తన రంగంలో క్రమంగా నిలదొక్కుకుని, జీవితంలో ఒక స్థాయికి ఎదిగిన ఒక కళాకారుడిని ఇంటర్వ్యూ చేస్తూ అడిగాడు విలేకరి.“జీవితంలో అనేక ఎత్తుపల్లాలు చూసారు. లేని రోజులకు, ఉన్న రోజులకు తేడా ఏమైనా కనిపిస్తోందా’ అని.“హస్తిమశకాంతరం’ జవాబు వచ్చింది వెంటనే.“లేని రోజుల్లో లేనిడబ్బు ఒక్కటే సమస్య. ఇప్పుడో డబ్బు తప్ప అన్నీ సమస్యలే”“అదెలా?”“ఆ రోజుల్లో డబ్బు లేకపోయినా మనుషుల నడుమ [...]
కస్తూరి రామచంద్ర మూర్తి. ఈ పేరు ఎవ్వరికీ తెలియదు. జర్నలిష్టు మిత్రుడు దివాకర్  కు స్వయానా మేనల్లుడు. కాకపొతే వయస్సులో కాస్త పెద్దవాడు. పుణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీ కోర్సు రెండో బ్యాచ్ . గోల్డ్ మెడలిష్ట్. అక్కడ కట్ చేస్తే...ఏడిద నాగేశ్వరరావు (మా రేడియో సహచర ఉద్యోగి, నాటక ప్రియుడు ఏడిద గోపాల రావుకు స్వయానా అన్నగారు) విశ్వనాద్ దర్శకత్వంలో  శంకరాభరణం [...]
మా పెద్దన్నయ్య కీర్తిశేషులు పర్వతాలరావు గారికి సినిమాల గోల పట్టదు. అలాంటిది ఆయన స్వయంగా ఒక సినిమాకి ముందుగా టిక్కెట్లు బుక్ చేయించాడు. చిక్కడపల్లి, అశోక్ నగర్ లలో ఉంటున్న కుటుంబాల వాళ్ళం మేమందరం, సుమారు ఓ పాతిక మందిమి పోలో మంటూ రిక్షాలు కట్టించుకుని సుల్తాన్ బజార్ దాపుల్లో, హనుమాన్  వ్యాయామ శాలకు దగ్గర్లో, కందస్వామి లేన్ లో ఉన్న రాయల్ టాకీసుకి  వెళ్ళాము. (ఈ హాలు [...]
“అన్ని సినిమాలు ఇలానే చూస్తుంటారా మీరు?”“అబ్బే అలా ఎలా చూస్తానండి. నా అభిమాన హీరో ఉంటేనే మొట్ట మొదటి ఆటకు వెడతాను”“అంటే మీ ఫేవరెట్ హీరో లేకపోతె ఆ సినిమా చూడరా!”“నాకునచ్చిన హీరోయిన్ వుంటే హీరో గురించి పట్టించుకోను. అలాగే, మంచి దర్శకుడు వుంటే హీరో, హీరోయిన్లు నచ్చకపోయినా చూస్తాను. ఒక్కోసారి కధ నచ్చితే ఈ ఫేవరెట్ల సంగతి పక్కన పెట్టి ఆ సినిమాకి వెడతాను”“నాకర్ధం అయింది [...]
ఆర్బీఐ  గవర్నరుగా పనిచేసిన వ్యక్తికి అప్పివ్వడం మామూలు వ్యవహారమా!  ఆర్వీవీ నేను రేడియోలో చాలాకాలం కలిసి పనిచేసాము. ఆయనిప్పుడు బహుముఖ వ్యాపకాలు పెట్టుకుని నెగ్గుకు వస్తున్నారు. వాటిల్లో ఒకటి భారత్ టుడే టీవీ సీఈఓ.  ఆయన చెప్పిన కధ కాని కధ ఇది.ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన దువ్వూరి సుబ్బారావు గారి పేరు వినని వారుండరు. రిజర్వ్  బ్యాంక్ గవర్నరుగా    చాలాకాలం [...]
చక్కటి మాట చెప్పాడు నిర్మల్ అక్కరాజు.నాకు ప్రతి గురువారం ఉదయం స్నేహ టీవీలో ఉభయం. అంటే ఆనాటి వార్తల మీద విశ్లేషణ. ఇది ప్రతి రోజూ ఉదయం తంతే కనుక మా ఆవిడ నాకు ‘వారాలబ్బాయి’ అనే నిక్  నేమ్ పెట్టింది.ఒకరోజు ప్రోగ్రాం అయిపోయి తిరిగొస్తున్నప్పుడు అతనన్న మాట ఇది.‘తలెత్తుకుని జీవిద్దాం’.(PHOTO COURTESY: IMAGE OWNER)ఈ మాట అంటూ అతడు చూపించిన వైపు దృష్టి సారించాను. రోడ్డు మీద కనబడ్డ వారందరి [...]
ఫోటోలో కుర్చీలో కూర్చున్నది ఎవరన్నది తెలంగాణాలో,  ఆమాటకి వస్తే హోల్ మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరయినా చెప్పేస్తారు, కే.వీ.రమణ అనో, రమణాచారి అనో. జగమెరిగిన మాజీ ఐ.ఏ.ఎస్. అధికారి ఆయన. ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వానికి సాంస్కృతిక సలహాదారు.అది సరే ఆయన ఎవరన్నది అందరికీ తెలుసు. మరి అక్కడ ఆ కుర్చీలో కూర్చుని టిక్కెట్లు అమ్ముతున్నట్టు కనిపిస్తోంది. ఆ సంగతి ఏమిటి?ఈ [...]
(PUBLISHED IN ANDHRAPRABHA TELANGANA EDITION ON 21-04-17,FRIDAY)కేసీఆర్ ఆలోచనా విధానమే విభిన్నం. పరిపాలనలో కావచ్చు, పార్టీ నడిపే తీరులో కావచ్చు ఆయనది ఒక అరుదయిన విలక్షణ శైలి. దీనికి తాజా ఉదాహరణ కొంపల్లి టీ.ఆర్ ఎస్ ప్లీనరీ సభాస్థలికి ప్రగతి ప్రాంగణంగా నామకరణం చేయడం. సాధారణంగా రాజకీయ పార్టీలు నిర్వహించే ఈ రకమైన వార్షిక సదస్సుల ప్రాంగణాలకు వ్యక్తుల పేర్లు పెడుతుండడం ఆనవాయితీ.   అందుకు భిన్నంగా ఈ సారి [...]
కింది అంకెలు అన్నీ ఏదో కార్పొరేట్ కాలేజీ ప్రకటన తాలూకు అనుకోకండి. మొన్న ఆంధ్రజ్యోతిలో నేను రాసిన ‘ఆ నాటి చంద్రబాబు’ అనే నా వ్యాసం చదివి నాకు ఫోను చేసిన వాళ్ళలో కొందరి మొబైల్ నెంబర్లు ఇవి.  మొదట చేసిన వారిలో కొందరి నెంబర్లు డిలిట్ చేయడం వల్ల ఇవే మిగిలాయి. దీపావళి నాడు కాల్చి పడేసిన టపాసుల్లో కొన్ని మరునాడు పేలినట్టు బుధవారం ఆంద్ర ప్రాంతం జ్యోతిలో వస్తే ఫోన్లు [...]
( ఏప్రిల్ 20 చంద్రబాబు జన్మదినం)(Published in AP Edition of ANDHRAJYOTHY daily today, Wednesday, 19-04-2017) సుమారు 40 సంవత్సరాల క్రితం, స్థానికులకు ఏమాత్రం పరిచయం లేని ఓ యువకుడు కాణిపాకం నుంచి నడక ప్రారంభించాడు. గడప గడప తొక్కాడు. ఇళ్ళలోని పెద్దలకు చేతులు జోడించి నమస్కరించాడు. యువకుల భుజం మీద చేతులేసి పలుకరించాడు. ఊరి సమస్యలను అడిగి తెలుసుకున్నాడు.రచ్చబండ్లమీద,  ఇళ్ళ అరుగుల మీద  సేద తీరాడు. స్తానిక [...]
గుండు చేయించుకున్న వాళ్లకు  తమ నెత్తి మీద జుట్టు లేదు అన్న స్పృహ ఎన్నడూ కలగదు. కానీ ఎదుటివారు ఆ తేడాను ఇట్టే పట్టేస్తారు. తేడా అయితే పడతారు కానీ మనిషిని అయితే గుర్తుపట్టలేరు. ఈ కారణంగానే  గుండూ రావులు ఎదుటి వారిని కనబడగానే  ‘హలో సుబ్బారావు బాగున్నావా’ అనేస్తుంటారు. గుండూరావును ఆ గుండుతో  పోల్చుకోలేని సుబ్బారావులు జుట్టు పీక్కుంటూ వుంటారు.ఈరోజు పార్కులో [...]
“పార్కుకు వెడదామా?” అంది మా ఆవిడ. “నలభయ్ ఏళ్ళు ఆలస్యం అయిందేమో!” అనబోయి తెలివి తెచ్చుకుని, ఆ మాట బయటకు అనకుండా నాలుక కిందే నొక్కిపట్టి  యాభయ్ ఏళ్ళ కాపురాన్ని కాపాడుకునే ప్రయత్నంలో పడ్డాను.   మొత్తం మీద మా జీవన యానంలో ‘తొలి నడక’, నా డెబ్బయ్యవ ఏట  బ్రహ్మానందరెడ్డి పార్కులో మొదలయింది. ‘మా నడక మా కాళ్ళ మీద మేము నడవడానికి తల ఒక్కింటికి పాతిక రూపాయల టిక్కెట్టా! ఔరా’ [...]
పూర్వం రేడియో సిలోన్ లో మీనాక్షి పొన్నుదొరై ఘంటసాల వోం, సుశీలా వోం అని తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడుతుంటుంటే  మా బామ్మగారు ఆమె తెలుగును  ఆటపట్టించేది. కానీ ఆమె వేసే తెలుగు పాటల్ని కోరుతూ వందల సంఖ్యలో శ్రోతలు ఉత్తరాలు రాసేవాళ్ళు.ఆ తరువాత చాలా ఏళ్ళకు నేను హైదరాబాదు రేడియోలో చేరిన తరువాత శ్రోతలు రాసే కార్డుల్ని బట్వాడా చేయడానికి తపాలా బంట్రోతులు (అనవచ్చా) [...]
(రైతులకు వచ్చే ఏడాది నుంచి ఎరువులు ఉచితంగా అందివ్వాలని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని మనసారా అభినందిస్తూ, ఈ అంశంపై రెండేళ్ళ నాడు రాసిన ఈ చిన్ని వ్యాసాన్ని మరోమారు పాఠకుల దృష్టికి తీసుకువస్తున్నాను) వారి వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు ఎన్ని ఉన్నప్పటికీ, ఈనాడు ప్రతి రాజకీయ పార్టీ రైతుల గురించే మాట్లాడుతున్నది. వాళ్ళు విడిగా అయినా కలివిడిగా [...]
సాధారణంగా టీవీ చర్చల్లో వ్యక్తుల పేర్లు రాకుండా చూసుకోవడం నాకు అలవాటు. ఈరోజు టీవీ- 5, చర్చలో చాణక్యుడు, కృష్ణ దేవరాయల ప్రసక్తి వస్తే, అచ్చం ఇలాగే కాదు కాని మొత్తం మీద నేను చెప్పిన మాటలు ఇవి. పొద్దుటి కార్యక్రమం గురించి ఇప్పుడే ఒక పెద్ద మనిషి విజయనగరం జిల్లానుంచి ఫోను చేసి బాగుందని అన్నప్పుడు ఆ విషయాలు నలుగురితో పంచుకోవాలని ఈ పోస్టు. అంతే!‘దుర్బలస్య బలం రాజ’ అంటాడు [...]
ప్రజాప్రతినిధులు, వారికి ఇవ్వాల్సిన మర్యాదలు (ప్రోటోకాల్) గురించి చర్చ జరుగుతోంది. పేరుకు ముందు గౌరవనీయులు అనే పదం విధిగా తగిలించాల్సిన వారిలో కొందరి దురుసు ప్రవర్తన కూడా పతాక శీర్షికలకు ఎక్కుతోంది. ఈ నేపధ్యంలో ఓ ముప్పయ్యేళ్ళ నాటి జ్ఞాపకం మనసులో కదలాడింది.అప్పుడు నేను మాస్కోలో రేడియో మాస్కోలో పనిచేస్తూ ఉండేవాడిని. ప్రతి ఫ్లోర్ లో ఉద్యోగులకోసం క్యాంటీన్లు [...]
ముఖ్యమంత్రులను, సీనియర్ అధికారులను విలేకరుల సమావేశాల్లో  కొందరు ప్రశ్నించే తీరుతెన్నులు గమనించిన తరువాత ప్రశ్నలు అడిగే  పద్దతికే నేను స్వస్తి చెప్పాను. కీర్తిశేషులు హిందూ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ గా పనిచేసిన రాజేంద్రప్రసాద్ గారి నుంచి నేను నేర్చుకున్న పాఠం ఇది. ఆయన ఒకసారి నాతో  అన్నారు, ‘ఒక తమాషా చూశారా.  ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నవారినీ, వారు అడిగే [...]
“ఇవ్వాళ  ఆంధ్రజ్యోతి చదివిన తరువాత కేసీఆర్ పట్ల నాకున్న దురభిప్రాయాలు పూర్తిగా తొలగిపోయాయి”హైదరాబాదులో సెటిలయిన ఒక తెలుగు మిత్రుడు పండగ రోజు పొద్దున్నే ఫోను చేసి చెప్పిన మాట ఇది.ఆయన ఇంకా ఇలా అన్నారు.“ఉద్యమం రోజుల్లో ఒక పార్టీ నాయకుడిగా ఆయన మాట్లాడిన మాటలు విని జీర్ణించుకోలేనంత కోపం పెంచుకున్న వాళ్ళలో నేనూ ఒకడ్ని. అయితేనేం పాలకుడిగా కేసీఆర్ కు నేను నూటికి [...]
ముగ్గురు మిత్రులు – సరస్వతి రమ  (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)నలభయి ఏళ్ళ తర్వాత కలుసుకున్న ముగ్గురు మిత్రులు గురించిన ఆంధ్రజ్యోతి కధనం. ఇందులో ఒకరు మన ఫేస్ బుక్ మిత్రుడు వేమవరపు భీమేశ్వర రావు కాగా రెండో వ్యక్తి తుర్లపాటి వెంకట సాంబశివరావు. అతడూ ఫేస్ బుక్ లో వున్నాడు. మూడో మనిషిని నేనే కనుక నా  గురించి చెప్పక్కరలేదు. మా ఇంట్లోనే జరిగింది ఈ అపూర్వ కలయిక. కాకపొతే, 2009 [...]
  ఇంచుమించుగా యాభయ్ ఏళ్ళ కిందటి సంగతి. గుంటూరు జిల్లా రేపల్లెలో ఎం కాం చదివిన ఓ కుర్రాడికి ఉద్యోగ నిమిత్తం ఒక గెజిటెడ్ అధికారి సంతకం కావాల్సి వచ్చింది. వాళ్ళ ఇంట్లోనే ఒక వాటాలో తహసీల్దార్ అద్దెకు ఉంటున్నాడు. కుర్రాడి అన్నయ్య విషయం చెబితే, ‘దానిదేముంది ఆఫీసుకు పంప’మన్నాడు. ఆ తహసీల్దార్ రోజూ ఆఫీసుకు వెళ్ళే తీరు ఆ కుర్రాడికి చూడ ముచ్చటగా వుండేది. ఓ బిళ్ళ బంట్రోతు ఓ [...]
చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రోజులు. హైదరాబాదులో ఎర్రమంజిల్ కాలనీ నుంచి జూబిలీ హాల్ కు బయలుదేరాను. అసెంబ్లీ సమావేశాలకు ముందు స్పీకర్ సంప్రదాయంగా ఇచ్చే అల్పాహార విందుకు వెళ్ళాలి. రోడ్డు దాటి అవతల వైపు వెళ్ళి ఆటో పట్టుకోవాలి. ఇవతల ఎక్కుదామంటే ఒక్కడూ రాకపోగా సనత్ నగర్ అయితే తీసుకుపోతా అంటాడు. వాళ్ళతో పనికాదనుకుని సగం రోడ్డు దాటాను. ఇంతలో [...]
One old story:"అపార్టుమెంటు జీవితాల్లో మనుషుల్ని కలిపేది విడతీసేది లిఫ్టే. ఈ వాస్తవం మా లిఫ్ట్ పుణ్యమా అని మా ఎరుకలోకి వచ్చింది.మా మధుబన్ అపార్టుమెంటులో లిఫ్ట్ చెడిపోయింది. ఇది పెద్ద వార్తేమీ కాదు. కాకపోతే అది చెడిపోయి మూడు నెలలు దాటిపోయింది. రిపేరు ఖర్చు పెద్ద మొత్తం కావడంతో చాలా రోజులు సంక్షేపించారు. మొదటి రెండు అంతస్తుల్లో వుండేవాళ్ళు మాకు లిఫ్ట్ అవసరమే లేదు [...]
ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేక మహామహులే గింగిరాలు తిరిగిపోయారు. ఫేస్ బుక్ లో చాలామంది పర్సనల్ మెసేజ్ లు పెడుతుంటారు, మీరెవరు, ఏమిటి మీ కధాకమామిషు అని. ఎంతైనా సొంత డబ్బా కాస్త కష్టం కదా! అందుకని ఎప్పుడో రేడియో స్వర్ణోత్సవాల సమయంలో నా గురు పత్నీ పుత్రిక అనగా తురగా కృష్ణమోహనరావుగారి సతీమణి తురగా జానకీ రాణి తనయ, నా రేడియో రోజుల సహోద్యోగి తురగా ఉషారమణి నా గురించి రాసిన ఈ ఆంగ్ల [...]
“సర్లెండి, మీకు ఉదయం తిన్న కూరే గుర్తుండదు, ఇక మనుషుల్ని ఎక్కడ గుర్తు పడతారు’ అంటుంది మా ఆవిడ.ఇంటిలిఫ్టులో ఒక పెద్ద మనిషి తారస పడ్డాడు. నన్ను చూసి పలకరింపుగా నవ్వాడు. నేనూ బదులుగా చిరునవ్వు నవ్వి ‘ఎవరింటికండీ’ అన్నాను. ఆయన గతుక్కుమన్నట్టు అనిపించింది. తరువాత చెప్పింది మా ఆవిడ, ఆయన మా పక్క అపార్టుమెంటు ఓనరని. ఇళ్ళల్లో సంగతి ఏమో కాని, ఆఫీసుల్లో ప్రత్యేకించి టీం వర్కు [...]
ఆయన తన కాలంలో పెద్ద స్టంట్ హీరో. ఒంటి చేత్తో పాతికమంది రౌడీలను మట్టికరిపించే దృశ్యాలను చూస్తూ ప్రేక్షకులు వేసే ఈలలతో, చేసే కరతాళ ధ్వనులతో సినిమా హాళ్ళు మారుమోగి పోయేవి. కొన్నాళ్ళకు ఆయన రిటైర్ అయ్యాడు. కొడుకు హీరో అయ్యాడు. స్టంట్ సీన్లలో తండ్రిని మించి పోయాడు. ఒకసారి ఆ పెద్దాయన కొడుకు నటించిన చిత్రం చూడడానికి థియేటర్ కు వెళ్ళాడు. కొడుకు చేస్తున్న స్టంట్ సీన్లు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు