జైశ్రీరామ్.17) పెద్దవారిఁ గనుచు పిల్లలు నడుతురు  -  మంచి చెడ్డ లనున వెంచకుండ.    మంచి త్రోవ నడిచి మము నడిపించుడు.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! పెద్దవాళ్ళను గమనిస్తూ, వారి ప్రవర్తనా సరళినే మేమూ అనుసరిస్తాము. అందలి మంచిచెడ్డలను మేము పరిగణింపఁ జాలముకదా. అందుచేత మీరు మంచి మార్గంలో నడుస్తూ మమ్మల్నీ నడిపించండి.జైహింద్.
జైశ్రీరామ్.16) నవత భ్రాంతిలోన నడయాడుచును మీరు  -  పిల్లల విడుటేల? ప్రేమ లేదొ?    భవిత మాది. మదిని పట్టించుకొనరేల?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! నవ జీవన భ్రాంతిలో మీరు జీవిస్తూ, పిల్లలను అశ్రద్ధతో అక్కడా ఇక్కడా ఇతరులకు అప్పిచెప్పి విడిచి పెట్టుట యెందులకు? మాపై మీకు ప్రేమ లేదా? మా భవిష్యత్తును గురించి ఆలోచించుతున్నారా? మీరే [...]
జైశ్రీరామ్.15) శ్రద్ధఁ గొలిపి భవిత నర్థవంతము చేయు  -  భవ్యమూర్తి తండ్రి బ్రహ్మ మాకు.    నవత మరిగి మమ్ము నడిపించ మరచిరే !  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మాలో శ్రద్ధ కలిగించి, మా జీవితాలను అర్థవంతంగా తీర్చిదిద్దే తండ్రి మాకు బ్రహ్మయే. అట్టి తండ్రి ఈ నాడు ఆధునిక జీవన సరళిలో మమ్ములను పట్టించుకోవడం లేదుకదా! ఇది ధర్మమేనా?జైహింద్.
 జైశ్రీరామ్.ఆర్యులారా! శ్రీ హరి వీయస్సెన్ మూర్తి గారువ్రాసిన గవాక్షబంధ కందము తిలకించండి.శ్రీ హరి వీయస్సెన్ మూర్తిమాన్యులు కవివర్యులు శ్రీ చింతా రామకృష్ణారావుగారు ఈరోజు పరిచయము చేసిన రచనను చూచూటవలన కలిగిన స్ఫూర్తితో చేసిన ప్రయత్నము.వారికి నమశ్శతములు.సత్యత్యక్తుం డగునానిత్యము కరిరాట్ప్రసాదు నిర్మల దయతోభృత్యుడు నౌనా ప్రణతిన్సత్యైశ్వర్యాహరుండు శౌరీ [...]
జైశ్రీరామ్.14) తిట్టుచుంద్రు మమ్ము కొట్టుచు నుందురు    -  పెంచి పెద్ద చేయు పెద్ద మీరు     మమ్ము మీరు తిట్ట మాటాడ లేముగా!    -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు మమ్మల్ని అవసరంగాను, ఒక్కొక్కప్పుడు అనవసరంగాను కొట్టుతూ తిట్టుతూ ఉంటారు. మమ్మల్ని పోషించి, పెంచే పెద్దవారు మీరు తిట్టితే మిమ్మల్ని మేము ఏమి అనఁగలము [...]
జైశ్రీరామ్.13) శ్రవణ పుటములందు చప్పుళ్ళు పడుచుండ  -  చదువుచున్నఁగాని మదికి పోదు.    చదువుచున్న మాకు సహకరింపరదేల?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము చదువుకొనే సమయంలో మీరు అవసరమున్నవాటిని గూర్చి, అవసరము లేనివాటిని గూర్చి మాటాడుకొంటూ ఏవేవో చప్పుళ్ళు చేస్తుంటారు. మా ఏకాగ్రతకు భంగం వాటిల్లుతోంది కదా? మాకు మీరు చదువుకొనేటందుకు [...]
జైశ్రీరామ్.12) దూర దర్శనమున దుర్భర ఘన శబ్ద  -  కలుషమునకు మనసు కలత చెందు.    శబ్దమెక్కువున్న చదువుట సాధ్యమా?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు దూరదర్శనములో చూచే కార్యక్రమాలు స్వరమునధికము చేసి వినుచున్న కారణముగా దుర్భరమైన ఆధ్వని కాలుష్యమునకు మా మనసు కలత చెందుతుంది కదా? అంత శబ్దములో చదువుట మాకు సాధ్యమగునా?జైహింద్.
జైశ్రీరామ్.11) దూర దర్శనమును మీరు చూచుచు మమ్ము - మెదలకుండ చదువు చదువుమనిన   మనసు నిలుచునెటుల? మాకది సాధ్యమా?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు దూరదర్శన యంత్రము ద్వారా కార్యక్రమములను చూస్తూ, మమ్మల్ని కదలకుండా మెదలకుండా చదవమంటారు. మీరు చూస్తున్న కార్యక్రమాలు అక్కడే ఉంటున్న మేము చూడకుండా, ఆశబ్దము వినకుండా మమ్ములను మేము ఎలా [...]
జైశ్రీరామ్.10) చదువుకొనెడి వేళ చదువుకోనీయక  -  పనులు చెప్పి మమ్ము పంపు మీరు    చదువు వెనుకఁబడిన, చవటగా చూతురా?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము చదువుకొనవలసిన సమయంలో చదువుకోనీకుండా ఏవో పనులు మాకు చెప్పి మా చదువుకు ఆటంకము కలిగిస్తారు. ఆ కారణముగా మేము చదువులో వెనుకబడుసరికి మేము పనికిరాని చవటలమన్నట్లుగా మీరు చూస్తారు. [...]
జైశ్రీరామ్.9) మాకు నచ్చు విద్య మమ్మెంచుకోనీక  -  మీకు నచ్చుదాని మాకు పులుమ    మాకు రాకపోవు. మాదోషమాయది?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా!మాకు నచ్చిన చదువును మమ్ములనెంచుకోనీకుండా మీకు నచ్చిన విద్యను మాచే బలవంతముగా నేర్పింతురు., ఆ విద్య మాకు రాక పోతే అది మా తప్పా?జైహింద్.
జైశ్రీరామ్.8) తోటివారితోడ సాటిగా మముఁ జేయ  -  నబ్బనట్టి విద్య నరయఁ జేసి,    ఫలము దక్కకున్న పనికిరామనుదురా?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీ తోటివారి పిల్లలను చూచి వారితో మమ్ములను పోల్చుకొంటూ మమ్మల్ని కూడా వారిలాగా చేయడం కోసం మా కు అబ్బనట్టి విద్యను బలవంతముగా నేర్పు చున్నారు. అది మాకు అబ్బక, మీరు కోరుకొన్న ఫలితము [...]
జైశ్రీరామ్.7) పలక చేతికిచ్చి పద్యాలు వ్రాయించి  -  పలుకునటులఁ జేయ పలుకఁ గలము.   పద్యమొక్కటైన పలుక నేర్పరదేల?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మా చేతికి రాతి పలక వ్రాసుకొనుటకు ఇచ్చి, మా చేత పద్యాలు మీరు వ్రాయించి చదువునట్లు చేసినచో మేము ఆ పద్యములు చెప్పఁగలము కదా. మీరు చక్కని తెలుఁగుపద్య మొక్కటైనా మాకు నేర్పరెందులకు?జైహింద్.
జైశ్రీరామ్.6) అక్షరాలునేర్పి యవధులు కనఁ జేయ   -  శ్రద్ధతోడ మేము చదివి, కనమె?    బొమ్మ చూపి చదువు రమ్మన్న వచ్చునా?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మాకు మీరు సక్రమముగా వర్ణమాల నేర్పి, మంచి చెడ్డలను చూపినచో మేము శ్రద్ధతో చదువుకొని, మీరు చెప్పినవి గ్రహింపలేమా? బొమ్మలు చూపించుతూ చదువు చెప్పుచున్నచో మాకు ఏవిధంగా చదువు [...]
జైశ్రీరామ్.5) నేర్వవలసినపుడు నేర్పక మమ్ముల  -  నేర్పు లేదటంచు నింద చేసి    పదుగురు విన మమ్ము వదరుచుందు రదేల?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! ఏది ఎప్పుడు నేర్పాలో అప్పుడు నేర్పక ఆ తరువాత మేము ఆ విషయములను నేర్చుకోలేదంటూ పదిమందిలోనూ అవమానపరుస్తూ మాటాదురుకదా! అది సరియగు పనియేనా?జైహింద్.
జైశ్రీరామ్.4) ముద్దు చేసి మాకు హద్దులు నేర్పరు.  -  హద్దు మీర మమ్ము గ్రుద్దుదురయ.    హద్దు లెల్ల నేర్ప శ్రద్ధగా నేర్వమా?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు మమ్ము గారము చేసి, ఏది చేయ వచ్చునో ఏది చెయ్య కూడదో అనే వాటికి సంబంధించిన హద్దులు చెప్పరు. తెలియక పోవుటవలన మేము హద్దులు దాటినచో మమ్ములను దండింతురు. మీరు మాకు ఆ విషయములను [...]
జైశ్రీరామ్.19) తల్లిదండ్రులందు దండిఁగా దొరికెడి   -  ప్రేమ మధువుఁ గ్రోలఁ బ్రీతి మాకు.     పిల్లల విడనాడు పెద్దలు పెద్దలా?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! తల్లి దండ్రులలో సమృద్ధముగా లభించెడి అకళంకమైన ప్రేమ అనే అమృతము సేవించుట యనిన మాకెంతయో ప్రీతి.. అట్టి తల్లిదండ్రుల ప్రేమను కోరుకొనే పిల్లల్ని విడిచిపెట్టే పెద్దలు పెద్దలా? [...]
జైశ్రీరామ్.3) మదిని నిలుప లేక మన్నింప వేడుచు  -  తెలుపుచుంటిమయ్య తెలియుఁడయ్య    మనసు కలత పెట్టు మా బాధలన్నియు  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మా మనసులను కలత పెట్టుచున్న మాకు బాధగా అనిపించుచున్న విషయములను మనసులో దాచుకొన లేక మీకు తెలియ జెప్పు చున్నాము. అవి మీరు తెలుసుకొన కోరుచున్నాము.జైహింద్.
జైశ్రీరామ్.బాల భావన.(  నీతి శతకము )రచన: చింతా రామ కృష్ణా రావు1) శ్రీశు మదిని నిలిపి ‘ప్రేమగా మము చూచి  -  కావుమా’ యని  మది కరఁగ వేడి,   పెద్దలైన మిమ్ము ప్రీతితో కొలుతుము   -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. శ్రీమత్ జ్ఞాన సుసంపన్నులైన ఓ పెద్దలారా! శ్రీమన్నారాయణుని మా మదిలో నిలిపి ప్రేమగా మమ్ములను చూచి కాపాడుమా యని అతని మనసు కరిగే విధముగా ప్రార్థించి, పెద్దలైన [...]
జైశ్రీరామ్.                                                          పురము హితమును కోరెడు పుణ్యమూర్తిమనకు మాధవునకు గూర్చు మధ్యవర్తి సకల వైదిక కర్మల చక్రవర్తిమన పురోహితు మన్నించ మనకు కీర్తి.రచన.శ్రీ మిస్సన్న.నా స్పందన.అతులిత భావనా గరిమ నద్భుత రీతిని మీరు సత్ పురోహితుని వచించినారలు? మహేంద్రునికైనను పూజనీయుడీక్షితిని పురోహితుండు. పరికించగ మీ [...]
 జైశ్రీరామ్.విభూతి, హంసయాన(తూణకము,సుగంధి),పంచచామర,సుగంధి**గర్భ శ్రీగంధినీ వృత్తముశ్రీ శివాని సత్కృపన్‌ బ్రసిద్ధిఁ జెంద వింతయా ధరన్‌ సుభక్తితోశ్రీ శివాని పల్కునే వచించి చిత్రమౌగతిన్‌ సదా ప్రమోదమైశ్రీ శివాఖ్యుడెంచఁగా రచించి శ్రీకరమ్ముగాఁ గృతుల్‌ సుఖమ్ముగాశ్రీ శివానికిత్తు జేల్‌ విశిష్ట సిద్ధి దాత్రి గావునన్‌ నిజమ్ముగావిభూతి (చామరము )శ్రీ శివాని [...]
జైశ్రీరామ్.స్వస్తిశ్రీ చాంద్రమాన హేవళంబి నామ సంవత్సర ఉగాది ఆగమన సందర్భంగా చందానగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయప్రాంగణములో 27-3-2017 న సాయంత్రం 5 గంటలనుండి కవి సమ్మేళనము నిర్వహింపఁబడుచున్నది. కవిపుంగవులయిన మీకు ఇదే మా ఆహ్వానం. పాల్గొనదలచినవారు తమ పేరు, చిఱునామా, సెల్ నెంబరు, తమ mail TD, తాము కవిసమ్మేళనములో పఠించఁబోవు కవిత chinta.vijaya123@gmail.com కు [...]
జై శ్రీరామ్. చక్రబంధ అగ్ని సూక్తమ్.ఋగ్వేదే ప్రథమం మండలమ్ - ప్రథమోஉష్టకః - ప్రథమోஉధ్యాయః అనువాకః -1 , సూక్తమ్ - 1 ఋషిః-మధుచ్ఛందా వైశ్వామిత్రః   దేవతా : అగ్నిః,   ఛన్దః  గాయత్రీ ౧. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజమ్ | హోతారం రత్నధాతమమ్ ||ప్రతిపదార్థము.  అగ్నిం = అగ్నిని; పురోహితం = పురోహితుడిని; యజ్ఞస్యదేవం = (జీవన) యజ్ఞాన్ని [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు