చినుకు రేణువులకిజల్లెడ పట్టే గొడుగువవుతావువేడిగాడ్పుల మింటికిసతత హరిత చరణమవుతావుశీతగాలుల పీడకిఎదురు నిలిచే గోడవవుతావురెక్కలు విసిరే పక్షులకువెచ్చని గూళ్ల నిచ్చనవవుతావుఆడిపాడ వచ్చే బుజ్జాయిలకిఆనంద డోలికల ఊయలవవుతావుఆకలి మంటల తంటలకుఅందివచ్చే పండువవుతావుపండగల వేళ పసందైన పందిరివికొంటె పిల్లల కొమ్మచ్చుల పల్లకీవిపెద్దమనుషుల చర్చల రచ్చబండవిపేరంటాళ్లు [...]
భయం నీ మీసంఅంచుల్ని తాకలేదుబెరుకు నీ కంటివంపులకు జడుసుకుందిమిగ్ కూలిపోయిన చోటమినార్ లా నిలబడ్డావుయుద్ధం వాకిలి ముందుఅద్దంలా మెరుస్తున్ననీ ఆత్మ విశ్వాసం చూసినింగి వంగి సలాం చేస్తుందినిన్ను సురక్షితంగా వెనక్కి తెచ్చుకోవడంఈ దేశపు నాయకత్వం సాధించే గొప్ప విజయంనువ్వు మళ్లీ రెక్కలు విచ్చుకొని ఎగరకపోతేఈ దేశం బిక్క మొహంతో చచ్చిపోవడం ఖాయం! COME BACK SAFE ABHI            [...]
తలకి సమాధి కడితేమొండెం, జెండాలా ఎగురుతుందిఆలోచనని పాతిపెడితేఆత్మ, అంకురమై మొలకెత్తుతుందిమరణం నేను ఎంచుకున్నమృదంగ జ్వాలికమరణం నేను రాసుకున్నమరొక అవతార గీతిక                     -కేశవ్
ఆంధ్రుడన్న మాట వింటేఎందుకంత ఉలికిపాటుఆంధ్ర రాష్ట్రమెందుకన్నపటేల్ కంటే పహిల్వాన్లాతలుపు మూస్తే గాయంతలని కోస్తే న్యాయమా?ఇదెక్కడి ఆటవికంఇది కాదా అరాచకంమాటిస్తే నమ్మడంముంచేస్తే తుంచడంఅదీ, ఇదీ ఒక్కటేలెక్క చూసి బాదుడేప్రత్యేక హోదానే వద్దంటేఅసలు మీకిక్కడ చోటేదిఇంకు చుక్క తుఫానులోదమ్ము చూసే దారేది?ఇచ్చిన మాటని చెల్లిస్తే పూల విరుల స్వాగతంఇది కాదని [...]
చెప్పిన మాటలు చెల్లనిచోటచిల్లర పాటలు పాడిన నోటరాజకీయం రుచిలేని భోజ్యంరాజీనామా నిషాలేని మద్యంఇంతవరకు చేసినవన్నీ గారడీలేఇందాకా కొట్టించినవన్నీ బురిడీలేకుయుక్తి కుర్చీలెక్కిన కేడీలకుజనం తల్చుకుంటే పడేది బేడీలేపకోడీల పాలనలో హోదా ఒక చోద్యంపల్లేరుల పానుపేసిచెకోడీలతో ఉరితీద్దాంఎంకన్నకు పవరుంటే ఇంకెందుకు ఆలస్యంమాటిచ్చిన నాలుకలేచీలిపేలికవుట తథ్యం      [...]
అగ్గిపూలను పుక్కిలించిఉగ్గుపాల రుణం తీర్చిన వాడుమూసి ఉన్న పిడికిలిలోఎగిసిపడే సముద్రం వాడురెక్కలు తీసేసినా ఎగిరేఎడతెగని సంకల్పం వాడుమృత్యువుకి ఎదురెళ్లేమరణ మృదంగం వాడుతరాలు మార్చిన సందేశం ఒకడుతలరాతలు రాసే సాహసం మరొకడుఇప్పటికీ వదలని జ్ఞాపకం ఒకడుఎప్పటికీ చెరగని సంతకం మరొకడు                            -కేశవ్(క్యాస్ట్రో నిష్క్రమణకు నివాళిగా...)
పొగ తాగేస్తే ప్రేమ పొదుగుచిక్కినట్టేనా...చావేజేమైనా చే గెవారాని మించినోడా...చుస్తే చూస్తం.. లేకపోతే లె...ఆర్ట్స్ కాలేజీ గేటు ముందుఉచ్చ పోస్తే నీకేందిఉరేసుకుంటే నీకేంది కళ్ళకి నెత్తుటి చారికవేళ్ళకి పరీక్ష నాళికకాళ్ళకి గుర్రపు నాడాగుండెకి పాబ్లో నెరూడానితగిలించాలని చూస్తే, ఊరుకోం***        ***      ***బే... అంటావుబేవకుఫ్ అంటావుబేషరం, తిడతావెందుకుతీట [...]
యుద్ధం నాదిగాయం నాదిగెలుపు వేరొకరిదిపేర్చిన బతుకు నాదిరాల్చిన చెమట నాదిఫలితం వేరొకరిదిమోసే భుజం నాదిచేసే కవాతు నాదివిజయపతాక వేరొకరిది                       -కేశవ్
వాన మంచిదే కానీ వద్దన్న చోటే పడుతుంది ఎందుకు?పుట్టడమే గొప్ప అనుకున్న చోటపుట్టుకతో చావు జతకట్టిన చోటబతికినా చచ్చినట్టే కనిపిస్తోంది ఎందుకు?చావుకి కొలమానం రాలిపోవడంరోజూ రాలే ఆకుల లెక్కఆయువు కొలిచే కాలమితిచెట్టుకి చచ్చిపోవడం తెలుసుబతికి బట్టకడ్డడం తెలుసుఒక్క చుక్క నీటితో జీవం పోసుకొనిపచ్చని పరికిణీలు అల్లుకోవడం తెలుసునీటి చుక్కల నేతిమూటల్లోజీవపు [...]
పిచ్చివాడాఅతుకుల బొంతలుగతుకుల దారులుచూసిన తర్వాత కూడాప్రేమలోతుల్ని కొలవాలంటావా...అవసరాలు పరిచినసున్నిత తెరల్లోలోహపు ముళ్లు దాచికసిదీరా గుచ్చిన తర్వాత కూడావెతుకులాట ఆపవా...నిజాలు కావాలంటేనీ గుండెలోతుల్ని కొలిచి చూడునిజాయితీ చూడాలంటేనీ దేహపు పొరల్ని పొడిచి చూడుఎవడి బతుక్కి వాడే కొలమానంఎవడి నొప్పి వాడికే ప్రామాణికంపక్కవాళ్ల లెక్కలు తీస్తేమిగిలేది [...]
వదులుకుంటే తిరిగి తెచ్చుకోవచ్చుపోగొట్టుకుంటే వెదికి పట్టుకోవచ్చుపారేసుకుంటే ఎవరైనా తెచ్చి ఇవ్వొచ్చుపగలగొట్టుకుంటే, మిగిలేది ముక్కలే!నిలబెట్టుకోవాలనే జ్ఞానం ఉన్నప్పుడుపగలగొట్టుకునేదాకా తెచ్చుకోకూడదుబతుకైనా, అతుకైనా ఒక్కటే కదాజారిందా దొరకదు... చితికిందా అతకదు!!                           -కేశవ్
నీ హృదయంలో కట్టిన సమాధినీ నవ్వు పూసిన  ద్రోహపు కత్తినాకొద్దు!నీ ప్రేమలో దాగిన విషపు కౌగిలినీ చూపులో దాచిన మైకపు మత్తునాకొద్దు!నీ చేతులతో పేర్చిన మోహపు చితీనీ మాటలతో పేనిన వలపు ఉరీనాకొద్దు!నీ మనసు రాసిన విద్వేష నైషధంనీకు తెలిసి ఆడిన కపట నాటకంనాకొద్దు!                           -కేశవ్
ఇన్నేళ్ల తర్వాత వెతకాలనిపిస్తోందిపాతపడి మాసిపోయిన ముఖాన్నితిరిగి తెచ్చుకోవాలనిపిస్తోందినలిగిపోయిన ముడతల్ని సరిచేసి మరీఅంటించుకోవాలనిపిస్తోందిఏది నకిలీ ఏది నిఖార్సుఏది నిజం ఏది అబద్దంకాలచక్రంలో సుడులుతిప్పిపిప్పి చేయాలనిపిస్తోందిమనసుని తవ్విపోసిజ్ఞాపకాల దొంతరల్నిచెల్లాచెదురు చేస్తుంటేపోగొట్టుకున్న ముఖాలుమళ్లీ మళ్లీ పలకరిస్తున్నాయిఅన్నీ పాతవే, [...]
నీ కౌగిలిలో కరిగిపోవాలనికలలతీరం చేరుకోవాలనిప్రతి అణువూ తపించిందిఎన్ని అడుగులు వేశానోఎంత దూరం తిరిగానోనాకు మాత్రమే తెలుసుఎక్కడ మొదలు పెట్టానో అక్కడికే తీసుకొచ్చావు హాట్సాఫ్అడగకుండా ఇచ్చిన వరాలుఅడిగినా పట్టించుకోని వైనాలుమన మధ్య ఎన్ని ఉన్నామళ్లీ మళ్లీ కలిపేదే బంధంచితి నుంచి చిగుళ్లు వేయడం సాధ్యమాగాలిలో దీపంలా వదిలేసిన క్షణాలుగాలి మాత్రమే తిని బతికిన [...]
ఓ దేశమాతా...ఆకలిని గెలిచే చిట్కా చెప్పుఆత్మీయతని కత్తిరించే నాభి చూపు అనుబంధాల సంకెళ్లని తొలగించుఅర్థంలేని భావోద్వేగ హననం నేర్పించుఎవడికి వాడు ఓటమికి రాసే సెంటిమెంట్లు వద్దునారెక్కలకు సామ్రాజ్యవాద ఉక్కుని తొడుగునానాలుకకు భాషలకి అంటని నేర్పుని ఇవ్వునామనసుకి ఇనుప కచ్చడాల్ని అద్దడం నేర్పుకాళ్లు కన్వర్టర్లుగా కళ్లు స్కానర్లుగామెదడుని మెమరీ చిప్ [...]
ప్రశ్నలే పల్లవులుచమత్కారాలే చరణాలుపదాల్లో ప్రేమ సంగతులుమాటల్లో మార్మికతభావంలో గాంభీర్యంబాధల్లో గాఢతమూసుకున్న కళ్లకి మేల్కొల్పుగీతం..మానని గాయాలకు మందు రాసే శోకం...ఆయన పాట జలపాతంఆయన మాట ఉల్కాపాతంపాటల వనంలో అతను అర్థరాత్రి సూర్యుడుగేయసంచయంలో మిట్టమధ్యాహ్నపు చంద్రుడు                             -కేశవ్(సిరివెన్నెలకి [...]
పాము కాటేస్తుందికుక్క కరుస్తుందిగద్ద పొడుస్తుందిమనిషి మాత్రంఎప్పుడు ఏం చేస్తాడోఎవరూ చెప్పలేరుఎందుకంటేజంతువుల్లోపెద్ద జంతువుమనిషే!!!                       -కేశవ్
సిగ్గులేని జాతి ఇదిప్రశ్నించే హక్కుందాదిక్కుమాలిన జనానికిదిశ మార్చే శక్తుందాసీమ శోకం చూస్తెచీమైనా కుట్టదుకుమ్ములాట కుళ్లులోఇసుమైనా మారదుకన్నీళ్లతో బతుకుల్నికలకాలం గడిపేద్దాంకలిసి రాని నేతలతోజీవితాల్ని కాలరాద్దాంముదనష్టపు మూర్ఖులేమనగద్దెక్కిన పెద్దలామారని తలరాతలకుమంచిగంధం చితులాతెలుగు తెలుగు తెలుగంటేతీరని దిగులేనాభాష మీద మోజుంటేభావమంత [...]
నడిబజారులో నగ్నంగానిజాయితీ నేల రాలిపోయింది...వాతలు తేలేలా కాల్చినందుకుకాదు, విలువలు వొలిచినందుకుతెగిన గాయాల్నిరెక్కల పొదివుల్లోతీరని భయాల్నిరంగుల పొరల్లోదాపరికం చేసుకున్నాగుట్టు ఆగదు...గాలి బలంగా వీచినాగాజు లంబంగా పగిలినామళ్లీ అదే గుండెదడ.. ★★★         ★★★పెదాలకు తాళం వేస్తావునీ మాటలకు తాళం వేయమంటావుకాళ్లకు సంకెళ్లు వేస్తావునీతో కలిసి [...]
గాయం చేయడం సులువేగాటు గాటుకీ లెక్కుంటదిసాఫ్ సాఫ్ చెప్పుకున్నాసెన్సిటివిటీ వదులుకోలేం తప్పు కనిపించినపుడు తప్పకుండా చంపేస్తాం...మనసుని జూమ్ చేసివైరస్ స్కాన్ చేసినపుడుజంక్ ఫైల‌్స్ తీసిపారేస్తాంఏమీ లేకుండా పదేపదేఅదేపనిగా స్కాన్ చేస్తేవైరస్ కాదు వాల్యూ పోతదిచెయ్యాలనిపిస్తే చేసేయొచ్చు...వద్దనిపిస్తే వదిలేయొచ్చు...చేస్తానని చెప్పేశాక [...]
ఎవరికి తెలీదుఎల్లలు ఎరుగనిమన మమతానురాగంఎవరికి తెలీదుఏళ్ల దోసిళ్లలో పెనవేసుకున్న మన అనుబంధం ఎవరికి తెలీదుఏరాడ గుట్టల్లో రాసుకున్న మరో చరిత్రలుచరిత్రపుటల్ని తీసి మన ప్రేమగాధని లెక్కరాసుకుంటే అదొక మధురకావ్యంచల్లని సాయంత్రాల్లోనీ అధరాల ముద్రల్ని  ఇసుక తెన్నెల్లో రాసి చెరిపేసిన క్షణాలుతెన్నేటి ఉద్యానంలోవిరహ పరిష్వంగ జాడలుభీమిలి వొంపులో [...]
నవ్వడం అంటేపెదవుల్ని విదిలించడం కాదునవ్వడం అంటేకళ్లని చికిలించడం కాదునవ్వడం అంటేగొంతుని సకిలించడం కాదునవ్వడం అంటేమనసుని పలికించడంనవ్వడం అంటేబంధాన్ని పెనవేయడంనవ్వడం అంటేమనుషుల్ని అల్లేయడంపెదవుల్లో విషాన్ని దాచుకుంటేప్రేమ పుడుతుందా...అనుబంధాల వాన కురిస్తేపాషాణం కరిగిపోతుందా... గుండెల్లో దోషాన్ని దాచుకొనికళ్లల్లో వక్రభాష్యాన్ని నింపుకొనిమాటలకు పంచదార [...]
నన్నుఎక్కువగా ద్వేషించొద్దుమళ్లీ ప్రేమించాల్సి వస్తుందినన్ను ఎక్కువగా ధూషించొద్దుమళ్లీ కీర్తించాల్సి వస్తుంది నన్ను ఎక్కువగా నిందించొద్దుమళ్లీ ఓదార్చాల్సి వస్తుందిమాటలు చెప్పడం కాదుమనసుని విప్పడం అంటేకోటలు కట్టడం కాదునీతికి నిలవడం అంటేఎగిరే గాలిపటాన్ని కాదుదారం తెగి నేలరాలటానికిఎగిసే పిల్లతెమ్మరను కాదుదూరం చూసి ఆగిపోడానికిఅలసట ఎరుగని సముద్రం [...]
  నాలోనే ఉంటూనాకు తెలియని నువ్వు ఎవరునిన్ను ప్రశ్నిస్తేనా ఉనికి ఎందుకుప్రశ్నార్థకంనిన్ను నిందిస్తేనా మనసుకిఎందుకు గాయం***  ***   ***నిప్పుని కప్పేస్తేనిజాలకు ముసుగులేస్తేఅబద్ధాలైపోతాయానిజయితీని కొనలేరునిజ నిరూపణలోనియమాల్ని మార్చలేరుఆత్మలకు అసలుప్రశ్నించే హక్కే లేదుధిక్కరించే మార్గం అంతకన్నా లేదు***   ***   ***ఎవర్నీ వినకు విన్నా నమ్మకునమ్మినా [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు