సంచిక వెబ్ పత్రికకు కథలు, నవలలు, కవితలు, వ్యాసాలు, విమర్శలు పంపించండి. రచనాంశం ఏదయినా కావచ్చు. రీడబిలిటీకి ప్రాధాన్యం. కవితలు, పద్యాలు, ప్రయోగాత్మక కవితలు( హైకు, నాని వంటివి) కార్టూన్లు, పంపవచ్చు. నిడివి పరిమితి లేదు. వ్యాసాలు, కార్టూన్లు, సలహాలు, చిట్కాలు కూడా పంపవచ్చు.. పుస్తక పరిచయానికి, సమీక్షలకు రెండు కాపీలు పంపాలి. మెయిల్ లో పంపితే murali@sanchika.com కు పంపాలి. కొరియర్, [...]
సంచిక పత్రిక ఉగాది ప్రత్యేక సంచికతో ప్రారంభమవుతుంది. ఉగాది సంచికలో కథలు, వ్యాసాలు, కవితలు, పద్య కవితలు, ప్రయోగాత్మక కవితలు, విమర్శలు, విశ్లేషణలు వుంటాయి. ఉగాది ప్రత్యేక సంచికకు రచనలు పంపేవారు జనవరి 31లోగా రచనలు పంపాలి. ఆ తరువాత అందే రచనలు రెగ్యులర్ సంచికలలో ప్రచురణకు పరిశీలించబడతాయి. రచనలు పంపే రచయితలకు సూచనలు: 1. సంచిక పత్రిక ప్రధానంగా అన్ని రకాల రచనలకు ఆహ్వానం [...]
1998లో ఉత్తమకథలుగా ఎంపికయినవాటిలో తలపాగా స్వగతం ఒకటి. కాట్రగడ్డ దయానంద్ రాసిన ఈ కథ నేను తలపాగాని, అంటూ ఆరంభమవుతుంది. కథ ఆరంభంలోనే గొంతుకేదో అడ్డం పడుతుంది. నేను తలపాగాని, అన్న తరువాత వాక్యం- మోకాళ్ళు దాటని పంచె, ముతక బనీను, బనీను జేబులో నాలుగు పుగాక్కాడలు, మాసిన గడ్డము, మట్టి శరీరము, నెత్తిన కిరీటం…..నేను తలపాగాని…మట్టితోనూ, మట్టిని నమ్ముకున్న జీవుల్తోనూ నా [...]
కాట్రగడ్డ దయానంద్ రాసిన 7 కథలు 25ఏళ్ళ ఉత్తమ కథల సంకలనంలో 1990,1994,1995,1998,2001,2002,2003 సంవత్సరాలలో ఉత్తమ కథలుగా ఎంపికయ్యాయి. అవి వరుసగా, కర్రావు, గూడు, పండుటాకు, తలపాగా స్వగతం, నేల తిమ్మిరి, గుండ్లకమ్మ తీరాన, అలజడి. ఈ ఏడు కథలు వరుసగా చదవటం ఒక రకంగా రచయిత రచనా సంవిధానం, ఆలోచనా తీరు, దృక్కోణం వంటి అనేక అంశాలను మనకు చేరువ చేస్తాయి. రచయిత రచనల గురించి ఒక అభిప్రాయానికి రావటంలో తోడ్పడతాయి. [...]
జాన్సర్ చోరగుడి రాసిన మూడు కథలు 25ఏళ్ళ ఉత్తమ కథల సంకలనాలలో ఎంచుకున్నారు. అవి: 2003లో మట్టిపక్షులు, 2005లో కడలూరు వెళ్ళాలి ఒక నీలిమ కోసం, 2007లో దీనికి పాత సాఫ్ట్ వేరే పనిచేస్తుంది. మట్టిపక్షులు ఆలోచింపచేసే రచన. అట్టడుగు వర్గాలవారు తమ వృత్తులను వదిలి, చదువుకుని సామాజికంగా ఎదుగుతూన్నామని భావిస్తూంటారు. కానీ, వారు ఎంత ఎదిగినా, వారిని అణగద్రొక్కిన వారు ఇంకా పైకెదుగుతూంటారని, [...]
2000లో ఉత్తమ కథగా ఎంపికయిన నోరుగల్ల ఆడది కథ కూడా ఉమామహేశ్వర రావు ఇతర కథలకు మల్లే చదివించేదిగా వుంటుంది. కానీ, చివరికి లాజికల్ గా వుండక, పలు సందేహాలను కలిగిస్తుంది. అసంతృప్తిని మిగులుస్తుంది. ఈ కథ టూకీగా చెప్పాలంటే, వేశ్యల కథ. విజయమ్మ స్వర్ణ అనే ఇద్దరు వేశ్యావృత్తిలో వుంటారు. కానీ, తమ డిగ్నిటీని కాపాడుకుంటూంటారు. వేశ్యలందరి భూములను మునసబు కాజేస్తాడు. కానీ, స్వర్ణ మాత్రం [...]
ఆర్ ఎం ఉమామహేశ్వర రావు రచించిన మంచివాడు కథ 1993 ఉత్తమ కథల సంకలనంలో ఉత్తమ కథగా ఎంపికయ్యింది. ఈ కథ ఉత్తమ కథల సంపాదకులకు సర్వసాధారణంగా ఇష్టపడే పలీటూరి పేదరైతుల కథ..కాబట్టి, ఇంతకుముందే ఒక కథ ఉత్తమ కథగా ఎంపికయ్యింది కాబట్టి, ఈ రెండు అంశాలను కలుపుకుంటే ఈ కథను ఉత్తమ కథగా సంపాదకులు భావించటంలో ఆశ్చర్యం కలుగదు. కథ చాలా ఆసక్తికరంగా చదివిస్తుంది. కథ ఆరంభమే గ్రామీణ జీవితంలో [...]
ఆర్ ఎం ఉమామహేశ్వర రావు కథలు 1991లో బిడ్డలుగల తల్లి, 1993లో మంచివాడు, 1997లో మొగుడూ పెళ్ళాల ప్రేమ కత, 2000ల్0అ నోరుగల్ల ఆడది, 2004లో వొంటేపమాను అనే నాలుగు కథలు 25ఏళ్ళ ఉత్తమ కథల సంకలనంలో ఉత్తమ కథలుగా ఎంపికయ్యాయి. ఉమామహేశ్వరరావు కథలు చదువుతూంటే కళ్ళముందు దృశ్యాలు కదలాడుతూంటాయి. జీవితాలు కళ్ళముందు కనిపిస్తాయి. ముఖ్యంగా, రాయలసీమ మాండలీకంలో కథలు రాయటంతో రాయలసీమ గ్రామీణ జీవితాలు మనకు [...]
బెజ్జారపు రవీందర్ రచించిన కొత్త రంగులద్దుకున్న కల 2010లో ఉత్తమ కథల సంకలనంలో స్థానం సంపాదించుకుంది. ఈ కథ చదవటం ఒక రకంగా కఠినమయిన పని. ఎందుకంటే ఇది కథ నిర్వచనంలో ఒదగని రచన. ఒక నాటకం రిహార్సల్స్ సాగుతూంటాయి.. ఆ నాటకంలో సంభాషణలు కథ..సంభాషణల్లోనూ మనకు కథ తెలియదు. అంతా సిద్ధాంతాలు, విమర్శలు, పరోక్షంగా విమర్శలు….ఇలా సాగుతుంది.. ఆరంభంలోనే రచయిత దృష్టి తెలిసిపోతుంది. ఇది [...]
పోరుతల్లి కథ పూర్తిగా మాండలీకంలో రాసిన కథ..ఇది ప్రథమ పురుషలో సాగే కథ. కొవిరయ్య సారు పాథం చెప్తూంటే అది సగ్మ్ అర్ధమయితది, సగం అర్ధం కాదు అంటూ ఆరంభమవుతుంది కథ..కథ మొదట్లో ఇదీ రొటీన్ కథే అనిపిస్తుంది. సార్ కాలానికి తగ్గట్టు బట్టలు తొడుక్కోవాలని అంటే పిల్లలకు అర్ధం కాదు. ఏ బట్టయితే ఏందిగాని నాకున్నయి మొత్తంల రొండు అంగీలు, రెండు లాగూలు. ఏకాలంల అయిన గవ్వే ఏసుకుంట. [...]
పలు కారణాలవల్ల, ముఖ్యంగా డెడ్ లైన్ లేకపోవటంవల్ల , వ్యాసాల నడుమ ఎడం కాస్త ఎక్కువగా వుంటోంది. అందువల్ల, వ్యాసాలు నేను రాయటం ఆపేశాననుకుని, ఆపేశారా? అని అడిగిన వారికి, ఆపకండని ప్రోత్సహించినవారికి, ఈ విమర్శలవల్ల కథ విమర్శ ఎలాఉండాలో తెలుసుకోవటమేకాక, కథా రచనలో తీసుకోవాల్సిన మౌలికమైన జాగ్రత్తలు తెలుస్తున్నాయి, ఉపయోగకరంగా వున్నాయని తెలియబరచి ఉత్సాహాన్ని ఇస్తున్న [...]
2005లో ఉత్తమ కథలలో ఒకటిగా నిర్ణయమైన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కథ వీరనారి. వీరనారి ఒక విచిత్రమయిన కథ. ఇదికూడా ఫాక్షన్ హత్యలకు సంబంధించిన కథ. అయితే ఈ కథ ఫాక్షన్ హత్యలు చేసేవారి భార్యల వైపునుంచి చెప్పిన కథ. మొగుడు బయటకువెళ్తే తిరిగి వచ్చేవరకూ వారు ప్రాణాలతో వస్తారో లేదొద అని భయపడుతూంటారు. ఎక్కడ ఎవరు హత్యకు గురయినా అది తమవారేనని బెదురుతూంటారు. ఈశ్వరమ్మ మొగుడు [...]
సూర్యుడిని చూసిన కళ్ళు కాస్సేపు ఇంకా దేన్నీ చూడాలేవు. సన్నపురెడ్డి వేంకటరామిరెడ్డి కథ చనుబాలు చదివిన తరువాత కన్నీటి కథ చదివిన తరువాత కన్నీటి కథ నిరాశ కలిగించటంలో ఆశ్చర్యం లేదు. అదీగాక, ఏ రచయితయినా అన్నె రచనలూ, ఒకే స్థాయిలో రాయగలగటం కష్టమే. కథగా కన్నీటి కథలో లోపమేమీ లేదు. ఒక హంతకుడు, అంటే ఫాక్షన్ హత్యలు చేసేవాడు. బస్సెక్కుతాడు. బస్సులో ఓ పాప పక్కనకూచుంటాడు. ఆ పాప [...]
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఏడు కథలు, 1996లో చనుబాలు, 2000లో కన్నీటి కత్తి, 2001లో పాటలబండి, 2005లో వీరనారి, 2008లో సెగలోగిలి, 2009లో సుడిగాలి, 2012లో బిలం కథలను ఉత్తమ కథలుగా ఎంచుకున్నారు. చనుబాలు కథ చదివిన తరువాత మామూలు స్థితికి రావటానికి కొంత సమయం పడుతుంది. సామాన్య పాఠకుదిగా చదివితే అతి గొప్ప కథ ఇది అనిపిస్తుంది. రచయితగా చదివితే, ఇలాంటి కథ రాసిన రచయిత ప్రతిభ పట్ల అసూయ కలుగుతుంది. [...]
2007 సంవత్సరంలో కే ఎన్ మల్లీశ్వరి రచించిన కథ ఖాళీని ఉత్తమకథల్లో ఒకటిగా ఎంపిక చేశారు. నిజానికి ఈ కథను కథగా ఒప్పుకోవటం కష్టం. ఉత్తమ కథగా ఒప్పుకోవటం మరీ కష్టం. నిజానికీ కథలో కథ లేదు. కతనంలేదు. ఉన్నదంతా ఉత్తమ కథ సంపాదకులకే రోదనం వుంటే నచ్చుతుందో అదే. ఇది రాధ అనే అమ్మాయి మోనోలాగ్ లాంటిది. ఆమె ఏవేవో ఆశలతో సినిమా ప్రపంచంలోకి అడుగిడుతుంది. ఆంకర్ అవుతుంది. నలుగురు బాయ్ ఫ్రెండ్స్ [...]
కే ఎన్ మల్లీశ్వరి నాలుగు కథలు 2005లో రెండంచుల కత్తి, 2007లో, 2011లో 2013లో ఉత్తమ కథలుగా ఎంపికయ్యాయి. ప్రస్తుత విశ్లేషణ పరిథి ఈ నాలుగు కథలకే పరిమితం. ఒక రచయిత ఎన్నో గొప్ప రచనలు చేసి వుందవచ్చు. లేక ఆయన రాసే ప్రతి అక్షరం అత్యద్భుతమని భావిచేవారుండవచ్చు. రాయకముందే పొగిడేసి, రాసినతరువాత దాన్లో లేనిపోని అర్ధాలు చూసి, ఆపాదించి మరీ పొగడవచ్చు. వాటితో ఈ విశ్లేషణకు సంబంధంలేదు. ఈ విస్లేషణ [...]
2005 సంవత్సరంలో ఉత్తమ కథగా ఎంపికయిన వివినమూర్తి కథ జ్ఞాతం. ఈ కథ చదువుతూంటే ఇది ఉత్తమ కథగా ఎలా ఎంపికయిందో అర్ధం కాక పోవటమేకాదు, అసలు కథకుండవలసిన లస్ఖణాలేమిటి? అన్న ప్రశ్న కూడా కలుగుతుంది. కేవలం రెండు మూడు పాత్రలు వాటినడుమ సంభాషణలు వుంటే అది కథ అది కథ అయిపోతుందా? ఉత్తమ కథ అయిపోతుందా? అన్న ప్రశ్న,వివ్నమూర్తి మొదటి కథ చదివినప్పుడు కలిగిన సందేహం, ఈ కథ చదివేసరికి వృక్షమై [...]
25ఏళ్ళ ఉత్తమ కథల సంకలనాల్లో వివినమూర్తి కథలు మూడున్నాయి. 1992లో పయనం-పలాయనం, 2005లో జ్ఞాతం, 2008లో అగ్రహారం అనే కథలను ఈ సంకలనాల సంపాదకులు ఉత్తమ కథలుగా ఎంపిక చేశారు. అయితే ఈ మూడు కథలు చదివితే రచయితగా వివినమూర్తి నపుణ్యం ప్రశ్నార్ధకం అవుతుంది . ఈ మూడు కథలలో ఏ కథకూడా ఉత్తమం అనిపించటం అటుంచి, కనీసం చదవదగ్గ కథ కూడా అనిపించదు. ఎందుకంటే, ఈ కథలలో రచయిత కథ చెప్పటం కన్నా, తన దృక్కోణాన్ని [...]
25ఏళ్ళ ఉత్తమ తెలుగు కథల సంకలనం కథలలో ప్రత్యేకమయిన కథలు భగంతం కథలు. ప్రతి రచయితకూ తనదంటూ ఒక దృక్కోణం వుంటుంది. దృక్పథం వుంటుంది. తనదైన ప్రత్యేక భావ వ్యక్తీకరణ పద్దతి వుంటుంది. అయితే, రచయిత రాను రాను అనేక కారణాల వల్ల తన దృక్కోణాన్నో, దృక్పథాన్నో, భావ వ్యక్తీకరణ పద్ధతినో మార్చుకునే వీలుంది. ఈ మార్పులో అనేకానేక ఒత్తిళ్ళు కూడా తమ వంతు పాత్ర నిర్వహిస్తాయి. కానీ, కొందరు [...]
25ఏళ్ళ ఉత్తమ తెలుగు కథల సంకలనాల్లో ఎంపికయిన చివరి ఖదీర్ బాబు కథ( ఇంతవరకూ) గెత్ పబ్లిష్ద్. ఇది 2010లో ఉత్తమ కథలలో ఒకటిగా ఎంపికయింది. కనబదుతున్నదంతా నిజం కాదు. కనబడనిదంతా లేకుందా పోదు. ఈ కనబడీ కనబడకపోవతంలో నిజానిజాలను దర్శించటం వ్యక్తి దృష్టి మీద ఆధారపడివుంటుంది. ఒకరికి కనిపించినది మరొకరికి కనిపించకపోవచ్చు. ఆ కనిపించేది కూడా అందరిలో ఒకే రకమయిన భావనను కలిగించకపోవచ్చు. [...]
2002లో ఉత్తమ కథలలో ఒకటిగా ఎంపికయిన ఖదీర్ బాబు కథ పెండెం సోడా సెంటర్ ఏ కోణంలోంచి చూసినా ఉత్తమకథనే. ఈ విషయంలో సందేహంలేదు. కథ చెప్పిన విధానం అతి సుందరంగా వుంటే కథాంశం అతి చక్కది. సమాజంలో ఒక మూడు నాలుగు దశాబ్దాలలో మానసికంగా, వ్యాపారపరంగా, సామాజికంగా వచ్చిన మార్పులను అతి సరళంగా ఎదకు హత్తుకునే రీతిలో ప్రదర్శించిన కథ ఇది. కావలిలోని పెండెం సోడా సెంటరునేకాదు, ఆ కాలంలో ప్రతి [...]
2000 సంవత్సరపు ఉత్తమ కథల సంకలనంలో ఖదీర్ బాబు కథ న్యూ బోంబే టైలర్స్ చోటు సంపాదించుకుంది. ఈ కథ చక్కని కథ. ఆరంభమ్నుంచి చివరి వరకూ వదలకుండా చదివిస్తుంది. ఆధునిక బట్టల ఫాక్టరీలు వచ్చాక, టైలర్ వృత్తిని ఎంచ్కుని దానిపైనే ఆధారపడిన వారి మారిన స్థితిగతులను అందంగా చూపిస్తుంది. ఖదీర్ బాబు రచనా సంవిధానం పారే నీటిలా గల గలా సాగిపోతుంది. ఎక్కడా అడ్డంకిలేని ప్రవాహమది. అతని వర్ణనలు, [...]
మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన 7 కథలు 25 ఏళ్ళ ఉత్తమ కథల సంకలంలో ఉత్తమ కథలుగా ఎంపికయ్యాయి. 1997 లో దావత్, 1998లో జమీన్, 2000లో న్యూ బాంబేయ్ టైలర్స్, 2001లో ఖాదర్ లేడు, 2002లో పెండెం సోడా సెంటర్, 2005లో కింద నేల ఉంది, 2010లో గెట్ పబ్లిష్డ్ అనే కథలు ఉత్తమ కథల సంకలనంలో స్థానం సంపాదించాయి. ఖేఎర్ కథలను విశ్లేషించేముందు కొన్ని విషయాలు చర్చించాల్సివుంటుంది. తరువాత వ్యాసాల్లో ఖదీర్ బాబు కథల విశ్లేషణ [...]
మొత్తానికి తెలుగు కథా సాహిత్య విమర్శలో ఒక కదలిక వస్తున్నట్టు అనిపిస్తోంది. కథల బాగోగుల గురించి నిష్పాక్షికంగా, నిర్మొహమాటంగా అభిప్రాయాలు చెప్పే పద్ధతి మొదలవుతున్నట్టు వుంది. అయితే, ఈ విమర్శ కేవలం కొత్త కథకుల కథలకు మాత్రమే పరిమితమవుతుందా, పేరు మాత్రం పెద్దదిగా పొందిన చిన్నాతిచిన్న కథకులకన్నా ఘోరమయిన పెద్ద పేరున్న పెద్దల కథలకు కూడా విస్తరిస్తుందో చూడాలి. [...]
లోయ కథను పర్ఫెక్ట్ కథగా భావించవచ్చు. ఎక్కడా రచయిత కనబడకుండా, వ్యాఖ్యానించకుండా తాను వేయాలంకున్న ప్రశ్నలు వేయకుండా పాఠకుడి మనస్సులో అవే సందేహాలు పాత్రల ద్వారా కలిగే రీతిలో లోయ కథను రచయిత సృజించారు ఈ కథ చదివిన తరువాత రచయిత మళ్ళీ ఇలాంటి కథే రాయకుండా,ఇంతవరకూ రాసిన రెండు ఉత్తమ కహలకు పూర్తిగా భిన్నమయిన కథతో మూడో ఉత్తమ కథను సృజించారు ఈ సంకలనాలలో గమనించేదిమటంటే రచయితలు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు