పురస్కార గ్రహీతలకు అభినందనలు... నా "అంతర్లోచనాలు" మంజు మనసు గోల కి దక్కిన గిడుగు రామమూర్తి పంతులు గారి పురస్కారం. నిర్వాహకులకు,  కాంతి గారికి, న్యాయ నిర్ణేతలకు నా మనఃపూర్వక కృతజ్ఞతలు ...
రామానుజం మాస్టారి స్పందన నా అంతర్లోచనాలు పుస్తకంపై.... మనఃపూర్వక ధన్యవాదాలు మాస్టారు మీ అమూల్యమైన స్పందనకు, ఆశీస్సులకు... తొలుత గా చిరంజీవులు మౌర్య , సౌర్య లకు శుభాశీస్సులు 🍇👐 అంతర్లోచనాలు 💎👀 మీ రచనల్లో ఓ మాధుర్యం ప్రత్యేకత ఏమిటంటే  మన నిత్య జీవితంలో అనుభవాత్మక అంశాలే అయినప్పటికీ , విషయం ప్రాధాన్యం తో పాటు ముగింపు/ ముక్తాయింపు అనిర్వచనీయం. పాఠకులను ఆకట్టుకుని , [...]
ఏ కలానికి గాయమైందో నెత్తురోడుతున్న క్షణాలన్నీ గేయాలుగా మారుతూ రుథిరాక్షరాలై వెల్లువెత్తుతున్నాయి గాలి వాటుకి చెల్లాచెదురై బంధాలు రెపరెపలాడుతూ అడపాదడపా తాకే ఆప్యాయపు చినుకుల్లో తడిసి మురిసి పోతున్నాయి అరకొరగా మిగిలిన రక్తసంబంధాలు ఆదరణ కోసం అర్రులు చాస్తూ అరచేయి అడ్డు పెట్టిన దీపాల్లా మిణుకు మిణుకుమంటున్నాయి దాహార్తి తీరని ధనదాహంలో మునిగి కాలపు వలకు [...]
మనసు చచ్చిపోయిన క్షణాలు నాకింకా గుర్తే ఆంక్షల పర్వానికి తొలి అడుగు పడినప్పుడు అర్ధం కాని ఆ పసితనపు ఛాయలు ఇంకా కనుల ముందు కదలాడుతునే ఉన్నాయి కాలానుగుణంగా మార్పులు చేర్పులు అవమానాలు అవహేళనలు సర్దుబాట్లు దిద్దుబాట్లు తప్పని జీవితాలై అలసిన దేహం కోరుకునేది తన కోసమంటూ ఆత్మీయతను అరక్షణమైనా కేటాయించమని అదే తీరని కోరికగా మిగులుతున్నా అనునిత్యం అగ్నిహోత్రమై [...]
1.   పరిచింది అక్షరాలే_పదాలకు భావాల మత్తు చేరిందనుకుంటా...!! 2.   మనసులొకటే మరి_ఆంతర్యాల అంతర్యుద్ధం మౌనంగా చేస్తున్నా ...!! 3.   అస్పష్టంగా ఉన్నా స్పష్టమైనవే_మనసు తెలిసిన భావాలవి..!! 4.   అలవోకగానే ఈ అద్భుతాలు_మదినలరించే అక్షరాలు చేరికైనప్పుడు...!! 5.   అక్షరాల మాయాజాలమదే_అనుభవాల అనుభూతులను అద్దంలా చూపించేస్తూ...!! 6.  అలుపెరగని ఆలోచనలే_అడపాదడపా ఆనందాన్నిస్తూ...!! 7.   మర్మమెరుగని
1.   పదాల పదబంధం చాలదూ పేర్చిన అక్షరాలు గాటినబడటానికి...!! 2.   అక్షరాలెప్పుడూ అక్షయమే గుండెగూటిలో నీ జ్ఞాపకాలున్నంత వరకు...!! 3.   మలి వయసే ఇప్పుడు పసితనపు ఛాయలు అద్దుకుంటూ. ..!! 4.   అక్షరాల చుట్టూనే అనుబంధం మనసు పరిమళాన్ని భావాలకద్దేస్తూ...!! 5.    వద్దన్నా వెంటబడక మానవు కదా విడిచి ఉండలేని అనుబంధం మనదైనప్పుడు...!! 6.    అక్షరమై అలరిస్తుంటానిలా ఆదరించి ఆస్వాదించే మనసులు [...]
మీ దృతరాష్ట్ర ప్రేమ మాకు వద్దు.... గత నాలుగునర్ర ఏళ్ళుగా తెలంగాణా వాదుల గురించి కాని, కే సి ఆర్ గురించి ఏమి మాట్లాడని నేను, మీ ప్రాంతీయతను గౌరవించడమే కారణం. ప్రాంతీయతాభిమానం అందరికి ఉండటంలో తప్పులేదు, ఉండాలి కూడా. చంద్రబాబు దగ్గినా తుమ్మినా అదో పెద్ద నేరంగా చూసే మీలాంటి వారికి దత్తత తీసుకున్న గ్రామాలు, పేర్లు ప్రభుత్వ సొమ్ముతో అభివృద్ధి అని అనుకోవడంలో మీ వక్రబుద్ది [...]
నేస్తం,           కొందరి ఆలోచనలు చూస్తుంటే నవ్వు వస్తోంది, బాధ వేస్తోంది. ఈ ముఖపుస్తకంలో మన పోస్ట్లకు వచ్చే లైకులు, కామెంట్లు మాత్రమే మన అక్షరభావాలకు కొలమానాలనుకుంటే దానికన్నా హాస్యాస్పదం మరొకటి ఉండదు. మనకు నచ్చిన పోస్ట్ మరొకరికి నచ్చాలని రూలేం లేదు కదా. మన చేతికున్న ఐదువేళ్ళే ఒకలా లేవు. మరలాంటప్పుడు మనమెలా చెప్పగలం "నాకు పలానా పోస్ట్ నచ్చింది, మీరందరూ లైక్ చేసి [...]
మళ్ళీ మెుదలైంది నోముల, మెుక్కుల, యాగాల ప్రహసనం. నా సొమ్మేం కాదుగా ఖర్చు అయ్యేది, అడిగేవాడు లేడు, అడ్డుకునే వాడు లేడు. అధికారం నాదయినప్పుడు ప్రజల సొమ్ము నాదే కదా.  అంతగా అయితే సెంటిమెంట్ ఉండనే ఉందాయే. మళ్ళీ అధికారంలోనికి రావడానికి....
నేస్తం,          ఏ నావది ఏ తీరమో అన్నట్టు ఏ బంధమెటుపోతుందో తెలియడం లేదు. ఏ సమస్యా లేకపోయినా ప్రపంచంలో తమకన్నా ఎక్కువ సమస్యలున్నవాళ్ళు లేరని, కొందరు లేనిపోని రోగాల పాలబడుతున్నారు. కనబడిన డాక్టర్ దగ్గరకల్లా వెళుతూ ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటూ శునకానందం పొందుతుంటారు. మనమసలే ఇప్పుడు బతుకుతున్నది కార్పొరేట్ వ్యవస్థలో, ఇక దీనికి తోడు ఏదో రోగముందన్నఈ అనుమాన భూతం తోడైతే [...]
జనవరి నవ మల్లెతీగలో అంతర్లోచనాలు పుస్తకంపై సాగర్ శ్రీరామ కవచం గారు రాసిన సమీక్ష....మనఃపూర్వక ధన్యవాదాలు నవ మల్లెతీగ పత్రిక యాజమాన్యానికి, సాగర్ శ్రీరామ కవచం అంకుల్ కి..
పురిటి మంచం నుండి పుడకల శయ్య వరకు పడిన అడుగులను అక్షరాలు గుంపుగా చేరి ఆకాశంలో నక్షత్రాలను సముద్రంలో అలలను లెక్కలేయాలన్న ఉబలాటంతో అదరాబాదరా ఉరుకుల పరుగులతో అలసటనెరుగక అవిశ్రాంతంగా శ్రమిస్తూ సాగుతున్న జీవితంలో చివరకు మిగిలేది ఏమిటన్న ఆలోచనలకు ముగింపునిచ్చే స్థితిని ఒంటరితనానికి అందించి ఏకాంతానికి తావిస్తే నాలుగు దిక్కుల సహవాసి ఐదో దిక్కైన [...]
నేస్తం,           మనిషి మనుగడకు జీవనాధారం భాష. ఆ భాషకు మూలం అక్షరం. ఆది యుగానికి ముందే లిపి ఉన్నదని భాషా మూలాలు చెప్తున్నాయి. మాతృభాష మీద మమకారం నానాటికి తగ్గుతూ, అవసరాలకు తగ్గట్టుగా భాషలను మనకు ఆపాదించేసుకుంటున్న రోజులు ఇవి. పుస్తకాలను చదవడం నామోషీగా అనుకుంటూ, రాతలను, రాసే వారిని చిన్నచూపు చూస్తున్న నేటి అభ్యుదయవాదులు ఎందరో. తమ రాతలను ఓ పుస్తకంగా అచ్చులో [...]
నేను విజయనగరం జొన్నవలనలో 7 వ తరగతి చదివేటప్పుడు నా పుట్టినరోజున నాన్న స్నేహితులు, కొందరు చుట్టాలు ఇంటికి వచ్చారు. అందరు మామూలుగా హాపి బర్త్డే అని, మెని మెనీ హాపి రిటర్న్స్ అని మనకు కాస్త తెలిసిన ఇంగ్లీష్ లో చెప్పారు. యార్లగడ్డ బాబూరావు బాబాయ్ మాత్రం నన్ను ఇబ్బంది పెట్టాలని చాలా పెద్దగా ఇంగ్లీష్ లో విష్ చేసారు. మనకేమెా సగం సగం అర్ధం అయ్యింది. థాంక్స్ చెప్తే ఏం తప్పు [...]
అణాకాణికి కూడా పనికిరాని పెతోడూ ఆంధ్రా రాజకీయాల్లో వేలెట్టేవోడే. ఇక్కడ వ్యక్తి పూజలు కాదు వ్యవస్థ బాగు ముఖ్యం. ఎవరెన్ని ఏసాలేసినా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు నిజాలు తెలుసు. కళ్ళు, చెవులు మూసుకుని లేరు ఆంధ్రోళ్ళు. కనీస బాధ్యత లేని నాయకులకు తమ ఓటుతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పాలక, ప్రతి పక్షాలను గమనిస్తూనే ఉన్నారు. ఆంధ్రను ఎద్దేవా చేసినోళ్ళను ఎన్నటికి [...]
నేనెప్పుడు ఒకలానే ఉన్నా... అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ. అప్పుడు నచ్చని నేను ఇప్పుడు కొందరికి నచ్చుతున్నా, మరి కొందరికి నచ్చడం లేదు. తేడా నాలో లేదు. మీ మీ ఆలోచనల్లో ఉంది...అప్పుడే మారని నేను ఎప్పటికి మారను. ఏది ఎలా ఉన్నా మిత్రులకు, శత్రువులకు, బంధువులకు,  రాబందు(ధు)వులకు అందరికి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు.....
రోడ్ షోలకు, టి వి షోలకే టైమ్ చాలడం లేదు ఇంక అసెంబ్లీ షోకి ఏమెాస్తాం చెప్పండి.....మేము చేస్తున్న ఈ ఎంటర్టెయిన్మెంట్ షోలు గుర్తించి మమ్మల్ని గెలిపిస్తే ఓ ముప్పై ఏళ్ళ పాటు మిమ్మల్ని ఇలాగే సంతోషపెట్టగలమని.... నేను భారత రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... 😊
కాల ప్రవాహం సాగుతూనే ఉంది మనిషి మనుగడను ప్రశ్నిస్తూ మనసెప్పుడూ ఆరని చితిలాంటిదే భావాల మహాభారత యుద్ధంలో అక్షరాలకు అంటరానితనం అంటుకుంటోంది కులం చేతిలో కీలుబొమ్మగా మారుతూ కళలు ఈర్ష్యల కుంపట్లలో కాలిపోతున్నాయి సాహిత్యమెా ఉన్మాద క్రియగా సాగుతూ అదుపు తప్పిన కలం అడ్డదిడ్డంగా రాస్తోంది నైతిక విలువలకు తిలోదకాలిస్తూ మన తలరాతను రాతలే బయటపెడతాయి పదుగురు పరమార్ధం [...]
1.   అంతరంగం అణు విస్ఫోటనమయ్యింది_మదిని తాకిన మాటల తూటాలకు....!! 2.   భావతరంగాల అంతర్మథనం_అనంతాకాశానికి చేరువగా...!! 3.   అక్షరాల్లో అలవోకగా ఒదిగిపోతాయి_మనసు దాయలేని భావాలన్నీ...!! 4.   ఫలించకున్నా గెలిచిన ప్రేమది_త్యాగానికి మరో రూపమై...!! 5.   పరిచితమే ఎప్పుడూ_అపరిమితమైన నీ జ్ఞాపకాలతో...!! 6.  ఎద నిండిన జ్ఞాపకమైతే చాలు_ఏళ్ళ తరబడి నిలిచిపోవడానికి....!! 7.   ఒడిజేరని ఓదార్పది_కలానికందని [...]
ఆత్మీయంగా పంచుకున్న అనుభవాల కబుర్లు, జీవితపు ఒడిదుడుకులు ఇలా అన్నీ కలిసి కాసేపు కాలాన్ని మనకప్పజెప్పినట్టుంది కదా రాణి అక్కా.. థాంక్యూ సో మచ్ నా పై నీ నమ్మకానికి...నీ సహచర్యాన్ని కోల్పోయిన వాళ్ళు ఈ ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతులు.... ఇన్నేళ్ళ తరువాత మనల్ని మళ్ళీ ఇలా కలిపిన నా రాతలకు, ఈ ముఖ పుస్తకానికి ధన్యవాదాలు...
          ఇదంతా చెప్పడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. నా కబుర్లు కాకరకాయలు బ్లాగు 10వ పుట్టినరోజు. 2009 జనవరిలో అంతర్జాలంలో అక్షరాలతో మొదలైన నా రాతల గురించి, నా గురించి కొన్ని కబుర్లు.ఓపిక ఉంటే చదివి మీ అభిప్రాయాలు చెప్పండి. సద్విమర్శలకు సదా స్వాగతం...                       నా కబుర్లు కాకరకాయలు బ్లాగు 10 సంవత్సరాలు దాటి 11వ సంవత్సరం లోనికి అడుగు పెట్టింది. 2009 జనవరి నుండి ఇప్పటి వరకు నేను [...]
                           " అంతర్లోచనాలు...అందరి ఆలోచనల సమాహారం"              నవ్యాంధ్ర రచయితల సంఘం, భువన విజయం, తెలుగురథం సంయుక్తంగా విజయవాడ ఠాగూర్ స్మారక గ్రంధాలయంలోలో నిర్వహించిన " అంతర్లోచనాలు " పుస్తక ఆవిష్కరణ సభ కాస్త ఆలశ్యంగా మొదలైనా ఆద్యంతమూ నవ్వుల చతురోక్తుల మధ్యన దిగ్విజయంగా జరిగింది.           నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి, నవ మల్లెతీగ సంపాదకులు, " [...]
అంతరంగ అంతర్మథనమే యామిని అక్షర శరాలు..!!           తెలుగు సాహిత్యంలో కవిత్వం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ ఆధునిక తరంలో ఎందరి మనసులనో తడుముతున్న భావాలను రాస్తున్న ఈ తరం కవయిత్రులలో యామినీదేవి కోడె ఒకరు. మూడు వాక్యాలలో ముచ్చటగా త్రిపదాల్లో పొందు పరచినా, తన మనసు స్పందించిన భావాన్ని కవితగా అక్షరీకరించినా, ఎంతోమందిని  తన భావజాలంతో కట్టిపడేస్తున్న యామిని దేవి కోడె [...]
నవమాసాలు మెాయకున్నా రక్తం పంచివ్వని బంధమైనా మమతలకు నెలవై మానవత్వానికి మరో రూపమై జీవకారుణ్యమే జీవిత ధ్యేయంగా ఓరిమికే ఓదార్పుగా శాంతి సహనాలకు చిరునామాగా అన్నార్తుల పాలిటి అన్నపూర్ణగా దివి నుండి భువికి ఏతెంచిన అమృతమూర్తి ఈ అమ్మ సకల మానవాళికి ఆదర్శమే...!!
నా అంతర్లోచనాలు పుస్తక ఆవిష్కరణ గురించి ఈ రోజు గోదావరి పత్రికలో...పత్రిక యాజమాన్యానికి, యడవల్లి శ్రీనివాస్ గారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు అంతర్లోచనాలు పుస్తకంపై అద్భుతమైన సమీక్ష రాసిన కత్తిమండ ప్రతాప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు