రాజకీయ ఛానెల్స్ వల్ల ఇదీ సమస్యరాజకీయ ప్రయోజనాలే ధ్యేయంగా ఛానెల్స్ నడిపితే....జర్నలిజం మంటగలిసి పోతుంది. దీనికి మంచి ఉదాహరణ కాంగ్రెస్ ఎం.పీ.జగన్ మోహన్ రెడ్డికి చెందిన 'సాక్షి' ఛానల్ కు, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ స్వీయ పర్యవేక్షణలో నడుస్తున్న 'స్టూడియో-ఎన్' కు మధ్య బుల్లితెర మీద నడుస్తున్న యుద్ధం.జగన్ ఇంద్రభవనం లాంటి ఇల్లు ఒకటి [...]
 ¨§ŒÕÊ ÅŒÊ NŸÄu-Jn-EE “æX«Õ æXª½ÕÊ „äCµ¢* ¦¢Cµ¢-ÍÜ¿Õ. ‚ ²Äª½Õ P†¾ßuœË Íçªáu NJ-ÍÜ¿Õ. ‚ „äÕœ¿¢ NŸÄu-ª½ÕnLo ÂíJ-NÅî ÂÃLa¢C, ¨ „äÕ²Ädª½Õ ®¾Ödœç¢šüqÂË Â¹éª¢{Õ ³ÄÂË-ÍÃaœ¿Õ..
ఇది ఈ రోజు 'ఈనాడు' పత్రికలో ప్రముఖ కార్టూనిస్టు శ్రీధర్ 'ఇదీ సంగతి' కింద ప్రచురించిన పాకెట్ కార్టూన్. రోశయ్య అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీధర్ ఈ కార్టూన్ వేశారు. కానీ...ఇదీ నాకు అభ్యంతరకరంగా తోచింది. కార్టూనిస్ట్ కు అన్ని అంశాల మీద చురకలు వేసే స్వేచ్ఛ ఉంటే ఉండవచ్చు గానీ...ఒక వయో వృద్ధుడి అనారోగ్యం మీద ఇలా కార్టూన్ వేయడం నాకు అస్సలు నచ్చలేదు. మీరేమంటారు?  ఇందులో [...]
ఈనాడు జర్నలిజం స్కూల్లో చదువుకున్న రోజుల నుంచి నేను నా ఆత్మీయ మిత్రులలో ఒకరిగా భావించే వ్యక్తి విజయకుమార్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఈనాడు విలేకరిగా జర్నలిస్టు జీవితం ఆరంభించిన విజయ్ ఇరవై రెండేళ్ళ కెరీర్ లో ఎన్నో ముఖ్యమైన వార్తలు కవర్ చేశారు. తను  ప్రస్తుతం HM-TV లో చీఫ్ కాపీ ఎడిటర్ గా పనిచేస్తున్నాడు. తను తన బ్లాగు (http://journomucchatlu.blogspot.com/) లో వై.ఎస్.ఆర్.ప్రథమ వర్ధంతి [...]
ఎన్నడూ లేనిది ఈసారి ఈ ఈ-తెలుగు వారి వల్ల మాతృభాషా దినోత్సవానికి ఒక వారం పది రోజుల ముందు నుంచే మాతృభాష పై బెంగ మొదలయ్యింది నాకు. తెలుగు గురించి ఇంత తీవ్రంగా జన్మలో ఎప్పుడూ ఆలోచించలేదు.  నేనేమో ఇంగ్లిష్ మీడియం పిల్లలకు పాఠాలు చెబుతున్నాను. నా ఇద్దరు పిల్లలను స్కూల్లో చచ్చినా తెలుగు మాట్లాడవద్దని తరచూ చెబుతూ ఉంటాను. పదో తరగతి చదివే కూతురు గుణించుకోకుండా ఒక రెండు [...]
ఒక మిత్రుడు ఈ-తెలుగు వారు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఒక ముఖ్యమైన కార్యక్రమం గురించి ఈ మెయిల్ పంపారు. ఆదివారం ఈ నడకలో మీరు కూడా పాల్గొనాల్సిందిగా సూచన. అక్కడి ప్రోగ్రాం వివరాల కోసం వారు సూచించిన లింకులో ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.-రాము-------------------------------------------------------------- అగస్టు 29, తెలుగుభాషాదినోత్సవం రోజున తెలుగుభాషకోసం అందరం కలిసి నడుద్దాం. మీరు తప్పకరండి అందరికీ [...]
కబడ్డీ ఆటలో అటు ఏడుగురు ఇటు ఏడుగురు ఆటగాళ్ళు ఉంటారు. కూతకు వెళ్ళిన ఆటగాడిని ఏడుగురు--కలివిడిగా, విడివిడిగా-- ముందుగా కార్నర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వీలు చిక్కగానే కలిసి కుమ్మేస్తారు. కూతకు వెళ్ళినవాడు కుంటూకుంటూ పోవాల్సిందే.  ఈ మధ్యన తెలుగు ఛానెల్స్ లో ఈ 'కబడ్డీ జర్నలిజం' ఎక్కువయ్యింది. వార్తలలో, యాంకర్ అడిగే ప్రశ్నలలో, స్టూడియో చర్చలలో ఇది స్పష్టంగా [...]
'రాఖీ పండుగ స్పెషాలిటీ తెలుసా?' అని అడిగింది నా కూతురు మైత్రేయి...ఎలాగైనా ఈ రోజు ఏదో ఒక పోస్టు రాయాలని కూర్చోగానే. నేను పండుగ ఉద్భవానికి కారణాలు మదిలో వెతుకుతుండగా...అలగ్జాండర్-పురుషోత్తముడి కథ గుర్తుకు వచ్చింది. ఇంతలో ఆమే చెప్పింది.   "ఏమీ లేదు...ప్రతి రోజు ఆడపిల్లలు రోడ్డు మీద నడవడానికి భయపడతారు కానీ రాఖీ రోజు మాత్రం మొగపిల్లలు రోడ్డు మీద నడవడానికి [...]
నైజీరియా వాడి దగ్గర డ్రగ్స్ కొంటూ రవి తేజ సోదరులు దొరికారు. పోలీసుల కథనం ప్రకారం పేపర్లు, ఛానెల్స్ ఆ వివరాలు అందించాయి. బాగుంది. కానీ కొన్ని ఛానెల్స్ ఈ రోజు ఆ నైజీరియన్ దగ్గర దొరికిన ఫోన్ నంబర్స్ ఇవి అంటూ...ఉదయ్ కిరణ్, రాజా తదితరుల ఫోన్ నంబర్లు, ఫోటోలు వేసి నానా యాగీ చేసాయి. ఇది అత్యంత బాధ్యతాయుతమైన జర్నలిజం. ఒక గజదొంగ దగ్గర ఉండే డైరీ లో ఏదైనా ఛానెల్ హెడ్ ఫోన్ నంబర్ [...]
1940 ప్రాంతం లో Robert Maynard Hutchins అనే ఆయన వల్ల ప్రచారం పొందిన 'మీడియా సామాజిక బాధ్యత సిద్ధాంతం" ఎంతో  ముఖ్యమైనది. మీడియా పనితీరుకు ఇది గీటు రాయిగా ఉన్నది. ప్రెస్ బాధ్యత "Objective Reporting" మాత్రమే కాదని, "Interpretive Reporting" కూడా దాని బాధ్యత అని ఈ సిద్ధాంతం చెబుతుంది. అయితే...మీడియా సామాజిక బాధ్యత పేరు మీద కొన్ని పనులు చేస్తున్నది కానీ...ఈ సవాలక్ష ఛానెల్స్ పుట్టుకొచ్చాక జనాలకు మీడియా మీద విరక్తి [...]
శ్రీరాం చంద్ర విజయంతో తెలుగు జాతి పులకించింది. టీ వీ ఛానెల్స్ చాలా కోణాలలో దీనిపై కార్యక్రమాలు చేస్తున్నాయి. మా వల్ల ఎక్కువ ఎస్.ఎం.ఎస్.లు వచ్చాయంటే...మా వల్ల వచ్చాయి అని ఛానెల్స్ ఊదర కొడుతున్నాయి.  కిందటి పోస్టులో మా ఛానల్ చేసిన కృషి గురించి ఎందుకు రాయలేదు? ఆ పోస్టు చూస్తే నాకు ఒళ్ళు మండింది..... అని ఒక ప్రముఖ ఛానల్ లో న్యూస్ ఎడిటర్ గా ఉన్న ఒక మిత్రుడు గట్టి క్లాస్ [...]
తెలుగు ప్రజలను కర్తవ్యోన్ముఖులను చేసి మైనంపాటి శ్రీరామ చంద్ర కు అపూర్వ సత్కారం దక్కటానికి తెలుగు మీడియా చేసిన కృషి ప్రశంసనీయమైనది. అందుకు అన్ని చానల్స్ వారికి అభినందనలు. చానల్స్ ఈ మధ్య చేసిన పాజిటివ్ పనులలో ఇది చెప్పుకోదగ్గదిగా కనిపించింది. కీప్ ఇట్ అప్, బాసులూ.  నిన్న రాత్రి పనులన్నీ పక్కనపెట్టి 'సోనీ' వాడు పెట్టిన నరకాన్ని భరించి ఫైనల్ ఫలితం చూసి చాలా ఆనందం [...]
పంక్చువాలిటీ (సమయపాలన) అలవాటైతే చాలా సమస్యలు ఉంటాయి. ఒక్క ప్రెస్ మీట్ కు అయినా ఆలస్యంగా వెళ్ళకుండా జర్నలిస్టు జీవితం గడిపాను. ఇప్పుడు క్లాసుకు ఒక పది నిమిషాల ముందే వెళ్ళడం...లేటు గా వచ్చిన పీ.జీ.పిల్లలను లాస్ట్ వార్నింగ్ అని రోజూ క్షమించడం జరుగుతున్నాయి. జయప్రకాశ్ నారాయణ్ గారిని కలిసేందుకు పన్నెండున్నరకు రమ్మని వారి సిబ్బంది అపాయింట్మెంట్ ఇస్తే పదకొండున్నర [...]
జగన్ ఓదార్పు యాత్ర విషయంలో "ఒక కేంద్ర మంత్రి" ని ఉటంకిస్తూ ABN- ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రసారం చేసిన ఒక రాజకీయ వార్త ఈ సాయంత్రం సంచలనం సృష్టించింది. ఈ వార్తకు వ్యతిరేకంగా 'సాక్షి' ఛానల్ హడావుడి ఆరంభించడంతో...రాష్ట్రంలో రాజకీయ మురికి జర్నలిజం మరొక సారి జడలు విప్పినట్లయ్యింది.రాష్ట్రానికి చెందిన ఒక మంత్రి సోనియాతో సమావేశమయినట్లు, జగన్ యాత్రకు వెళ్ళవద్దని ఆమె తనతో అన్నట్లు, [...]
దేశంలో అగ్రశ్రేణి న్యూస్ నెట్ వర్క్ గా TV-9 దూసుకుపోతున్నది. గత నలభై ఐదు వారాల టాం గణాంకాలు దీన్ని నిరూపిస్తున్నట్లు ఆ ఛానల్ సీ.ఈ.ఓ. రవి ప్రకాష్ ఒక మెయిల్ లో తెలిపారు. స్టార్, జీ, ఎన్.డి-టీ.వీ. నెట్ వర్క్ లతో పోల్చినా TV-9 అగ్రస్థానంలో ఉన్నట్లు రవి పంపిన గ్రాఫ్ తెలియజేస్తున్నది. ఈ ఘనత సాధించినందుకు రవికి, ఆయన బృందానికి అభినందనలు. ప్రజా శ్రేయస్సు ధ్యేయంగా ఈ ఛానల్, దాని వైరి [...]
వార్తా కథనంలో నోటికొచ్చిన చెత్త రాయడం...'విశ్వసనీయ వర్గాలు' ఈ విషయం చెప్పాయని చివర్న తగిలించడం. తెలుగు జర్నలిజం లో ఈ తంతు రోజు రోజుకూ పెరిగి పోతున్నది. చివరకు టీ.వీ.స్క్రిప్టు లలో కూడా 'విశ్వసనీయ వర్గాలు' ఎక్కువ అయిపోయాయి. హైదరాబాద్ టైమ్స్ ఆఫ్ ఇండియా లో పెద్ద పొజిషన్ లో ఉన్న ఒక జర్నలిస్టు..."Highly reliable sources," "Highly placed sources" అన్న పదాలు లేకుండా  స్టోరీ రాయ లేకపోవడాన్ని నేను చాలా [...]
తెలుగు టెలివిజన్ జర్నలిజంలో అనతికాలంలోనే పేరు తెచ్చుకున్న జర్నలిస్టులలో సాయి (చుండూరి వెంకట సత్యనారాయణ) ఒకరు. సచివాలయం బీట్ చూస్తున్న తను TV-9 నుంచి ఉన్నట్టుండి జెమిని ఛానల్ లో చేరిన సందర్భంగా " TV-9 నుంచి సాయి నిష్క్రమణ...కారణం ఒక స్కాం?" అన్న పోస్టు రాసాము. తనను ఆ ఆరోపణ బాధించినట్లు  సాయి చెప్పారు. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నుంచి రామ్ నాథ్  గోయింకా అవార్డు [...]
బ్లాగులో కొన్ని చర్చలు భలే గమ్మత్తుగా, ఊహించని దిశ తీసుకుని రసవత్తరంగా సాగుతుంటాయి. సమాజానికి బాగా ఉపకరించే, చర్చకు పనికివచ్చే విశ్లేషణ చేస్తే స్పందించని వారు...ఆమ్మాయిలు, సెక్సు, రీ ప్రొడక్టివ్ హక్కులు...వంటి అంశాల విషయంలో చక్కగా స్పందిస్తారు. ఇలాంటి అంశాలపై రెండు వర్గాలుగా విడిపోయి కామెంట్ల యుద్ధం నడుస్తుంది. అలాగని వారిని తప్పుపట్టలేం. తాడేపల్లి గారి బాధాకరమైన [...]
నిన్న సాయంత్రం రవి ప్రకాష్ గారి ఛానల్ TV-1 లో ఒక క్రైం స్టోరీ చూస్తుంటే...Reproductive Rights, తాడేపల్లి గారు అప్రయత్నంగా గుర్తుకు వచ్చారు. ముందుగా ఆ కథనాన్ని వివరించి, ఆ తర్వాత నాకు అనిపించిన దాన్ని తెలియజేస్తాను. వాడొక తెలుగు దేశం పార్టీ నాయకుడు. పార్టీ లో ఏదో పదవి వుంది. పెళ్ళైన వాడే. వాళ్ళ భార్య ఎం.పీ.టీ.సీ.సభ్యురాలు కాగా అమ్మ సర్పంచు. అంటే...రాజకీయ అండదండలు కలవాడే. వాడికి మాటి [...]
వాడు అక్రమాలకు....వీడు అవినీతికి పాల్పడుతున్నాడని పత్రికా కార్యాలయాలలో కూర్చొని అద్భుతమైన పరిశోధనాత్మక వ్యాసాలు రాసే జర్నలిస్టు సార్లు తమ సొంత పనులకు లంచాలు ఇవ్వజూపడం దారుణం. పదవీచ్యుతురాలైన వైస్ చాన్సలర్ కుసుమ కుమారి, ఆమె భర్త భూమన్ రెడ్డి ఈ రోజు HM-TV స్టూడియో లో కూర్చొని అసలేమి జరుగుతున్నదీ వివరంగా చెప్పారు. యాంకర్ కిరణ్ చక్కగా నిర్వహించిన ఈ చర్చలో భూమన్ ఒక [...]
ఒక పధ్ధతి ప్రకారం బ్లాగు ఉండాలని, అది పదుగురికి ఉపకరిస్తే బాగుంటుందని అనుకునేవారిలో 'సాహిత్య అభిమాని' శివ గారు ఒకరని నేను నమ్ముతాను. రేడియో కళాకారులకు సంబంధించి ఆయన ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. దానిపై ఆయన బ్లాగులో రాసిన పోస్టును...విస్తృత ప్రచారం కల్పించాలన్న ఉద్దేశంతో దిగువ ఇస్తున్నాను. మీరు ఆ ప్రయత్నంలో పాలుపంచుకొంటే సంతోషం, ఉపయుక్తం.--రాము [...]
TV-9, N-TV లను నిషేధిస్తున్నట్లు తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీ చేసిన ప్రకటన అంత సబబుగా లేదు. ఆ ఛానెల్స్ స్టూడియోలకు వెళ్లకూడదని తెలంగాణా వాదులను ఆదేశించడం...చెరువు మీద అలిగి ఏదో చేసినట్లు అనిపిస్తున్నది. ఆ ఫత్వాను కాదన్న విజయశాంతి పై జే.ఏ.సీ.నేతలు టీ.ఆర్.ఎస్. పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు గారికి ఫిర్యాదు చేయడం, ఇక ముందు అలా చేయవద్దని ఆయన ఆమెను కోరడం ఎబ్బెట్టుగా [...]
మిత్రులారా...శుభోదయం....PhD నత్తనడకన సాగుతూ నన్ను వెక్కిరిస్తోంది. నిన్నటి నుంచి దాని మీద కసి పెరిగింది. ఇది తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం. ఇలాంటి కిక్ కోసం గత నాలుగేళ్ళుగా ఎదురుచూస్తున్నాను. ఇక ఒక్క రోజు కూడా వేస్ట్ కావడానికి వీల్లేదు. ఈ ఒత్తిడి కి తోడు...భుక్తిని ఇచ్చే జర్నలిజం టీచింగ్, తృప్తిని ఇచ్చే ఫిదెల్ టేబుల్ టెన్నిస్ కెరీర్ ప్లస్ మైత్రేయి ప్లాన్ చేసిన స్కూల్ [...]
'Z 24 గంటలు' ఈ రోజు ఒక ప్రయోగం లాంటిది చేసింది. ఇది నాకైతే చెత్త పోలిక అనిపించింది. మీకు సృజనాత్మకత అనిపిస్తే నాకు అభ్యంతరం లేదు. మెజారిటీ మీద మెజారిటీ సాధిస్తూ మరొక సారి సిద్ధిపేట ఉప ఎన్నికలో జయకేతనం ఎగురవేసిన  హరీష్ రావు ను టెండూల్కర్ తో పోలుస్తూ 'హరీష్ టెండూల్కర్' అనే శీర్షికతో ఒక స్టోరీ ప్రసారం చేసింది ఆ ఛానల్ ఈ సాయంత్రం. రాజకీయ వార్తల మధ్య టెండూల్కర్ బొమ్మ [...]
బెస్ట్, వరస్ట్ బాస్ ఎంపిక కోసం చేసిన అభిప్రాయసేకరణ గందరగోళానికి దారి తీసింది. శాస్త్రీయత లోపించిందని పలువురు మెయిల్ ద్వారా, ఫోన్ ద్వారా చెప్పిన మీదట...తుది ఫలితాలు చూసిన తర్వాత ఇవి ప్రకటించకపోవడం ఉత్తమమని అనిపించిందని తెలియజేయడానికి చింతిస్తున్నాను.నేను అనుకున్న సాంపిల్ సైజ్ కూడా రాలేదు. పైగా....ఈ ఆన్ లైన్ సర్వే నచ్చక పోవడం వల్ల కావచ్చు ఒక సోదరుడు/ సోదరి...వరస్ట్ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు