2007లో ఉత్తమ కథల్లో ఒకటిగా ఎంపికయిన బీ అజయ్ ప్రసాద్ కథ లోయ చదివిన తరువాత చాలా సేపు వెంటాడుతుంది. కథలో గుప్పిటలో ఏముందో అన్న ఉత్సుకతను కల్పించటమేకాదు, గుప్పిట విప్పి చూపకుండా కథను ముగించటం ద్వారా,కథ పూర్తయినా కథకు వెంటాడే లక్షణాన్ని అత్యద్భుతమయిన రీతిలో ఆపాదించారు రచయిత.నిజానికి ఈ కథను ఉత్తమ కథ అని నిర్ద్వంద్వంగా ప్రకటించవచ్చు. కథ సూటిగా ఎక్కడ ఆరంభమవాలో అక్కడే [...]
అజయ్ ప్రసాద్ రచించిన జాతక కథ అత్యంత ఆసక్తికరంగా ఆరంభమవుతుంది. హింస అంటే ఆయుధం కాదు- కారణం అని తెలుసుకున్నప్పుడు నిజంగా నేను భయపడ్డాను అంటూ ఆరంభమవుతుంది కథ. అయితే మొదటి పేరాలోనే మనిషి జాతకంలో తీరని అశాంతికి, అపారమైన దుహ్ఖానికి సర్వకాలావస్థల్లోనూ కారణాలు ఒకటే అన్నది నేను తెలుసుకున్న సత్యం అని గుట్టు విప్పేస్తాడు. ఆతరువాత కథ ప్రారంభమవుతుంది. ఆరామంలో చదువు పూర్తయిన [...]
25ఏళ్ళ ఉత్తమ కథల సంకలనంలో బీ. అజయ్ ప్రసాద్ కథలు ఆరు వున్నాయి. 2006లో జాతక కథ, 2007లో లోయ, 2008లో యూఎఫో, 2009లో జాగరణ, 2011లో ఖేయాస్….కథలను ఉత్తమ కథల సంపాదకులు ఉత్తమ కథలుగా ఎంపిక చేశారు. ఈ ఆరుకథలు చదివిన తరువాత ఒక ఆలోచన కలుగుతుంది. ఇంతవరకూ ఈ ఉత్తమ కథల సంకలనంలో చదివిన కథలకు, కథకులకు పూర్తిగా భిన్నమయిన కథకుడు అజయ్ ప్రసాద్ అని. అతను ఎంచుకున్న కథాంశాలు కానీ, వాటిని కథ రూపంలోకి మలచి అందించిన [...]
2004 సంవత్సరంలో అక్కిరాజు భట్టిప్రోలు రచించిన అంటుకొమ్మ ఉత్తమ కథల సంకలనంలో ప్రచురణకు ఎంపికయింది. వంశవృక్షాల్లో అబ్బాయిలు పుట్టని వారి వృక్షం శాఖోపశాఖలుగా ఎదగక అక్కడే ఆగిపోతుందని చూపుతూ, ఇది మహిళలకెంత అన్యాయం అన్న భావాన్ని కలిగించటం కోసం రచించిన కథ ఇది అనిపిస్తుంది. చివరలో ఒక పాత్ర ఆగిపోయిన శాఖను విస్తరింపచేసి, వారి భర్తలు పిల్లలౌ పిల్లల పిల్లలతో నింపుతాడు. [...]
25ఏళ్ళ ఉత్తమ కథల సంకలనాల్లో అక్కిరాజు భట్టిప్రోలు కథలు మూడు ఉన్నాయి. 2003లో నందిని, 2004లో అంటుకొమ్మ, 2006లో గేటెడ్ కమ్యూనిటీ. ఈ మూడు కథ్నలు సులభంగా చదివేయగల కథలు. ఎలాంటి సంక్లిష్టతలు, ప్రయోగాలు, అస్పష్ట ప్రతీకలు లేని కథలు. అంటే రేడెర్ ఫ్రెండ్లీ కథలన్నమాట. ఈమూడు కథలు చదివిన తరువాత ఇవి చదివించదగ్గ కాథలేకానీ, ఏమాత్రం గుర్తుంచుకోదగ్గ కథలు, చర్చించదగ్గ కథలు, మనసును తాకి, మనసును [...]
ఆడెపు లక్స్మీపతి మరో ఉత్తమ కథ విధ్వంస దృశ్యం. ఇది కూడా ద్వితీయ పురుష(మధ్యమ పురుష)లో వున్న కథ. అయితే దీన్ని కథ అనేకన్నా దృశ్య వర్ణన అనవచ్చు. ఇదికూడా చదవటానికి అతి కష్టపడాల్సిన కథ. రచయిత కథను దృశ్యాల ద్వారా చెప్పాలని ప్రయత్నించాడు. కానీ, దృశ్యాలనన్నిటినీ కలిపే అంశమేదీలేదు. అన్నీ డిప్రెసివ్ సంఘటనలే…ఎటునుంచి ఎటువెళ్తాయో ఓహకందవు. ఇదెలాగంటే ఒక గమ్యం, సంబంధము లేని [...]
ఆడెపు లక్ష్మీపతి కథ ఆక్రోశం థిర్డ్ పెర్సన్ నారేటివ్ లో మామూలుగా అర్ధమయ్యే రీతిలో సాగుతుంది. వెంకటి అనే రైతు పని చేస్తూంటాడు. అతని భార్య వూరు వెళ్తుంది. ఆయన చేస్తున్న పనిని కాస్త వర్ణిస్తాడు రచయిత. ఊరూరు తిరిగి తిండి సంపాదించే శారడకాండ్ల బృందం వస్తుంది రెండెకరాల పొలంలో రెండుపుట్లు కూడా వడ్లు రాలేదని ఉన్నదేదో వారికి ఇస్తాడు వెంకటి. ఇంతలో అతడికి కొడుకు ఆలోచనలు [...]
ఆడెపు లక్ష్మీపతి కథలు మొత్తం 5 ప్రచురితమయ్యాయి 25ఏళ్ళ తెలుగు ఉత్తమ కథల సంకలనాల్లో..1991లో ఆక్రోశం, 1995లో జీవన్మృతుడు, 1996లో తిర్యగ్రేఖ, 2000లో విధ్వంసదృశ్యం, 2008లో అసందిగ్ధ కర్తవ్యం అనే కథలు ఉత్తమ కథలుగా ఎంపికయి ప్రచురితమయ్యాయి. ఆడెపు లక్ష్మీపతి కథల గురించి చర్చించేకన్నా ముందు కథను చెప్పే పద్ధతుల్లో ద్వితీయ పురుష కథారచన ప్రక్రియ గురించి కొంచెం [...]
కుప్పిలి పద్మ రచించిన మరో రెండు కథలు 2003లో వర్షపు జల్లులో, 2013లో లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్ , ఉత్తమ కథలుగా 25ఏళ్ళ ఉత్తమ కథల సంపాదకులు ఎంపిక చేశారు. అయితే, ఈ రెండు కథలు చదువుతూంటే, ఇవి, సాలభంజిక కథలోంచి పుట్తిన ఉప కథలుగా అనిపిస్తాయి తప్ప ప్రత్యేకమయిన కథలుగా అనిపించవు. సాధారణంగా, ఒక కళాకారుడి ఒక కళాప్రదర్శన బాగా పాపులర్ అయితే, కళాకారుడు మళ్ళీ మళ్ళీ అలానే కళాప్రదర్శన చేయాలని [...]
2001 సవత్సరం ఉత్తమ కథల సంకలనంలో కుప్పిలి పద్మ కథ సాలభంజిక తెలుగు కథా ప్రపంచంలో అత్యంత అధికమైన పొగడ్తలకు గురయిన ఆధునిక కథలలో ఒకటి. ఉత్తమ కథ అనగానే సాలభంజిక అంటారు. గ్లోబలైజేషన్లో స్త్రీ ఎక్స్ప్లైటేషన్ అనగానే సాలభంజిక అంటారు. అంతవరకూ ప్రచురితమయిన కథల్లోంచి 20 ఏళ్ళ ఉత్తమకథలుగా ఎంచుకున్న 30 కథలలో కుప్పిలిపద్మ రచించిన సాలభంజిక ఒకటి. 2000డశకంలోనే రాగలిగే కథల జాబితాలో ఈ కథను [...]
కుప్పిలి పద్మ రచించిన ఆరు కథలు ఉత్తమ కథలుగా ఎంపికయ్యి, 25ఏళ్ళ తెలుగు ఉత్తమ కథల సంకలనాల్లో చోటు చేసుకున్నాయి. 1994లో మసిగుడ్డ, 1995లో విడీఅర్ ఎల్ ఎఫ్, 2000లో ఇన్స్టంట్ లైఫ్, 2001లో సాలభంజిక, 2003లో వర్షపు జల్లులో, 2013లో ది లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్ అనే ఆరు కథలను ఉత్తమ కథలుగా సంపాదకులు నిర్ణయించారు. కాలం మారి ఎన్నో ఆధునిక గృహ పరికరాలు ఇంటిని అలంకరించినా వంటింట్లోంచి మాయం కాని మసిగుడ్డలానే [...]
25ఏళ్ళ ఉత్తమ కథల విమర్శలో కథా విమర్శన సూత్రాలను పాటించటంలేదని ఒకాయన మెసేజ్ ద్వారా విమర్శించాడు. బహిరంగంగా పోస్టు పెట్టవచ్చుగా అంటే తన అభిప్రాయం అందరికోసం కాదని, నాకు మాత్రమే సూచన అని అన్నాడు. అప్పుదొచ్చిందొక ఆలోచన…..విమర్శ సూత్రాలేమిటి? విమర్శకు నాకు తెలిసి ఒకటే సూత్రం…ఒక రచన చదివిన తరువాత ఆ రచన నాలో ఎలాంటి సంచలనం కలిగించింది? ఎలాంటి ఆలోచనలకు కారణమయింది? ఎలాంటి [...]
ప్రపంచంలోని ఇతర దేశాలలోని ధర్మానికి భారతదేశాంలోని సనాతన ధర్మానికి మౌలికంగా ఒక తేడా వుంది. ఆయా ధర్మాలు ఒక వ్యక్తి పైననో, ఒక పుస్తకంపైననో ఆధారపడివుంటాయి. కానీ భారతీయ సనాతన ధర్మం ఇలా ఒక వ్యక్తి, పుస్తకంపైన ఆధారపడివుండదు. ఇక్కడ ధర్మం, జీవన విధానం ఒకదానితో ఒకటి పడుగులో పేకలా కలసిపోయాయి. ఒక రాజు సైనిక వ్యూహాన్ని ఏర్పాటు చేసినట్టు..పలు పొరలలో ధర్మ రక్షణ కవచాలున్నాయి. [...]
సారీ జాఫర్ కథ ను ఉత్తమ కథగా ఎంచుకోవటానికి కారణాలను ముందుమాటలో సంపాదకులు వివరించారు. ముస్లిం జీవితాలన్ను చర్చించిన కథ అని, ఈ కథతోపాటూ 2003 సంకలనంలో ఎంచుకున్న ఇంకో రెండు కథలను గమనిస్తే గాయపడ్డ ముస్లింల మనస్సులు, వారిని వెన్నాడే అభద్రతాభావాలు అర్ధమవుతాయనీ, అతి మామూలు విషయాలు, సంఘటనలు వారి మనోభావాలను దెబ్బతీసే సున్నితమైన స్థితికి కళ్లకుకట్టినట్తు చూపిస్తాయనీ రాశాౠ. [...]
సాధారణంగా ఒక వ్యక్తి ఏదయినా నిర్ణయానికి వచ్చేటప్పుడు అన్నీ ఆలోచిస్తాడు. అన్ని కోణాల్లోంచి విషయాన్ని విశ్లేషించి నిర్ధారించుకుంటాడు. ఒక రాజకీయ కథలో..అమ్మాయికి కష్టం వచ్చింది. మొగుడికి కష్టం వచ్చినప్పుడు ఆమె అండగా నిలబడింది. ఈంకి పిల్లలు పుట్టరని తెలియగానే, మొగుడు పట్టించుకోలేదు. అత్తగారు, అమ్మాయి అమ్మా నాన్నలను పిలిపించి అమ్మాయిని తీసుకుపొమ్మంటారు. భర్త [...]
ఒక రాజకీయ కథ మొత్తం ప్రథమపురుషలో అమ్మాయి చెప్తుంది. మధుసూధన్ అనే ఆయనను కట్నం ఇచ్చి పెళ్ళి చేసుకుంటుంది కొన్ని రోజులు ఆనందంగా వుంటారు. ఇంతలో అతనికి పనిచేస్తుంటే చేయి తెగిపోతుంది. అప్పుడు ఈమె ధైర్య్మ్ చెప్తుంది దగ్గర వుండి సేవ చేస్తుంది. ఆఫీసులో యూనియన్ వాళ్ళు వచ్చి కంపెంసేషన్ ఇప్పిస్తారు. అతనిఉద్యోగం పోకుండా కాపాడతారు ఇంతలో ఆమె గర్భవతి అవుతుంది. అబార్షన్ [...]
25ఏళ్ళ తెలుగు ఉత్తమ కథల సంకలనాలలో వోల్గా కథలు నాలుగు ఉన్నాయి. 1992లో ఒక రాజకీయ కథ, 1993లో తోడు, 2003లో సారీ జాఫర్, 2006 లో మృణ్మయ నాదం అనే కథలను ఈ సంకలనాల సంపాదకులు ఉత్తమ కథలుగా ఎంచుకున్నారు. వోల్గా కథలను ఇతరుల కథలలో ఒకటి రెండు కోణాలలో విశ్లేషించటం కుదరదు. తెలుగులో ఫెమినిస్ట్ రచనలకు, సాంప్రదాయంలో మహిళల పట్ల వివక్షతలను ఎత్తిచూపించటానికి ఆమె రచనలు ఎంతమందికో ప్రేరణనిచ్చి, [...]
అనుకోకుండా కొన్ని రోజులు విరామం ఇవాల్సి వచ్చింది. మీ విశ్లేషణ కోసం ఎదురుచూస్తున్నామంటూ మెసేజ్ లు పెట్టిన వారికి ధన్యవాదాలు. ఏమయింది, ఆపేశారా? అని ప్రశ్నించిన వారికి ధన్యవాదాలు. మీ విస్లేషణలకోసం ఎదురుచూస్తున్నాము, అని మెయిల్ రాసిన వారికి ధన్యవాదాలు. మీ విశ్లేషణల ద్వారా కథల గురించి, కథల రచన గురించి తెలుసుకొంటున్నాం, కొనసాగించండి అని ఫోను చేసి మరీ చెప్పినవారందరికి [...]
25ఏళ్ళ తెలుగు ఉత్తమ కథల సంకలనంలో వాడ్రేవు చిన వీరభద్రుడు, బమ్మిడి జగదీశ్వరరావు కథలు చెరో మూడేసి వున్నాయి. వీరిద్దరిలో బమ్మిడి జగదీశ్వరరావు కథకుడేకాక, వామపక్ష ఉద్యమాలతో సంబంధం వున్నవాడు. ఈ సంకలనాలలో కథ ఎంపిక అవటానికి అదొక అదనపు అర్హత! వాడ్రేవు చినవీరభద్రుడు ప్రధానంగా కథకుడు కాదు. ఆయన కవి. సాహిత్య విశ్లేషకుడు. తాత్విక సాహిత్యం లోలోతుల్లోకి వెళ్ళి అత్యంత నిగూధమయిన [...]
25ఏళ్ళ తెలుగు ఉత్తమ కథల సంకలనంలో పాపినేని శివశంకర్ కథలు 6 ఉన్నాయి. ఈ సంకలనానికి ఈయనకూడా ఒక సంపాదకుడు. ఇది, సంపాదకుడు తన కథనే ఉత్తమ కథగా ఎంచుకోవచ్చా? అన్న ప్రశ్నకు దారి తీస్తుంది. ఎంచుకోవచ్చనేవారున్నారు, ఎంచుకోకూడదనేవారున్నారు. పత్రికలు పోటీలుపెట్టి, ఆ పత్రికలో పనిచేసేవారు కానీ, వారి బంధువులుకానీ పోటీలో పాల్గొనేందుకు అర్హులు కాదని అనేవారొకప్పుడు. ఇప్పుడు ఆ [...]
ఫార్ములా సినిమాలని ఒక మాట వింటూంటాం. అది కథలకూ వర్తిస్తుందని 25ఏళ్ళ ఉత్తమ కథల సంకలనంలో రిపీప్త్ కథకులిద్దరుముగ్గురి కథలు చదవగానే అనిపిస్తుంది. ఫార్మూలా సినిమాలు సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా అందరూ అదే ఫార్మూలాను అనుసరించేట్టు, రచయితలు ఏదయినా కొత్త ఆలోచన చెప్తే ప్రేక్షకులు ఆమోదించరని ఫార్మూలానే అనుసరించమనేట్టు, ఈ ఉత్తమకథల సంకలన కర్తలుకూడా బాగున్నా, [...]
నేను కథకు సాంవత్సరీకాలు నిర్వహించి ఉత్తమ కథలను ఎంచుకునేవారిని, వారి ఉత్తమ కథలను విమర్శిస్తూంటే, ఒక యువ రచయిత, మీరు ఉత్తమ కథలుగా ఎంపికయ్యే అర్హతలుండే కథలు రాయటంలేదు. రాస్తే, మీవీ ఎంపికయ్యేవి అన్నాడు. అతడు యువ రచయిత, ఇంకా తెలుగు సాహిత్య రంగంలోని రాజకీయాలు, విమర్శక డింపతుల మాఫియా ముఠాల రాజకీయాల గురించి అతనికి పరిచయం లేదు కాబట్టి నేను వాదన పెంచలేదు. అప్పటి అతని వాదనకు [...]
25ఏళ్ళ తెలుగు ఉత్తమ కథల సంకలనాల విశ్లేషణ ఆరంభించేముందు ఈ సంకలనాల్లో కథల ఎంపికకు ప్రాతిపదికలు, ప్రామాణికలు ఏమిటన్నది స్పష్టంగా తెలుసుకోవాలసివుంటుంది. ప్రతి సంకలనానికి వున్న ముందుమాటలో ఈ విషయాన్ని సంకలనకర్తలు ప్రకటిస్తూనే వున్నా, 2016 సంకలనం ముందుమాటలో ఆడెపు లక్ష్మీపతి ఈ విషయాన్ని విష్పష్టంగా వివరించారు. ఆడెపు లక్ష్మీపతి 6 అంశాలను ప్రస్తావించారు. అవి: 1. వినూత్నమైన [...]
25ఏళ్ళ ఉత్తమ కథల సంకలనానికి ముందుమాటలో వల్లంపాటి వెంకటసుబ్బయ్య, వామ పక్ష భావజాలం కథలు అధికంగా సంకలనాల్లో వుండటాన్ని సమర్ధించాలని ప్రయత్నించారు. జీవితాన్ని వామపక్ష భావజాలం తీవ్రంగా ప్రభావితం చేస్తున్నప్పుడు, అందులోంచే అత్యధిక శాతం మంచి సాహిత్యం పండుతున్నప్పుడు అది సంకలనాల్లో ప్రాతినిధ్యాన్ని పొందటం సహజ పరిణామమే..అని సమర్ధించారు. జీవితాన్ని వామపక్ష భావజాలం [...]
1. ముందుగా 25ఏళ్ళుగా తమకు నచ్చిన తమవారి కథలతో సంకలనాలు ప్రచురిస్తూన్న కథా సాహితికి అభినందనలు. వారికి నచ్చిన కథలనే 25ఏళ్ళలో ఉత్తమ కథలుగా నిలిపిన వారి కథా ప్రేమకు నీరాజనాలు. అయితే, కథల పుస్తక ప్రచురణ విషయంలో, ముఖ్యంగా, 25ఏళ్ళ కథలను రెండు సంపుటాలుగా ప్రచురించటంలో వారు కనబరచిన శ్రద్ధ, చూపిన నాణ్యత విషయంలో హృదయపూర్వకంగా అభినందలు తెలుపక తప్పదు. పుస్తకాలను నాణ్యంగా [...]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు