పసి పిల్లలు ఏడవటానికి ఎన్నో కారణాలుంటాయి. ********** కడుపునొప్పి, ఆకలివేయటం..వంటి అనేకకారణాల వల్ల ఏడుస్తారు.  కొన్నిసార్లు పిల్లలను చీమలు వంటివి కుట్టే అవకాశం ఉంది. చీమ కుడుతున్నా మాటలు రాని పిల్లలు చెప్పలేరు కాబట్టి,  గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటారు. అలాంటప్పుడు పెద్దవాళ్లు గమనించుకోవాలి. ************** చిన్నపిల్లలకు స్నానం చేయించేటప్పుడు, ముఖము కడిగేటప్పుడు కొన్ని [...]
ఈ రోజుల్లో  చాలామంది పెద్దవాళ్ళు ఉపాధి కొరకు బైటకు వెళ్ళటం వల చిన్నపిల్లలను వేరే వారి వద్ద ఉంచి వెళ్తున్నారు.  బయటివాళ్ళు పిల్లలను జాగ్రత్తగా చూడనూవచ్చు లేక కొందరు సరిగ్గా చూడకపోనూ వచ్చు. **************  పిల్లలను బయటివారి వద్ద ఉంచి వెళ్ళటం గురించి ఈ మధ్య ఒక వీడియో గురించి విన్నాను. అందులో విషయమేమిటంటే, ..అమ్మా! విలువైన నగలు బయట వారి వద్ద  ఉంచి వెళ్తారా ? అని [...]
మాకు తెలిసిన ఒక అమ్మాయి చదువు కోసం వేరే ఊళ్ళో సీట్ రావటం వల్ల తల్లితండ్రికి దూరంగా హాస్టల్లో ఉంటోంది.  ఆ అమ్మాయికి కొంతకాలం క్రిందట బాగా జ్వరం వచ్చి కొన్నాళ్ళు నీరసంగా ఉంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుని మందులు వేసుకుంటే జ్వరం తగ్గింది . అయితే , అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏది పడితే అది తినకూడదు కదా!  ఇంట్లో అయితే, పిల్లలకు అనారోగ్యం వస్తే పెద్దవాళ్లు వారికి [...]
 ఈ రోజుల్లో చాలామంది పిల్లల జీవితాల్లో టెన్షన్  బాగా పెరిగింది.  డబ్బు ఉన్న వారి పిల్లలు కూడా చదువులు, ఉద్యోగాల వల్ల బయట ఉండటం వల్ల సరైన పౌష్టికాహారాన్ని తినటం లేదు. ఇంట్లో అయితే పెద్దవాళ్ళు బ్రతిమాలో, కోప్పడో పౌష్టికహారాన్ని తినేలా చేస్తారు. ( అయితే, ఈ రోజుల్లో పిల్లలు ఇంట్లో ఉన్నా కూడా,  కొందరు పెద్దవాళ్ళు బిజీగా ఉండటం వల్ల గబగబా ఏదో ఒకటి వండేసి  [...]
ఈ రోజుల్లో కల్తీల సమస్య ఎక్కువగా ఉంది. చాలామంది మనుషుల మనస్సులలోనే స్వచ్చత తగ్గి, మనస్సుల కల్తీ పెరిగిన ఈ రోజుల్లో పరిస్థితి ఇలా కాక ఇంకెలా ఉంటుంది ?    చాలామంది లో డబ్బు యావ బాగా పెరిగింది. ఇలాంటి ప్రపంచంలో  ఇతరులను దోచుకోవటం, అన్యాయం, అధర్మం, మోసం, కల్తీలు వంటివి పెరుగుతాయి.    మనుషుల స్వభావాలు మంచిగా మారనంత కాలం సమాజంలో కల్తీలు, అవినీతి, అక్రమాలు, లంచాలు, నేరాలు, [...]
ఈ మధ్య మేము యాత్రకు వెళ్ళివచ్చాము.  యాత్ర చక్కగా జరిగినందుకు దైవానికి కృతజ్ఞతలు మరియు వందనములు. 
వ్యక్తులకు.. అసూయాద్వేషాలు , పంతాలు, పట్టుదలలు, అధికారం కోసం యుద్ధాలు జరగటం..మొదలైనవి కధల ద్వారా వినటానికి,చదవటానికి..ప్రేక్షకులకు ఆసక్తిగా ఉంటాయి. వినోదాన్ని కలిగిస్తాయి. అయితే, యుద్ధాలు నిజంగా జరిగితే మాత్రం తట్టుకోవటం చాలా కష్టం.   యుద్ధాలు సంభవిస్తే ఎందరో ప్రజలతో పాటూ ఎన్నోమూగజీవులు కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. పురాణేతిహాసాలలో కూడా ఎన్నో యుద్ధాల [...]
కొందరు బంధువులు, కొందరు ఇరుగు పొరుగు ఇళ్ళ వాళ్ళు, ఆఫీసుల్లో ..కొందరు ఎలా ఉంటారంటే, ప్రక్కవాళ్ళ  ఇబ్బందులను పట్టించుకోకుండా ప్రక్కవాళ్ళ వస్తువులను వాడేసుకుంటూ ఉంటారు. ప్రక్కవాళ్లు తెచ్చుకున్న మంచినీళ్ళ బాటిల్ నోటికి కరచుకుని త్రాగేస్తుంటారు. వాళ్ళు తెచ్చుకున్న టిఫిన్ బాక్సులను ఖాళీ చేస్తుంటారు. అదేమిటంటే షేరింగ్ అంటారు. అవసరమైనప్పుడు ఇతరులకు సహాయపడటం ఎంతో [...]
  ఈ రోజుల్లో చాలామంది ప్రజలలో బాధ్యతారాహిత్యం పెరిగింది. తమ స్వార్ధమే తప్ప సమాజం ఏమైనా ఫర్లేదు..అనే పరిస్థితి కనిపిస్తోంది.  ఇలాంటి వాళ్ళను చూస్తే, ప్రజలకు మేలు చేయాలి అనుకోవటం గురించి కూడా కొన్నిసార్లు నిరాశగా అనిపిస్తుంది.  అవినీతి పనులు చేసైనా సరే , బాగా డబ్బు సంపాదించి, విలాసవంతంగా జీవించాలనే వారి సంఖ్య బాగా పెరిగింది. ఈ క్రమంలో పర్యావరణాన్నీ [...]
ఇలాంటి సున్నితమైన విషయాలు రాయాలంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది. అయితే, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ విషయాల గురించి రాయాలనిపించింది.   సైనికులు, పోలీసులు....నక్సలైట్లు..వీళ్ళ మధ్య కాల్పులు జరిగి.... కొందరు మరణించటం అనేది ఎంతో బాధాకరమైన పరిస్థితి.ఈ పరిస్థితి మారాలని ఎందరో కోరుకుంటున్నారు. సైనికులు, పోలీసులు ..వీళ్లలో కూడా చాలామంది పేద కుటుంబాల నుంచీ వచ్చిన వారు  ఉంటారు. [...]
అక్షయ తృతీయ రోజున సింహాచలంలో చందనోత్సవాన్ని చేస్తారు. ..................... అక్షయతృతీయ నాడు దానం చేస్తే మంచిదంటారు . అక్షయతృతీయ పండుగ వేసవిలో వస్తుంది. అప్పుడు మంచినీరు, గొడుగు, విసనకర్ర ..వంటివి దానం చేయటం వల్ల ఎందరికో ఉపయోగం కలుగుతుంది. దానం చేయటం వల్ల దానం చేసినవారికి మంచి జరుగుతుందని, ఆహారం, గృహం …వంటివి కొరత లేకుండా లభిస్తాయని అంటారు. ................
ప్రాచీన కాలంలో జరిగినట్లుగా అనేక కధలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రాచీనులు తెలియజేసినవి కాకపోవచ్చు. కాలక్రమంలో గ్రంధాలలో వచ్చి చేరి ఉండవచ్చు. ఏవి నిజమో? ఏవి కల్పితాలో? భగవంతునికే తెలియాలి. ఒకప్పుడు శివుడు శనిదేవుని ప్రభావానికి భయపడి శనైశ్చరునికి కంటబడకుండా ఉండటం కోసం మారువేషంలో దాక్కోవటం జరిగిందనే విధంగా కొన్ని కధలు ప్రచారంలో ఉన్నాయి. ఈ కధలు [...]
 చాలామంది జీవితంలో ముందు ఏం జరుగుతుందోనని ఉత్సుకతతో జాతకాలను చూపించుకుంటారు. జాతకం మంచిగా ఉంటే ఆనందాన్నీ, ఏమైనా తేడాగా ఉంటే బాధను పొందుతారు. ( ఈ రోజుల్లో జాతకాలు చెప్పటం సరిగ్గా తెలిసిన వారు అరుదుగా ఉన్నారు .) ఆ జాతకమంతా పూర్వం తాను చేసిన మంచిచెడు కర్మల ఫలితమేనని తెలిసినా జీవితంలో చెడు జరగకూడదనే ప్రతివ్యక్తి కోరుకోవటం జరుగుతుంది. ******************* రాసిపెట్టిఉన్నది ఎలాగూ [...]
ఏసుక్రీస్తు లోకరక్షణ కొరకు శిలువనెక్కారని అంటారు.  శ్రీ కృష్ణుడు లోకరక్షణ కొరకు ఎన్నో అవతారాలను ధరించారంటారు. శివుడు లోకరక్షణ కొరకు హాలాహలాన్ని కంఠంలో నిలిపారని అంటారు. ఈ విషయాలను గమనిస్తే, దైవం లోకరక్షణ కొరకు ఎన్ని చేసారో తెలుస్తుంది.  అయితే, చాలామంది మనుషులు  చేస్తున్నదేమిటి ?  లోకరక్షణ మాట అటుంచి తమ స్వలాభం కోసం లోకాన్ని కష్టపెడుతున్నారు.   తమ అంతులేని [...]
 ఏ మతమైనా దైవం అందరికీ దైవమే.  ఇంతకు ముందు టపాలో గుడ్ ఫ్రైడే సందర్భంగా శుభాకాంక్షలని వ్రాసాను. ఇలా వ్రాయటం తప్పే.  అలా  వ్రాసినందుకు దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.  విన్నకోట నరసింహా రావు గారు వ్రాసిన వ్యాఖ్యను చదివిన తరువాత నేను వ్రాసిన తప్పు తెలిసింది.  ఏసుక్రీస్తు సమాధి నుండి పునరుత్థానం  చెందిన రోజు గుడ్ ఫ్రైడే కావచ్చు..అని అనుకున్నాను. [...]
ఆసక్తి ఉన్నవారు   దయచేసి ఈ లింక్స్   వద్ద చూడగలరు.  ముహూర్తాలు....సత్కర్మాచరణ. ముహూర్తాలు...మరి కొన్ని విషయాలు.
శ్రీ దేవీభాగవతము( తెలుగు వచనం)లో నారాయణమహర్షి నారదమహర్షికి తెలియజేసిన విషయములలో ..కొన్ని విషయములు. . రాత్రి వేళలో చివరి యాభై అయిదు ఘటికలు ఉషఃకాలం, యాభైఏడు ఘటికలు అరుణోదయం, యాభై ఎనిమిది ఘటికలు ప్రాతఃకాలం, అటుపైని అరవై ఘటికలకు సూర్యోదయం.  ( సూర్యోదయం నుంచి సూర్యోదయానికి అరవై ఘటికలు). ********* ప్రాతఃకాలంలో బ్రాహ్మీముహూర్తాన ప్రాణాయామం చేయటం గురించి కూడా తెలియజేసారు.  ఈ [...]
 గొప్ప ముహూర్తాలు కనుగొనటం అంత తేలిక కాదనిపిస్తుంది. అయితే,గొప్ప ముహూర్తాలు కనుగొనటం అంత తేలిక కాకపోవటమే మంచిదనిపిస్తుంది. మంచి ముహూర్తాలు కనుగొనటం చాలా తేలికయితే, చెడు పనులు చేసేవారు కూడా ఆ ముహూర్తాలను తెలుసుకుని పనులు మొదలుపెడతారు. మనుషులు జీవితంలో సుఖంగా ఉండాలంటే ధర్మాన్ని ఆచరించటం మంచిది. ధర్మాన్ని ఆచరించేవారికి దైవకృప లభిస్తుంది. గ్రహాలు [...]
ఇంకో సందేహం ఏమిటంటే, హిందువులు కాలాన్ని సూర్యోదయం నుంచి లెక్కిస్తారంటారు. ఉదా..సూర్యోదయం నుండి మరుసటి రోజు అని చెబుతారు. గౌరీ పంచాంగం, రాహుకాలం, యమగండం..మొదలైనవి సూర్యోదయం నుండి లెక్కిస్తారనుకుంటున్నాను.( నాకు తెలిసినంతలో..)  అయితే, కొన్ని పంచాంగములలో ..రజస్వల ..మొదలైన సందర్భాలలో రాత్రి ఆఖరి జాము సమయాన్ని మరుసటి దినం అని లెక్కిస్తారనుకుంటున్నాను. ఉదా..రాత్రి వేళ [...]
మంచి ముహూర్తాలు చూడాలంటే చాలా విషయాలు చూడాలి. మంచి ముహూర్తం లభించాలంటే కొన్నిసార్లు అన్నీ సరిగ్గా కుదరకపోవచ్చు. పంచకరహితమైన మంచి ముహూర్తం ఉంటే అప్పుడు యమగండం ఉండొచ్చు లేక రాహుకాలం ఉండొచ్చు లేక వర్జ్యం ఉండొచ్చు. ఇవన్నీ కష్టం అనుకున్నప్పుడు , గౌరీ పంచాంగం ప్రకారం మంచి సమయం చూసుకోవటం సులువనిపిస్తుంది. గౌరీ పంచాంగం అంటే సూర్యోదయ కాలం నుండి లెక్కిస్తారు. [...]
ఈ సంవత్సరం ఉగాది సందర్భంగా కొన్ని సందేహాలు నెలకొన్నాయి. కొందరు 28న అని, మరికొందరు 29న అని అంటున్నారు.  కొందరేమో 29న సూర్యోదయానికి ముందే పాడ్యమి ముగుస్తున్నట్లు అంటున్నారు. కొందరేమో సూర్యోదయం తరువాత కూడా కొంతసేపు పాడ్యమి ఉన్నట్లు అంటున్నారు. హిందువులు సూర్యోదయం ప్రకారం లెక్క చూస్తారు. ఇప్పుడు వసంతనవరాత్రోత్సవాలు నిర్వహిస్తారు.నవరాత్రులు అనటంలోనే రాత్రి అనే పదం [...]
శ్రీ రామ నవమి సీతారాముల కల్యాణం..సందర్భముగా అందరికి శుభాకాంక్షలండి. దైవానికి వందనములు. శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. . అనేది గొప్ప శ్లోకము. మనస్సు ఎప్పుడైనా అశాంతిగా గందరగోళంగా ఉన్నప్పుడు ,  పై  శ్లోకాన్ని కొంతసేపు  అనుకుంటే మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది.
 మహిషాసుర మర్దిని అమ్మవారు ............... ఒకప్పుడు మహిషాసురుడు రాక్షసులకు చక్రవర్తి అయ్యాడు. అతడు దేవేంద్రుని జయించి స్వర్గాధిపత్యాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. దిక్పాలకులు, దేవతలు అందరూ అతని ఆజ్ఞకు వశులయ్యారు. మహిషాసురుడు చేసే అన్యాయములు భరించలేక , దేవతలందరూ బ్రహ్మదేవునితో కలిసి శివకేశవులను దర్శించుకొని తమ బాధలు చెప్పుకొన్నారు. మహిషాసురుని దుర్మార్గాలు వివరించారు. ఆ [...]
ఒకప్పుడు మహాశక్తి యొక్క సరస్వతీ శక్తి శుంభనిశుంభాది రాక్షసుల్ని సంహరించింది.  ఒకానొక సమయంలో శుంభుడు, నిశుంభుడు అనే పేర్లు గల రాక్షసులు ,వరబలగర్వాలతో దేవతల్ని అమరావతి నుండి తరిమివేశారు. శుంభ,నిశుంభుల వల్ల ఎన్నో బాధలు పడ్డ దేవతలు .... ఏదైనా ఉపాయం చెప్పమని దేవగురువు వద్దకు వెళ్ళి అడిగినప్పుడు, ఆయన చెప్పిన సలహా ప్రకారం , మీకేమయినా ఆపదలు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని [...]
ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రం మీద ఆదిశేషునిపై పవళించి యోగనిద్రలో ఉన్నారు.   అప్పుడు విష్ణుమూర్తి చెవులలోని గులివి నుండి మధువు, కైటభుడు అనే ఇద్దరు రాక్షసులు జన్మించారు. వారిద్దరూ మహా బలవంతులు.వారు శక్తిస్వరూపిణి అయిన పరాశక్తిని గురించి తపస్సు చేసి స్వేచ్చామరణమును వరముగా కోరుకొన్నారు. ఆ వరగర్వముతో రాక్షసులిద్దరూ బ్రహ్మ మీద దాడి చేశారు. బ్రహ్మదేవుడు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు