పద్యాలు !!!  "శంకరాభరణం"  బ్లాగులో కొన్ని ప్రసిద్దమైన పద్యాల భావాన్ని అన్య చంధస్సులో వ్రాయుమనగా వ్రాసినవి.  “నిండుమనంబు నవ్యనవనీతసమానము పల్కు దారుణా ఖండలశస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్క మీ  రెండును రాజులందు విపరీతము గావున విప్రుఁ డోపు నో  పం డతిశాంతుఁ డయ్యు నరపాలుఁడు శాపము గ్రమ్మఱింపఁగన్” నన్నయ గారి పై పద్యం యొక్క పూర్తి భావాన్ని కాని, కొంతభాగాన్ని [...]
   !!! శ్రీరామచంద్రుడు!!! ఎవ్వెడు తండ్రి మాట వినె? నెవ్వడు కానలకేగె ?రాజ్యశ్రీ నెవ్వడు వీడె ?కష్టముల నెవ్వడె దుర్కొనె?వాయునందనుం డెవ్వనిగొల్చి శ్రేష్టుడయె ?యెవ్వడుధర్మమునిల్పె?రావణుం డెవ్వని చేతజచ్చె? ప్రభు వెవ్వడు ? రాముడె! భక్తిగొల్చెదన్ !!!
దొంగిలింప బడదు దొరలచే జిక్కదు పాలివారు గోర వీలుగాదు తరుగ  బోదు విద్య,దానమ్ము చేసినా వృద్ధి నొందు గాదె ప్రొద్దు ప్రొద్దు !!!
ఇడుములు వచ్చును పోవును కడలినికెరటములరీతి కలవరపడకన్ నడచిన చాలును నీతిని విడువక,చీకటులుతొలుగు వెలుగులు పూయున్!!!
నడిచెడు కాలము కంటెను గడిచిన కాలమ్మె మేలు  గమనించినచో నడిచెడు కాలమె మేలగు గడుపందగునట్టి వచ్చు కాలము కంటెన్ !!!
రాములందున బలరాముండు నొక్కడే రాములందు పరశరాముడొకడె రాములెందరున్న రఘురాము డొక్కడే రాములందు గొప్ప రాముడతను!!! (21-09-2015 నాటి శంకరాభరణము బ్లాగులో యిచ్చిన సమస్యకు పూరణ )
కవి మిత్రులకు పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు !!!  ఒక మంచి మాటె చాలును వికలము జెందిన మనుజుని వేదన బాపన్ ముకుళించిన కమల దళము వికసించదె సూర్య కిరణ విలసనమునకున్ !!!
 మునివ్యాసుని భారతమును వినివ్రాసిన శూలిసుతుడు విజ్ఞుడు విద్యా ధనుడు గణేశుడు తొమ్మిది దినరాత్రులు పూజలందె దిగ్విజయముగా !!! ఘనముగ  వేడ్కలు ముగియగ జనులందరు సంతసమున జైజైయన రా బినునితొ మహేశు తోడుత వినాయకుని సాగనంపవిచ్చేసె రహీమ్ !!! (నేడు శంకరాభరణం బ్లాగులో యిచ్చిన సమస్యకు పూరణ)
తనను తాను మార్చ దలపంగ నేరడు యెదుటి వాని మార్చ నెదిరిచూచు మార లేని తాను  మార్చునా యితరుల ? మంద వారిమాట మణుల మూట !!!
విద్య నెఱగు వాడు విశ్వ పూజ్యుండౌను విద్య యున్నవాడు విజ్ఞు డౌను విద్య గురుడు సఖుడు విత్తమౌ చుట్టమౌ రూపమౌను జ్ఞాన దీప మౌను !!!  
చదివిన శుభములు కలుగును చదివిన వారలకు శాస్త్ర సారము దెలియున్ చదివిన గౌరవము పెరుగు చదివిన చీకట్లు తొలుగు చదువగ వలయున్ !!!
( శంకరాభరణం బ్లాగులో  ఈమధ్య  చేసిన కొన్ని  సమస్యా పూరణలు)  (శ్రీకాళ హస్తిశ్వర శతకము స్ఫూర్తిగా పూరించినది)వింతల్మేన చరించగ కాంతా సంఘంబు రోయ కాయంబు జరా క్రాంతంబవ "జీవితమే కాంతారమ్మనెను" మోక్ష కామికుడు తమిన్ !!!( జీవితమే కాంతారమ్మనెను = జీవితమునే ఒక పేరడవి గా భావించెను) కలడు కలడుదేవుండని కథలు పెక్కుభాగవతులు జెప్పిరిమున్నుభక్తిమీరప్రాణి ప్రాణిలో దేవుండు [...]
   క్రొవ్వెక్కిన రిపుమూకల కవ్వింతల వమ్ము జేసి గగనపు వీధిన్ రివ్వున రెపరెప లాడుచు మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్ !!! (శంకరాభరణం లో యిచ్చిన నేటి సమస్యా పూరణమునకు పూరణ )
   (బంధువు,స్నేహితుడు శ్రీ పిట్ల లక్ష్మణ్ గారు  తేది   12-07-2015 రోజున పరమపదించినారు, వారికి)                                                                 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,                                                                       అశ్రునివాళి                                                                  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
అక్ర మంబుగ ధన మార్జించి బ్రతుకుట మురికి కూపమందు   మునుగు టౌను   హితము గాదు రోగ హేతువై బాధించు మంద వారి మాట మణుల మూట !!!
నిప్పు ,అప్పుయు పగ నిదుర బోనీయవు తమకు తాను గాను తరుగ బోవు నార్ప తీర్చ త్రుంచ నంతమైపోవేల మంద వారి మాట మణుల  మూ ట !!!
వేరు దేశ మైన వేషమ్ము వేరైన పలుకు భాష తీరు తెలియ కున్న మనసు మనసు  కలుపు మంత్రమే  చిరునవ్వు మందవారి మాట మణుల మూట !!!  
కార్య సాధకుండు కష్టంబు నష్టంబు పరిగణించ బోడు పనిని మాని విజయమొందు వరకు వీరుడై పోరాడు మందవారి మాట మణుల మూట !!!
ధర్మ మార్గమందు  తగు ద్రవ్యమార్జించి జీవనమ్ము గడుపు పావనునకు చింత దరికిరాదు సిద్ధించు మోక్షమ్ము మందవారి మాట మణుల మూట !!!  
    నేటి  నేత !!! అప్పుడు చెప్పినదొక్కటి, యిప్పుడు వేరొకటి జెప్పె, యికముందితడే జెప్పును కొంగ్రొత్త దొకటి, అప్పుడు యెప్పుడు జనులకు  తప్పులె జెప్పున్ !!!
అందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు.  శ్రీ సీతా రాములకు వందనములు  శ్రీలు పొంగు నయోధ్య సుక్షేత్ర మైన   సీమలో పుత్ర కామేష్టి జేసి బడిసె  తాపసులు దేవతలు మెచ్చ దశరథుండు  రామ లక్ష్మణ భరతాది నామ వరుల! మునుల పనుపున జనకుని పురముకేగి  లలన సీతను పెండ్లాడె లక్షణముగ ! కుమతి మందర, కైకమ్మ కోర్కె మీర  వందనీయుడౌ తండ్రి సద్వాక్కు నిల్పె ! దనుజ నాథుని తలద్రుంచి తనదు [...]
ఉగాది  శుభాకాంక్షలు!!! స్వాగతమ్ము నూత్న సంవత్సరమునకు స్వాగతమ్ము చిలుక వాహనునకు ధర్మబద్ధమైన కర్మాచరణ జేయు త్రోవ జూపి తగిన చేవనిమ్ము !!!
ధర్మ మార్గ మందు కర్మముల్ జేయుచు చేతనైన సేవ జేయువాడు శివుని కిష్టు డౌను శివశివా యనకున్న మంద వారి మాట మణుల మూట  !!!
తల్లి దండ్రి భార్య తనయులు మనుమలు మనసు వారి చుట్టు మసలునెపుడు దేహముండు వరకు మోహంబు బోవునే ? మందవారి మాట మణుల మూట !!!
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు