ఈ వేసవిలో పిల్లలను ఆకట్టుకోవటానికి మన దేశం వచ్చిన అమెరికన్ కంప్యూటర్ ఏనిమేటెడ్ ఫాంటసీ 3D చిత్రం "Epic". 'విలియమ్ జాయిస్' రాసిన ఒక పిల్లల పుస్తకం ఆధారంగా రూపొందించబడ్డ ఈ సినిమా ఏనిమేషన్ మాత్రమే కాక 3D కూడా అవడం వల్ల ఇంకా ఆకర్షణీయంగా రూపుదిద్దికుంది. ఇవాళ మా పాపను తీసుకువెళ్ళి చూపెట్టాను. మా ఇద్దరికీ బాగా నచ్చింది. ఈ సినిమా కథ క్లుప్తంగా చెప్పాలంటే మంచి, చెడుల మధ్యన [...]




