రహసనాల్లో తేలియాడుతున్నాం గతుకుల రహదారుల్లో పడిలేస్తూ గాయాలకు లేపనాలద్దేద్దామని ఆరాటపడిపోతున్నాం పోరాడాలని తపన పడుతూనే గెలుపు దరిని చేరాలని ఉవ్విళ్ళూరుతున్నాం జీవితానికి అర్ధాన్ని వెదుకుతూ కాలంతో జత కలిపి [...]
చిన్నప్పటి స్నేహం కల్మషం లేనిదని, అప్పటి మనసే ఇప్పటికి అదే ఆప్యాయతను కురిపిస్తుందని అనుభవించే మా మనసులకే ఆ సంతోషం తెలుస్తుందనుకుంటా. ఆఖరి బెంచ్ లో మనం ఆ చివర, ఈ చివరా కూర్చున్నా ఎప్పటికి విడిపోని మన స్నేహబంధం ఇదే కదా.... థాంక్యూ సో మచ్ డిజేంద్రా....
నేస్తం,        అమ్మతో మొదలైన అక్షర సహవాసం నన్ను ఇలా ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేయడం భలే బావుంది. అమ్మతోనూ, అక్షరాలతోనూ పెనవేసుకున్న ఈ అనుబంధం ఏ జన్మ పుణ్యమో మరి. ఊహ తెలిసినప్పటి నుండి అక్షరాలతో ఆటలు మొదలు. పెద్దలు చెబుతున్నట్టు భావాలు పంచుకోవడానికి ఏ లక్షణాలు తెలియని ఓ మామూలు అక్షర ప్రేమికురాలిని మాత్రమే. మనసుకు అనిపించిన భావాన్ని (బాధ, కోపం, సంతోషం ఇలా అది ఏదైనా [...]
నేస్తం,         వ్యవస్థలో విలువలు తగ్గుతున్నాయంటే కారణాలు మరెక్కడో వెదుకుతాం కాని వెదుకులాట మనతోనే మొదలు పెట్టం. ఎందుకంటే మన మీద మనకంత నమ్మకం. మనం ఏ తప్పు చేయని ప్రబుద్ధులమని ప్రగాఢ విశ్వాసం కూడాను. పెళ్ళాం / మొగుడు పిల్లల మంచి చెడు అవసరం లేదు. ప్రపంచానికంతా ఆదర్శవంతులమే కాని మన ఇంట్లో మాత్రం ఎవరి అవసరాలు పట్టించుకోము. కుటుంబం మన అలంకారానికనుకుంటూ, బాధ్యతలు పంచుకుని, [...]
వేకువ పొడుపులు తెలియని వెన్నెల అందాలు చూడలేని వేవేల వర్ణాలన్నింటిని తనలో ఇముడ్చుకుని చీకటి చీరను చుట్టుకుని వెలుగుకు తోడుగా తానుంటానని స్నేహానికి మరో రూపమై నిలిచి సుఖ దుఃఖాల సమ్మేళనాన్ని జీవన్మరణాల సమతౌల్యాన్ని అంతర్లోకాల పరిచయాన్ని ఆనంద విషాదాల అర్ధాన్ని మనసుల మౌనాన్ని చూడగలిగే మరో ప్రపంచపు వెలుగురేఖగా మారి శూన్యాన్ని సైతం సవాలు చేసేది ఈ [...]
1.   మౌనానికి పర్యాయపదాలే అన్నీ_పరిభాషలెన్నున్నా పలుకు నేర్వలేక...!!
నేస్తం,          అసలైన ఆనందం అంటే ఏమిటని ఓ సందేహం వచ్చింది. మానసికమైన సంతృప్తికి మించిన ఆనందం ఈ సృష్టిలో మరేది లేదని అనిపించింది. ఈ మానసిక తృప్తి అనేక రకాలుగా మనిషిని ఉల్లాసపరుస్తుంది. అది ప్రేమ, ఆత్మీయత, అభిమానం ఇలా అనేక రూపాల్లో మనుష్యుల నుంచి మనసులకు చేరుతుంది. కొందరికి ఎంత డబ్బు ఉన్నా సంతోషం ఉండదు, ఇంకా దేనికోసమో ఆరాటపడుతూ, పరుగులెడుతూనే ఉంటారు. రోజు కూలీ చేసుకునే [...]
                                   జ్ఞాపకాల ప్రేమ పొంగుల వరద గోదారి ఈ గుండెల్లో గోదారి...!!        మాడిశెట్టి శ్రీనివాస్ మనసుని పుస్తకంగా మలచి అక్షర నివేదనగా అందించిన ఈ " గుండెల్లో గోదారి.."  మనతో పంచుకున్న అనుభూతులను మనమూ ఆస్వాదిద్దాం.       చివరి మజిలీ వరకు మదిలో భయంగా దాచిన భావాలను ఎంత ప్రేమగా చెప్పారంటే " నా గుండెల్లో పవిత్రంగా దాచుకున్న పాదముద్రలే నీవైనప్పుడు నువ్వెక్కడుంటే [...]
స్వరాజ్యమా నువ్వొచ్చావట నీ చిరునామా కాస్త చెప్పవూ రాజకీయాల మత మౌఢ్యాల గుప్పిళ్ళలో దాగున్నావా కులాల కార్చిచ్చుల్లో పడి మగ్గుతూ అస్పృశ్యతకు అందుబాటులోనున్నావా మువ్వన్నెల రంగులకు ముక్తాయింపుగా గగనానికి ఎగురుతున్న సీతాకోకచిలుకల్లో చేరావా మూడుకాళ్ళ ముదుసలివైనావని చేష్టలుడిగి మంటగలుస్తున్న మానవత్వంలో దాగుండిపోయావా తరాలు మారుతున్నా తరగని అంతరాల నడుమ తల [...]
నేస్తం,     రాంకులు, మార్కులంటూ.. ఐఐటిలు, ఎన్ఐటిలంటూ మనమే పెంచి పోషిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు అహంకారంతో నైతిక విలువలు లేకుండా చేస్తున్న అకృత్యాలు చూస్తూ కూడ పిల్లలను ఆ స్కూల్ మాన్పించలేని దుస్థితి మనదైనందుకు సిగ్గు పడుతున్నాను. 9 వ తరగతి వరకు ఆ స్కూల్ లో చదువుకున్న పిల్లలను స్కూల్ వారి పర్సెంటేజ్, పేరు కోసం పిల్లలపై సవాలక్ష తప్పులు రుద్ది వాళ్ళను బయటకు [...]
పురాణాలు, ఇతిహాసాలు మనం చూస్తున్నా, చదువుతున్నా వాటిలోని పాత్రలు మన నిత్య జీవితంలో తారసపడుతూనే ఉంటాయి. అలాంటి పాత్రల్లో అతి ముఖ్యమైన పాత్ర మహాభారతంలో శకుని. శకుని  లేనిదే మహాభారత యుద్ధం లేదని మనకందరికి తెలుసు. పగ, ప్రతీకారం కోసం బంధాలను, బంధుత్వాలను మరిచి మెాసాలు,మాయలు చేసి సోదరి వంశాన్ని నిర్వీర్యం చేయడానికి కపట ప్రేమను ప్రదర్శించిన వైనం మనందరికి విదితమే. అలాంటి [...]
నేస్తం,          రోజులు గడిచి పోతుంటాయి జ్ఞాపకాలను వెంటేసుకుని. మనుష్యులు దూరమైనా, బంధాలు భారమైన కొంతమంది మాత్రం గతాన్ని గుర్తుచేసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడైనా మనస్సాక్షికి విలువనిస్తూ. మనసే లేని వారికి మనస్సాక్షితో పనిలేదనుకోండి అది వేరే సంగతి. కొద్దిరోజుల పరిచయాన్ని కూడా జీవితాంతం గుర్తుంచుకునే స్నేహాలు కొన్నైతే, అవసరానికి అయినవాళ్ళని వాడుకుని, వాళ్ళ [...]
                    " మనసు ఆకాశ కాన్వాసుపై అక్షర చంద్రుడు ఈ సగం తెగిన చంద్రుడు "                   వైద్య రంగంలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకుని, సాహిత్యం, సంగీతం ప్రవృత్తిగా ఎంచుకుని ఎన్నో అవార్డులు, సన్మానాలు పొందిన డాక్టర్ యశోద పెనుబాల " సగం తెగిన చంద్రుడు " పై నాలుగు మాటలు.                చిన్ననాటి నేస్తమైన అక్షరమూ, మధ్యలో వచ్చి చేరిన భావానికి స్నేహం కలవకపొతే తన కవిత్వం ఒంటరిదైపోతుందని
నేస్తం,        మనసు మాటలను తర్జుమా చేయడానికి అక్షరాలు సహకరించడం లేదెందుకో. సహజ పరిణామక్రమాలన్ని అసహజంగా మారుతున్న నేటి సమాజ సమీకరణాల్లో జరుగుతున్న మార్పులను అక్షరీకరించడాన్ని అక్షరాలు అసహ్యించుకుంటున్నాయి. అది మనిషిగా మనలోని  తప్పు అని మనకు తెలిసినా తెలియనట్లు నటించేస్తూ, ఎదుటివారిపై ఆరోపణలు చేసేస్తూ మాటలకు తేనెలు పూసి, మకరందంకన్నా తీయనిది మన అనుబంధమని నాలుగు [...]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు