కొంతమంది ఓటు వేశాక, పోలింగ్ బూత్ లోపలే వేలు చూపిస్తూ ఫోటో దిగారు - సెల్ ఫోన్లకు అనుమతి లేదే, బహుశా వీళ్ళు రూల్స్ ని బ్రేక్ డాన్స్ చేయించేవాళ్లు అయిఉండచ్చు, లేదా నేనే ఫస్ట్ తాలూకూ బాపతు అయిఉండచ్చు, లేదా అత్యుత్సాహ అమాయక వీర విధేయులు అయివుండవచ్చు.😂ఇంకొంతమంది పోలింగ్ బూత్ నుండి బయటకొచ్చాక వెనకాల పోలింగ్ లొకేషన్ కనిపించేలా వేలెత్తారు - వీళ్ళ సెల్ ఫోన్లను లోపలికి [...]
 Bashu, the Little Stranger (1989) సినిమా ఇరాన్-ఇరాక్ యుద్ధం నేపథ్యంలో, యుద్ధం తాలూకు వినాశనం ఒక పసి హృదయం పై ఎంతటి ప్రభావం చూపిందో మనవీయ కోణంలో ఎండగడుతూ సాగుతుంది. ఒక పర్శియన్ సినిమా పత్రిక, విమర్శకులు & సినీ పండితుల మధ్య 1999లో నిర్వహించిన సర్వేలో “Best Iranian Film of all time” గా ఎన్నుకోబడింది ఈ చిత్రం. సినిమాలోని ప్రతి సన్నివేశం జరుగుతున్నప్పుడు & ఆ సన్నివేశం పూర్తయ్యాక ఆలోచించుకోవడానికి  మనకు [...]
Best Foreign Language Film కేటగిరిలో అకాడమీ అవార్డ్(2011)తో సహా మొత్తం 47 అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న సినిమా A Separation(2011). About Elly తరువాత Asghar Farhadi దర్శకత్వంలో వచ్చిన మరో ఆణిముత్యం ఈ చిత్రం. కథ: ఒక జంట విడాకులు కావాలని జడ్జ్ ముందుకు వాదనలు వినిపించేందుకు రావడంతో కథ మొదలవుతుంది. Simin తమ దేశం (Iran)ను భర్త, కూతురు(11ఏళ్ళు)తో వదిలి వేల్లాలనుకుంటుంది. కాని అందుకు ఆమె భర్త Nader అంగీకరించడు. కారణం అల్జీమర్ [...]
About Elly (2009) సైకలాజికల్ డ్రామా లో సాగే ఇరాన్ సినిమా. మధ్యతరగతి జీవితాల మానసిక స్థితిగతులపై అద్భుతంగా పరిశోధన చేసినట్టు ఉండే కథ, కథనం ఈ సినిమాకి ఆయువుపట్టు. సినిమాలా కాకుండా నిజంగా జరుగుతున్న భావనను మనలో రేకెత్తించిన దర్శకుడి (Asghar Farhadi) ప్రతిభకి బెర్లిన్ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో Silver Bear for Best Director అవార్డు దక్కింది. ఇతర అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో దాదాపు 10 అవార్డులని [...]
డిస్నీ వారి The Jungle Book (2016)  సినిమా అద్భుతం.. 1967లో వచ్చిన The Jungle Book సినిమాకి ఇది రిమేక్ అయినప్పటికీ కథ, స్క్రీన్ ప్లే తో పాటు మరికొన్ని కొన్ని తేడాలని గమనించాను.. అవేంటంటే..1) The Jungle Book (1967) : ఈ సినిమా “The Jungle Book” అనే టైటిల్ గల ఒక పుస్తకం తెరుచుకొని పేజీలు  తిరగేసినట్టు మొదలవుతుంది.The Jungle Book (2016) : ఈ సినిమా టైటిల్ సరాసరి జంగిల్ లోనే మొదలవుతుంది.2) TJB(1967): ఇక్కడ మోగ్లీ, భగీరా(బ్లాక్ పాంథర్)కి [...]
Midaq Alley 1995 (Spanish: El callejón de los milagros) మెక్సికన్ సినిమా. నోబెల్ బహుమతి గ్రహిత Naguib Mahfouz రచించిన అరబిక్ నవల Zuqāq al-Midaq 1947 (English Translation: Midaq Alley 1966) ఆధారంగా తీసిన ఈ సినిమాకి దర్శకులు Jorge Fons. దాదాపు 11 అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పాల్గొన్న ఈ సినిమా, 26 అవార్డులని సొంతం చేసుకుంది. మెక్సికోలో ఆస్కార్ అవార్డులా భావించే Ariel Awards లో 11 అవార్డులని సొంతం చేసుకుంది. IMDB.COM & Entertainment Weekly విడివిడిగా నిర్వహించిన సర్వేలలో [...]
ఇప్పుడే ‘ఊపిరి’(2016) మాతృక అయిన ‘ది ఇన్ టచబుల్స్’(2011) సినిమా చూశాను.. ఇది చాలా సెన్సిబుల్ సబ్జెక్టు.. పెన్ను టేబుల్ పై నుండి ఇచ్చినా, దాన్ని సహాయంగా గుర్తించి థాంక్స్ చెప్పుకొనే పాశ్చాత్య దేశాల్లో, అచేతనంగా పడి ఉన్న ఒక వ్యక్తికి, మరో వ్యక్తి అన్ని ‘రకాల’ సపర్యలు చేయడం అనేది చాలా గొప్పగా అనిపించే అంశం. అయితే భారతీయులకు ఇవన్నీ మామూలు విషయాలు. మన ఇంట్లోనో, మన చుట్టాల [...]
Strangers on a Train (1951) సినిమా దర్శకులు Alfred Hitchcock. ఈ సినిమాలో టెన్నిస్ క్రీడాకారుడైన Guy Haines(Farley Granger) కి రైలులో ప్రయాణిస్తున్నప్పుడు,అనుకోకుండా  Bruno Anthony (Robert Walker) అనే వ్యక్తి పరిచయమవుతాడు. మాటల మధ్యలో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న భార్యకు Guy Haines విడాకులు ఇవ్వాలనుకుంటున్న విషయం, ఆవిడ అందుకు ఒప్పుకోవట్లేదన్న విషయం, విడాకులు తీసుకున్న తరువాత సెనేటర్ కూతురిని చేసుకొని తద్వారా రాజకీయ భవిష్యత్తు [...]
కథ: పోలీస్ డిపార్టుమెంటు లో డిటెక్టివ్ గా పనిచేసే వ్యక్తి(Tomer Sisley), అతని సహోద్యోగి(Laurent Stocker )తో కలిసి కొకయిన్ తీసుకెళ్తున్న రాయబారుల మీద దాడి చేసి ఆ డ్రగ్స్ ని దొంగతనం చేసి దాచిపెడతారు. ఆ క్రమంలో అతనికి చిన్న గాయం కూడా అవుతుంది. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్టు ఆఫీస్ కి వెళ్తారు. అయితే ఆ డ్రగ్స్ తాలూకు డీలర్(Serge Riaboukine) & నైట్ క్లబ్ యజమాని కి అది వీళ్ళ పనే అని తెలిసి, అతని కొడుకు(Samy Seghir )ని తన [...]
జే.డి.చక్రవర్తి దర్శకత్వంలో వచ్చిన హోమం (2008) సినిమా, ఆస్కార్ అవార్డ్ పొందిన The Departed(2006) అనే హాలీవుడ్ సినిమాలోని కథ, కథనాల్ని ఉన్నదున్నట్టుగా వాడుకొని తీశారు. ఇద్దరు హీరోయిన్లతో ఉన్న ప్రేమ సన్నివేశాలని మాత్రం సృష్టించారు. ఈ సినిమాకి రచయితలు జే.డి.చక్రవర్తి (కథ,స్క్రీన్ ప్లే), కోన వెంకట్ (మాటలు).  తెలుగు సినిమా ఫార్ములా ప్రకారం హాస్య సన్నివేశాలు ఉండాలి కాబట్టి, [...]
శివ నాగేశ్వర రావు దర్శకత్వంలో వచ్చిన సిసింద్రి (1995) సినిమాకి కథ సూర్యదేవర రామ మోహన రావు అందించగా, మాటలు మరుదూరి రాజ అందించారు. ఈ Baby’s Day Out (1994) అనే సినిమాను నూటికి నూరు శాతం కాపీ కొట్టి తీసినప్పటికీ, క్రెడిట్స్ లో ఎక్కడా ఆ విషయం ప్రస్తావించకపోవడం విశేషం. అయితే తెలుగు ప్రేక్షకుల కోసం శివాజీరాజా, నాగార్జున పాత్రల్ని సృష్టించి కథలో స్వల్ప మార్పులు చేశారు. బాబు మోహన్, [...]
Dilwale Dulhaniya Le Jayenge (1995) సినిమాలోని మొదటి భాగాన్ని(విశ్రాంతి కన్నా ముందు భాగం) దాదాపుగా వంశీ(2000, October) సినిమాలో వాడుకున్నారు. వంశీ సినిమాకి సత్యానంద్, పరచూరి బ్రదర్స్ రచయితలు. ఈ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే ఫైట్లు Jet Li నటించిన Romeo Must Die(2000, March) & Tom Cruise నటించిన Mission Impossible 2 (2000, May) సినిమా నుండి ఉన్నదున్నట్టుగా వాడుకున్నారు. మొదటి భాగానికి, రెండవ భాగానికి సంబంధం లేకుండా కథ అతుకుల బొంతలా మారడం, మహేష్ [...]
మోసగాళ్ళకి మోసగాడు (1971) సినిమాకి అసలు మూలం The Good, the Bad and the Ugly (1966) అనే ఇటాలియన్ సినిమా. ఈ సినిమాలోని 75% కథని, సన్నివేశాల్ని, సంఘటనల్ని కాపీ కొట్టారు. కొన్ని సన్నివేశాల్ని For a Few Dollars More(1965), Mackenna’s Gold(1969) సినిమాల నుంచి తీసుకున్నారు. అయితే టైటిల్స్ లో ఎక్కడా ఈ సినిమాల ప్రస్తావన ఉండదు. హీరోయిన్ పాత్ర కోసం కొంత, తెలుగు నేటివిటీ కోసం మరికొంత కథని మార్చారు. ఈ సినిమాకి కథ, మాటలు అందించింది [...]
Alfred Hitchcock దర్శకత్వంలో వచ్చిన Vertigo (1958) సినిమాలోని ముఖ్యమైన కథాంశాన్ని మాత్రమే తీసుకొని, సన్నివేశాల్ని ఏ మాత్రం వాడుకోకుండా Bhagam Bhag (2006) సినిమా తీశారు దర్శకులు ప్రియదర్శన్. అయితే Bhagam Bhag సినిమా Siddique Lal దర్శకత్వంలో వచ్చిన Mannar Mathai Speaking(1995) మలయాళ సినిమాను స్పూర్తిగా తీసుకున్నారని చెప్పుకోబడ్డా, ఈ Mannar Mathai Speaking సినిమాకి కూడా మూలాధారం Vertigo
Life is Beautiful – 1997 ఇటాలియన్ ట్రాజిక్ కామెడీ సినిమాలోని ఫస్ట్ హాఫ్ లోని ప్రేమకథని, సన్నివేశాల్ని ఉన్నదున్నట్లు వాడేసుకొని “చిరునవ్వుతో” సినిమా తీశారు. ఆ సినిమాకి కథ, మాటలు త్రివిక్రమ్ అందించారు. Life is Beautiful సెకండ్ హాఫ్ లోని ట్రాజిక్ స్టోరీని త్రివిక్రమ్ ఇంతవరకు వాడుకోలేదు, కాని ఈ సినిమాలోని కొడుకు పెద్దగై తన తండ్రి తన మీద చూపించిన ప్రేమని తిరిగి ఇవ్వగలిగితే ఆ కథ ఎలా ఉండొచ్చు [...]
బాహుబలి సినిమాని కాస్త ఆలస్యంగా చూడటం వల్ల కాస్త ఆలస్యంగా సమీక్షిస్తున్నాను.బాహుబలి సినిమాని విమర్శిస్తే కోడిగుడ్డుపై ఈకలు పీకినట్టే అవుతుంది. అంత అద్భుతంగా ఉంది ఈ సినిమా.. It’s a Visual Wonder..!! రాజమౌళి దర్శకత్వ ప్రతిభ మెచ్చుకొని తీరాలి. నాకు రాజమౌళి సినిమాలు నచ్చడం మొదలైంది మర్యాద రామన్న సినిమా నుంచి, ఆ తర్వాత వచ్చిన ఈగ కూడా బాగా నచ్చింది. ఇప్పుడు బహుబలితో ఆ నమ్మకాన్ని [...]
షార్ట్ ఫిల్మ్ (లఘు చిత్రం):ట్రైలర్:పోస్టర్:ఫేస్ బుక్ పేజ్:https://www.facebook.com/sds.superduperstar
‘యాష్ట’ నుండి మాఫీ..ఆడుకోవడానికో ‘సోపతి’..‘అర్ర’లో బోసి వెన్నెలలు..కడుపు నింపే ‘జాగారాలు’..‘లంగోటా’ల్లో నిండుకుంటున్న బాల్యం..కబ్జా అయిపోతున్న కొత్త ‘దండెం’..అమ్మ నానమ్మైన ‘యాది’..వెరసి మా చిట్టి తండ్ర్రి..!!--దాదాపు పదిహేను రోజుల కిందట, మాకో బాబు పుట్టాడు..!!Thanks To Almighty For Everything..!!
భగవత్స్వరూపం         – అరుణ్ కుమార్ ఆలూరి  ఆకలికి దయలేదురేపు సంపాదించి కడుపు నింపుతాడన్న నమ్మకం కానీఈ పూటకి వదిలేద్దమన్న జాలి కానీ దానికి లేవుఆకలికి దయలేదు.. ఆకలికి జాలి కూడా లేదుమరీ వీధి రౌడీలా ప్రవర్తిస్తోంది“మామూలు” ఇవ్వడం కాస్త ఆలస్యమైనా పేగుల్ని పిప్పి చేస్తోంది.దీనికి తోడు ముక్కొకటి బద్ధశత్రువై కూర్చుంది.కాస్త కమ్మటి వాసన తగలగానే ఆకలికి [...]
"చిన్నప్పటినుంచి నాకు పుస్తకాలు చదవడమన్నా, తాతయ్యలు, బామ్మల కబుర్లు వినడమన్నా ఆసక్తి. అదే నాలో విషయఙ్ఞానం - ముఖ్యంగా పౌరాణిక ఙ్ఞానం పెరిగేందుకు బాటలు వేసింది. మా నాన్నగారి దగ్గర, బాబాయి దగ్గర ఉన్న రామాయణ భారత భాగవతాల వంటి ఉద్గ్రంథాలు, మా నాన్నగారి మేనత్తల దగ్గర స్త్రీల వ్రతకథలు, శ్రీశైల క్షేత్ర మహత్యం, శ్రీ వెంకటేశ్వర మహత్యం, వినాయక విజయం వంటి పుస్తకాలు, వీటితో పాటే [...]
"నేను డాక్టర్ని కనక మనిషికి ఉన్న మూడవ కోణం - ఆరోగ్యం - అతని శరీరంలోని వ్యాధులు, అవయవ నిర్మాణం, వాటికి అతని జీవితం మీద ఉండే ప్రభావం - ఇవి ముఖ్యమైనవని చాలా గట్టి నమ్మకం. అంటే ఆ పాత్రల మానసిక, సాంఘీక , ఆర్థిక పరిస్థితులనే కాకుండా శారీరక, ఆరోగ్య పరిస్థితులని కూడా వర్ణిస్తూ - వీటి మధ్య జరిగే సంఘర్షణని  వర్ణిస్తూ సాహిత్యాన్ని సృష్టించాలని నా ఆశ" అని రచయిత ముందుగా [...]
నాగవల్లి - చంద్రముఖికి కొనసాగింపుగా చెబుతూ, ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం కాస్త నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. జీర్ణించుకోలేని విషయం ఏంటంటే , ఈ చిత్రం చంద్రముఖికి కొనసాగింపు కాదు, పునర్నిర్మిణం మాత్రమే..!  కొంత మంది తెలుగు నటీనటులతో పాత చంద్రముఖి చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మించినట్టుగా కనిపిస్తుంది. కొత్తగా ఏమి లేదు 10% తప్ప! చిత్రంలోని పాత్రలు, వారి [...]
చతుర మాసపత్రికలో కొత్తగాలి శీర్షికలో ప్రచురితమైన నా నానీలు (చిన్ని కవితలు)హలోనమస్కారమైతేతెలుగుకిపురస్కారమే..!(సెప్టెంబర్)మనస్సు బావుల్లోనిఅనురాగపు ఊటల్నిడబ్బు పంపువేగంగా తోడేస్తోంది..!(జూన్)ఆయమ్మెంత అదృష్టవంతురాలుడబ్బులతో పాటుపాపాయి బోసినవ్వులుకావలసినంత ఉచితం(ఆగస్టు)ఊళ్ళోబావి ఇంకిపోయింది..ఇంట్లోకన్నీళ్ళు ఊరుతున్నాయి..!(జులై)
ఆమె చేస్తోంది.ఆవిడ చేయిస్తోంది.ఇలా కొన్నేళ్లుగా సాగుతోంది.రోజు రోజుకూ భారమవుతున్న దేహంతో కదలకుండా చెప్తుంటుంది ఆవిడ.లేడి పిల్లలా పరుగులు తీస్తూ చకచక చేస్తుంది ఆమె.ఆవిడ పత్రిక తిరగేస్తూ ఆమెని ఓ సారి చూసింది... "నాకెన్ని జబ్బులొచ్చినా ఆరోగ్యాన్ని కొనుక్కోగలను. పాపం! దీనికేదైనా అయితే?" అని జాలిపడింది. పండంటి బిడ్డని కన్న మరునాడే ఆమె పనిలోకొచ్చిందని [...]
పుత్రోత్సాహము వలదు...- అరుణ్ కుమార్ ఆలూరి  పంతులుగారు విషయం చెప్పినప్పటినుంచి కేశవ్, సంహితల మదిలో అదే పదేపదే తిరుగుతూ మనశ్శాంతిని మైళ్లదూరం తరిమి ఎక్కడో విశ్వాంతరాల్లో వదిలింది. ఒక్క కొడుకే చాలనుకుని చైనా క్యాలెండరు చూసి ప్రణాళికలు వేసుకునిమరీ కన్నారు. మొదటి కాన్పులోనే కొడుకు పుట్టడంతో రెండో బిడ్డకి ఆలోచన కూడా చేయలేదు. ఇద్దరు, ముగ్గురిని కని ఎవరికీ పరిపూర్ణమైన [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు