కొడుకుమర్చిపోయినాతండ్రి మాత్రం మర్చిపోలేదు. కొడుకు భవిష్యత్తు గురించి హర్మన్ కి బెంగ పట్టుకుంది. ఒకరోజు కొడుకుని దగ్గరికి పిలిచి మాట్లాడాడు. చదువు విషయం ఏం ఆలోచించావు అని అడిగాడు. తిరిగి మ్యూనిక్ కి ఎప్పుడు వెళ్తున్నావని అడిగాడు.  ఇంకఎక్కడైనా చదువుకుంటా గాని తిరిగి మ్యూనిక్ కి మాత్రం ససేమిరా వెళ్లనని మొరాయించి కూర్చున్నాడు ఆల్బర్ట్. కొడుకు మనోభావం అర్థం [...]
తరచుసుస్తీ చెయ్యడం వల్ల తమకి తెలిసిన ఓ డాక్టరు దగ్గరికి వెళ్లి చూపించుకున్నాడు. ఆల్బర్ట్ ని చూడగానే డాక్టరు అదిరిపోయాడు. పిల్లవాడు బాగా చిక్కిపోయాడు. ఏం జరిగిందని అడిగాడు, డాక్టరు. ఆల్బర్ట్ జరిగిందంతా ఏకరువు పెట్టాడు. ఇంట్లో వాళ్లు చాలా గుర్తొస్తున్నారని ఎలాగైనా వెళ్లి వాళ్లని చేరుకోవాలని వుందన్నాడు. విషయం అర్థమైన ఆ మంచి డాక్టరు ఆల్బర్ట్ బడి అధికారులని [...]
అప్పుడప్పుడే రెండవ ప్రపంచ యుద్ధం మొదలవుతోంది. కేంద్రకంలోని అపారమైన శక్తి  నాజీలచేతికిందికి వస్తుందేమోనని అమెరికా ప్రభుత్వం బెంబేలు పడసాగింది. కనుక కేంద్రక శక్తిని వినియోగించే మారణాయుధాల మీద పరిశోధనలు మొదలుపెట్టింది.ఈ ప్రయత్నంలోఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. కేంద్రక చర్యలో, న్యూట్రాన్లు పూర్తిగా యురేనియమ్ పదార్థాన్ని వదిలి వెళ్లిపోయేలోపు, వీలైనన్ని [...]
1894  లోఆల్బర్ట్ మరో సంకట పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ సంకటానికి బీజాలు బడిలో లేవు, ఇంట్లో వున్నాయి. ఆల్బర్ట్ తండ్రి హర్మన్ చెస్తున్న వ్యాపారం దివాలా తీసింది. ఇలా దివాలా తీయడం కొత్తేమీ కాదు. కాని ఇంతలా దివాలా తీయడం ఇదే మొదటి సారి. తండ్రి ఘోరంగా అప్పుల పాలయ్యాడు. బంధువులు అంతోఇంతో సహాయం చేస్తామని ముందుకు వచ్చారు. కాని తండ్రి చేసిన అప్పులు ఆ సహాయానికి అందనంత [...]
యురేనియమ్ తో న్యూట్రాన్తాడన ప్రయోగాలు చేసిన ఎన్రికో ఫెర్మీ కథకి మళ్లీ వద్దాం. అతడి కృషిలో 93 సంఖ్య గల మూలకం ఉత్పన్నం అయ్యిందని అతడికి అనిపించింది. కాని ఆ సంగతిని అప్పుడతడు నిర్ధారించుకోలేక పోయాడు. దాన్ని శుద్ధి చెయ్యడానికి ప్రయత్నించిన శాస్త్రవేత్తలంతా విఫలులయ్యారు.ఈ ప్రయత్నాలలోపలువురు ప్రముఖులు ప్రవేశించారు. ఇరవై ఏళ్ల క్రితం ప్రోటాక్టినియమ్ ని కనుక్కున్న [...]
ఆల్బర్ట్కి మాక్స్ టాల్మూడ్ అని ఓ స్నేహితుడు ఉండేవాడు. ఇతడు ఆల్బర్ట్  కన్నాకొన్నేళ్లు పెద్దవాడు. తదనంతరం ఇతగాడు వైద్య విద్యలోకి ప్రవేశించాడు. ఈ కుర్రవాడు సెలవు దినాల్లో వచ్చి ఐన్ స్టయిన్ వాళ్ల ఇంట్లో  ఉండేవాడు. అలా ఓ సారి వచ్చినప్పుడు ఆరన్ బర్న్ ష్టయిన్ (Aaron Bernstein) రాసిన కొన్ని సైన్స్ పుస్తకాలు పట్టుకొచ్చాడు. ఈ పుస్తకాలు భూమి, సౌరమండలం, విశ్వం మొదలుకొని గొప్ప [...]
పరమాణు కేంద్రకాల తాడనానికి వాడబడ్డ మొట్టమొదటి రేణువులు ప్రోటాన్లు, డ్యూటెరాన్లు, ఆల్ఫా రేణువులు మొదలైన ధనావేశం గల రేణువులు. అలా ధనావేశం గల రేణువులు ధనావేశం గల కేంద్రకాల చేత వికర్షించబడతాయి. కనుక ఆ వికర్షణని అధిగమించి కేంద్రకాన్ని చేరి ఢీకొనాలంటే ఆ తాడించే రేణువులని అత్యధిక వేగం వద్దకి త్వరణం చెయ్యాలి. కనుక కేంద్రక చర్యలని సాధించడం కష్టంగా ఉండేది.న్యూట్రాన్లు [...]
టీచరుపట్ల తన మనోభావాలని కప్పిపుచ్చుకోలేని అపరాధానికి చిక్కుల పాలయ్యాడు పాపం ఆల్బర్ట్. ఎప్పుడూ క్రమశిక్షణ, క్రమశిక్షణ అంటూ పిల్లల్ని రాచి రంపాన పెట్టడం తప్ప పిల్లల్లో చదువు అంటే సహజమైన ప్రేమ ఎలా అంకురింపజేయాలో తెలీని ఈ టీచర్లని చూస్తేనే ఆల్బర్ట్ కి  చిర్రెత్తుకువచ్చేది. ఇలాంటి ధోరణి వల్ల బడిలో ఇమడలేకపోయాడు. ఆల్బర్ట్ధోరణి తోటి పిల్లలకి మొదటి నుంచే కాస్త [...]
మొట్టమొదటి కేంద్రక చర్యలు ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే ఐసోటోప్ లతో జరిపినవి. కాని కేంద్రక చర్యలు ఈ విధంగాజరపనక్కర్లేదు. ఉదాహరణకి ఒక శతాబ్దం క్రితం ప్రకృతిలో లేని కర్బన రసాయనాలని ఉత్పత్తి చేసే ప్రయత్నాలు జరిగాయి. అదే విధంగా ప్రకృతిలో లేని న్యూట్రాన్-ప్రోటాన్ విన్యాసం గల కేంద్రకాలని సాధించాలనుకుంటే? సరిగ్గా ఈ ప్రయత్నాన్నే 1934 లో ఇద్దరు ఫ్రెంచ్ భౌతిక [...]
ముందుమాట భారతీయ భాషా సాహిత్యాలలో పురాణ సాహిత్యానికి ముఖ్య స్థానం వుంది. దైనిక జీవనంలో కూడా పౌరాణిక ఘట్టాలని, పౌరాణిక పాత్రలని తలచుకుంటూ, వారి నుండి స్ఫూర్తిని గొంటూ బతకడం మనకి అలవాటైపోయింది. బలానికి భీముడు, స్నేహానికి కర్ణుడు, స్వామిభక్తికి హనుమంతుడు, సత్యవ్రతానికి రాముడు, పాతివ్రత్యానికి సీత, నియమాలని, నిర్వచనాలని అతీతంగా భాసిల్లే పురుషోత్తమ తత్వానికి శ్రీ [...]
 ఎదుగుతున్నపిల్లలు గల తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలని ఎప్పుడెప్పుడు బళ్లో పడేద్దామా అని ఆత్రుతగా ఉంటుంది. కాని చిక్కేంటంటే ఆల్బర్ట్ కి చిన్నప్పట్నుంచీ బడులన్నా, బడిపంతుళ్లన్నా పడేది కాదు. బళ్లో పాఠాలు చెప్పే టీచర్లు డ్రిల్లు మాస్టర్లలాగానో, సేనాధిపతుల లాగానో కనిపించేవారు. ఇంట్లో హాయిగా, స్వేచ్ఛగా తన ఊహాలోకంలో తేలిపోతూ కాలం గడపడానికి అలవాటు పడ్డ ఆల్బర్ట్ కి [...]
1930 లో ఇంగ్లీష్ భౌతిక శాస్త్రవేత్త పాల్ అడ్రియెన్ మారిస్ డిరాక్ (1902-1984) ప్రోటాన్లకి, ఎలక్‌ట్రాన్లకి పూర్తిగా వ్యతిరేకమైన రేణువులు (ప్రతిరేణువులు) ఉంటాయని సైద్ధాంతికంగా నిరూపించాడు. ప్రతి-ఎలక్‌ట్రాన్ కి ఎలక్‌ట్రాన్ కి ఉండే ద్రవ్యరాశి ఉంటుంది గాని ధనావేశం ఉంటుంది. అలాగే ప్రతి-ప్రోటాన్ కి ప్రోటాన్ కి ఉండే ద్రవ్యరాశే ఉంటుంది ఋణావేశం ఉంటుంది.1932 లో నిజంగా [...]
ప్రతిపిల్లవాడు, పసిపాప సహజంగా శాస్త్రవేత్తే. అందుకు ఆ పిల్లవాడు ఆల్బర్ట్ ఐన్ స్టయిన్ కానక్కర్లేదు. దారే పోతున్న పురుగుని వెంటపడి నోట్లో పెట్టుకోయిన పసికందు ఓ శాస్త్రవేత్తలా ఆ విచిత్రమైన చిన్న నల్లని వస్తువుని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తోంది. ‘భూమికి అంచు ఎక్కడుంది?’ అనో, ‘తారలు ఎంత దూరంలో వున్నాయి?’ అనో యక్షప్రశ్నలతో తండ్రిని వేధించే పాప ఓ శాస్త్రవేత్తలా తన [...]
అధ్యాయం 14కేంద్రక చర్యలు                                                      కొత్త రూపాంతరీకరణపరమాణువులో అంత కన్నా సూక్ష్మమైన రేణువులు ఉన్నాయని, రేడియోధార్మిక రూపాంతరీకరణలలో, ఆ సూక్ష్మరేణువులు కొత్త కొత్త విన్యాసాలు దాల్చుతాయని ఒక సారి అర్థమయ్యాక ఇక తదుపరి మెట్టు ఏమిటో స్పష్టంగా తెలిసింది.మామూలు [...]
బ్లాగర్లకి నూతన సంవత్సర శూభాకాంక్షలు (కాస్త ముందుగా)!ఇది ఈ బ్లాగ్ లో వెయ్యవ పోస్ట్ కావడం విశేషం. ఈ పోస్ట్ తో ఐన్‍స్టయిన్ జీవిత కథ సీరియల్ గా ప్రారంభం అవుతోంది.--  ఆల్బర్ట్ఐన్ స్టయిన్ 1879  లో, మార్చ్  14  వ తారీఖు నాడు, జర్మనీలో ఉల్మ్ నగరంలో జన్మించాడు. ఐన్ స్టయిన్ కుటుంబం మధ్యతరగతి కుటుంబం. వారి వంశం  300  ఏళ్లుగా దక్షిణ జర్మనీలో స్థిరపడింది. ఐన్ స్టయిన్ తండ్రి పేరు [...]
దీన్ని బట్టి మనకి తెలుస్తున్నది ఏమిటంటే వ్యక్తిగత పరమాణువుల పరమాణు భారం హైడ్రోజన్ పరమాణు భారానికి పూర్ణంక నిష్పత్తి కలిగి వున్నా, ఒక ప్రత్యేకమూలకంలో వివిధ భారాలు గల  పరమాణువులుఉంటాయి కనుక వాటి సగటు భారం హైడ్రోజన్ పరమాణు భారానికి పూర్ణాంక నిష్పత్తి కలిగి వుండనక్కర్లేదు.కొన్ని సందర్భాలలో ఒక ప్రత్యేకపరమాణువు యొక్క ఐసోటోప్ ల సగటు భారం అంత కన్నా ఎక్కువ పరమాణు [...]
తండ్రి ఎవరో కూడా తెలియకుండా జీవితాన్ని అరంభించి, కనికరం లేని తల్లి పెంపకంలో చిన్న తనాన్ని అనుభవించి, నూనూగు మీసాల నూత్న యవ్వనంలోనే క్యాల్కులస్ ని కనిపెట్టి, గురుత్వ సిద్ధాంతం, కాంతి సిద్ధాంతం మొదలైన సిద్ధాంతాలతో ఓ అద్భుత విశ్వదర్శానాన్ని మానవాళికి అందించి, కేవలం సిద్ధాంత రచనతోనే ఆగిపోకుండా రాయల్ సొసయిటీ లాంటి వైజ్ఞానిక సంస్థని సంస్కరించిన ఐసాక్ న్యూటన్, [...]
కాని దీని వల్ల ఓ ప్రగాఢమైనసమస్య తలెత్తింది. యురేనియమ్, థోరియమ్ ల విచ్ఛిత్తి వల్ల ఏర్పడ్డ ఉత్పత్తుల మాటేమిటి? ఇలాంటి ఉత్పత్తులు డజన్ల కొద్దీ కనుగొనబడ్డాయి. కాని ఆవర్తన పట్టికలో వాటిని ఉంచడానికి కేవలం తొమ్మిది స్థానాలు మాత్రమే వున్నాయి (పరమాణు సంఖ్య 84 గల పోలోనియమ్ నుండి పరమాణు సంఖ్య 92 గల యురేనియమ్ వరకు).ప్రత్యేక ఉదాహరణగా తీసుకుంటే యురేనియం పరమాణువు ఒక ఆల్ఫారేణువుని [...]
బుడుగు, సీగానాపెసూనాంబల సమస్య:సీగానాపెసూనాంబని ఓబెద్ద రాచ్చసుడు సముద్రంలో A అనేద్వీపంలో దాచేశాడు. నేల మీద  B  అనేచోట ఉన్న బుడుగు వెళ్ళి ఆమెని రష్చించాలి.  బుడుగు ఎక్కిన నిఝం జెటకా నేల మీద Vl  వేగంతో ప్రయాణిస్తుంది. ఎక్కాల్సిన పడవ  సముద్రం మీద Vbవేగంతో ప్రయాణిస్తుంది. B  నుండి బయల్దేరిన బుడుగు ఏమార్గం వెంటప్రయాణిస్తే అతితక్కువ సమయంలో A  ని చేరుకుంటాడు?  [...]
అంత దీర్ఘమైన కాలాలని కొలవాలంటే ఒక నియతద్రవ్యరాశి గల  యురేనియమ్(లేక థోరియమ్) నుండి పుట్టే ఆల్ఫా రేణువుల మొత్తం సంఖ్యని లెక్కించాలి. జింక్ సల్ఫయిడ్ తెర మీద ఆల్ఫా రేణువులు పడ్డప్పుడు ఏర్పడే మెరుపులని లెక్కపెడుతూ ఆల్ఫా రేణువులని లెక్కపెట్టాడు రూథర్ఫర్డ్. ఈ పరికరాన్నే సింటిలేషన్ కౌంటర్ (scintillation counter) అంటారు.  ఆల్ఫా రేణువులు వెలువడే వేగాన్ని బట్టి యురేనియమ్ ఏ [...]
షాలొనర్లాంటిదుష్టులపీడవొదిలిపోయాకటంకశాలవార్డెన్గాన్యూటన్పనిమరింతసులభంఅయ్యింది. వైజ్ఞానికరంగంలోతనసహజప్రతిభనిఇప్పుడుటంకశాలనిర్వహణలోప్రదర్శించాడు. టంకశాలఉత్పత్తిఆకాశాన్నంటింది. వారానికిలక్షపౌన్లవిలువగలసరికొత్తనాణేలుటంకశాలనుండివెలువడసాగాయి. ప్రభుత్వరంగాలలోన్యూటన్పేరుప్రతిష్ఠలుపెరిగాయి. టంకశాలయొక్కకార్యక్రమాలుసమాజానికివిలువైనవేకావచ్చు. [...]
అర్థాయుష్షు (half-life)పరమాణువుల యొక్క అంతరంగ విన్యాసం గురించి తెలిపే అధ్యయనాల వల్ల మరింత పరిజ్ఞానం ఏర్పడుతున్నా, మరెన్నో కొత్త సమస్యలు తలెత్తుతూనే వున్నాయి. 1900 లో క్రూక్స్ యురేనియమ్ సమ్మేళనాల గురించి ఓ చిత్రమైన విషయాన్ని గమనించాడు. కొత్తగా తయారైన యురేనియమ్ సమ్మేళనాలు కాస్తంత మాత్రంగానే రేడియోధార్మికతని ప్రదర్శిస్తున్నాయని అతడు గుర్తించాడు. కాని 1902 లో రూథర్ఫర్డ్, [...]
ఆ రోజుల్లో రాజుగారి టంకశాల లండన్ లో ‘టవర్ ఆఫ్ లండన్’ అనే కోటబురుజు లాంటి దుర్భేద్యమైన భవంతిలో ఉండేది. ఆ భవంతి చుట్టూ లోతైన కందకం వుంటుంది. చిన్న వంతెన మీద ఆ కందకాన్ని దాటగానే అవతల ఎత్తైన గోడలు. ఆ గోడలు దాటి లోపలికి ప్రవేశిస్తే అక్కడ ఇంకా ఎత్తైన రెండవ ప్రాకారం ఎదురవుతుంది. ఆ లోపలే సిపాయిల సిబిరాలు, మందుపాతర భాండారాలు వుంటాయి. అంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో వున్న [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు