కళ్ళు తెరవగానే కిటికీ లో నుంచి కనిపిస్తున్న వెలుతురు. . .గోడ మీద గడియారంలో టైం . . . గాలిలో తేలి వస్తున్న ,పారిజాతం , మాలతీ సౌరభాలు. . . చెట్టు మీది పక్షుల కూతలు . . . రోడ్ మీద ఆకుకూరల వాళ్ళ అరుపులు . . . పక్కింటి నుంచి నల్లాలో పడుతున్న నీళ్ళ చప్పుడు . . .ఎక్కడి నుంచో , కాదు మా ఫోనే రింగవుతోంది :)కింద నుంచి అమ్మ " కమలా లేచావా ? కాఫీ పంపనా ?""వద్దమ్మా నేను కలుపుకుంటాను "కాఫీ గ్లాస్ [...]
" అత్తగారిని హీరోయిన్ గా పెట్టి రాసేసిన భానుమతిగారు . వూళ్ళో వాళ్ళ మీద రాస్తే దెబ్బలాటకి రారూ ! మాఇంట్లో వాళ్ళమీద రాస్తే ఏగోలా ఉండదు అన్న బీనాదేవిగారు , తన బాల్యం .తనఫాక్టరీ నేపధ్యంగా ,తీసుకుని కధలు అల్లిన సోమరాజు సుశీలగారూ ,తన పల్లెటూరూ తన అనుభవాలని కధల రూపంలో చెప్పే పొత్తూరి విజయలక్ష్మీ (అంటే నేనే )వీళ్ళందరూ ఆకోవకే చెందుతారు . వీళ్లకధల్లో ఏముంది అని అంటే ఏమీ ఉండదు . [...]
పుస్తకాలు సద్దుకుంటూ , భాను వైపు చూసాను.అప్పటి కి తనూ లేచింది. పుస్తకాల బాగ్ భుజానికి తగిలించుకొని కూ  అని కూత  పెడుతూ పరుగు తీసాము. అవును మరి అప్పటికే కొంచం ఆలశ్యం అయ్యింది. సోషల్ సారు బెల్ల్ మోగినవెంటనే  వదల్లే . అడ్డం వచ్చిన రాళ్ళను తన్నుకుంటూ పరుగులు పెట్టాము. అప్పటి కే గూడ్స్ వచ్చేస్తోంది. దాని వెంట ఒక్కో పెట్టే తో పాటు పరిగెడుతూ చివరి పెట్టే దగ్గర కోచ్చాము. [...]
అనుకున్నాను కాని చైనావోళ్ళూ మంచోళ్ళే పాపం :) మొన్న హాంకాంగ్ లో దిగాక , కాసేపు అటూ ఇటూ తిరిగాము. బ్రేక్ ఫాస్ట్ చేద్దామని వెళుతూ రెస్ట్ రూం లో కి వెళ్ళాను.రూం లో నుంచి వచ్చి వాష్ బేసిన్ దగ్గరకు వెళుతుంటే అక్కడ ఉన్న స్వీపర్ ముసలమ్మ ఇంకో బేసిన్ వైపు చూపించింది.అక్కడికి వెళ్ళమంటోందనుకొని అటువైపు వెళ్ళాను.అక్కడ నా హాండ్ కర్చీఫ్ పెట్టి ఉంది.ఓ కింద పడిందేమో ననుకొని , అది [...]
మా మామయ్య చింతలపాటి వెంకట కృష్ణారావుగారు మా అమ్మకు బాబాయిగారి అబ్బాయి,అన్నయ్య.మా అత్తయ్య చింతలపాటి సీత మానాన్నగారి ఏకైక చెల్లెలు,మా మేనత్త.మామామయ్య సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి.ట్రైబల్ వెల్ఫేర్ డైరక్టర్గా రిటైర్ అయ్యారు.ఉద్యోగం చేస్తున్నరోజులల్లో పసర,నాగోలు,రంపచోడవరం,కొత్తగూడెం దగ్గర, బూర్గుంపాడ్ దగ్గరి వివిధ గ్రామాలల్లో అనేక సంక్షేమకార్యక్రమాలు [...]
స్వాహాదేవి మీద కోపం వచ్చిందో, చాయాదేవి మీద కోపం వచ్చిందో సూర్యాదేవ్ గారు తెగ మండిపోతున్నారు!చివరాఖరుకి వరణుడు సంధి కుదిర్చి చల్లబర్చాడు!హమ్మయ్య అనుకుంటూ బాల్కనీ లోని నా చేర్ లో సెటిల్ అయ్యాను.పారిజాతాల సీజన్ ఐపోయినట్లుంది అక్కడక్కడా పూసి పరిమళాలు వెదజల్లుతున్నాయి.కాంపౌండ్ వాలంతా అల్లుకొని విరగపూసిన రాధామాధవాల నుంచి సన్నని సువాసనలు వస్తూ ఏవో జ్ఞాపకాలను [...]
అలా జరిగింది!పుస్తకావిష్కరణసభలకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు , పి.యస్.యంలక్ష్మిగారు, ఇక నెక్స్ట్ మీదేఅనేవారు.నాదా? నావెవరు కొంటారండి.ఆ పుస్తకాలు నేనుఅమీర్పేట చౌరస్తాలో ట్రాఫిక్ పోలీస్ పక్కన నిలబడి అందరి కీ పంచాల్సిందే అనటముమాకు అలవాటైపోయింది.ఆ మధ్య ఒకసభలో కస్తూరి మురళికృష్ణ గారు ,మీవెన్ని కథలయ్యాయండి అని అడిగారు.దాదాపు పదిహేనండి అన్నాను.ఐతే ఇక మీకథలు బుక్ [...]
కొన్నిపాత విషయాలు తలుచుకుంటే చాలా గమ్మత్తుగా అనిపిస్తాయి.అసలు అప్పుడు అంతపిచ్చిమొహంలా ఎలా బిహేవ్ చేసానాఅనిపిస్తుంది.అలాంటిదే ఓ సంఘటన. ఇదీబ్లాగ్ ల కు సంబందించిందే.నాకు లాప్ టాప్ఇచ్చినప్పుడు మా అబ్బాయి చాలాస్ట్రిక్ట్ గా,తెలీని వాళ్ళతో మాట్లాడకు వగైరా వగైరా చాలా చెప్పాడు.నాకూ, మా మనవరాలికీ , మనవడి కీ కలిపి ఒకేలాప్ టాప్ ఇచ్చాడు.అందులోనాకు అడ్మింట్రేషన్ పవర్ కూడా [...]
అంతర్జాతీయమహిళా దినోత్సవం .అది2009 మార్చ్ 8.పొద్దున మా చెల్లెలు ఫోన్చేసి"అక్కా ఈ రొజు ఆంధ్రజ్యోతిపేపర్ లో బ్లాగ్ లగురించి ఇచ్చారు చూసావా ?" అంది.ఎక్కడా ఇంకాపని కాలేదు చూస్తాను అని వెంటనే చూసాను.అరుణాపప్పు అందులో బ్లాగ్ ల గురించి, అందులోమహిళా బ్లాగుల గురించి రాసింది.దానిలోనే "కూడలి" అనే చోట అన్నితెలుగు బ్లాగ్ ల పోస్ట్ లుఏ రోజు వి ఆరోజు వస్తాయని చదివి కూడలి లో నా [...]
ఓసారి సి.ఉమాదేవిగారు బ్లాగ్ పుస్తకం అవిష్కరిస్తున్నారట, వెళుదాం వస్తారా అని ఫోన్ చేసి అడిగారు.సరే నన్నాను.ఉమాదేవిగారి శ్రీవారు మమ్మలిని అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ వస్తానని వెళ్ళారు.అప్పటికి కొద్ది మంది ప్రమదావనం సభ్యుల తో తప్ప వేరే బ్లాగర్స్ ఎవరితోనూ పరిచయం కాలేదు.ఉమాదేవిగారికీ ఎవరూ తెలీదు.అలాగే వెళ్ళాము.అప్పటికే కొంతమంది వచ్చి హాల్ లో ఉన్నారు.అందులో ఓ అబ్బాయి నా [...]
కొత్థ లాప్ టాప్ మీద టైప్ చేస్తుంటే మాలా మమ్మీ బాగానే టైప్ చేస్తున్నావే అన్నాడు సుపుత్రుడు."అవును రా చేయి పూర్తి తగ్గిపోయింది "చూడు అని చేతిని అటు తిప్పీ ఇటుతిప్పీ వాడు చూడకుండా కష్టం మీద చేతిని వెనక్కి తీసికెళ్ళీ హాపీగా చూపించేసాను."చేయే కాదు మామ్మ్ చూడటానికి కూడా ఫ్రెష్ గా ఉన్నావు.ఆక్టివ్గా కనిపిస్తూ ఇదవరకటి మాలా మమ్మీ లా ఉన్నావు ."అని మెచ్చుకున్నాడు.అమ్మయ్య ఇక [...]
మా ఏమండీ నా మతిమరుపుకు సూచించిన పరిష్కారం , ఫిబ్రవరి నెల తెలుగుతల్లికెనడా అంతర్జాలపత్రిక లో వచ్చిన నా కథ " అలారం మ్రోగింది." లో చదివి మీ అభిప్రాయం చెప్పగలరు.http://www.telugutalli.ca/#
మొన్నసాటర్ డే ఈ టివి లో వచ్చిన మాప్రమదాక్షరి ప్రోగ్రాం చూడటం మర్చిపోయాను.చెప్పానుగా చేతికి దెబ్బ తగిలినప్పటి నుంచీ అన్నీ మర్చిపోతున్నానని.ఎవరో అన్నారు అందరికీమెదడు మోకాల్లో ఉంటే రచయితలకు మణికట్టులో ఉంటుంది. అందుకని నువ్వు అన్నీ మర్చిపోయావు అని.ఓహో అనినేనూ అలానే ఫిక్సైపోయా :) అసలు విషయానికోస్తే , ఆప్రోగ్రాం వచ్చిన రోజు లక్ష్మిగారు మీవడలు టి.వీ లోబాగా పడ్డాయండోయ్ [...]
చాలా రోజుల తరువాత ఈ మధ్య బ్లాగ్ ఓపెన్ చేసాను.ఓకటి రెండు పోస్ట్ లు వేసాను.వాటికి ఇంకో ఒకటి రెండు కామెంట్స్ మేయిల్ లో వస్తే , వాటిని పబ్లిష్ చేసినప్పుడు  ఎంత హాపీగా అనిపించిందో! తీర్థం లో తప్పిపోయి , మళ్ళీ ఇల్లు చేరుకున్న ఫీలింగ్ వచ్చింది :)2008 డిసెంబర్ లో బ్లాగ్ స్టార్ట్ చేసాను.అప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ , ఆదివారం అనుబంధం లో అరుణ పప్పు బ్లాగ్ ల గురించి వ్రాశిన ఆర్టికల్ [...]
20-1-2016 గోతెలుగు.కాం వెబ్ మాగ్జిన్ లో వచ్చిన నా కథ "సాబ్ అందర్. . .  అమ్మా బాహర్ . . . . దర్వాజా బంద్" కథ.http://www.gotelugu.com/issue198/5125/telugu-stories/sab-andar-amma-bahar-darvaja-band/ధడ్ . . . ధఢ్ . . . ధఢ్ . . . ధడాల్ . . . . .పెద్ద చప్పుడు తో తలుపు తెరుచుకోగానే ఆజ్ హవా బహుత్ హైనా అమ్మా , నిచే కాభీ కొండీ లగాలో తబ్ నై ఖులేగా అని చెప్పి జహీరా వెళ్ళి పోయింది. ఓరినీ గాలికి తెరుచుకుందా ఈ తలుపు ! ఏ దొంగోడు వచ్చాడో, ఏ దయ్యమో వచ్చిందోనని ఎంత హడలి [...]
మనుషులు మమతలు అంటారు కాని, మనుషులతోటే కాదు, మొక్కలు, వస్తువులు, యిల్లు, ఊరు అన్నింటి తోనూ కొద్దికాలం కలిసి ఉంటే చాలు వాటి మీద బోలెడంత మమత పెరిగిపోతుంది.అవి ఏవి వదిలేయాలన్నా ఎంత ధుఖం వస్తుందో.:( కాని తప్పదు .దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం మా మనవడి మీద పంతం తో కంప్యూటర్ నేర్చుకున్నప్పుడు, నాకు మా మనవడి కి, మనవరాలికి అందరికీ కలిపి షేరింగ్ ఆటోలా ఒకే లాప్ టాప్ ఉండేది.ఓ [...]
ఓ పక్క పియస్యం గారుకొబ్బరినీళ్ళల్లో జలకాలాడుతున్నారు అదే గ్లాస్ లల్లోపోస్తున్నారు.శ్రీశాంతి తను తెచ్చిన ఆలూబజ్జీలు అందరిమీదా ప్రయోగించేందుకు ఆయత్తమవుతోంది(పాపం మొదటిసారి చేసిందిట).నేను నా వడలువేడిచేసి , అల్లం పచ్చడితో వడ్డించేందుకుతయారు చేసుకుంటున్నాను.కొంత మంది బల్లమీద అన్నీ సద్దుతున్నారు.కొంతమందికుర్చిలల్లో కాళ్ళు బార్ల జాపుకొని కూర్చొనిథాఫీగా [...]
అదేమిటో సినిమా కు వెళ్ళిన కాసేపటికే మా ఏమండీ కి తెగ నిద్ర వచ్చేస్తుంది.హాయిగా సీట్ వెనకకు ఆనుకొని నిద్రపోతారు.జ్యోతి సినిమా కు వెళ్ళినప్పుడు , అందులో జయసుధ కాసేపు ఫ్లాష్ బాక్ లో కాసేపు ఫూచర్ లో ఉంటుండుండేది.ఏమండీ కి మధ్య మధ్య మెలుకువ వచ్చినప్పుడు అదేమిటీ ఇందాక జయసుధ మురళీమోహన్ తో డ్యూఎట్ పాడుతోంది కదా ఇప్పుడు గుమ్మడిని ఏమండీ అని పిలుస్తోంది ఏమిటీ అని కన్ ఫ్యూజ్ [...]
16-12-2016 గో తెలుగు.కాం అంతర్జాలపత్రిక లో వచ్చిన నా కథ "విధివిన్యాసాలు."http://www.gotelugu.com/issue193/4989/telugu-stories/vidhivinyasalu/
మాలిక ఈ నెల డిసెంబర్ 2016 లో , ప్రమదాక్షరి కథామాలిక స్నేహం శీర్షిక లో నేను వ్రాసిన కథ "గుండెకీ గుబులెందుకు?" పబ్లిష్ అయ్యింది. మాలిక ఎడిటర్ జ్యోతిగారికి,నా కథ ను చక్కగా విశ్లేషించిన మంథా భానుమతి గారి కి ధన్యవాదాలు.http://magazine.maalika.org/2016/12/10/%E0%B0%97%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B1%86%E0%B0%95%E0%B1%80-%E0%B0%97%E0%B1%81%E0%B0%AC%E0%B1%81%E0%B0%B2%E0%B1%86%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0/
ఈ నెల విహంగ పత్రికలో శ్రీమతి సోమరాజు సుశీల గారు వ్రాసిన "ముగ్గురు కొలంబస్ లు" పుస్తకము పై నా సమీక్ష.http://vihanga.com/?p=17080#sthash.lp1Omn9y.dpbs
మొన్నోరోజుఓ పెళ్ళికి వెళ్దామని బయిలు దేరాము.దారిలోమావారు ఓ ఫొటో స్టూడియోదగ్గర ఆపారు.ఎందుకండీ అంటేనా పాస్పోర్ట్ ఫొటోలు లేవు తీసుకోవాలి అన్నారు. ఓహో అనుకున్నాను.నేను కార్ లోనేకూర్చుందామనుకున్నాను. నువ్వూ రా అన్నారు.ఎందుకండీఅంటే చెప్తాగా అన్నారు.పాపం వంటరిగా వెళ్ళటానికిభయపడుతున్నారేమో ,సాయం కావాలేమో అనుకొనివెళ్ళాను.ఆయన ఫొటో షెషన్లోపల జరుగుతుండగా నేను బయట [...]
ఓ సంవత్సరం క్రితం మావారికి బైపాస్ అయ్యింది.దాని తరువాత ఆయన బరువు , తగ్గి, సుగర్ లెవెల్ తగ్గించాల్సిన అవసరం వచ్చింది.దాని తో అపోలో హాస్పెటల్ లో ఉన్న ఫిథియోథెరొఫీ సెంటర్ లో డాక్టర్ సలహాతో చేరారు.అక్కడి డైటీషియన్ మావారికి డైట్ చార్ట్ ఇచ్చింది.సో దానిని తూచా తప్పకుండా పాటించాను.కాకపోతే ఆ డైట్ పాటించాక మావారి బరువు పెరిగి సెంచరీకి చేరువైంది.సరే ప్రతివతాధర్మం తప్పకుండా [...]
 ఈవారం 18-2-2016 ఆంధ్రభూమిలో వచ్చిన నా కథ "లావొక్కింతయులేదు." చదవని వారు కాస్త ఓపిక చేసుకొని చదివి మీ అభిప్రాయం చెబుతారు కదూ :)మీ వీలు కోసం స్కాన్ పేపర్ ఓపెన్ చేసి కష్టపడకుండా కథ కూడా పోస్ట్ చేస్తున్నాను. ఇక మీ ఇష్టం.                             లావొక్కింతయులేదు!మాలాకుమార్"నువ్వసలునా డైట్ గురించి సరిగ్గాపట్టించుకోవటము లేదు."మావారు నిష్టూరంగా [...]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు