జంటల లీలలు ; జాబిలి కంటను పడినాయి ; మింటను, జాబిల్లి కంటను - పడనే పడినాయి ;   || ;రజనీనాధుని కంటను పడనే పడినాయి ;   రేరాజు కిలకిలా  ; రాకా చంద్రుడేల నవ్వుచుండె ; జాబిల్లి కంట పడిన మధు దృశ్యం - అది ఏమై ఉండును!???  ; ;కాముని పున్నమి రంగుల హేలల ;పాల వెన్నెలకు అద్దుతు అతివలు ;రాసక్రీడల హంగుల మేళా ;   || ; వనితల వలువలు వన్నెల చందము ;చంద్రుని తెల్లని వెన్నెల సైతం [...]
నవనీత చోరుని పట్టుకుంటిమి ; ఒడుపుగాను, నేర్పుగాను పట్టేసాము  ;  ||;ఇంద్రనీల ఛాయ వాని దేహము పయి ;చాల పాల తుంపరలు - వెన్న తుప్పరల ముత్యాల సిరులు ; దొంగ ఆనవాలు ఇట్టె ;పట్టించి ఇచ్చేను గదా ;  ||;మౌక్తిక హారముల సొబగు భలే భలే ; పూస వెన్న కిటుకులు భలే భలే ;తెలి ముత్యపు దండల - కోటి చంద్రికల ధవళిమ ;ఇల కెపుడును పున్నమ ;శీతలాహ్లాదముల నిత్య పున్నమ  ;  ||;======================;;indra neela CAya waani payi ;caala paala [...]
పదే పదే అలుగుటలో ఆరితేరె రాధమ్మ ;అలకనంద కోపమును తీర్చును గోవిందుడు ; ;పదే పదే అలుగుటలో ఆరితేరె రాధమ్మ ; జరుగుబాటు ఉంటే ఆజ్ఞలు, ఆదేశాలు ; ఛప్పన్నారు దేశాలలోన చలామణీ ఔతాయి ; అని తెలిసెను మనకు నేడు ;అంతేలే, అది అంతేలే :  || ;చెలి చూపులలోన ; కాయును ఎర్రని పగడాలు ; ; ఎర్రెర్రని పగడాలు ; కోపాలు, కినుకలు, అలుకలును ;ఇంతటి విలువైనవి ; || అని తెలిసెను మనకు నేడు ;అంతేలే, అది [...]
అంబరాన తొలకరుల ;మబ్బులు గుంపులు గుంపులు ;రాధ మదిని గుంజాటన ;గుబులు గుబులు గుంపులు ;  ||;పెరటి జామ దోర పళ్ళు ;ఎత్తైన చెట్ల కొమ్మలందున్న సపోటాలు ;   మేలి ముసుగులోన కుక్కి ; మూట కట్టి, బయలు దేరె రాధమ్మ ;  ||;పల్లవాధర క్రిష్ణుడు, వేణు గాన లోలుడు ; మురళీ వాదనలో క్రిష్ణ - ఆకలినే మరచును ; మొదలసలే తన ఆకలినే మరచును ; అనుచు - రాధ మదిని గుంజాటన ;  ||;పరుగులెత్తు గోవులతో  చికాకులు [...]
తళ తళ లాడే పింఛములు ; పింఛాలెన్నో : జమ చేసినది మా రాధమ్మ ; వన మయూరితో : ||;ధగ ధగ శీతల చంద్రికలతోటి - మేలమాడుతూ : శీతవెన్నెలను తన కన్నుల భరిణల ; జమ చేసినది మా రాధమ్మఅతి నిపుణతతో  - జమ చేసినది మా రాధమ్మ ; ||;మిల మిల జాబిలి నొడిసి పట్టుకుని ; తన దోసిలిలో పదిల పరచినది నీ కోసం ;;'ఇదిగో, క్రిష్ణా! వెన్న ముద్ద ' అని నీకు చూపుతూ, పిలుస్తున్నది కద, భలే కదా - తన నైపుణ్యాలు ; చూడవోయి [...]
అనీ అననట్లు - అన్నామా - వానికి అంతెరుగని నీలుగు ;నీలుగుడు చాలంటే ; కస్సుమనును అది ఏమో!?చెరుకు వింటి ఐదు పూలు : ||;అంతు పొంతు లేకున్నవి, ఐదు పూల ముచ్చటలు - గాలి పొడుగునా అంతు పొంతు లేకుండా అవేమిటి ముచ్చట్లు 1? - అన్నామా మేమంతా!? అనీ అనని విధాన ; అన్నామా మేమంతా!?అంతెరుగని నీలుగు, వానికి ; అంతెరుగని నీలుగు ;;  ||;అనీ అననట్లు - అన్నానూ వానికి ; అంతెరుగని నీలుగు ;నీలుగుడు చాలంటే ; [...]
ఆటలు ఆడేరు, పాటలు పాడేరు ; భాండీరంలో తోటలన్నియు చైతన్యం  అయ్యేను ; చైతన్య మయములయ్యేను : ;క్రిష్ణ మాయ అంటేను - ఇదే కదా చూస్తుంటే :  శ్రీక్రిష్ణ మాయ అంటేను - ఇదియె కదుటె, ఓయమ్మా! :  || ;చద్ది బువ్వ మూటలను కొమ్మలకు కట్టారు ; చేతి కర్రలను పట్టి ; నడుములకు తుండ్లు కట్టి ; గిల్లి దండ, ఉప్పాటలు ; కబడి ఆటలెన్నెన్నో ఆడేరు క్రిష్ణ బృందము ; శ్రీక్రిష్ణ బృందము :||క్రిష్ణ మాయ [...]
అనుకుంటే ఒక మాట ; అదే జపం పూట పూట ; క్రిష్ణ నామమే! శ్రీ క్రిష్ణ నామమే :  ||;  పలికినపుడు తేనె ఊట ;పులకించిన మది చైత్ర తోట ;క్రిష్ణ నామమే! శ్రీ క్రిష్ణ నామమే :  ||;ప్రతి ఊహ మదివీట ; పసిడి రజను ఎత్తు మేట ; జిహ్వకు పుణ్యాల పంట ; ఎన్నికైన నోము పంట ;క్రిష్ణ నామమే! శ్రీ క్రిష్ణ నామమే :  ||   ;పేర్మి క్రిష్ణుని పేరుకు ; సరి రాదు, రాలేదు ; ఆ స్వర్గ నేత మహేంద్రుని ; మధు చషకం - సుధల కొలత [...]
దీపావళి ; క్రిష్ణ దీపావళి ;భామామణి వచ్చినది ;సత్య భామామణి వచ్చినది ;  ||;కాకర పువ్వొత్తులు ;రుక్మిణిది తొలి బోణీ ; ||;చిచ్చుబుడ్లు మీకన్నది ;వెన్నముద్ద, పాము పొగలు నాగ్నజితీ!నీ కొరకు, అంటూ ఇచ్చెను సత్య ;  ||;భూ చక్రం, అగరొత్తులు ; లక్ష్మణకు చాలన్నది ;కాళిందీ తడబడకు,తాటాకు అగ్గి, కాగడాలు -- మేలంటూ, చాలన్నది ;  || ;విష్ణుచక్రములు నావి ;అనెను క్రిష్ణ దేవేరి ;పటాసుల పట పటలు ; నింగి [...]
నౌకలోన వ్యాహ్యాళి,  క్రిష్ణ రాధ నిరాళి ; లహరి లహరి లాహిరి సయ్యాటలు ; ||;పడవ నడక తీరు ; సోయగముల జోరు;వాహినికి హెచ్చినది వినూత్నమౌ  సౌరు ; || ;ఇన్ని నవ్య సొగసులను ;అందుకొనెను నది వాహిని ;అందుకు మా నీలి యమును -అందుకొనుము జోహారు ; || =* ] Virali means Priceless, Valuable, Rare, Precious.  ;;]  Nirali means Unique and different ;======================================;;krishNa raadha nirALi ; naukalOna wyaahyALi ;lahari lahari laahirula sayyaaTalu ;  ||;paDawa naDakaku teeru ; sOyagamula jOru ; waahiniki heccinadi winuutnamau  sauru ; ||;inni nawya sogasulanu ;amdukonenu [...]
మంచు మంచు - తెలి మంచు ; హేమంతం గడుగ్గాయి ;మంచు మంచు - తెలి మంచు ; హేమంతం ఆకతాయి  :  || ;హిమం మయం ఇల సర్వం మంచు మయం ; హిమ ఋతువు దిగి వచ్చి - పుడమిని ప్రశ్నించింది ;  ;"కుశలమా, క్షేమమా, ఏమంచు" అడుగుతూ -తెగ ఆరా తీస్తుంటే - పృధ్వి తెల్ల బోయింది ;మంచు తెరలలోన దాగి ; గాలి నవ్వుకున్నాది :  || ;ఘోష వలదు వసుంధరా! ఘోష వలదు ప్రకృతీ!;  ;రాధ నవ్వు పువులు విరిసేను ;నులి వెచ్చని పుప్పొడుల [...]
సృష్టి యావత్తూ రాధమ్మకు సింగారమే ;బంగారు బొమ్మ , మా రాధమ్మకు ;  ||;తుహిన కణములు తూలి ;రాధ పాపిట వాలి, మణులె ఐనాయి ;  || ;రాణివాసము మోటు -అనుకొంటు నవ్వినవి ;ఆ మంచు బిందువులు  ;  || ;పూల పుప్పొడి తేలి ;  రాధ నిశ్వాసముల - చేరి ;అదనపు తావులే పొందినవి ;  ||;ప్రకృతియె రాధమ్మ ఐనప్పుడు ;ఈ రీతి వాడుకకు ;అచ్చెరువులెందులకు,అది సహజమే కదా!   అతి సహజమే కదా! ;  ||  ;================================.pATa  ;-;sRshTi [...]
క్రిష్ణవంశి శిష్యరికం ; వాణి వీణ సంబరం ; సంగీత పరిధి అంబరం ;  || ;క్రిష్ణ మురళి గురువాయెను ;కచ్ఛపీ వీణియకు సంబరము ; తంత్రి - నాద సమ్మోహనం ;  || ;వంశి వాదన చేసి చేసి ; చివురు వ్రేళ్ళు అలసెనేమొ ; క్రిష్ణ! నీదు చివురు వ్రేళ్ళు అలసెనేమొ ;;  నీ బడలిక ఉపశమింప ; నాదము లిటు దిగి వచ్చును ; శారదాంబ వీణియ సిరి - కచ్ఛపీ నాదము లిటు దిగి వచ్చును ;  ||    ================================;;  LINK [...]
భువన మోహనం క్రిష్ణ లాసము ;భావ రాగము రాధా క్రిష్ణ యుగళము ;  || ; రాధిక వదనం కృష్ణుని సదనం ; శ్యామల మోహన కృష్ణుని సదనం ;మృదు మధు మురళీ రాగ రంజితం ; ||;దామిని పుణికిన సరము రాధిక ;సౌదామిని పుణికిన సరము రాధిక ;పారము క్రిష్ణ ధ్యాన గగనార్ణవము ;  ||;భువన మోహనం క్రిష్ణ లాసము ;భావ రాగము రాధా క్రిష్ణ యుగళము ;  || ;=======================;;bhaawa raaagamu ;raadhaa krishNa yugaLamu ;  || ;raadhika  kRshNuni sadanam ;Syaamala mOhana kRshNuni sadanam ;mRdu madhu muraLI raaga ramjitam ; [...]
రేయికి చలి పుట్టె ;చలి చలి ; వణికేను రాతిరి ;  ||రాదిక విచ్చేసె భీతి వలదు ;;తన మేలిముసుగునుపరచి కప్పునులే ;ఓ నిశీ! తన మేలిముసుగునునీకు చుట్టేనులే ;  ||;'చలి చలి'  అంటూను కృష్ణుడు ;;గడ గడా వణుకుతూంటేను ;నటనల వణుకులు - చాలులే క్రిష్ణయ్య! ;అని రమణీయముగ నవ్వె రమణీమణి ;  ||;భామామణి రాధిక లక్ష దరహాసాలు ;నింగిలో విరిసిన - నక్షత్రమాలికలు ;రాధ పరిష్వంగము ఆచ్ఛాదనం ;క్రిష్ణునికి [...]
తుహిన కణములు తూలి ;రాధ పాపిట వాలి, మణులె ఐనాయి ;  || ;రాణివాసము మోటు -అనుకొంటు నవ్వినవి ;ఆ మంచు బిందువులు  ;  || ;పూల పుప్పొడి తేలి ;  రాధ నిశ్వాసముల - చేరి ;అదనపు తావులే పొందినవి ;  ||
ఆ స్వర్గానికి సరిసాటి ; ఈ పృధ్వీ తలము ;కుడి ఎడమగ, ఔనమ్మా ;  ||ఆలమందల మేపేను ; పచ్చిక బయలుల కిష్టయ్య ;  ఆవులమందల మేపేను :  ||;ఆరుబయలుల పచ్చందనములు ; కన్నుదోయికి మేలు మేలు మేలు ;  మేలైనట్టి షడ్రుచుల విందులు ; దివ్య సీమలకు సాటి ;మన  భూ తలము కుడి ఎడంగా, ఔనమ్మా ;  ||;ఉద్యానములలోన దోబూచి ఆటలు ; వనితల మేనుల సౌరభ వెల్లువలు ; పొదరింటి ప్రతి ఆకు, పువులు పొందేను ; దివ్య [...]
తాత్సారం చేయకండి, వేళ ఆయెను ; గోవర్ధన గిరి పూజ వేళ ఆయెను ;  ||;ఉగ్రసేన తాతలు ; అవ్వలు, ముత్తవ్వలు ; ముత్తాతలు గునగునా ముందు నడుస్తున్నారు ; యువత మీకు మగత ఇంత!?, వడి వడిగా ముందుకు నడవండి ; మునుముందుకు నడవండి ;  || ;ఏడు తేజిల సూర్య - రధమును వడి ఓడిస్తూ ; మన బళ్ళు చకచకా సాగాలి ; మునుముందుకు  సాగాలి ; ;ఒంటెద్దు శకటముల జోరు ; జోడెడ్ల బళ్ళు - జోర్ జోరు జోర్ జోరు ;మించగ [...]
ఈ సన్నని తంత్రి ;వీణకై గాలింపు ;ఈ తీగ కొక ఆట ;;;;;;రమణీయ మాణిక్య వీణ మన రాధిక ; రాధ డెందము ఎపుడు ; క్రిష్ణ మమతల కొలువు ;  || ;వీణపై కెక్కిన రాగ మందారమే : రాగ మెక్కించుకొన ;; గాన సింగారమే ;  || కొన గోటి మీటులె చాలు ;నిలువెల్ల పులకింత ; ఏడు స్వరములె చాలు ఇంద్ర భోగములు ;  ||  ఎన్నెన్ని రాగాలు , ఏమి గీతాలు ; తీగ సన్ననిదోయి, రూపు మితమేనోయి ;; అమితమీ రాగముల ; తొణుకాడు [...]
క్రిష్ణుడు, ఎరుగను నేను అంటాడు ; ఎంతమాత్రం నిజము కానే కాదు ;  || ;కుండల వెన్నలు, మీగడలు ; జున్ను, పెరుగులు ; ఎట్లుంటాయో ఎరుగను, నేను అంటాడు, క్రిష్ణుడు, ఎరుగను నేను అంటాడు ; ఎంతమాత్రం నిజము కానే కాదు ;  || ;అంతెత్తు ఉట్టి మీది ; చట్టి లెవరు దించారో ; వెన్నలన్ని ఖాళీ చేసి ; పగుల గొట్టారో ; ఎరుగనే ఎరగను - అంటున్నాడు ; క్రిష్ణుడు ఎరగను - అంటున్నాడు ;ఎంతమాత్రం నిజము కానే [...]
సాంద్రం, మంద్రం చిరు గాలి ;  కోపం వస్తే సుడి గాలి ;రౌద్రం వస్తే సడిగాలి ; జడిపించేను లోకాల్ని ;;ఉడుకుమోతు ఐ చిరుగాలి ; మిడి మిడి మిడుకుతు ఉన్నట్టి ఈ ఈదురు గాలి ; గడ బిడ ముడి వడి - ఈదర గాలి ;  || ;సెగల ఊష్ణమౌ వడ గాలి ;వానల వెల్లువ దడగాలి ;  గమ్ముగ ఊరక ఉండదుగా ;ప్రభంజనమ్ముగ హోరెత్తు  ;  ||;ఔషధ మొకటే తనకంట ; రవంత చోటు చాలంట ;క్రిష్ణ మురళిలో ; రవంత చోటు చాలంట ;  ||  [...]
గుడు గుడు గుంచం ఆటల గాలి ; పొద్దు పుచ్చుతోంది - గాలి, బాగా పొద్దు పుచ్చుతోంది ;  || ;రాధా క్రిష్ణుల జంటకు చుట్టూ ; తిరుగుతు చేయు ప్రదక్షిణము, సవ్య ప్రదక్షిణము ;  ||  ;సోగగ ఒక పరి ; షోకుగ మరొక్క తీరున ; తిరుగుచు చేయు ప్రదక్షిణము ; సవ్య ప్రదక్షిణము ;  || ;ఈ తూరిక్కడ - కాదు పొమ్మంటె ; బిగదీసుకొనును గాలి తూరి తూరికి ఈ చాదస్తం, మర్మ మెరుగ లేము ;  || ;======================================;;guDu guDu gumcam [...]
సాంద్రం, మంద్రం చిరుగాలి ;  కోపం వస్తే సుడి గాలి ;రౌద్రం వస్తే సడిగాలి ; జడిపించేను లోకాల్ని ;;ఉడుకుమోతు ఐ చిరుగాలి ; మిడి మిడి మిడుకుతు ఉన్నట్టి ఈ ఈదురు గాలి ; గడ బిడ ముడి వడి - ఈదర గాలి ;  || ;సెగల ఊష్ణమౌ వడ గాలి ;వానల వెల్లువ దడగాలి ;  గమ్ముగ ఊరక ఉండదుగా ;ప్రభంజనమ్ముగ హోరెత్తు  ;  ||;ఔషధ మొకటే తనకంట ; రవంత చోటు చాలంట ;క్రిష్ణ మురళిలో ; రవంత చోటు చాలంట ;  ||  [...]
జాలు పుప్పొడి సన్నాహం ; వేసెను దారి నీ కోసం ;; క్రిష్ణా, వేసె రహదారి నీ కోసం ;  ||యమునా వాహిని నింపాది  ;; సోలుతు ఉన్నది తీరమున ;ఎలమావి ఛాయల చిరు భీతి ;రమణి నమ్మకం నీ పైన ; బేల రాధిక - ఎదురుచూపులు నీకోసం ;  ||;పున్నాగ పూవున సన్నాయి ; రాధ రాగమున వెదజల్లి, అనురాగమున వెదజల్లి ;; - ఉబుకుబికి పరిమళం ఉవ్వెత్తు ;; నిఖిల ప్రకృతికి ఈ హాయి;  ||;నీరవ నిశ్శబ్దమీ రేయి ; రాధ కన్నుల [...]
శరత్ చంద్రిక క్రిష్ణస్వామి ;భక్తులెల్లరకు స్వామి ఆమని ;  || ; మిట మిట ఎండ ; చిటపట ఎండలు ; హడలి పోవుచుండె ; రాధ హడలి పోవుచుండె ;"పూవుబోణి మన రాధ కందిపోవునను భయము ఏలనండీ!?శంక ఏలనండీ!?  ....  ; "|| శరత్ చంద్రిక క్రిష్ణస్వామి ;భక్తులెల్లరకు స్వామి ఆమని || ;మిడి మిడి చలులు వీచిన గానీ ; జడ దడి వానలు కురిసిన గానీ ; ప్రచండ ఎండలు కాసినా గానీ ,  తనకు అండగా నిలిచిన వాడు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు