నేను నిర్వహించిన తెలుగు జానపద కళా చైతన్య యాత్ర ను 'తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ ' లో నమోదు చేసారు . క్రింది లింక్ లో చూడండి http://www.telugubookofrecords.com/home/category/find-record/page/5/
స్పాట్ పెయింటింగ్ మరియు ఆధునిక ,సాంప్రదాయ వాయిద్యాల పోటి లో పాల్గొని ,మీ చిన్నారులను పాల్గొనేలా ప్రోత్సహించి ................సృజనాత్మకత ను వెలికి తీసి .................
అందరికి ఆహ్వానం.
చిత్రకళా సేవలో ....
తాతా రమేశ్ బాబు
అమెరికా అబ్బాయి-గుడివాడ అమ్మాయి చిత్రలేఖనం
అమెరికా, వాషింగ్ టన్ లో పుట్టి పెరిగిన కృష్ణ జిల్లా గుడివాడ అక్కినేని కళాశాల కోశాధికారి శ్రీ కాట్రగడ్డ సింహాద్రి అప్పారావు మనుమడు, ప్రణవ్ రామ . వాషింగ్ టన్ లోనే డాన్ స్టన్ ఎలిమెంటరీ పాటశాల లో 1 వ స్టాండర్డ్ చదువు తునాడు. తన 8 సం. వయసులో చకచక బొమ్మలు గీస్తున్నాడు.
గుడివాడ వచ్చిన ఈ అమెరిక అబ్బాయికి చిత్ర లేఖనం లో శిక్షణ ఇమ్మని [...]
ఒక బుల్లి మరియు వికలాంగ చిత్రకారులు
మా పాటశాల ఆవరణలో ఎలిమెంటరీ పాటశాల కూడా వుంది. అక్కడ ప్రదాన ఉపాధ్యాయులు శ్రీ మల్లవల్లి అమ్మన్న బాబు. వీరు మా పాటశాల పూర్వ విధ్యార్దే ! విద్యార్థులను చిత్రలేఖనం లో ప్రోత్సహిస్తూ గీయించిన చిత్రం చూడండి. విద్యార్ధి పేరు 'గరికే బాలకృష్ణ ' . చదువుతున్నది 3 వ తరగతి .
అలాగే మా
ఏకాగ్రతగా బొమ్మ గీస్తున్న దృశ్యం
మా పాటశాల లో 6 వ తరగతి చదువుచున్న విద్యార్ధి ' పెయ్యల ప్రకాష్ ' . ఈ రోజు నేను బోర్డ్ మీద గీసిన 'మర్రి ఆకు ' బొమ్మను చాలా ఏకాగ్రతగా గీస్తున్నాడు. చూడ ముచ్చట గా వుంది ఆ దృశ్యం. వెంటనే ' క్లిక్ '. ఆ పైన ఇక్కడ మీ కోసం. ఈ అబ్బాయికి మీ అభిప్రాయం తెలియ చేయండి.
సాన్వి ఆజాద్ గ్రీటింగ్
మే 24 , ప్రముఖ రచయిత పి . చంద్ర శేఖర ఆజాద్ పుట్టిన రోజు .
ఇటివల ''ఎదురీత' సీరియల్ లో నటించే సందర్భం లో .వారింటికి వెళ్లాను . ఆజాద్ మనవరాలు , ఆజాద్ పుట్టిన రోజు కి స్వయంగా తయారు చేసిన గ్రీటింగ్ చూసాక , అది ఇక్కడ పెట్టాలని పించింది .
గ్రీటింగ్ లోపల పేజీ
ఈ చిన్నారి కి మీ ఆభిప్రాయం చెప్పండి
బాటసారి -బంగారు కంకణం, 2 వ భాగం
అందరికి నమస్కారం.
'బాల కళ ' -బాల బాలికలలో నిబిడీకృతమైన సృజన శక్తిని వెలికి తీయడం కోసం ఏర్పాటు చేశాను . ఈ వేసవి లో కొన్ని విడియో లు అప్లోడ్ చేస్తాను. దయచేసి మీ పిల్లలకు చూపించండి . మీ పిల్లలు ప్రదర్శించే కళలకు సంబందించిన ఫోటోలు కానీ విడియో లు కానీ నాకు మెయిల్ చేస్తే ,అప్లోడ్ చేస్తాను. ఇది పిల్లల బ్లాగు . ఇందుకు పెద్దలు సహకరించాలి.
పప్పెట్ [...]
చిన్నారులూ, ఈ వేసవి సెలవులను ఎలా గడుపుతారు? 'బాల కళ' కి రాసి పంపండి.
ఇక్కడ ఒక విడియో ఇస్తున్నాను. చూడండి. మీ అభిప్రాయం చెప్పండి. మీ మనసులో వున్నది నిర్భయంగా రాయటానికి వెనుకాడ వద్దు.
ఇక్కడ ఇచ్చిన ఈ విడీయో 'కథ' పేరు....
'బాటసారి-బంగారు కంకణం '
దురాశ దుక్కానికి చేటు -అనే సామెత విన్నారా? ఒక క్రూర జంతువు మాటలు నమ్మి ఆశ పడిన బాటసారి గతి ఏమయిందో ఈ బొమ్మలాటలో చూడండి.
[ఓ [...]
సాన్వి ఆజాద్ బొమ్మలు :
ప్రముఖ రచయిత , నటుడు, పి. చంద్ర శేఖర ఆజాద్ మనవరాలు 'సాన్వి ఆజాద్ ' . ఈ పాప కు బొమ్మలు వేయడం, డాన్సు చేయడం, నూతనత్వం గా ఆలోచించడం పుట్టుక తోనే అబ్బాయి . ఆంగ్లం,హిందీ, తెలుగు భాషలలో మాట్లాడే ఈ చిన్నారి వేసిన కొన్ని బొమ్మలు చూడండి. మీ అభిప్రాయం చెప్పండి.
"పుట్టిన రోజు సంతోషం" (పాట)రచన : యం.వి.తరుణ్ ప్రదీప్, 4 వ తరగతి, మం.ప.ప్ర.పాఠశాల, త్రిపురాంతకంఎడిటింగ్ : మద్దిరాల శ్రీనివాసులు, పల్లవి: ఈ రోజే నీ పుట్టిన రోజూ ఈ రాజే పుట్టిన రోజూ ఈ బంగరు రోజూ .....సంతోషపు రోజూ......చరణం : కొత్త బట్టలేసే నీ పండుగ రోజూ కేకు కోసి మిత్రులకూ పంచే రోజూ కొత్త నీకిష్టమైన పదార్ధాలు పొందే రోజూ నీ మిత్రులు అందరూ కలిసే రోజూ నీ బర్త్ డే రోజూ ఈ రోజే చరణం :పెద్దలంత [...]
దెయ్యం(కథ)-మద్దిరాల శ్రీనివాసులు చిట్టిపల్లె గ్రామంలోని శరత్, శ్రావణ్ ఇద్దరూ ఇరుగూపొరుగూ పిల్లలు. నాలుగు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కనే వున్న సింగంపల్లెలోని ఉన్నత పాఠశాలలో శరత్ 8వ తరగతి, శ్రావణ్ 7వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ మంచిమిత్రులు. ఏ పనిచేసినా, ఎక్కడికెళ్లినా దాదాపు కలిసే వుంటారు. వాళ్లిద్దరిలో శ్రావణ్ చాలా తెలివైనవాడూ, చురుకైనవాడు. కానీ, [...]
పరులకు సహాయం (కథ) రచన : మద్దిరాల రాంప్రకాష్ , 5 వ తరగతి , NSC పాఠశాల , త్రిపురాంతకం. ప్రకాశం జిల్లా. ఒకానొకప్పుడు ఒక మనిషి నివసిస్తూ వుండేవాడు. అతని పేరు జాకీ. అతడు ఒక అడవిలో నివసిస్తూ పండ్లు, ఆకులు, గడ్డలు మొ||నవి తింటూ జీవించేవాడు.
చిన్నారులూ, మీరంతా వేసవి శెలవుల్ని ఆనందంగా,విజ్ఞాన దాయకంగా ,వినోదంగా,కళాత్మకంగా గడపాలని కోరుకొంటున్నాను. మీ నేస్తం చి.తాతా వెంకటేశ్వర రావు తయారు చేసిన "విచ్చుకొనే పువ్వు " వీడియో ను ఇక్కడ ఇస్తున్నాను. చూడండి.ఎలా వుందో చెప్పాలి మరి.... ఇలాంటివి మీరు తయారు చేస్తే ,వెంటనే బాల కళ కు పంపండి. ఇది తయారు చేయటం చాలా తేలిక .మీలో చాలామందికి తెలుసుకదా.
క్రింది పొడుపు కథలు సేకరించిన వారు పి.రచన ,ఏడవ తరగతి.ఒకటి:మిమ్మల్నిఎండ నుంచివాన నుంచిరక్షించ లేనిగోడుగునిఎవరు నేను ?జవాబు : గుడుగో ట్టపురెండు:రెండు అంగుళాల గదిలోఅరవై మంది దొంగలుతల,మొండం ఉన్నాయి కానీకాళ్ళు,చేతులు లేవుఎవరు వాళ్ళు ?జవాబు : లుల్లపు లోట్టే పెగ్గి అమూడు: అడ్డంగా కొస్తేచక్రాన్నవుతానిలువుగా కొస్తేశంఖాన్నవుతాఎలా కోసినానిన్నేడిపిస్తాఎవరు నేను?జవాబు: [...]
చి .తాతా వెంకటేశ్వర రావు గీసిన " చిట్టి చిలకమ్మా " బొమ్మలకు దృశ్య రూపం .క్రింది లింకు క్లిక్ చేసి తిలకించండి .దృశ్య రూపం చేసిన" తెలుగు ఫర్ కిడ్స్ డాట్ కామ్" కు, బాల కళ జేజేలు .http://www.youtube.com/watch?v=ZWNVtFgGr4s
శకునాల గోపయ్యShare Buzz up! చిన్నారి డెస్కు, ప్రజాశక్తి - మద్దిరాల శ్రీనివాసులుSat, 17 Apr 2010, ISTశీనయ్య, గోపయ్య బట్టలను వాయిదా పద్ధతిలో అమ్మే వ్యాపారస్తులు. ఇద్దరూమంచిమిత్రులు. అయితే గోపయ్యకు శకునాల పిచ్చి ఎక్కువ. శీనయ్యకు అలాంటిపట్టింపులు ఏమీలేవు.ఒకసారి ఇద్దరూ కలిసి పట్నం వెళ్లి రకరకాల బట్టలు కొనితెచ్చుకున్నారు. పల్లెలన్నీ తిరిగి వాయిదాలలో సొమ్ము చెల్లించే విధంగాబట్టలను [...]
మా వూరు
మాది పల్లెటూరు
మంచి కదే పేరు
చల్లని పిల్ల గాలులు
చెంగు నెగిరే మేకలు
నల్లనల్లని మబ్బులు
తెల్ల కొంగల బారులు
ఆ చెట్లూ ఆ చేమలు
ఆ పశువులా పచ్చికలు
ఆ చెరువులా తామరులు
ఆ ఫలాలు ఆ వనాలూ
ఆ డొంకలు ఆ దారులు
ఆ పొలాలు ఆ హలాలు
ఆ జలాలు ఆ జనాలు
ఆ కేకలు ఆ పిలుపులు
అవే అవే ఇష్టం
అవే ఎంతో ఇష్టం
********* **********
పల్లె పార్కు
పల్లెటూరి పొలంలో
పిల్లలుండే [...]