దానవీర శూరకర్ణలోని చిత్రం భళారే విచిత్రం ఈ పాట నిజంగా చిత్ర మే.. సుయోధన సార్వభౌముడికి డ్యూయె ట్ పెట్టాలనే ఆలోచనే ఓ చిత్రం. సి.నారాయణరెడ్డి ఆ పాటను అద్భుతంగా రాస్తే ప్రభ ఆ పాటలో అంతకుముందు ఏ సిని మాలోనూ కనిపించనంత అందంగా కనిపిస్తుంది. చిత్రమైన పాట ఉన్న ఈ సినిమా ప్యారడైజ్‌లో బాగా నడిచింది. ఆ సినిమా హాల్ చరిత్ర ఇంతకన్నా చిత్రమైనది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ఏ [...]
‘‘మీఅన్నయ్య వచ్చాడు. నాకోసం చేసిన ఉప్మాను మీ అన్నయ్యకు పెట్టు’’‘‘ఇప్పుడే తిని వచ్చాను. ఉప్మా వద్దు చెల్లెమ్మా’’‘‘అర్జునా తిండి అన్నాక ఆలూ బిర్యానీ ఉంటుంది. ఉప్మా ఉంటుంది. ఆలూ బిర్యానీ అనగానే పొంగి పోవడం, ఉప్మా అనగానే ఢీలా పడిపోడం ధీరుల లక్షణం కాదు .  టమాటా రైస్‌కు, టమాటా బాత్‌కు ఒకేలా స్పందించడమే స్థిత ప్రజ్ఞత. ’’‘‘ఉప్మాపై నేనెవరి మనోభావాలను గాయపరచను. ఆ సంగతి [...]
ఘంటసాల మరణం .పాకిస్థాన్ తో యుద్ధం-బాంగ్లాదేశ్ ఆవిర్భావం ప్రభుత్వ పాఠశాల లో రుచికరమైన చిక్కటి పాలు .. చింత చెట్టు నుంచి రాలిపడే చింతకాయలు  . బడిపంతులు -అంజలి శ్రీదేవి , జయమాలిని జగన్ మోహినీ ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం  లేదు . కానీ గాంధీనగర్ లోని బాలాజీ టాకీస్ అనగానే ఇవన్నీ ఒకదాని తరువాత ఒకటి గుర్తుకు వస్తాయి . *** మహా సౌధం కూలిపోయిన తరువాత అక్కడ ఆనవాళ్లు [...]
‘ఆ సణుగుడు ఏంటి? ఏం కావాలో స్పష్టంగా అడుగు?’’‘‘ఒకటి ఎక్స్‌ట్రా ఉంటే ఇస్తావేమోనని’’‘‘రెండు రోజులు అయితే నూతన సంవత్సరం నువ్వు దేనికోసం వచ్చావో తెలియనంత అమాయకుడినేం కాదు. స్పష్టంగా అడగమంటున్నాను?’’‘‘మనసు లాగుతోంది ... ఉండలేకపోతున్నాను.. ’’‘‘నువ్వు ఇంట్లో   గుమ్మడివి బయట దేవదాసులో అక్కినేనివి. ఇంకెంత కాలం ఈ డబుల్ రోల్. మేమంతా తాగుబోతులం . నువ్వేమో శ్రీరామ [...]
టాకీస్ 1నమో వేంకటేశ నమో తిరుమలేశా మహానందమాయే ఓ మహా దేవ దేవ.. ఎప్పుడు ఈ పాట విన్నా మనసు ప్రశాంతంగా మారుతుంది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలను కలిపేది/విడదీసేది ట్యాంక్‌బండ్ అంటారు. కానీ నిజానికి కల్పన టాకీస్ ఈ రెండు నగరాల మధ్య వార ధి. ఈ టాకీసు మొదటి గేటు హైదరాబాద్‌లో ఉంటే, రెండవ గేటు సికింద్రాబాద్ పరిధిలో ఉంటుంది. టాకీస్ గేటు సికింద్రాబాద్ పరిధిలో ఉంటే సినిమా [...]
‘‘ఏమోయ్ ఫాండురంగం అన్నయ్య వచ్చాడు. టీ తీసుకురా!’’‘‘నిన్న నీ కవిత చూశాను. నిజం చెప్పు నువ్వు ట్రెజరీలో పని చేస్తున్నావా? లేక ఇంటెలిజెన్స్ అధికారిగా మారువేషంలో ట్రెజరీలో ఉన్నావా?’’‘‘ఒక్క పైసా కూడా లంచం తీసుకోకుండా నీ బిల్లులన్నీ సాంక్షన్ చేస్తున్నందుకు నువ్వు నాకిచ్చే గౌరవం ఇదా? నీ చిన్నప్పటి తొలి ప్రేయసి విశాలాక్షి బిల్లులు కూడా నువ్వు చెప్పావని పైసా [...]
‘‘ఏంటా పరుగులు! లేడికి లేచిందే పరుగు అన్నట్టు అలా పరుగెత్తుతున్నావు, ఎక్కడికి?’’‘‘ఇంకెక్కడికి రాజధాని నగరానికి. నగరం మొత్తాన్ని ఓసారి తనివితీరా చూద్దామని?’’‘‘మంచిది నేను కూడా వస్తాను పద! ఇంతకూ నువ్వెవరు? నీ కథేంటో చెప్పు’’‘‘వినే ఓపికుంటే ఆత్మకథ మొత్తం చెబుతా విను’’.‘‘ఆత్మకథ అంటే భయమేస్తుంది. మహానటుడు ఎన్టీఆర్ జీవిత కథ విషాదంగా ముగియడానికి ఆత్మకథనే కారణం [...]
‘‘ఈ మధ్య నల్లపూసయ్యావు.. అసలు కన్పించడం లేదు’’‘‘ఎదురుగా చెట్టంత మనిషిని పెట్టుకొని కనిపిస్తలేవంటావేంటి?‘‘చాల్లే, నా ఉద్దేశం ఇప్పుడు కనిపించడం లేదని కాదు. ఈ మధ్య కనిపించలేదు’’‘‘ఓ అద్భుతమైన విషయంపై పరిశోధించేందుకు వెళ్లాను. తెలుగు సినిమా సక్సెస్ ఫార్ములా, భారత రాజకీయాల సక్సెస్ ఫార్ములాల తులనాత్మక అధ్యయనం చేశా!’’‘‘కాస్త తెలుగులో చెబుతావా?‘‘తెలుగు సినిమాల [...]
‘‘దిగులుగా కనిపిస్తున్నావు.. ఇవాంకా వెళ్లి పోయిందనా ? ఆమె  నీ మనసు మీద తీవ్రమైన ప్రభావం చూపినట్టు వుంది?’’‘‘నీలా నేను బానిసను కాదు స్వతంత్ర భారతదేశంలో పుట్టిన స్వతంత్ర పౌరుడిని..శ్వేత జాతి ఇవాంకా అంటే బానిసలా తోక ఊపుతా అనుకున్నావా?’’‘‘బానిస అనగానే గుర్తుకు వచ్చింది. నీ దగ్గరకు వస్తున్నాను అని చెబితే మీ బాస్ వాళ్ల ఆవిడ నిన్ను కూరగాయలు తెమ్మని సంచి ఇచ్చింది... [...]
మెట్రో ప్రారంభం హైదరాబాద్ చరిత్రలో ఓ కీలక మలుపు. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా సైకిళ్ళ జోరు కనిపించేది. ఇప్పుడు ఎక్కడ చూసినా మెట్రో జోరు. మెట్రోతో నగర స్వరూపమే మారిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో తెలంగాణపై అవకాశం ఉన్నంతవరకు వ్యతిరేక ప్రచారం సాగించారు. వ్యతిరేక ప్రచారానికి ఏ ఒక్క అంశాన్ని వదులకుండా చిత్తశుద్ధితో [...]
‘‘నిజం ఛెప్పండి.. ఎక్కడికి వెళుతున్నారు’’‘‘ఆఫీసు పనిమీద క్యాంపుకెళుతున్నాను డియర్. ఎప్పుడూ లేనిది ఈరోజు అలా అడుగుతున్నావేమిటి?’’‘‘నన్ను మభ్యపెట్టాలని చూడకండి. నిజంగా ఆఫీసు పనిమీద వెళుతుంటేబీరువాలో ఉన్న ఆ కొత్తముఖం పెట్టుకొని వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఆఫీసుకు వెళ్లేప్పుడు పెట్టుకుని వెళ్లే ఆ ఏడుపు ముఖంతోనే వెళ్లండి. లేదంటే మొన్న మా అయ్యవాళ్లు వచ్చినప్పుడు [...]
‘‘మా రోజులే వేరు. మా కాలంలో ఇంట్లోకి నాన్న వస్తున్నాడంటే గజగజ వణకిపోయేవాళ్లం. చిన్న తప్పు చేసినా తొడపాశం పెడతాడని భయపడేవాళ్లం. కలికాలం. ఈ రోజుల్లో తల్లిదండ్రులను పిల్లలు పేరుపెట్టి పిలుస్తున్నారు. మొన్న ఓ ఫంక్షన్‌లో వాయ్ పంకజ్ అని అమ్మాయి పిలుస్తుంటే ఎవరా అని విచారించా, వాళ్ల అమ్మాయి అట. ఏదో బాయ్‌ఫ్రెండ్‌ను పిలిచినట్లు ఆ పిలుపులేమిటి? మా కాలంలో స్కూల్‌లో టీచర్‌గా [...]
‘‘జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. జరిగినవాటిని జీర్ణం చేసుకోవాలి తప్పదు. ఇంత దిగులుగా ఎప్పుడూ కనిపించలేదు ఏమైంది?’’‘‘కొన్ని చూస్తుంటే బాధేస్తుంది. చెబితే వినరు ఏం చేస్తాం’’.‘‘ఇంతకూ దిగులెందుకో చెప్పనేలేదు’’.‘‘ఈ విశ్వం ఏమవుతుందా? అని ఆలోచిస్తుంటే భయం వేస్తుంటుంది’’.‘‘ఎంతైనా నువ్వు అదృష్టవంతుడివి’’.‘‘ భయం వేస్తుందంటే  అదృష్టవంతుడివి అంటావేం. నీకన్నీ [...]
‘‘డాక్టర్ మావాడి జబ్బుకు చికిత్స లేదంటారా?’’‘‘వైద్య శాస్త్రంలోనే ఇదో అంతు చిక్కని లక్షణం’’‘‘డాక్టర్ బ్లాక్ అండ్ వైట్‌లో అక్కినేని తొలి సినిమా నుంచి నిన్న మొన్న అల్లరి నరేష్ కామెడీ పారడీల వరకు ఎన్నో సినిమాల్లో డాక్టర్లు అచ్చం మీలానే అంతు చిక్కని జబ్బు అని చెప్పిన తరువాత కూడా సినిమా ముగింపులో జబ్బు నయమైంది డాక్టర్. అలానే మా పిల్లాడి జబ్బు కూడా నయం అవుతుందా? [...]
2005 లో వచ్చిన సమాచార హక్కు చట్టము pdf  ఇంగ్లీష్ లోనే కాకుండా  గుర్తింపు పొందిన భారతీయ భాషలు అన్నింటిలోనూ అందుబాటులో ఉంది .. ఆసక్తి ఉన్న వారి కోసం సమాచార హక్కు చట్టం 2005 తెలుగు pdf http://rti.gov.in/RTIACT_Telgu.pdf
RTI 1 చట్టం కొందరికి చుట్టం అంటుంటారు  .. కానీ చట్టం తన గురించి తెలిసిన అందరికీ చుట్టమే .. తెలియని బంధువుల దగ్గరకు వెళ్ళనట్టుగానే చట్టం గురించి తెలియక పోవడం వల్ల చాలా మంది దాన్ని దూరం పెడుతున్నారు కానీ చట్టం అందరికీ చుట్టమే ... చట్టం గురించి మనం తెలుసు కొక పోతే చట్టం నుంచి మనం ప్రయోజనం ఎలా పొందగలం ...  సామాన్యుడి చేతికి అత్యంత శక్తి వంతమైన ఆయుధం అందించిన సమాచార [...]
‘‘హలో వర్మగారేనా?’’‘‘ఔను భాబు నేను వర్మనే. నీ కోసమే ఎదురు చూస్తున్నాను. చెప్పు ఏంటి విషయం?’’‘‘నేను ఫోన్ చేస్తాను అని మీకెలా తెలుసు సార్! ఆశ్చర్యంగా ఉంది.’’‘‘హలో అంతగా ఆశ్చర్యపోకు నీ గురించే అంటే, నీ గురించే అని కాదు. ఎవరో ఒకరు ఫోన్ చేస్తే మాట్లాడదామని, రోజూ ఓ ఐదారుగురితో తిక్క తిక్కగా మాట్లాడందే నిద్ర రాదు. ఇప్పుడు నువ్వు దొరికావ్ ఏ చానల్?’’‘‘నేను చానల్ రిపోర్టర్‌ని [...]
‘‘ఆ హీరోయిన్‌ను మింగేసేట్టుగా చూడాల్సిన అవసరం లేదు’’‘‘నేను చూస్తున్నది హీరోయిన్‌ను కాదు. హీరోను. నీ కళ్లు ఆ హీరోయిన్ కట్టుకున్న చీరపై ఉన్నాయేమో నేను కూడా అదే చూస్తున్నట్టు నీకు అనిపిస్తోంది.’’‘‘బుకాయించకండి కళ్లు చిదంబరం ఎటు చూస్తున్నాడో కూడా చెప్పేంత చురుకైన చూపు నాది. హీరోవైపు చూస్తున్నారో, హీరోయిన్‌ను కొరికేసేట్టుగా చూస్తున్నారో ఆ మాత్రం గ్రహించలేను [...]
‘‘దేవుని సృష్టిలో ప్రతి ప్రాణికి ఓ ప్రత్యేకత ఉంటుంది.’’‘‘ఆ విషయం నీకు ఇప్పుడు తెలిసిందా?’’‘‘ఎప్పుడు తెలిసింది అని కాదు, ఎలా తెలిసింది అని అడుగు. బుద్ధునికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు ఆ దృశ్యం చూడగానే నాకిప్పుడు ఈ విషయం గుర్తుకు వచ్చింది.’’‘‘ఏమా విషయం? ఏమా జ్ఞానోదయం?’’‘‘భూమి  బల్లపరుపుగా వుంటుందని పతంజలి గోపాత్రునికి అనిపిస్తే పోలీసాయనకు తన లాఠీలా [...]
‘రామాయణం, మహాభారతం నుంచి నేనోటి గ్రహించాను’’‘‘ఏంటి ఇప్పుడు నువ్వా రామాయణ, మహాభారతాలు రాయడానికి సిద్ధమవుతున్నావా? ఇప్పటివరకు రాసినవి సరిపోలేదా?’’‘‘ఎంతమంది రాసినా ఎవరికోణం వారికి ఉంటుంది. ఇంతకూ వాటినుంచి నేనేం గ్రహించానో చెప్పనివ్వు’’‘‘రామాయణ కల్పవృక్షం నుంచి రామాయణ విషవృక్షం వరకు అందరూ అన్నీ చెప్పేశారు. ఇంక చెప్పడానికి నీకేం మిగలలేదు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి [...]
‘‘మీఏరియాలో ప్రజలకు ఉచితంగా వైద్యం చేసే డాక్టర్లు ఉన్నారా?’’‘‘అవసరం లేకున్నా గర్భాశయం తొలగించే వైద్యులున్నారు. అమృతాంజనం రాస్తే పోయే తలనొప్పికి కూడా లక్ష రూపాయల చికిత్స చేసే ఖరీదైన డాక్టర్లూ ఉన్నారు. కానీ పుట్టి బుద్ధెరిగిన తరువాత పేదలకు ఉచితంగా వైద్యం చేసే డాక్టర్‌ను చూడలేదు.’’‘‘నువ్వు చూడకపోతే ఉండరా? ’’‘‘గుడిసెలో ముసలమ్మ దగ్గినా బ్యాగ్ పట్టుకొచ్చి ఉచితంగా [...]
‘‘ఇప్పుడెంతో హాయిగా ఉంది. ఏమవుతుందో అనే టెన్షన్‌తో ఇన్నాళ్లూ బుర్ర వేడెక్కింది. ఇ ప్పుడు ఆకాశంలో పక్షిలా విహరిస్తున్నంత హాయిగా ఉంది’’‘‘దేనికి టెన్షన్? రైళ్లో వచ్చావా? పరీక్షలన్నాక తప్పే వాళ్లూ ఉంటారు. పట్టాలున్నదే తప్పడానికి, అసలు పట్టాలు తప్పినప్పుడే పట్టాలంటూ ఉంటాయని తెలిసేది. దానికి టెన్షన్ ఎందుకు?’’‘‘రైలు పట్టాలు తప్పితే ఆశ్చర్యపోయేంత అమాయకుడిలా [...]
‘‘ ఫ్యాన్స్ గురించి ఏమనుకుంటున్నావ్??’’‘‘నేను పర్యావరణ ప్రేమికుడిని.. ఏసీలు అస్సలు నాకు నచ్చవు. ఐ లైక్ ఫ్యాన్స్. నువ్వు కూడా ఏసీ వదిలేసి ఫ్యాన్‌ను నమ్ముకో’’‘‘ నేనడిగింది ఫ్యాన్స్.. అంటే సినీ అభిమానుల గురించి..’’‘‘జగన్ పార్టీ గుర్తు ఫ్యాన్ గురించా? నంద్యాలలో ఓడిపోయినంత మాత్రాన దిగులెందుకు? మనిషి లాంటి దేవుడు అని పూజలందుకుంటున్న ఎన్టీఆర్‌నే బోల్తా కొట్టించిన ‘గండర [...]
‘‘హాయ్ రాధా.. నీకు నిండా నూరేళ్లు.. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను.. ఇంతలోనే నువ్వు కాల్ చేశావు’’‘‘గోపీ.. నీకో అర్జంట్ విషయం చెప్పాలి. తొందరగా వచ్చేయ్!’’‘‘ బిజీగా ఉన్నాను రాధా.. ఫరవాలేదు. ఫోన్‌లోనే చెప్పేయ్ విషయం ఏంటో?’’‘‘నేను నెల తప్పాను గోపీ’’‘‘పోనీ రాధా వందేళ్లలో ఓ నెల తగ్గితే పెద్ద తేడా ఏముంటుంది? ఇంతోటి దానికి ఫోన్ చేసి చెప్పాలా?’’‘‘అబ్బా అది కాదండి.. నేను [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు