లీలగా జరిగినది లాగి చెప్తానుగోలలో గుర్తున్నది గోరింతలు చేసి చెప్తాను నేరుగా చూసింది నరికి నాకు నచ్చింది చెప్తాను బేజారు అయ్యేదాకా బెంబేలు  ఎత్తేదాకా అదే అదే చెప్తాను అన్నట్టు ఉన్నది ఇప్పటి ఛానెళ్ల పరిస్థితి dengue  జ్వరాలు వచ్చి పిల్లలు పెద్దలు న్యాయమూర్తులు చనిపోతుంటే ఇదేంటి ప్రభుత్వం ఏమి చేస్తోంది అని నిలతీసే ధైర్యం లేని పత్రిక లలిత [...]
చాలా కాలం అయ్యింది ఏదైనా రాసి  వృత్తిపరమైన మార్పులు ఆ మార్పుల వలన వచ్చిన తలనొప్పులు... మధ్యలో నాకు పెళ్లి అవ్వటం ఇలాంటి చాలా పరిణామాల మధ్యన నా టపాలు టపా కట్టేశాయ్... కానీ ఇన్నాళ్ళకి మళ్ళి అవి తిరుగుటపాలో వచ్చాయి అని చెప్పటానికి ఆనందిస్తున్న.ఇక నించి సాధ్యమైనంత వరకు నెలకి ఒక టపా అన్నా రాద్దాం అని అనుకుంటున్నాను.-మీ నేస్తం 
కథ దగ్గర దగ్గరగా 2002 లో వచ్చిన ఇంగ్లీష్ సినిమా 'Minority Report' లా ఉంది. కాకపోతే కథను మనవాళ్ళ బుర్రలకు అర్ధమయ్యేలా మార్చారు. ఈ విషయంలో దర్శకుడిని, కథానయకుడిని మెచ్చుకోవచ్చు.కాని మహేష్ టాంక్రూయిస్ లా మారాడా murugandas గారు,  Steven Spielberg ని అనుకరించగలిగారా అనేది కష్టమైన ప్రశ్న. సినిమా చూడాలంటే కొంచెం భయంగానే ఉంది ఎక్కడ నిరాశపరుస్తాడొ అని. ఎంతైనా మాతృకలో చూసిన అనుభూతిని పోగొట్టుకోలేం కదా!
పదేళ్ళ పసివయసులో ఆట పాట, అమ్మ నాన్నల ప్రేమ, కోపాలు, అల్లరి చేష్టలు, మురిపాలు ఫోగు చేసుకోవాలి. కాని ఎవడో చేసిన తప్పుకు పీడకలలే తోడుగా రాబోయే కాలంలోకి అడుగులేయడం ఎంత దుర్భరం. ఇదే అనుకుంటే ఇప్పుడో పసిపాపకు తల్లవడం, ఆ బంధాన్ని విడిపించుకున్నా దానితో ఎర్పడిన అనుభూతులు కుదురుగా బతక నిస్తాయా?చిన్న చిన్న అనుభూతులే మనసుని అల్లకల్లోలం చేసే జ్ఞాపకాలు, మరి ఇంత పెద్ద బంధం [...]
నమ్మశక్యం కాని జీవితం, ఆదరణ, విజయం, సమకాలీన కాలంలోని ఓ పరమాధ్బుతం "అమ్మ" జయలలిత. వ్యకిగత కారణాలు ఏవైనా కానివ్వండి అనుకున్నది సాధించిన ధీర, ప్రతికూల పరిస్థితులలో పారిపోకుండా, గెలుపు రుచిచూసిన "పురుట్చి తలైవి". ఎక్కడో పుట్టి, మరెక్కడో మెరిసిన "విప్లవ నాయకి". ఇంతమంది జనం 'అమ్మా' అని ఏడుస్తున్నారంటే ఆమెలోని అమ్మ మనసే కారణం కదా! నాలుగురాళ్ళు వెనకేసుకోమని, పొయే సమయానికి [...]
ఆన్నా, నువ్వు దేశభక్తుడివే, అందులో ఎలాంటి సందేహం లేదు. మంచే చేయాలనుకుంటావు, నమ్మకమే మాకు. కాకపొతే సిద్ధపాటు అదే ప్రిపరేషన్  సరిగా లేదన్నా. ప్లానింగ్ చేసినోడెవడొ గాని పళ్ళూడగొట్టాలన్న కోపం వస్తుంది.పేదోళ్ళ గురించి ఆలోచిస్తావు, మంచిది. కాని కష్టపడే వాడిని కొట్టి, పనిలేని వెధవలకు పంచడం ఎంతవరకు సబబు.  ఆలోచించు. ఏ అమ్మ నాన్నైనా పిల్లలు పనిమంతులు [...]
"హాయ్!! హలో !! నమస్తే!! ఆదాబ్ !! వేల్కం టు చెంప చెళ్ళుమన్నది - సక్సెస్ మీట్ ...................దీనిని మీకు అందిస్తున్న వారు స్కూటర్ అగర్బత్తి మరియు రావణరాజ్ అడ్డకట్టు పంచలు.మీరందరు మెచ్చిన అండ్ మీకు నచ్చిన చెంపచెళ్లుమంది పది వేల  ఎపిసోడ్ సందర్భంగా మీకోసం ఈ సక్సెస్ మీట్. "అంటూ గుక్కతుప్పుకోకుండా గాలి పీల్చకుండా ...తాను బట్టల్లో చేసిన పొదుపు మాటల్లో ఏ మాత్రం చేయకుండా [...]
చిన్న నోట్లను, నాణేలను అందుబాటులో లేకుండా చేసి, పెద్ద వాటిని అలవాటుచేశారు. దాని వల్ల సగటు మనిషి ఖర్చు చేసే మొత్తం పెరిగింది. కాని అదే మొత్తంలో సంపాదన పెరగలేదు.అప్పటివరకు బస్సుల్లోనే చిల్లర ఎగవేసేవాళ్ళూ, అదికూడా పర్వాలేదు అనుకునే స్థాయిలోలోనే సుమా. ఆ తర్వాత అది ఒక సంప్రదాయంలా, అదికారికంగా అన్నట్లు అన్నిచోట్లా అలాగే అయిపోయింది.50 పైసలు, రూపాయి, రెండు రూపాయిల స్థానంలో 5 [...]
 నీ నవ్వుతో ఉప్పొంగెనొక గంగ నా మనసులోఆ నవ్వు వెలిగేది క్షణమాత్రమైనాఆ ఉరక నిలిచేను నిలువెల్ల నాబ్రతుకులోనీ పద సవ్వడితో జతకలిపి నా గుండె జతిస్వరమై రవళించెనే మరి ఎందుకోనీ అడుగుల సవ్వడిలేకనేమో త్వరపడి నానుండి సెలవడి లీనమయ్యే అనంతాలలో 
ముగ్గుపోయాలన్నా, మూల వాసం పెట్టాలన్నా వడ్ల బ్రహ్మయ్యనే సాటి...’, మట్టి కచ్చుతో గోడ కట్టాలంటే సుతారి సాయన్ననే తిరుగులేని మేస్ర్తి. ‘గోడలకు మల్లంపెట్టి, గచ్చుచేయాలంటే తూర్పు నర్సయ్యనే మొనగాడు...’లాంటి మాటలు ఒకప్పుడు గ్రామాల్లో ఇల్లు కట్టాలనుకున్న సందర్భంగా వినే వారం. పూర్తి స్థానికత ఆధారంగా లభించే వస్తువులతో ఇల్లుకట్టే నైపుణ్యం ఒకప్పటి మాట. ఇప్పటికీ ఈ అనుభవం ఆయా [...]
ఎవరన్నారు మౌనం మాట్లాడదనివినే మనసుకు తెలిసిన భాష అదే కదామాటలు, పాటలు మరెన్నో శృంగార నైషదాలుజనించిది ఈ భాషలోనే కాదా… సరదాల గొడవలు, మరెన్నో యుద్ధాలుఅదుపులేని ఆవేశాలకనువైన భాష ఇదేకదా ఒకటేమిటి, పెదవి దాటి రాని మాటలన్ని మనసు లోతుల్లోని నిఘూడ భావాలన్నినీ వేలిచివర చేరి మనః తనువును శృతిచేసే తీరులన్ని నా మనుసుకే కదా తెలిసేది కోపతాపాలూ, ప్రణయ భావాలూ కనులు తెలిపే [...]
ప్రజలందరూ రాజధాని నిర్మాణానికి నిధులివ్వాలి. రైతులందరూ (రాజధాని నిర్మించే ప్రాతంలోనివారు) స్వచ్చందంగా భూములు ఇవ్వాలి. పేదరిక నిర్మూలన, ప్రజా సేవ మాలక్యం, ధ్యేయం, సింగినాదం, జీలకర్ర. ఇది మన నేతల ప్రగల్బాలు. రాష్ట్రం విడిపోయి, పీకల్లోతు ఆర్థిక  ఇబ్బందుల్లో మునిగి ఉన్నాం. అంతే కాదు అన్న దాతను ఆ పథకం ఈ పథకం, ౠణమాఫీ అంటూ నానా రకాల వాగ్ధానాలు, పథకాలు చెప్పి నడుం [...]
గిలిగింతల పలకరింపులంటూమెల్లగా వీచే చలి గాలిమోసుకొచ్చే ఊసులన్నీ  నాకోసమేనందినాలో ఊపిరి చిరునామా నువ్వనినా ఊసులు బాసలూ నీతోనేనని నా ప్రతి అణువు నీతో శృతికలిపిందనినీ శ్వాశలోని పరిమళమే నా గిలిగింతకు కారణమని    తెలిపేదెలా చల్లగాలికి,  వాన మబ్బులకు   దూరమైనా చేరువైన మనసుల నడుమతెలియకున్నా వలపుల ఊసులన్ని  మోసుకుంటూ చేస్తున్నాయి రాయబారాలు ఇలా
నా కోపంలోని ప్రేమను ఆ ప్రేమలోని మధువును నా నవ్వులో దాగిన బాధనిదాని వెనుకనున్న కారణాన్ని నా మౌనం మాటున దాగిన మాటలనుఆ మాటలలోని వాడిని నా ప్రాణాత్మలలొ పల్లవింవిచే సంవేదాన్ని సైతం అర్ధవంతగా శృతిచేసి రోజుకో కొత్త రాగాన్నిపలికించే నాదబ్రహ్మవా? నాలో చలించే చైతన్య స్రవంతికిసరికొత్త రూపానివా? లేక నా ఉచ్వాశ నిశ్వాసాల ఝరిలో ప్రవహించే ప్రాణానివా? నా నువ్వు నేనే కదానేను [...]
ప్రేమికుల రోజు సందేశాలు చూసి ఫేసుబుక్  లో సరదాగా రాసిన కవితనీ నవ్వులే నా లోకమేనువ్వు వుంటే లేదు ఏ శోకమేనువ్వు లేకుంటే అది శాపమేనిన్ను విడిచి పోవుట నరకమేనీవు లేని ప్రతి ఘడియ వ్యర్ధమేనీవు లేకుంటే  లేదు ఏ అర్ధమేనేను వేసే ప్రతి అడుగు నీ కోసమేనా ప్రేమకు లేదు ఏ అంతమే
కన్నమ్మా!!నీకిష్టమని, నీకు ఇవ్వాలనిఇష్టంతో కొంచెం కష్టపడిమా ఉసిరి చెట్టునడిగిపట్టుకొచ్చాను నీకో తాయిలం కాని ఇచ్చే దారి కనిపించడంలేదునీ దగ్గరకు రాలేని నేనునా దగ్గరకు రాలేని  నీ పని వత్తిడిఇవేమో నా కళ్ళముందు నా చేతుల్లో పచ్చగా గమ్మత్తుగా బంగారంలా మెరుస్తూ  నావంకే చూస్తూ పిచ్చిదానా ఎందుకింత ఆత్రం  అని అమ్మలాగా మదలిస్తూఅన్నయ్య కోసం దాచి ఉంచే తాయిలంలామనసు [...]
ఎప్పటికీ తిరిగి రానివి కొన్నిమరెప్పటికీ మరచిపోలేనివి ఇంకొన్ని మొదటి స్నేహం, తొలి ప్రేమతొలిసారి ఒడిని చేరిమురిపించిన చిన్నారి మళ్ళీ తిరిగి రావు అలా అనిమరపుకూ రావునింగినుండి నేల జారిన చినుకుతిరిగి ఎగరలేదు, కాని రూపం మార్చిజీవంపోసే అమృతమే అవుతుందిగుండెలోతుల్లో జనించిమొలకెత్తినా ప్రేమ తనగూడు చేరలేక పొవచ్చునేమో  కాని తన రూపాన్ని మార్చుకుంటేదాన్ని సరైన కోణంలో [...]
ఇవ్వాళ, రేపుహియర్ అండ్ దేర్ అన్నీ నువ్వైతేమరి నేనెక్కడ?లుక్ అండ్ ఫీల్ టాప్  టు బోటం అన్నిటిలో నువ్వుంటేమరి నెనెక్కడనువ్వు రాక ముందునా ప్రపంచంలో నేనేకింగ్ అండ్ క్వీన్ మరి ఇప్పుడు?హార్ట్ అండ్ సోల్ నువ్వే తీసుకుంటేనాలో నేనెక్కడని  నన్నే వెతుక్కుంటే?టు బి ఫ్రాంక్ఇది కూడా బావుందిఅప్ టు నువ్వు నాతోఉన్నంత వరకు 
రేపటి మాట వదిలెయ్ (చొడొ కల్ కి బాతియా - హిందీ చిత్రం)   నాకు నచ్చిన చిత్రం ఇది. ఎన్నిసార్లు చూసాలో గుర్తు లేదు కాని మనసులో నిలిచిన చిత్రం. ఇప్పటి పరిస్థితిలో మన బ్రతుకులకు అద్దం పట్టి, మనలను నిలదీసే చిత్రం. బ్రతుకుతున్నామనుకుని బ్రతుకలేని మన చేతకానితన్నాన్ని, అందరితో కలిసి ఉన్నామనుకుంటూనే కలవలేని మన సంకుచిత మనసులను ఎత్తి చూపే చక్కని చిత్రం. ప్రతిక్షణాని ఎలా [...]
A man eats two eggs each morning for breakfast.  When he goes to the Kirana store he pays Rs. 12 a dozen.  Since a dozen eggs won’t last a week he normally buys two dozens at a time. One day while buying eggs he notices that the price has risen to Rs. 16. The next time he buys groceries, eggs are Rs. 22 a dozen.When asked to explain the price of eggs the store owner says, “The price has gone up and I have to raise my price accordingly”. This store buys 100 dozen eggs a day.  He checked around for a better price and all the distributors have raised their prices. The distributors have begun to buy from the huge egg farms.  The small egg farms have been driven out of business.  The huge egg farms sell 100,000 dozen eggs a day to distributors.  With no competition, they can set the price as they see fit. The distributors then have to raise their prices to the grocery stores. And on and on and on.As the man kept buying eggs the price [...]
మావి చిగురు తినగానే కోయిల గొంతు పాడేనా?కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా?ఎప్పటికి తేలని ప్రశ్న ఇది. అయినా ఎన్నెన్నో అనుభూతులకు అర్ధాలు, మధురోహలు తలపుకు తెచ్చే కమ్మని గీతం.నిత్య నూతనంగా వచ్చే క్రొత్త సంవత్సరాదిని కళ్ళముందు నిలిపే కోయిల పాట, వెనువెంటనే దానిని వెతికడానికి ప్రుగులెత్తే కళ్ళకు నన్ను కుడా చుదమంటూ గమ్మతైన సువాసనలతో పలకరించే వేపపూలు, కొద్దిగా [...]
ఇష్టమంటే ఇంత కష్టంగాఉంటుందని తెలియలేదుతెలియకుండా నను చేరిగుండెలో నిండిపోయావె ఇలానీడ సైతం నిన్నువిడిచి రాను పొమ్మంటేదారి తెలియని గమ్యమేదోరమ్మని పిలుస్తుంటేతడబడే అడుగులతో సాగిపోతున్నాఆగి మరి నిను చూడలేకపోతున్నా  
నీతో ఉన్నప్పుడు తెలియలేదునువ్వెళ్ళిపోతున్నావు అన్న భయానికే�సుడులు తిరుగుతున్నాయి కన్నీళ్ళు ఒకవైపు నీ క్షేమంమరో వైపు నీ ఎడబాటుపంచుకోలేని భావల సడులెన్నో గుండెకోత అంటే ఇదేనేమోఅనుభూతులన్నీ శిలాక్షరాలుగామారున్నవేళ ఆ ఉలి నొక్కులేమో చేయివదిలి పోవద్దనిచెంతనే ఉండిపొమ్మనిఅడగాలని ఆశగా ఉందికాని అది స్వార్ధమౌతుందేమో అది చేప్పలేక నిన్ను వీడలేకనన్ను నేను [...]
నాదో చిన్న సందేహం.  రాష్ట్రంలో ఎప్పుడు కూడా అధికారపక్షం, ప్రతిపక్షం ఉంటాయి కదా!వాటి భాధ్యతలు వాటికి తెలుసు కదా! ప్రతిపక్ష హొదా ఇచ్చారంటే దానర్ధం అధికారపక్షపు లోపాలను ఎత్తిచూపి సరిచేయాలని. నిర్మాణాత్మక విషయాల్లో కలుగజేసుకునే అధికారం మీకు ఇచ్చారు. ప్రజలు మీకుకూడా ఒకవిధంగా అధికారమిచ్చినట్లె. ఇది నా చిన్ని బుర్రకు తెలిసిన విషయం.మరి ప్రభుత్వం / అధికార పక్షం [...]
దూరమౌతున్న నీ అడుగుల సవ్వడి కూడానాకు తెలియనివ్వకు ప్రియతమానీ శ్వాసలో చెరి నా ఉనికినేమరచిన నా ఊపిరి నిలువలేదు మరి   నీ నడకలలో చేరితనవైపు అడుగులేయిస్తుందోలేక నిను వీడలేని ఇష్టంతోనన్నే వదిలి నీతో వస్తుందోఅందుకేదూరమౌతున్న నీ అడుగుల సవ్వడి కూడానాకు తెలియనివ్వకు ప్రియతమా
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు