పక్షి రెక్కల వేగం పెంచింది చూడు.  అంతాన్ని  సమీపిస్తుంది.నా జీవిత పాత్రని మధువుతో త్వరగా నింపుచెట్ల మీద, కంచెల  నిండా, ఉదయాన్నే ఎన్ని పూవులువిచ్చుకొని, గాలిలో నవ్వుతున్నాయో చూడుపక్కనే ఎన్ని అందమైన పూవులు వాడి,ధూళిలో నశించాయో అదీ చూడు.
బాపుగారికి గల రామభక్తి గురించి వినటం వల్ల చాలా ఆశలతో ఈ సినిమాకు వెళ్ళిన నాకు కొంచెం నిరాశే కలిగిందని చెప్పాలి. బాపుగారు మొదట నుండి స్త్రీ పక్షపాతే ననుకోండి ముత్యాలముగ్గు లో కానీ మిస్టర్ పెళ్ళాంలో కానీ సున్నితంగా మగవారిని విమర్శిచారు. బాపుగారి స్త్రీ పాత్రలు అభిమానవతులు, తెలివైన వారు, కష్టజీవులు ఎలాగైనా మగపాత్రలకంటే ఒక పిసరు ఎక్కువ గానే ఉంటాయి వాళ్ళ కారెక్టర్లు. [...]
మీరు పరిగెత్తి ఎన్నాళ్ళయింది?తాడాట ఆడగలనని అనుకొంటున్నారా?ముఖ్యంగా మీ వయసు ముప్పైపైన అయినట్లయితే  మీరు క్రీడాకారులు కానట్లయితే, ఈ ప్రశ్నలు అడిగినందుకు నన్ను చిత్రంగా చూస్తారు. నేనూ నాలుగు నెలల క్రితంవరకూ అలాగే అనుకొనేదాన్ని. దినాజ్ ఫిట్నెస్ సెంటర్ లో నేను గడిపిన ఈ మూడు నెలలూ నా ఆలోచనా విధానాన్ని, నా జీవన శైలిని ఇంతగా మారుస్తాయని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా [...]
మహిళా దినోత్సవం నాడు నాకు నా బుజ్జి తల్లి చూపించిన చిట్టి చిట్టి ఆప్యాయత, చాలా రోజుల తర్వాత ఒక పోస్ట్ తీరిక చేసుకొని అయినా రాయాలని గట్టిగా అనిపించేలా చేసింది.నేనూ ఎంతో మంది అమ్మాయిల్లాగే ఎందుకో తెలియదు కానీ మొదటి సారి కడుపుతో ఉన్నప్పుడు అబ్బాయి కావాలనే కోరుకొన్నాను.  అమ్మాయి పుట్టిందని నిరాశ పడలేదు కానీ తర్వాత అయినా అబ్బాయి అయితే బాగుండని అనుకొన్న మాట నిజం. మా [...]
శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు హైదరాబాదులో గరుడపురాణం పై చెప్పిన ప్రవచనం రోజూ భక్తి టివి లో 8.30 ని లకు ప్రసారం అవుతున్నది.నిన్న మొదటి భాగంలో ఆయన చెప్పిన విషయాల్లో కొన్ని ముఖ్యమైనవై మీతో పంచుకొందామని పించింది.హిందూ ధర్మానికి మూల గ్రంధాలు, మూడు రకాలు, అవి శృతులు (వేదాలు), స్మృతులు (ధర్మ గ్రంధాలు), పురాణాలు. మొదలెక్కడో తెలియని హిందూ ధర్మ సూత్రాలను ద్వాపర యుగాంతంలో వేద [...]
గణపతి:శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజంప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే!అగజానన పద్మార్కం గజానన మహర్నిశంఅనేక దంతం భక్తానాం ఏక దంతముపాస్మహేవక్రతుండ మహాకాయ కోటి సూర్య సమ ప్రభనిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదాతులసి:యన్మూలే సర్వ తీర్ధాని యన్మధ్యే సర్వ దేవతాయదగ్రే సర్వ వేదాస్చ తులసీం త్వాం నమోనమ:సరస్వతి దేవి:సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ [...]
పంచ ప్రాణాలు ప్రాణ వాయువు: శ్వాస ద్వారా హృదయానికి తర్వాత అన్ని కణాలకు చేరే వాయువుఅపాన : ఊపిరితిత్తులు, విసర్జన అవయవాలద్వారా వ్యర్ధ పదార్దములు పంపే వాయువువ్యాన:  శరీరం యొక్క సంకోచ వ్యాకోచాలకు కారణంఉదాన: వాక్కు రూపంలో ఉండేవాయువుసమాన:  జీర్ణమవటానికి ఉపయోగించే వాయువుఉప ప్రాణాలు నాగ : త్రేన్పు గా వచ్చే గాలికూర్మ : రెప్పవేయటానికి కారణమైన గాలికృకల :  తుమ్ము ధనంజయ [...]
అక్షరార్చన: అక్షరంబు వలయు కుక్షి జీవనులకుఅక్షరంబు జిహ్వకు ఇక్షు రసముఅక్షరంబు తన్ను రక్షించు గావునఅక్షరంబు లోక రక్షితంబు
 చెన్నకేశవ స్వామి గుళ్ళు పల్నాడు ప్రాంతంలో ఐదు ఉన్నాయంటారు.ఇది మాచర్ల చెన్నకేశవ స్వామి గుడి, తేరు., ఇక్కడ స్వామి మీసాలతో, ఖడ్గంతో, శంఖ చక్రాలతో, నగుమోముతో ఉంటాడు.క్రిందిది మార్కాపురం చెన్నకేశవ స్వావి గుడి, అక్కడి అందమైన ఆంజనీయుడు. ఇక్కడ కూడా స్వామి చక్రధారియై దుష్టశిక్షణ కు సిద్ధంగా ఉంటాడు. మాచర్ల లోని తేరు లాంటిదే ఇక్కడా ఉంటుంది.  ఈ రెండు గుళ్ళల్లోనూ చైత్ర [...]
నా జీవితం లో అత్యంత మధురమైన రోజుల్లొ కొన్ని మా పిల్లల పసితనపు రోజులు.  అమాయకమైన వాళ్ళ నవ్వులు, నిద్రపుచ్చటాలు, బుజ్జి బొజ్జలు నింపటాలు మర్చిపోలేని అనుభూతులు.  ఆడపుట్టుక పుట్టినందుకు గర్వపడే రోజులు.అప్పుడు నేను పాడే జోలపాటలు కొన్ని గుర్తుకు వచ్చాయి. కొత్త తల్లులకు ఉపయోగిస్తాయని ఇక్కడ వ్రాస్తున్నాను.ఇవన్ని ఒక్కక్క లైన్ పాటలే అన్ని కలి పి  పాడవచ్చు లేక ఒకటే [...]
నేను కుల వ్యవస్థను గూర్చి చర్చించ గలిగినంత చరిత్ర చదివిన దాన్ని కాదు.కాని సమకాలీన పరిస్థితులను, మా తాత గారి నాన్న గారి తరం వరకు వాళ్ళు చెప్పిన నేను గమనించిన విషయాల అవగాహనతో ఈ విషయం పై అనిపించిన విషయాలు చెప్పాలనుకొంటున్నాను.శారద గారు ఎప్పుడో 'ఈ మాట'లో రాసిన కధ  లొ చెప్పినట్లు, కుటుంబం పరిధి దాటి, కులాలను, ప్రాంతాలను,  వృత్తులను, మతాలను, దేశాన్ని, జాతులను, భాషను [...]
పండు తింటున్నప్పుడు గింజ పారేస్తాం. పండు రుచినే గుర్తుపెట్టుకొంటాం కాని గింజను కాదు, అలాగే ప్రతి మనిషిలో చెడు గింజలా మంచి గుజ్జులా ఉంటుంది. మనం తోటి మనిషి విషయంలో మాత్రం చెడు అనే గింజను గుర్తు పెట్టుకొని మంచి అనే గుజ్జు వదిలేస్తాం. అంటూ రామ్ ఎడిటొరియల్ లో చెప్పిన ఈ వారం సాక్షి ఫన్ డే లో ఖదిర్ బాబు అద్బుతమైన శైలిలోరాసిన ఈ  కధ మిస్ కాకండి. [...]
భారతీయత కలిసిన ఇస్లాము మతమే సూఫీ సంప్రదాయం.ఇది ప్రేమ తత్వాన్ని భోదిస్తుంది. భగవంతున్ని ప్రేయసిగా భక్తుడు ప్రియుడుగా భావిస్తూ భగవదైక్యాన్ని భోదిస్తుంది. ఇది రాధా మాధవ తత్వాన్నికి దగ్గరగా ఉంటుంది. కృష్ణ భక్తి తత్వంలో భగవంతుడు పురుషుడు భక్తుడు స్త్రీ.  మానవుడు కోరదగ్గ పొందదగ్గ తపించదగ్గ  ఒకే వక్తి భగవంతుడు, ఇతరములన్ని వ్యర్ఢము అని చెప్పటమే ఈ రెండు మతాల [...]
ఎంతో మందికి లా నాకూ ఈ మధ్య రేడియో ఫ్రెండ్ అయిందండి.హైపర్ సిటి, రాక్ సిటి హైదరాబాదు లో వచ్చేకొన్ని FM  ల గూర్చి ఈ చిన్ని పోస్టు.నాకు బాగా నచ్చేవి బిగ్ లో శేఖర్ గజిబిజి పజిల్స్., శేఖర్, జో ల బాబా సూక్తులు (ప్రైజ్ గా బాబా బుర్ర లాంటి ఖాళి CD ఇస్తారట)సిటి లో వంశి, శివ్ కామెడి అదుర్స్.ఈ రోజు సిటి జోక్స్:-"కుక్కలు పెళ్ళి ఎందుకు చేసుకోవు?  వాటిది ఆల్ రడీ కుక్క బతుకే కదా""సిగెరెట్లు [...]
ఉదయాన్నే రోజూ చదువుకో దగ్గ శ్లోకాలు . చిన్ని పదాలతో పిల్లలు నేర్చుకోవటానికి వీలుగా ఉంటుంది.౧. వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనందేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం౨. అతసి పుష్ప సంకాశం హార నూపుర శోభితం రత్న కంకణ  కేయూరం కృష్ణం వందే జగద్గురుం౩. కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననంవిలసత్ కుండల ధరం కృష్ణం వందే జగద్గురుం౪. మందార గంధ సంయుక్తం చారు హాసం చతుర్భుజంబహి: [...]
భారత దేశం ఎందఱో విదేశీయులను ఆకర్షించ టానికి ముఖ్య కారణము ఇక్కడి భౌగోళిక పరిస్థితులు. మన దేశం లో పారే నదులు ఇన్నికోట్ల ప్రజలకు అన్నపానాలకు లోటు లేకుండా చేస్తుంటే ఈ దేశ గర్భములోని రత్నాలు మన పై ఇతర ప్రాంతాలకు ఈసు కలిగేట్లు చేస్తున్నాయి. అతి ప్రాచీనమైన మన సంస్కృతి భగవద్దత్తమైన ఈ ప్రకృతి వనరులను అనుభవించటమే కాక వాటిని గౌరవించ మని నేర్పుతుంది.అందుకే హిందూ మతంలో [...]
తర్కశాస్త్రంలో:ఉక్షేపణంఅవక్షేపణంఅకుంచనంప్రసారణంగమనంవైద్యశాస్త్రంలో:వమనం - వాంతి (vomiting / Emesis ) జీర్ణం కాని వ్యర్ద పదార్ధాలను బయటకు పంపటానికి ఈ పద్దతి ఉపయోగిస్తారు. సోరియాసిస్ వంటి చర్మ వ్యాదులు, అసిడిటీ లాంటి జబ్బుల ఉపశమనానికి ఇది ఉపయోగిస్తుంది. మొండెం ని మూడు భాగాలుగా అనుకొంటే పై భాగానికి దీని ప్రభావం ఉంటుంది. రేచనం - విరేచనం (purging) - అర్థరైటిస్ మొదలైన కండరాల నొప్పులు, [...]
అవునండి బాపు రమణ ల అద్భుతం గూర్చే నేను చెప్పాలనుకొన్నది.ఈ మూవీ నేను ఒక సారి దూరదర్శన్  లో చూసి ఛాలా ఉద్వేగానికి లోను అయ్యాను.ఆ సినిమాలో వాణిశ్రీ క్యారెక్టర్ ఆణువణువూ ఇన్స్ప్రిరింగ్ గా ఉంటుంది.  ఆమె వ్యక్తిత్వం చాల ఉన్నతం.సూర్య కాంతం గారి నస పడటంలో, ఇంట్లో ఆర్ధిక స్తితులు భరించటం లో, భర్త చాతగానితనం చెప్పుడు మాటలు వినటం అర్ధం చేసుకోవటం లో, కాముకుడైన భర్త [...]
 చలం అనువదించిన ఖయ్యాం రుబాయిల్లోంచి కొన్ని.. పక్క మీద నేను ఇంకా కలలు కంటూ ఉండగానేవినబడింది మహనీయమైన ఆ పానసాల లోంచి ఓ కేకలేవండి పిల్లల్లారా లేవండి ఉదయమైందిగిన్నె లోని జీవన మధువు ఎండి పోక ముందే గిన్నెల్ని నించుకోండినింపు, ప్రాణాన్ని మధువుతో నింపు శీతాకాలపు పశ్చాత్తాప వనాన్ని వసంతాగ్ని లో మంటబెట్టునింపు నా పాత్రను నింపు.కాల విహంగానికి నా జీవిక పధం లో [...]
పక్క మీద నేను ఇంకా కలలు కంటూ ఉండగానేవినబడింది మహనీయమైన ఆ పానసాల లోంచి ఓ కేకలేవండి పిల్లల్లారా లేవండి ఉదయమైందిగిన్నె లోని జీవన మధువు ఎండి పోక ముందే గిన్నెల్ని నించుకోండి
నింపు, ప్రాణాన్ని మధువుతో నింపుశీతాకాలపు పశ్చాత్తాప వనాన్ని వసంతాగ్ని లో మంటబెట్టునింపు నా పాత్రను నింపు.కాల విహంగానికి నా జీవిక పధం లో ఎగరటానికిఎంతో దూరం లేదు.
రచన: మహమ్మద్ ఇక్బాల్ (ఉర్దూలో) సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారాహమ్ బుల్ బులే హై ఇస్‌కే, యే గుల్ సితా హమారా|| పరబత్ వో సబ్ సే ఊంఛా హమ్‌సాయా ఆస్‌మాన్ కావో సంతరీ హమారా ! వో పాస్‌బా హమారా||గోదిమే ఖేల్‌తీహై ఇస్‌కీ హజారో నదియాగుల్‌షన్ హై జిన్‌కే దమ్‌సే రష్‌కే జినా హమారా||మజ్ - హబ్ నహీ సిఖాతా ఆపస్‌మె బైర్ రఖ్‌నాహిందీ హై హమ్ వతన్ హై హిందుస్తాన్ హమారా||
జాతీయ గీతము రచన: శ్రీ బకించంద్ర చటోపాధ్యాయ గారు (ఆనందమట్ నుండి )వందేమాతరంసుజలాం సుఫలాం మలయజ శీతలామ్సస్యశ్యామలాం మాతరం ||వందే||శుభ్రజ్యోత్స్నం పులకిత యామినీమ్పుల్లకు సుమిత ద్రుమదల శోభినీమ్సుహాసినీం సుమధుర భాషినీంసుఖదాం వరదాం మాతరం ||వందే||కోటి కోటి కంఠ కలకల నివాద కరాలేకోటి కోటి భుజై ధృత ఖర కరవాలేఅబలాకేనో మాం ఎతో బలేబహుబల ధారిణీం నమామి తారిణీంరిపుదల వారిణీం మాతరం [...]
భారత జాతీయ గీతము రచన : శ్రీ రబీంద్రనాధ్ టాగూరు గారు జన గణ మన అధినాయక జయహే!భారత భాగ్య విధాతా!పంజాబ, సింధు, గుజరాత, మరాఠా,ద్రావిడ, ఉత్కళ, వంగ!వింధ్య, హిమాచల, యమునా, గంగ,ఉచ్చల జలధితరంగ!తవ శుభనామే జాగే!తవ శుభ ఆశిష మాగే!గాహే తవ జయ గాథా!జనగణ మంగళదాయక జయహే భారత భాగ్యవిధాతా!జయహే! జయహే! జయహే! జయ జయ జయ జయహే!
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు