మూడు వారాల తర్వాత మహానటి సినిమాను చూశాను. హైదరాబాద్ లోని ఈసీఐఎల్‌.. ఏఎస్‌రావు నగర్‌లోని రాధికా థియేటర్లో మా చెల్లి మాధవి, బావ, తమ్ముడు రాంబాబుతో కలిసి మహానటిని ఎట్టకేలకు -27-05-2018-న చూడగలిగాను. సినిమా చూశాక రోజుల తరబడి ఆ జ్ఞాపకాలే వెంటాడాయి. మహానటికి తెలుగు ప్రేక్షకులు అర్పిస్తున్న నీరాజనం అనిర్వచనీయం. స్వయంగా సినిమాను థియేటర్లో చూస్తే తప్ప ఆ అనుభూతి మనకు అందదు. మూడో [...]
యూట్యూబ్ తెరిస్తే చాలు.. శ్రీరెడ్డికి సపోర్టుగా, వ్యతిరేకంగా తెలుగు సమాజం నిలువునా చీలిపోయిన ముఖచిత్రమే గత కొన్ని వారాలుగా కనబడుతోంది. ఎవరి వైఖరి సరైంది, కాదు అని ఎవరికి వారు తేల్చుకునే సమయంలోనే పరిణామాలు విపరీతంగా మారిపోతున్నాయి. ప్రత్యేక హోదా ఉద్యమమే పక్కకు పోయేంత తీవ్ర స్థాయిలో ఇప్పుడు తెలుగు మీడియా తెలుగు సినీరంగంలో క్యాస్టింగ్ క్యాచ్‌పై ఎడతెగని యుద్ధాలు [...]
బడాబాబులు, వారి కొడుకులు, వారి కాళ్లు నాకే నిర్మాతలు, దర్శకులు రాజ్యమేలుతున్న తెలుగు చిత్ర పరిశ్రమ వాస్తవానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదని తెలుగు రేప్ ఇండస్ట్రీ అని తీవ్రాతితీవ్రమైన ఆరోపణలు చేశారు హైదరాబాద్ మహిళా నేత తేజస్విని. టాలీవుడ్‌‌లో కమిట్‌మెంట్, కాంప్రమైజ్ అనే పదాల చాటున సాగుతున్న రేప్‌ల భాగోతంపై మొన్న మాధవీలత, గాయత్రీగుప్తా నిన్న శ్రీరెడ్డితో మొదలైన [...]
నా చిన్ని జర్నలిస్టు జీవితంలో తొలిసారి నాపై, నా వృత్తిపై సందేహం, అంతకు మించి అసహ్యం కలిగిన క్షణాలివి. మా బాల్యంలో, మా యవ్వనంలో నటన అనే అపురూప కళ ద్వారా మమ్మల్ని చల్లగా పలకరించిన శ్రీదేవితో.. ఇంద్రజగా ఒక లోకోత్తర సౌందర్య పరిమళాన్ని తన కళ్లతో, సాధుత్వంతో ప్రదర్శించిన శ్రీదేవి జీవితంతో, ఆమె కుటుంబంతో గత మూడురోజులుగా ఆడుకున్న మా మీడియాను ఏం చేసినా పాపం పోదన్నదే నా [...]
నేను ‘డెవిల్ ఆన్ ది క్రాస్’ నవలను కెన్యాలోని కామిటి మాగ్జిమమ్ సెక్యూరిటీ జైలులో 1978లో టాయిలెట్‌ పేపర్ మీద రాసాను. నా మరొక పుస్తకం ‘యుద్ధకాలంలో స్వప్నాలు’ను ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా నాగపూర్ హై సెక్యూరిటీ జైలులో ఖైదీగా వుండి అనువాదం చేయడం ఎంత చారిత్రక వైచిత్రి!  - గుగీవా థియోంగీ సీగుల్ పబ్లిషర్స్ ఆహ్వానంపై ఇండియాకు వస్తున్న సుప్రసిద్ధ కెన్యా రచయిత [...]
తెలంగాణలో కవులు, రచయితలు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ప్రభుత్వానికి అమ్ముడుపోయారని, అవార్డులకోసం, రివార్డుల కోసం, శాలువాల కోసం కవులు, రచయితలు ప్రభుత్వం ముందు సాగిలపడిన ఇంత సాంస్కృతిక దిగజారుడుతనాన్ని ఏనాడూ చూడలేదని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారా? తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు జయధీర్ తిరుమలరావు గారు ఇది నిజమే అని ఢంకా భజాయించి చెబుతున్నారు. ఆయన మాటల్లోనే [...]
అజ్ఞాతవాసిని దెబ్బతీసిన (కలెక్షన్లను అలా పక్కనబెట్టండి) మూడు టెర్రిబుల్ మిస్టేక్స్ ఏమిటి అనే అంశంపై కత్తి మహేష్ తార్కిక, హేతుపూర్వక సమాధానాలు కింది లింకులో చూడవచ్చు. సినిమా సమీక్ష అంటే హీరోమీద, దర్శకుడి మీద బండలేయడం కాదంటూ కత్తి ఇక్కడ ఇచ్చిన వివరణ అర్థవంతంగానే ఉంది. చివరి వరకూ చూడండి. కత్తి వర్సెస్ పవన్ అభిమానుల మధ్య కొనసాగుతున్న యుద్ధాలను పక్కనబెట్టి సినిమా [...]
ఛత్తీస్‌ఘడ్ దంతెవాడ జిల్లా పాల్నార్ గ్రామంలో ఆరోజు రాఖీ పున్నమి. కాని ఆదివాసి బాలికల జీవితాల్లోకి నిండు వెన్నెల తొంగి చూడవలసిన తరుణంలో చేదు చీకటి అనుభవం చోటు చేసుకున్నది. ఆ చేదు నాభి దాకా దిగి ఆ రుచి నాలికకో, నోటికో, శరీరానికో కాదు, గుర్తు చేసుకుంటేనే వణికిపోయేలా మనస్సును ఎల్లప్పుడూ అంటుకూనే ఉంటుంది. గుర్తు చేసుకోకపోవడానికి అదేం మరిచిపోయే ఘటననా? ఒక్కరి అనుభవమా? [...]
‘‘నక్సల్బరీ ఏకీ రస్తా’’ ‘‘నక్సల్బరీ గతం కాదు, చరిత్ర, వర్తమానం, భవిష్యత్తుకూడా.’’  ‘‘నక్సల్బరీ ఏకీ రస్తా’’ ‘‘నక్సల్బరీ గతం కాదు, చరిత్ర, వర్తమానం, భవిష్యత్తుకూడా.’’ 92 ఏళ్ళ కురు వృద్ధుడు కొకొణ్‌ మజూందార్‌ తడబడుతోన్న గొంతులోంచి ఏమాత్రం తొట్రుపడకుండా నక్సల్బరీని వ్యాఖ్యానించిన తీరు ఇది. నక్సల్బరీ విప్లవోద్యమ ముద్దుబిడ్డ చారూమజూందార్‌ యావత్‌ భారతదేశ జనావళికి [...]
‘భారతి’ తర్వాత తెలుగు సాహిత్య చరిత్రలో 400కు పైగా సంచికలను పూర్తి చేసుకున్న మాసపత్రిక ‘ప్రజాసాహితి’. నాల్గవ వంతుకు పైగా అంటే 100కు పైగా సంచికలను ప్రత్యేక, విశిష్ట సంచికలుగా వెలువరించటం ద్వారా తన సాంస్కృతికోద్యమ కర్తవ్య దీక్షను ప్రజాసాహితి ప్రదర్శించింది. సరాసరిన ప్రతి నూరు సంచికలలో 11 దాకా ప్రత్యేక సంచికలున్నాయి. ప్రజాసాహితి ప్రత్యేక సంచికలు అంటే ఎక్కువ పేజీలతో, [...]
ప్రేమను పంచే పోరాటంలో ప్రాణాలర్పించి గెలిచావు శ్రీనివాస్: సునయన అత్మవేదన బరువెక్కిన హృదయంతో నేనీ నాలుగు ముక్కలు రాస్తున్నాను. గత బుధవారం, ఫిబ్రవరి 22, 2017 నాకో కాళరాత్రి. ఆ రోజు నేను నా భర్తను, ఆత్మబంధువును, మిత్రుడిని, అత్యంత నమ్మకస్తుడిని కోల్పోయాను. అతనో స్ఫూర్తి ప్రదాత. సహాయకారి. ఒక్క నాకే కాదు... తనని ఎరిగిన వారందరికీ. ఎవరు ఎదురైనా... ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు ఉండేది. [...]
ఎనభై సంవత్సరాల వయస్సులో కూడా అలుపెరగకుండా తెలుగు, తమిళ భాషల్లో అనువాద రంగంలో నిరంతరం కృషి చేసిన సృజనకారుడు ఏజీ. యతిరాజులు గారు. తెలుగు, తమిళ సాహిత్యాభిమానులకు గత 56 సంవత్సరాలుగా వీరు సుపరిచితులే. తమిళనాట వీరి గ్రంథాలు పది ముద్రణలు పొందాయి. అలెక్స్‌ హేలీ– ‘ఏడు తరాలు’, డా. కేశవరెడ్డి ‘అతడు అడవిని జయించాడు’, కళ్యాణరావు ‘అంటరాని వసంతం’ తదితర పుస్తకాలను తమిళంలోకి [...]
తెలుగు జాతి పిల్లలు మునుపటిలా తెలుగు మాధ్యమంలో చదవాలా? లేక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు బుల్లెట్ ట్రెయిన్ వేగంతో తీసుకువస్తున్న ఆంగ్లం మాధ్యమంలో చదవాలా అనే అంశంపై గత కొంతకాలంగా తెలుగు దినపత్రికల్లో, ప్రజాసాహితి వంటి మాస పత్రికల్లో వస్తున్న వ్యాస పరంపరలో తాజా రచన "కూడు పెట్టేది ఇంగ్లీష్ కాదు – నైపుణ్యమే!". ఆంగ్లంలో చదవకపోతే పిల్లలు అంతర్జాతీయ [...]
దేశాధ్యక్షుడు ప్రదర్శిస్తున్న శత్రువైఖరి అమెరికా మీడియాను ఒక్కటిగా చేసింది. ఎంత కండబలాన్ని ప్రదర్శించినా, శ్వేతసౌథం నుంచి ప్రెస్ బృందాన్ని సాగనంపినా ఈ యుద్ధంలో ట్రంప్ విజయం పొందలేడని తేల్చి చెప్పింది. జర్నలిస్టులు ఎవరు, వారెందుకు, ఎవరికోసం ఉంటున్నారు అనే మౌలిక సమస్యల పట్ల పునరాలోచించుకునే అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడికి కృతజ్ఞతలు చెప్పింది అక్కడి మీడియా. [...]
అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి కొన్ని గంటలైనా కాక ముందే లక్షలాదిమంది అమెరికన్ మహిళలు వాషింగ్టన్ వీధుల్లో భద్రకాళులై తిరగబడ్డారు. ట్రంప్ పురుషాధిక్య భావాలకు వ్యతిరేకంగా లేచినిలబడ్డ అమెరికన్ మహిళలకు ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో వేలాది మంది మహిళలు శనివారం మార్చ్ చేస్తూ సంఘీభావం ప్రకటించారు. శుక్రవారం వాషింగ్టన్ డీసీలో ట్రంప్ [...]
దేశభక్తి పేరుతో పెద్ద నోట్ల రద్దు ద్వారా నల్లధనం వెలికితీత ముసుగులో 60 రోజులుగా భారత ప్రభుత్వం, దాని పెద్దన్న నరేంద్రమోదీ ఆడుతున్న దొంగ నాటకం గుట్టు బట్టబయలైంది. దేశంలో ఎక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్ల వెనుక ప్రపంచ పెద్దన్న అమెరికా హస్తం ఉన్నట్టు, అమెరికా చెప్పినట్టుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు.. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌, ఆర్థిక శాఖ [...]
ఇప్పుడు కాదు... ఎమర్జెన్సీ సమయం నుంచి నేను రాజకీయాలను చూస్తున్నాను.  ఇందిరాగాంధీ మొదలుకొని తదుపరి వచ్చిన మురార్జీ, చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, వీపీ సింగ్ నుంచి నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు చెప్పే ఒక స్టాక్ డైలాగ్ "ప్రజలు త్యాగాలు  చెయ్యాలి". * నిజమే.. ప్రజలు త్యాగాలు చెయ్యాలి. * తమకు వచ్చే వంద రూపాయల గ్యాస్ సబ్సిడీని వదులుకోవాలి. * నాయకులు మాత్రం తమకు లభించే ఏ [...]
గుత్తా వెంకట లక్ష్మీ నరసింహారావు అంటే చాలామందికి తెలియదు. జీవీఎల్‌ నరసింహారావు అంటే పత్రికారంగంలో పనిచేసిన కొందరికి తెలుసు. ‘జీవీఎల్‌’ అంటే రాజకీయ పత్రికారంగాల్లో ప్రముఖులు, అప్రముఖులు చాలామందికి తెలుసు. బాల్యదశ (బాలసంఘం) నుండి అంత్యదశ వరకూ కమ్యూనిస్టుగా జీవించిన ఓ కామ్రేడ్‌ జీవీఎల్‌. అరవై నుండి తొంబైవ దశకం చివరి వరకూ పాత్రికేయుడు జీవీఎల్‌ నరసింహారావు. మాజీ [...]
డిసెంబర్ 2న అపోలో ఆసుపత్రిలో చో రామస్వామి ఉన్న రూమ్‌కి వెళ్లి  ఆయనకు ధైర్యం చెప్పి ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పడూ పాజిటివ్ గానే ఆలోచించాలని, మీకు నయం అవుతుందని చెప్పిన జయలలిత రెండురోజుల్లోపే గుండె ఆగిన సమస్యతో చనిపోవడం కోట్లమందిని విభ్రాంత పరిచింది. ఆమెను ఆసుపత్రిలోనే శశికళ ప్రభృతులు హత్యచేశారంటూ వస్తున్న రకరకాల నిందారోపణలు, అభియోగాలను అలా పక్కనబెట్టి ఈ వీడియోను [...]
తమిళనాడు అసెంబ్లీలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత  తెలుగులో మాట్లాడిన అరుదైన క్షణం ఇక్కడ చూడండి. మా తెలుగును కాపాడండి. మా భాషను కాపాడండి. అలాగే ఉర్దూ, మలయాళం, కన్నడ భాషలను కూడా తమిళనాడులో ప్రోత్సహించండి అంటూ హోసూరు ఎమ్మెల్యే గోపీనాధ్ 2012లో తమిళనాడు అసెంబ్లీలో అభ్యర్థించినప్పుడు జయలలిత తమిళ బ్రాహ్మణ యాసతో కూడిన తెలుగులో సమాధానం ఇచ్చారు. అన్ని భాషలను కాపాడడానికి మేం [...]
భారత దేశంలో ఇప్పుడు పొకెమాన్ వీడియో గేమ్ అడి పోకెమాన్‌లను వెదికి పట్టుకునే ఆట చరిత్రలో కలిసిపోయినట్లుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారికి మరో గేమ్‌ను అవసరం కొద్దీ ఆడాల్సి వస్తోంది. అదేమిటంటే, నగరాల్లో, పట్టణాల్లో ఏ ఏటీఎమ్‌లో ఏ సమయంలో డబ్బు దొరుకుతోంది అనే సమాచారాన్ని జీపీఎస్ సహాయంతో తెలుపుతున్న వాల్‌నట్ వంటి యాప్ ‌లను గాలించడం వేలం వెర్రిగా మారింది. పగలు [...]
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు దేశీయ కరెన్సీపై భారతీయులు శతాబ్దాలుగా పెట్టుకుంటూ వచ్చిన విశ్వాసాన్ని పటాపంచలు చేసిపారేసిందా? నోట్లమార్పిడి అనే పెద్దపులిపై మోదీ స్వారీ చేస్తున్నారా? తాననుకున్నది చేయడం తప్ప ఏ ఒక్క విలువనూ, రాజ్యాంగ సంప్రదాయాలను పాటించని మోదీ.. పెద్ద నోట్ల రద్దుద్వారా భారత ప్రజలపై యుద్ధప్రకటనను చేశారా? ఈ ప్రశ్నలన్నింటికీ ప్రముఖ [...]
భారత ప్రజలపైనో, అక్రమార్కులపైనో ఇంకా స్పష్టం కాని సర్జికల్ దాడితో, పెద్ద నోట్ల రద్దుతో దేశం దేశం ఇప్పుడు రోడ్లపైపడి ఊగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాస్త్రంగా భావించి వదిలిన పెద్ద నోట్ల రద్దు ఒక్క దోపిడీదారును, నల్లధన మాఫియాను రోడ్డెక్కించకపోయినా 120 కోట్ల పైబడిన సగటు భారతీయులు మాత్రం ఇప్పుడు అక్షరాలా బ్యాంకుల పాలబడ్డారు. ప్రజలపై సర్జికల్ దాడి విశ్వవార్త [...]
"ప్రతి పనిలో స్వంత లాభం ఏమిటి అని ఆలోచించి, దాన్ని నేర్పుగా సాధించుకోవడమే లక్ష్యమైన స్థితిలో కేవలం తమ సొంత తృప్తి కోసం కాక పీడిత ప్రజల పక్షాన నిలబడే వారి నిజాయితీని పూర్తిగా తప్పుబట్టడం కష్టం. అట్లాంటి వారు దశాబ్దాలుగా మరణిస్తూ ఉండటమూ కలత పెట్టే అంశమే. పారిన రక్తానికీ, సాధించిన మార్పుకూ మధ్య పొంతన లేకపోవడం కూడా సమస్యనే. స్వాతంత్ర్యానికి ముందూ తరువాతా, అటువంటి వారి [...]
ఏఓబీ ఎన్‌కౌంటర్ ప్రజాయుద్ధంపై చేసిన గాయం మానుతున్నట్లుంది. ఊహించని పెను నష్టం ఉద్యమాన్ని, సానుభూతిపరులను కలవరపెడుతున్న నేపథ్యంలోనే ఆర్కే తదితర నాయకత్వం సురక్షితమన్న వార్త అడవినీ, మైదానాన్ని సాంత్వన పరిచినట్లే ఉంది. ఆర్కే ఏమయ్యాడు, ఇతర నాయకత్వం ఏమయింది అనే చర్చ ముగిసింది. మరోవైపున జరిగిన నష్టం పట్ల తీవ్ర బాధను వ్యక్తం చేస్తూనే.. ప్రజాయుద్ధం అంటే ఇదేనా?  ప్రజలు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు