లోగడ ప్రకటించినట్లుగా ప్రముఖ కవయిత్రి "శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ" గారికి "నండూరి రామకృష్ణ మాచార్య స్మారక పద్యకవితా పురస్కార" ప్రదానోత్సవం నండూరి వారి జయంతి సభలో జరుగుతుంది. ఈ నెల 29న జరిగే ఈ సభకు జంట నగరాలలోని‌ సాహిత్యాభిమానులందరికీ ఇదే మా ఆహ్వానం!- డా. ఆచార్య ఫణీంద్ర
నిజాం వ్యతిరేక స్వాతంత్ర్య సమర యోధులు, ప్రముఖ రచయిత, హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం కార్యదర్శిగా గత 50 ఏళ్లుగా విశిష్ట సేవలందించిన డా. ఎమ్.ఎల్. నరసింహారావు గారు 12/2/2016 నాడు ఉదయం పరమపదించారు. వారి సంతాప సభ ఈ రోజు భాషానిలయంలోనే .. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కే. వి. రమణాచారి గారి అధ్యక్షతన జరిగింది. ఆచార్య రవ్వా శ్రీహరి గారు, ఆచార్య ఎస్. వి. రామారావు [...]
"తప్పుడు శబ్దముల్ పలుక తప్పని నే ననబోను గాని, మా ఒప్పుగ నున్న శబ్దముల నుమ్మడి రాష్ట్రమునందు నేళ్ళుగా నెప్పటి కప్పు డేల అవహేళన జేసి"రటంచు బాధతో  జెప్పిన నా పయిన్ విషము జిమ్ము ఖలుల్ నశియింత్రు భారతీ! 
ధర్మ మెటనుండునో, అట దైవముండు!దైవ మెవరి పక్షమొ, వారినే విజయముతప్పక వరించు!! కావున ధర్మము నెపుడాచరించ వలయు ప్రజ లవనియందు!!!
గెలిచి  వత్తునేని, కేల జాతీయ పతాక ఎగసి యాడ దాల్చి వత్తు!ఓడి చత్తునేని, ఒడలుపై ఆ పతాకను స్థిరముగ కప్పుకొనుచు వత్తు!!
తెలవారు జామునే తెలుగు వాకిళ్ళలో ముదితలు వెలయింప ముగ్గు బాట – గగన వీధులయందు కదన రంగము బోలి బాలల గాలిపటాల వేట – ఘల్లు ఘల్లున కాళ్ళ గజ్జెలన్ కదిలించి గంగిరె ద్దాడంగ గంతు లాట – “హరిలొ రంగో హరి! హరి హరీ! హరి!” యంచు హరిదాసు పాడంగ చిరత పాట –గోద, రంగనాధుల భక్తి గుడులు చాట – అరిసెలు, చకినాల్, పొంగళ్ళు కరుగ నోట – పులకరించు మనసు, జిహ్వ  తెలుగు నాట – కలుగు సంపూర్ణ తృప్తి సంక్రాంతి [...]
ఈ శుభోదయ వేళ ... నీవింక నిద్రమేలుకొని చూడగా - నీకు మేలు గూర్చదేవతలు వేచినటు, నీ హృదిని అనేకచిత్ర చిత్రానుభూతులు చేరు గాక!
రచన : మహాసహస్రావధాని డా. గరికపాటి నరసింహారావు గారుసీ. అడు గడుగున నిషేధాజ్ఞ జారీచేయ         మగడు నిషిధ్ధాక్షరిగను దోప -గుప్పిళ్ళు నిండని గ్రుడ్డి గవ్వలతోడ         మాసమ్ము గడుప సమస్య కాగ -అది సర్దు మిది సర్దు మని చంపు కాన్వెంటు         దత్తుండు దత్త పదంబు కాగ -ముద్దు లొల్కెడి చంటి బుజ్జాయి పాపాయి         వర్ణనీయాంశమై వరలు చుండ -పాలు కూరలు పండ్ల [...]
"ఈ నిద్రాణ నిశీధి, జాగృత మహా హేమ ప్రభా పుంజమైకానంగా నది నా తపస్సు! అటులన్ గానిచ్చుటే, భారతీ!ఈ నా జీవితమందు నా ప్రతిన!" యం చెవ్వాడు కష్టించెనో -ఆ నా ఇష్ట ప్రధానమంత్రి 'నరసింహా రావు'కున్ మ్రొక్కెదన్!(పూర్వ ప్రధాని "స్థిత ప్రజ్ఞ " శ్రీ పి.వి. నరసింహా రావు" గారి వర్ధంతి నివాళిగా ...- డా. ఆచార్య ఫణీంద్ర)   
ఇల వైకుంఠ పురంబులే - నగరిలో నే మూల నే మందిరంబుల నేకాదశి దివ్య పర్వదినమున్ బోవంగ; శేషోదరస్థల పర్యంక రమా సుసేవిత పరంధా మోత్తర ద్వార సద్విలస ద్దర్శన భాగ్యము న్నమిత భక్తిన్ బొంద "పాహీ" యటన్! 
2016 సంవత్సరానికి గాను మా గురువు గారు - దివంగత మహాకవి డా. నండూరి రామకృష్ణమాచార్య స్మారక పద్య కవితా పురస్కారాన్ని సుప్రసిద్ధ కవయిత్రి శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ గారికి ప్రకటిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.  "భద్రాచల రామదాసు", "మాతృభూమి" వంటి కావ్యాలను రచించిన శ్రీమతి లక్ష్మీనరసమ్మ ( ఖమ్మం జిల్లా, భద్రాచలం వాస్తవ్యురాలు) గారికి 29 ఏప్రిల్ 2016 నాడు [...]
నెలవంక రూపమే ’తలకట్టు’గా మారె –శూలమే ’దీర్ఘ’మై శోభ గూర్చె –మెడను నాగేంద్రుడే ’గుడి దీర్ఘ’మై వెల్గె –’కొమ్ము’లాయెను నంది కొమ్ము లలరి –’ఏత్వంబు’,’లోత్వంబు’లే నాగ భూషణాల్ –’ఋత్వాలు’ జంగమ ఋషులు గాగ –’పూర్ణ బిందువె’ అన్నపూర్ణ ముఖంబయ్యె –ప్రమథ గణపతియే ’ప్రణవ’మయ్యె –"ఓం నమ శ్శివాయ" యటంచు నూని యట్టిఅక్షరముల తొలుత దిద్దు నందు చేత -అక్షరములే తెలుగు వాని కక్షతలగుఅలరి [...]
సాయంకాలము ముగియగవేయి పనులనన్ని మాని, విశ్వంభర తారేయి కవుంగిలి నొదుగుచుహాయిగ నిదురించు - సూర్యు డగుపడు దనుకన్!
వినదగు నెవ్వరు జెప్పిన;వినినంతనె దాని గూర్చి వివరము లెరుగన్కను నెవ్వడు "గూగులు", నామనుజుడె పో జ్ఞాని నేడు మహిని! ఫణీంద్రా!
'భూదేవిం'గని మోహితుండయి తనన్ భోగింపడో నాథుడంచేదో సన్నని సందియమ్ము 'సిరి'కి న్నే మూలొ! తానందుకే,ఆదేశించి వసింప నామె నహి శీర్షాగ్రమ్ముపై, చాటునన్ -పాదాబ్జంబుల బట్టి స్వామి కెదుటన్ వాసించు వాల్జూపులన్!
శివుడును, శివానియు కలసిఅవలీలగ ఏక దేహ మందున నిముడన్,ఎవ రెక్కువ, తక్కువ యనిఅవసరమా ఇక వివాద మాడ, మగలలో?
తల్లిగ, అక్కగ, చెల్లిగ,ఇల్లాలుగ సలిపి మహిళ లెన్నియొ సేవల్;వెల్లువగా ప్రేమ గురియ -చల్లగ జీవించుచుంద్రు జగతిని పురుషుల్! 
భావములను మార్చు బంగారు లతలుగా -పద్యమన్న దొక్క పరుసవేది!పాఠకుడును చదివి భాగ్యవంతుడగును -భాష యందు! బ్రదుకు బాట యందు!!
 చిత్తము జేసి దివ్యమగు సెమ్మెగ, జ్ఞానపు నూనె నింపి, వ్యు     త్పత్తిని ప్రత్తిగా వడకి, వత్తుల భావము లల్లి, చేతనా     వృత్తిని అగ్ని జేసి, సుకవిత్వపు జ్యోతులు వెల్గ - కావ్య సం     పత్తిని గూర్చితిన్ బ్రదుకు భాసిల "దివ్వెల పర్వ" వృత్తమై !
ఏదియు గాదు శాశ్వతము, నీ భువి యందున మానవాళికిన్!ఏదియు వెంట దేరు, మరి ఏదియు తీసుకపోవ వీలు గా,దేదియునైన నిచ్చటనె యేదొ క్షణంబు సుఖింత్రు - దానికైఆదియు నుండి అంతమగు నంతటి దాక తపింతు రేలనో?  
సైకిలు త్రొక్కలేక నొక చక్కని బైక్ కొని, కొన్ని నాళ్ళ కాబైకును గూడ మార్చి, కొని భారి ఖరీదగు కారు, దానిలోసోకులు, సౌఖ్య మెక్కువయి స్థూల శరీరుని గాగ - వైద్యుడున్నా కనె త్రొక్కుమం చనుదినమ్మును సైకిలు, లావు తగ్గగాన్!
వర్షమందు తడిసి వచ్చిన నను జూచి,        ఇంటిలో నొక్కొక్క రిట్టు లనిరి -"గొడుగు వెంటను తీసుకొనిపోవు టెరుగవా?"        అనుచు కోపమ్ముతో అన్న దిట్టె!"వర్ష మాగు వరకు బయటనే ఒక నీడ        నాగకుంటివె?" యని అక్క దెప్పె!"జలుబొ, జ్వరమొ గల్గ తెలియు నప్పు"డనుచు        పలురీతి నాన్న చీవాట్లు బెట్టె!కాని, నాదు తలను కడు ప్రేమతో, కొంగుతోడ వడిగ తుడిచి ... "పాడు వాన!బిడ్డ డిల్లు [...]
మానవ జీవితమ్మన - ప్రమాదకరమ్మగు బావియందు లోలోనికి జారిపోవుటయె! లోపల మొత్తము మున్గిపోవుచో -దానినె 'మృత్యు' వందురు! నిదానముగా నెవడో యొకండు పైపైనకు లేచి నిల్పుకొను ప్రాణము; వాని కథే చరిత్రయౌ!
వాడే నను కాపాడెడివాడని - వాడని తలంపు పారుచునుండున్నాడును, నేడును, మరి యేనాడును నాలోని జీవనాడుల యందున్!
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు