7 డిసెంబర్ 2016 నాడు నేను కావ్య పరిచయం చేసిన "శ్రీ చంద్రశేఖర విజయం" కావ్యావిష్కరణ సభా విశేషాలు (వివిధ పత్రికలలో). చిత్రంలో నేను ఎడమ నుండి 2వ స్థానంలో ఉన్నాను.- డా. ఆచార్య ఫణీంద్ర
జనుల విఘ్నాల తొలగింపు జమయు, ఖర్చుధీయుతుండై లిఖించు వినాయకుండు -కార్య నిర్వాహ రచనాధికారులకునుదీక్ష, విజయ సిద్ధిని ప్రసాదించు గాక!
ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారు రచించిన "శ్రీమదాంధ్ర శివానంద రామాయణము (బాలకాండం)" కావ్యావిష్కరణ సభలో గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కె.వి.రమణాచారి గారు.చిత్రంలో .. ఎడమ నుండి .. డా. ఆచార్య ఫణీంద్ర (నేను), ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు, డా.జి.యం. రామశర్మ గారు, డా. రాపాక ఏకాంబరాచారి గారు, ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారు, ఆచార్య పొన్నపల్లి [...]
కుడి వైపు నిలుచున్న గొప్ప వీరుని పైన    దాడిని గమనించు ధ్యాస లేదు!ఎడమ వైపున నున్న ఎత్తైన నరునిపై     దాడి జరుగ - నేను చూడ లేదు!     వెనుకున్న వానిని వెన్నుపోటు పొడువ -     నా కెందు కనుకొంటి నాదు మదిని!ముందున్న వ్యక్తిని మోదగా బండతో -     దాడిని ఆపి, కాపాడ లేదు!     మీద నూహించ లేదు - నా మీద కూడదాడి జరిగె - తప్పించుకోన్ దారి లేదు!చుట్టు ప్రక్క సాయంబుకై [...]
నిన్న వరకు కాస్త నిలిచియున్న ప్రాణమ్ము నేడు పూర్తి నాశమయ్యె!తాడి దన్ను నోటు తలదన్ను నోటు రాన్ -వేయి నోటు చిత్తు పేపరయ్యె!!
త్యాగరాజు మరల పుట్టి, ధరణి నెల్లస్వరగతుల సౌరభాలను సంతరించి,తరతరాల రసజ్ఞుల మురియజేసి -అరిగె "బాలమురళి"గ నే డమరపురికి!అపర త్యాగరాజుకు అశ్రునివాళిగా -డా. ఆచార్య ఫణీంద్ర 
ప్రముఖ పద్యకవి ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారు రచించిన "శ్రీమదాంధ్ర శివానంద రామాయణము (బాల కాండము) కావ్యావిష్కరణ మహాసభకు సాహిత్యాభిమానులందరికీ ఇదే మా ఆహ్వానము.- డా. ఆచార్య ఫణీంద్ర
కష్టము లవి యట్లె కలకాల ముండవు -అలల వోలె ఎగసి తొలగిపోవు!అవియె తొలగు పిదప, అనుభవాలుగ నిల్చు!!జీవితానుభవము చెరగిపోదు!!!
ఈర్ష్య, ద్వేషమ్ము, వెటకార, మీసడింపు -తోటివార నెట్టును నీకు దూరముగను!ప్రేమ, గౌరవ, మర్యాదల్  వెల్లివిరియ -చేరువౌదురు జనులు నీ చెంత జేరి!
నీరము పుట్టి విష్ణుపద నీరజయుగ్మమునందు గంగయై,పారుచు దేవలోకముల పావనమై, శివశీర్షమెక్కి తాజారి, ధరిత్రి సాగి పలు స్థానములందు జనోపయోగమై,చేరె సముద్ర గర్భమున కృష్ణయు, గౌతమి, నర్మదాదులై!
"భావన" యను శిలను పరిశుభ్రముగ జేసి,"బుద్ధి"ని ఉలి జేసి పూని చెక్కి,అందమైన శిల్పమటుల తీరిచిదిద్దుశిల్పియె "కవి"! "కవిత" శిల్పమనగ!
ఒక పత్రికలో గుడివాడకు చెందిన "హెచ్. ఆర్. చంద్రం" గారు రచించిన ఈ పద్యకవిత నన్ను బాగా ఆకట్టుకొంది. వస్తు నవ్యతతో సహజంగా, హృద్యంగా సాగిన ఈ పద్య కవితను ఆధునిక పద్య కవితాభిమానులు ఆస్వాదించి ఆనందిస్తారని భావిస్తూ ఇక్కడ ప్రచురిస్తున్నాను.- డా. ఆచార్య ఫణీంద్ర
వ్యాసుడు పుట్టిన దినమిది -భూసురులున్, కవుల, గురుల పూజా దినమైప్రాశస్త్యము గల దినమిది -దాసుడు పుట్టిన దినమయె దైవము మెచ్చన్!అందరికీ "గురు పూర్ణిమ" శుభాకాంక్షలతో -ప్రత్యేక ధన్యవాదాలతో -                              డా. ఆచార్య ఫణీంద్ర 
నే గమియింతు "నాఫిసు"కు నెమ్మదిగా తలపోయు చేదియో -"వేగము పెంచు - 'ఝా'మ్మనుచు వేడుకగా పయనింత" మంచు తావాగును నాదు వాహనము! "వద్ద"ని నే కడు ప్రేమ దానికిన్సైగను జేసినంత, నది చల్లబడుంజుమి బుంగ మూతితో!   
మా విరితోటలో పెరుగు మల్లియ చెట్టు - కరాల బోలెడిన్తీవలు సాచి, ఆకుల మదీయ భుజంబుల దట్టి పల్కు నేవేవొ గుసల్ గుసల్ చెవుల కింపుగ! ఆ మధురంపు పల్కులేపూవులు; వాని సౌరభమె పుల్కలు రేపెడి భాష యయ్యెడిన్!
ఏడాది కాలాన కెంత విల్వొ - పరీక్ష   తప్పిన యట్టి విద్యార్థి నడుగు!ఒక ఋతు కాలానకున్న విలువ - రైతు   పొలమునందలి కృషి ఫలము నడుగు!ఒక్క మాసంబున కున్న విలువ - గర్భ   వతి పడె డాపసోపాల నడుగు!ఒక్క వారంబున కున్న విలువ - వార    పత్రిక నుద్యోగి పాట్ల నడుగు!రోజు కూలి నడుగు మొక్క రోజు విలువ!గంట విలువను బడిలోని గంట నడుగు!నిమిషమును "ఫ్లైటు మిస్" ప్రయాణికుల నడుగు!సెకను విలువ [...]
ప్రముఖ కవి, అంతర్జాతీయ విఖ్యాత భూభౌతిక శాస్త్రవేత్త ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారు నెలకొల్పిన వి.యల్.యస్. విజ్ఞాన సారస్వత పీఠం - హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో 8 జూన్ 2016 నాడు "వేము అన్నపూర్ణ జ్ఞాపక పద్యకవితా పురస్కారాల ప్రదానోత్సవం" నిర్వహించింది. ప్రముఖ రచయిత్రి, ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు శ్రీమతి మలయవాసిని గారికి మరియు ప్రముఖ కవి, [...]
"మిమ్ము మీరు పాలించుకోన్ మీకు చేతకాద" టన్నవా రందరు కనులు తెరచికనుడు - చంద్రశేఖరరావు ఘనుని సుపరిపాలన "తెలగాణ ద్వితీయ వార్షికము"న!(తెలంగాణ రాష్ట్రావిర్భావ ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలతో - )
ఆద్య కవుల్ జగద్ధితమె ఆశయమై రచియింప పద్యముల్,మధ్య కవుల్ రచించిరి సమత్వము భిన్న మతాల నెంచి; నవ్యోద్యమ పద్యకర్త దళితోద్ధరణంబును గోరె - ఇట్టులాపద్యమె నిల్చె మానవత పట్టము గట్టి సహస్ర వర్షముల్!
నిధుల పంపకముల నిష్పత్తి ద్రోహమ్ము      నిలిచిపోయి ఇపుడు నిధులు దక్కె -ఉన్నతోద్యోగాల ఉనికిలో మోసంబు,      లన్యాయములు నాగి, అవియు దక్కె -భాష, సంస్కృతులకు ప్రామాణికత గూడి      గౌరవాదరములు కలిగె నిపుడు -నీటి ప్రాజెక్టుల నిర్మాణ లక్ష్యమ్ము      నిర్వీర్య క్షితి నింక నీళ్ళ దడుపు -"నిధులు,నుద్యోగములు నింక నీళ్ళ కొరకు,ఆత్మ గౌరవమ్ము కొరకు" ననుచు, నాడుసాగిన [...]
ఫలమునందు సగము పంచి నీకిచ్చుచోసగము నాకు మిగులు – సగము నీకు –పంచి ఇచ్చునెడల మంచి ఆలోచనన్నాకు మొత్తముండు! నీకునుండు!
29/4/2016 నాడు హైదరాబాదులో నారాయణగూడలోని వై.యం.సి.ఏ. ఆడిటోరియంలో జరిగిన మహాకవి కీ.శే. డా. నండూరి రామకృష్ణమాచార్యుల  వారి జయంతి సభలో ప్రముఖ కవయిత్రి, భద్రాచలం వాస్తవ్యురాలు శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ గారికి ఆచార్యుల వారి స్మారక పద్య కవితా పురస్కారాన్ని ప్రదానం చేసారు ఆనాటి ముఖ్య అతిథి - ప్రముఖ పద్యకవి, అంతర్జాతీయ విఖ్యాత భూభౌతిక శాస్త్రవేత్త ఆచార్య వి.యల్.యస్. [...]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు