మధుర గాయకుడు హరిహరన్ స్వయంగా స్వరపరిచిన "Horizon(1988)" అనే గజల్స్ ఆల్బం ఉండేది మా ఇంట్లో. హరిహరన్ వాయిస్ మొదటిసారి విన్నది అందులోనే నేను. ఆ ఆల్బమ్ లో మొత్తం ఎనిమిది గజల్స్ ఉంటాయి. అన్ని బాణీలూ హరిహరన్ వే .అన్నీ కూడా చాలా చాలా బావుంటాయి. గజల్స్ మధ్యన వచ్చే సంతూర్ వాదన వింటుంటే మనసు ఎటో గాల్లో తేలిపోతూ ఉంటుంది. అంత బాగా స్వరపరిచారు హరిహరన్. ఆ కేసెట్లో మొదటి గజల్ "ఆజ్ భీ హై మెరే [...]
బజార్లో ఇప్పుడు రకరకాల కంపెనీల వారు 1+1ఆఫర్లతో రకరకాల సూప్స్ అమ్ముతున్నారు. చలి కాలం భోజనం తయారయ్యేలోపూ లేదా సాయంత్రాలు వెచ్చవెచ్చగా సూప్ తాగితే బావుంటుంది. కానీ బజార్లో దొరికేవాటిలో ప్రిజర్వేటివ్స్ వాడతారు. అవి ఎక్కువగా తినడం మంచిది కాదు. సో, ఇంట్లో మనం స్వయంగా చేసుకున్న సూప్ అయితే అన్నివిధాలా ఆరోగ్యకరం. క్రింద రాసిన పధ్దతిలో టమాటా ఇంకా కార్న్, స్వీట్ కార్న్, [...]
మొన్న ఆదివారం పొద్దున్నే న్యూస్ పేపర్లో "రోజ్ కన్వెన్షన్" పేరుతో గులాబీల ప్రదర్శన తాలూకూ ఫోటోలు కనబడ్డాయి. ఆదివారంనాడు మేం తెప్పించుకునే నాలుగు పేపర్లలోనూ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. వివరాలతో ఆర్టికల్ ఏమీ లేదు :( నెట్లో వెతికినా టైమింగ్స్ కాదు కదా, ఏ వివరాలూ కనబడలేదు. ఆఖరికి నోవొటెల్ హోటల్ లో ప్రదర్శన జరుగుతోంది అన్న వివరం ఒక్కటీ పట్టుకుని, ఆ అడ్రస్ వెతుక్కుంటూ [...]
కౌముదిలో 'నవలా నాయకులు' సిరీస్ లో ఆఖరి ఆర్టికల్...’చివరకు మిగిలేది’ నుండి..http://www.koumudi.net/Monthly/2014/december/dec_2014_navalaa_nayakulu.pdfఇన్ని నెలలూ ఆర్టికల్ రాసిన వెంఠనే.. 'చదువుతా విని ఎలా ఉందో చెప్పండని' ఫోన్లో నాన్ననూ, ఇంట్లో మావారినీ కూచోపెట్టి అన్ని ఆర్టికల్స్ వాళ్ళకి వినిపించిన తర్వాతే పంపేదాన్ని! అలా ఓపిగ్గా వినీ నాకు ప్రోత్సాహాన్ని అందించిన వారిద్దరికీ బోలెడు థాంక్యూలు :) మొదట్లో కొన్ని [...]
రోజు ముగిసి, సద్దుమణిగే సమయంలో రేడియో పెట్టుకుని నిద్రపట్టేదాకా వింటూ పడుకునే ఓ అలవాటు చిన్నప్పటి నుండీ! ఇవాళ కూడా ఊపిరి సలపని హడావిడి తరువాత, ఇందాకా రేడియో పెట్టాను.. ఉత్కంఠభరితమైన అమితాబ్ గొంతు ఖంగుమని మోగింది.. గభాలున గుర్తుకొచ్చింది IFFI మొదలైన సంగతి. చేస్తున్న పనులు వదిలేసి వాల్యూమ్ పెంచి, ఆ స్పీచ్  వింటూ కూచుండి పోయాం ఇద్దరం..! ఎంతో ఉత్సాహభరితమైన, [...]
కొన్ని రోజులు ఝామ్మని జారిపోతూంటాయిదూకే జలపాతంలా..కొన్ని రోజులు సాదాగా నడిచిపోతూంటాయినిఠారైన నిలువుగీతలా..కొన్ని రోజులు గజిబిజిగా ప్రశ్నిస్తూంటాయిబోలెడు చుక్కల మెలికల ముగ్గులా..కొన్ని రోజులు నిశ్శబ్దంగా గడిచిపోతుంటాయిస్తబ్దుగా నిశీధిలా.. కొన్ని రోజులు దిశారహితంగా ఉంటాయి అచ్చంగా జీవితంలా..
ఇందాకా నెట్ లో వార్తలు చదువుతుంటే.. అమితాబ్ చెప్పిన వాక్యాలు విని లతాజీ కళ్ళల్లో నీళ్ళు తిరుగాయని, ఆవిడ ట్వీట్ చేసారన్న వార్త కనబడింది. (http://zeenews.india.com/entertainment/celebrity/when-amitabh-bachchan-made-lata-mangeshkar-cry_1500535.html) ఆ వాక్యాలు ఒక ప్రముఖ గజల్ లోనివి. వెంఠనే గజల్ రారాజు మెహదీ హసన్ పాడిన "मोहब्बत करनेवाले कम ना होंगे" అనే ఆ అద్భుతమైన గజల్ వెతుక్కుని విని ఆనందించాను
నాగయ్య గారి 'త్యాగయ్య' సిన్మాలో ఆయన "ఎందరో మహానుభావులు.." పాడాకా, ఆ సభలో ఒకరు "బ్రహ్మానందాన్ని కలిగించారు త్యాగయ్య గారూ.." అంటారు. అలాక నిన్న అనుకోకుండా మాకు బ్రహ్మానందాన్ని కలిగించారు మా గేటేడ్ కమ్యూనిటీ మిత్రులొకరు. నగరంలో ఎన్.టి.ఆర్. గార్డెన్స్ లో పదిహేనురోజులుగా జరుగుతున్న భక్తి టివీ వారి "కోటి దీపోత్సవం" వి.ఐ.పి పాసులు ఇచ్చారు. మొన్న(ఆదివారం) వాళ్ళు వెళ్తూ వెళ్తూ [...]
"మొత్తుకూర..?" ఇదేం పేరని నవ్వుకోకండి. దొండకాయల్ని మొత్తి చేసే కూర కాబట్టి మేం దీనిని మొత్తుకూర అంటాం. ఈజీగా, త్వరగా అయిపోయే కూర ఇది.  ఎలా చెయ్యాలంటే: * ముందర దొండకాయల్ని కడిగి రెండువైపులా కొసలు కట్ చేసేసుకోవాలి. (లేతవైతే చేతితో గిల్లేసినా చాలు. ఒకోసారి అదీ చెయ్యను నేను :)) * పచ్చిమిర్చి, అల్లం తొక్కే రాయి/కల్వం తీసుకుని ఎవరిమీద కోపం ఉందో వాళ్లని తల్చుకుంటూ దొండకాయల్ని [...]
 రెండు నెలల క్రితం మావారికి ఓ చిన్న ఏక్సిడెంట్ అయ్యి కాస్త బాగానే దెబ్బలు తగిలాయి. ముందెళ్ళిన డాక్టర్ మామూలు దెబ్బలే అన్నారు గానీ తర్వాత వెళ్ళిన మరో డాక్టర్ గారు ఏంకిల్ దగ్గర హైర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది. రెస్ట్ గా ఉండమన్నారు. సో, ఓ మూడు వారాలు క్రేప్ బ్యాండేజ్ వేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్కున్నారు అయ్యగారు. అదేదో ఏడ్ లో "మరక మంచిదేగా.." అన్నట్లు తనకు దెబ్బలు తగిలించి [...]
ఇవాళ క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసీ పూజ వేళ వినేందుకు గానూ తులసీ స్తోత్రం, తులసీ మంత్రం, తులసీ నామాష్టకం , తులసీ హారతి.. క్రింద వీడియోస్ లో:(వీడియో లింక్స్ పనిచేయకపోతే పేర్ల క్రింద డైరెక్ట్ యూట్యూబ్ లింక్స్ ఇచ్చాను.) తులసీ స్తోత్రం:http://youtu.be/Dxptk_6cgss తులసీ మంత్రం, తులసీ నామాష్టకం :http://youtu.be/cAvzwnc16Ag తులసీ వివాహం : https://www.youtube.com/watch?v=iWs142GBCVsతులసీ హారతి:http://youtu.be/T9JH9h0qL6M
వంకాయ-కొత్తిమీరకారం చక్కగా నవనవలాడే లేత వంకాయలు మార్కెట్లో దొరికినప్పుడు నాకు గబుక్కున తట్టేది ఒకటే కూర "వంకాయ-కొత్తిమీరకారం". గుత్తి వంకాయలైనా, మామూలు వంకాయలైనా ఫ్రెషా కాదా అనేది వాటి ముచికను బట్టి తేల్చచ్చు. ఫ్రెష్ అయితే ముచిక ఆకుపచ్చగా ఉంటుంది. లేకపోతే కాస్త వాడినట్లు ఉండి రంగు మారిపోయి అసలు ఆకుపచ్చగానే ఉండవు. ఇప్పుడు కొత్తిమీర కారం గురించి చెప్పుకుందాం. [...]
image from google 1990 లో ఉత్తమ హిందీ చిత్రం జాతీయ  పురస్కారాన్ని అందుకున్న చిత్రం "దృష్టి". గోవింద్ నిహలానీ దర్శకత్వంలో శేఖర్ కపూర్, డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలు చేసారు. ఈ చిత్రానికి ప్రముఖ హిందుస్తానీ గాయని కిశోరీ ఆమోంకర్(Kishori Amonkar/किशोरी आमोणकर) సంగీతాన్ని చేసారు. నాలుగు పాటలూ హిందుస్తానీ శాస్త్రీయ సంగీతబాణీలే. పాటలు కూడా ఆమే పాడారు. ఒకటి మాత్రం డ్యూయెట్ ఉంది. అది కూడా
ప్రతి మనిషిలోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి. సందర్భానుసారం, పరిస్థితుల దృష్ట్యా అవి మారుతూ ఉంటాయి. ఒక వ్యక్తిని అతడు చేసే/చేసిన పనుల వల్ల అంచనా వెయ్యడం అనేది సబబు కాదు. అసలలా ఎందుకు చేసాడు అనే కారణాలను అన్వేషించడం, వాటిని తెలుసుకున్న తరువాత ఒకరి వ్యక్తిత్వాన్ని అంచనా వెయ్యడం సరైన పని అని ఈ నవల ద్వారా రచయిత తెలియపరుస్తారు. ప్రపంచమంతా కౄరుడు, నిర్దయుడు, పాషాణహృదయుడు, [...]
ఫోటో కర్టసీ: గూగుల్ పదిహేనవ శతాబ్దానికి చెందిన సంత్ సూరదాసు(सूरदास) ప్రసిధ్ధి చెందిన కవి, వాగ్గేయకారుడు, కృష్ణభక్తుడు. పుట్టుకతో అంధుడైన సూరదాసుకి పేదరికం మూలానో ఏమో తల్లిదండ్రుల లాలన అందక ఆరేళ్ల వయసులోనే ఇల్లు విడిచిపెట్టేసి వ్రజ్ లో స్థిరపడిపోయాడు. శ్రీకృష్ణుడి జన్మస్థానమైన మథురానగరి సమీపంలోని ప్రాంతం ఇది. సుధ్ధాద్వైత గురువు వల్లభాచార్యులు అతడిని [...]
భారతీయ తంత్రీవాయిద్యాలైన వీణ, సితార, సంతూర్ మొదలైనవాటికి తోడుగా పాశ్చాత్య వాయిద్యాలైన వయొలిన్, గిటార్, మేండొలిన్ మొదలైన వాయిద్యాలను కూడా శాస్త్రీయ సంగీత వాదనకు జతపరిచారు మన భారతీయ సంగీతకారులు. విచిత్ర వీణ, సరస్వతి వీణ, రుద్ర వీణ మొదలైన రకరకాల వీణలను శాస్త్రీయ సంగీతకారులు ఉపయోగిస్తారు. పాశ్చాత్య వాయిద్యమైన హవాయీన్ గిటార్ ను కొద్దిగా మార్చి "మోహన వీణ" అనే పేరుతో [...]
అచ్చం పెయింటింగ్ లా ఉంది కదూ..(నిన్నటి తరువాయి.. )దూరాలు వెళ్తే మధ్యాహ్నం లోగా రాలేము.. ఇంట్లో గడిపినట్లు ఉండదని ఈసారి దగ్గరలో ఏమున్నాయని ఆలోచించాం. ద్వారపూడి, బిక్కవోలు లక్ష్మీగణపతి, కడియం మొదలైనవన్నీ ఇదివరకూ చూసేసాం. అయితే ఈమధ్యన మేం పారాయణ చేస్తున్న శివమహాపురాణంలోని 'స్కందోత్పత్తి -కుమారసంభవం' ఛాప్టర్ లో "బిక్కవోలు గ్రామంలో ఉన్న దేవాలయంలోని సుబ్రహ్మణ్యుడు [...]
నాకెంతో ప్రియమైన హిందుస్తానీ గాయకులు శ్రీ పండిట్ జస్రాజ్ గారు... సంగీతఙ్ఞుడిగానే గాక వ్యక్తిగా కూడా ఇష్టుడు నాకీయన. సాదాసీదాగా, చలాకీగా ఉంటారెప్పుడూ. ఎనభై ఏళ్ళ పైబడినా ఇంకా ఎంతో ఎనర్జిటిక్ గా చెక్కుచెదరని చిరునవ్వుతో కనబడుతూ ఉంటారు.  పూర్వజన్మ పుణ్యాన ఇలా భారతావనిపై జన్మించి వారి ఖాతాలో ఉన్న సంగీతామృతాన్ని మనలపై చల్లేసి మాయమైపోయారు మన దేశంలో ఎందరో సంగీత [...]
చిన్నప్పటి నుండీ ప్రతి సెలవులకీ ఓ పాతికేళ్ళపాటు కొన్ని వందలసార్లు విజయవాడ నుండి కాకినాడ, కొన్నిసార్లు అమ్మావాళ్ళ రాజమండ్రి  వెళ్ళాం కానీ ఎప్పుడూ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాముఖ్యమైన ప్రదేశాలు చూడలేదు. పెద్దయ్యాకా ఆ ఊళ్ళూ, అక్కడి గుళ్ళూ గోపురాలూ, వాటి ప్రాముఖ్యత తెలిసే సమయానికి వాటిని చూడాలనుకున్న తడవే చూడలేనంత దూరంలోకొచ్చేసాం. అందుకని ఎప్పుడు అటువైపు వెళ్ళినా [...]
పదిరోజుల క్రితం ఓ పని మీద నా జన్మభూమికి వెళ్ళా.. గోదారినీ, బ్రిడ్జీనీ, ఆ పచ్చని పొలాల్ని చూడగానే అదేమిటోగానీ ఒక్కసారిగా ప్రాణం లేచివచ్చినట్లయింది..  ట్రిప్ తాలూకూ కొన్ని ఫోటోలు.. ఈ క్రింద ఫోటోస్ అన్నీ కూడా ట్రైన్ లోంచీ బస్ లోంచీ తీసినవి..
అర్జెంట్ గా ఊరు వెళ్ళాల్సిన పని వచ్చింది.. అందుకని ఈ టపాతో ఈ సిరీస్ ఎండ్ చేసేస్తున్నాను.. నా లిస్ట్ లో మిగిలినవన్నీ కలిపి ఒకే టపాలో ఇరింకించేస్తున్నాను. ఖాళీగా ఉన్నప్పుడు చూడండి :) ***   ***    *** ఇవాళ మొదట బొంబాయి సినిమాలో నాకెంతో ఇష్టమైన + నా ఫేవొరేట్ సింగర్ పాడిన పాట..  Uyire  Uyire.. Minsara Kanavu తమిళంలో "Minsara Kanavu", తెలుగులో "మెరుపు కలలు",
మిన్నలె, చెలి, రెహ్నా హై తేరే దిల్ మే.. పేర్లతో మూడు భాషల్లోనూ వచ్చిన ఈ సినిమా పాటలు మూడూ భాషల్లోనూ సూపర్ డూపర్ గా హిట్ అయిపోయాయి. సాహిత్యం, భాషల కన్నా సంగీతానికే ఇక్కడ మార్కులు పడ్డాయి. ప్రతి గల్లీలో, ట్రైన్లో, టివీల్లో, రేడియోలో అన్నిచోట్లా రిలీజైన కొన్నాళ్ళ పాటు ఈ పాటలే. సంగీత దర్శకుడిగా "హేరిస్ జైరాజ్" మొదటి సినిమా అనుకుంటా ఇది. ఈ తమిళ్ సాంగ్స్ కేసెట్ పెట్టుకుంటే [...]
పదే పదే కొన్ని పాటల్ని కేవలం సంగీతం కోసమే వినాలనిపిస్తుంది. ఈ సిరీస్ మొత్తం ఆ మ్యూజికల్ ఇంట్రస్ట్ వల్లే. ఏ.ఆర్.రెహ్మాన్ అందించిన అద్భుతమైన ట్యూన్స్ లో కొన్ని బాలచందర్ చిత్రం "డ్యూయెట్" లోని పాటలు. సినిమా ఓ మాదిరిగా ఉంటుంది. కేవలం పాటల కోసం భరించాలంతే. అసలు సినిమా వచ్చిన కొత్తల్లో ఆ తమిళ్ పాటలు ఎన్నిసార్లు విన్నామో లెఖ్ఖలేదు. నాకు ఆ తెలుగు డబ్బింగ్ పాటలు నచ్చక తమిళ్ [...]
"ఉల్లాసం" అని ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వచ్చింది. అజిత్, విక్రమ్, మహేశ్వరి.. ఇంకా రఘువరన్, బాలు కూడా ముఖ్యపాత్రల్లో నటించారు. "ఉల్లాసం" పేరుతోనే తెలుగులోకి డబ్బింగ్ చేసారు. అందులో రెండు మూడు పాటలు బావుంటాయి. కార్తీక్ రాజా నే సంగీతం. అన్నింటిలోకీ "Veesum Kaatrukku " అని ఉన్నికృష్ణన్, హరిణి పాడిన పాటొకటి నచ్చేది నాకు. ఈ సినిమాలో ఫోటోగ్రఫీ కూడా బావుంటుంది. ఈ పాట విన్నప్పుడల్లా నాకు [...]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు