మంచితనం అంటే..A. స్వతహాగా పుట్టుకతో మంచిని కలిగి ఉండడంB. తల్లిదండ్రుల పెంపకంతో మంచిని అలవర్చుకోవడంC. తన స్వీయానుభవంచేత మంచిని అలవర్చుకోవడంD. మంచి అనిపించుకోవడానికి మంచితనాన్ని ఇష్టపూర్వకంగా కలిగి ఉండడంE. మంచి అనిపించుకోవడానికి మంచితనాన్ని బలవంతంగా కలిగి ఉండడంF. మంచిగా కనిపించడానికి మాత్రమే మంచితనాన్ని కలిగి ఉన్నట్లు కనిపించడంG. మంచిగా కనిపించడానికి మంచిని [...]
సరీగ్గా పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఈరోజు నాతోటి వయసువాడు, నాకు చాలా ఇష్టుడైన శ్రీ పడిగెల లోక్ నాథ్ హఠాత్తుగా మరణించాడు. అతని జ్ఞాపకాలు నన్నింకా వెంటాడుతూనే [...]
కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ బ్లాగు లోకి అడుగు పెట్టినట్లే చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు స్వాతిముత్యం సినిమా చూశాను.ఒక మనిషి కొలత వేయలేనంత కాకపోయినా కనీసం [...]
ప్రియమైన మిత్రులందరి కోసం...ప్రత్యేకించి హైదరాబాద్ వాస్తవ్యుల కోసం..మీ కృష్ణ మోహన్ కందర్ప
ఎన్నో సంవత్సరాల తర్వాత అమర్ ప్రేమ్ సినిమా చూశాను. కొన్ని సినిమాలు చూశాను అని అనుకోవడం చాలా తక్కువవుతుంది. ఆ పదం అస్సలు సరిపోదు. ఆ సినిమాని అనుభవించాను అనాలి. అప్పుడే ఆ అనుభూతి సంపూర్ణమౌతుంది. ఆ సంగీతమే మొత్తం సినిమాకి పెద్ద ఆస్తి. రాహుల్‌దేవ్ బర్మన్ లాంటి బిడ్డని కన్నందుకు సచిన్ దేవ్ బర్మన్ ఎన్నిసార్లు ఎంతగా మురిసి ఉంటాడో తెలీదు కానీ, కోట్లాది జనాలు ఆ సంగీతానికి [...]
"ఊళ్ళో ఇంతమంది కుఱుపులు కోశాను కానీ ఈ నా చిన్ని కుఱుపంత బాధ ఎప్పుడూ చూడలేదు" అన్నాట్ట ఓ నాటు వైద్యుడు. ఊళ్ళో అంతమందీ ఎంత బాధపడ్డారో అతనికేం తెలుస్తుందీ! అవన్నీ వారికి. మఱి ఈ బాధ తనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇది తన బాధ కనుకా.ఏదైనా అంతే - తనదాకా వస్తే గానీ ఏదీ తెలియదు. తెలియదంటే అసలు తెలియదని కాదు. పూర్తిగా తెలియదని మాత్రమే. ఒకొక్కసారి ఎవరో, ఏదో తన గొడవ చెప్పి గోల పెడితే [...]
2001 లో చిత్తూరు జిల్లా నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ ఫీల్డ్ ఆఫీసర్ గా పని చేసినప్పుడు 40 స్కూళ్ళ పిల్లలకోసం కట్టిన పాట ఇది...పల్లవి:కలలోనైన కలగనలేదే బడికెళ్తానని - మెలకువనైన అనుకోలేదే చదువొస్తుందనిప్రభుత్వమే కరుణించి ఈపుస్తకమిప్పించి - అఆ లే నేర్పించి తెలివన్నది రప్పించిగొప్ప గొప్ప చదువులన్ని నాకే నేర్పుతున్నది - నే మనిషినైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నదిహే హే.. హే [...]
హైదరాబాద్ - 09-06-2003 - 06.30 సాయంత్రండైరీనుంచి యథాతథంగా..త్యాగరాజు అన్నది నాన్నగారి పేరైతే నేనెందుకు త్యాగాలు చేయాలో 1990 నుంచీ కూడా నాకు అర్థం కాని ప్రశ్న. అది అలాగే కొనసాగుతోంది. ఈరోజు నాకు చాలా ఇష్టమైన జర్నలిజం (ఈనాడు) కోర్సులో జాయినింగ్ రిపోర్టు ఇవ్వడానికని వెళ్ళాను. అక్కడికి వెళ్ళకముందే తెలిసినా - అక్కడికి వెళ్ళాక ఉండవలసిన కమిట్‌మెంటూ, వదులుకోవలసిన కమిట్‌మెంట్సూ రెండూ [...]
మిత్రులకు, భాషాభిమానులకు, తెలుగు బ్లాగర్లకు మరియు అన్ని అంతర్జాల తెలుగు సమూహాలకు....
మిత్రులందరికీ2008నూతన సంవత్సర శుభాకాంక్షలు......
ఎవరో అన్న ఓ చిన్న మాట చాలు, మనసు వికలం అయిపోవచ్చు. ఓ చిన్న సంఘటన చాలు, చిత్తం చంచలమైపోవచ్చు. ఒక దృశ్యం చాలు బుద్ధి పెడతలబట్టవచ్చు. ఏమీ లేకనే ఒక్కోసారి నీకు తెలియకనే నీ తల పని చేయకపోవచ్చు. ఇంతకూ ఎలాంటివి ఎలాంటివారిని ఇలా ఇబ్బంది పెడతాయో నిర్థారణగా చెప్పలేము. కొందఱను చూడగానే మఱికొందఱకు గుండెలు దండోరా వేయడం మొదలు పెట్టవచ్చు. స్థిరచిత్తులకు ఇలాంటివేవీ చిన్నమెత్తు నష్టం [...]
కలలలో తేలిపోవడం చాలామందికి ఇష్టం. వాస్తవస్థితి హాయిగా లేనప్పుడు కనీసం తనకు తాను సృష్టించుకున్న స్వప్నజగత్తులోనైనా ఏదో ఇంత సౌఖ్యం కానవస్తుందేమోనని వెంపర్లాడడం సహజం. తన మనః ప్రశాంతి కోసం ఎక్కడైనా సరే మనిషి అన్వేషిస్తూ ఉంటాడు. ఆ అన్వేషణ అలా అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది. జీవితం బహు చిత్రమైనది. అనుకున్నపుడు హాయినివ్వదు. బరువుగా అడుగులు వేయలేక ముందుకు సాగలేక [...]
నిఝంగా ఏ కల్మషమూ లేని స్థితి స్నేహానికి మాత్రమే ఉంది. స్నేహానికి పరాకాష్ట త్యాగం. ఆమధ్య శోభారాజు గారి దగ్గర అన్నమయ్య పాటలు పాడడానికి వెళ్ళినపుడు ఏదో మాటల్లో సందర్భం వచ్చి ఆవిడ అడిగింది. ప్రాణస్నేహితుడు అంటే నిజంగా ప్రాణం వదిలేసేటంత స్నేహితులు ఎవరికైనా ఉన్నారా అని అడిగితే నేను ఠపీమని అవునండీ నాకు ప్రసాద్ అనే ప్రాణస్నేహితుడున్నాడు, నేను తనకోసం తను నాకోసం [...]
పులివెందుల నగరిగుట్టలో ఉంటున్న రోజులవి. నాన్నగారు రాజారెడ్డి బ్యాంకులో (స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాని అక్కడ అలాగే పిలుస్తారు, కంగారు పడొద్దు) సేల్స్ ఆఫీసర్‌గా ఉండేవారు. ప్రతీనెలా సరుకులు అప్పుతెచ్చే అంగడిలోనే దీపావళికి పటాకులు కూడా తెచ్చుకోవడానికి రెడీ అయ్యాము. తెచ్చుకున్నాక పంపకం ఓపెద్దపని. నాన్నగారు కూచుని ఐదుమందికీ వారివారి అభిరుచిని బట్టి పంచేవారు. తీరా [...]
మా తెలుగు తల్లికి మల్లెపూదండ - మా కన్నతల్లికి మంగళారతులు తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక తెలుగు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు కీర్తిశేషులు శ్రీ పొట్టి శ్రీరాములు గారికి కృతజ్ఞతాభివందనములతో.........
నా చిన్నప్పట్నించీ చూస్తూన్నాను. ఏ హోటల్లో కూడా (ప్రాంతాలతో సంబంధం లేకుండా) గోధుమరవ్వతో ఉప్మా అలాగే ప్రసిద్ధి గాంచిన చింతపండు పులిహోర ఎందుకు చేయరో అర్థం కావడంలేదు. ఈ విషయంలో ఎవరికైనా ఏదైనా పాయింటు తడితే కాస్త చెప్పరూ...కొసమెరుపుః అసలు గుళ్ళల్లో చేసి పంచిపెట్టే సదరు చింతపండు పులిహోర రుచి " ఏమని వర్ణించనూ"....
చావా కిరణ్, తాడేపల్లి గార్ల సౌజన్యంతో...చిత్రం-1 :ఇక్కడ వంతెనని మోస్తున్న నాలుగు ఆధారాలూ చుట్టుకొలతలోను ఎత్తులోను ఒకేలాలేకపోవడం గమనించండి.చిత్రం-2 :ఇక్కడ వంతెనకు ఒకే వొక్క ఆధారం ఉంది. అదీ మధ్యలో కాకుండా ఒకమూలకొచ్చింది.చిత్రం-3 :అదే స్తంభం-కొంచెం విస్తృత దృశ్యంగా...దాని తరువాతి స్తంభానికి మటుకు రెండు ఆధారాలుండడం గమనించండి.చిత్రం-4 :ఇదివరకటి చిత్రంలోని ఒంటి ఆధారం వంతెన [...]
చిన్నప్పటిలాంటి ఉత్సాహమే లేదు.... వినాయకచవితి వస్తోందంటే ఎంత ఉత్సాహంతో ఉరకలు వేసేవాళ్ళమో గుర్తుకొస్తే కళ్ళలో నీళ్ళూరడం తప్పితే మరేమీ లేదు!తెల్లారీ తెల్లారకుండానే పత్రి కోసం తమ్ముడూ నేనూ సైకిళ్ళమీద పరుగో పరుగు.... ఎంత పత్రి అంటే, ఇందాక సాయంత్రం ఇరవై రూపాయలు పెట్టి కొన్నదానికి ఇరవై రెట్లెక్కువగా తెచ్చేవాళ్ళం.ఈ భాగ్యనగరంలో పందిళ్ళకోసమే వినాయకుడు అన్నట్టుంటుంది. [...]
ఏం జరుగుతోందిక్కడ? సర్వంసహాసౌర్వభౌములవారి ఇంటికి కూతవేటు దూరంలోనే ఏమిటీ ఘోరం..నేను, మీరు, మనందరం కొంటున్న ప్రతీ వస్తువూ, సబ్బు-ఉప్పు-పప్పు అన్నింటిమీదా వసూలుచేస్తున్న పైస పైస కూడబెట్టేది కొంతమంది అవినీతిపరుల కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారికి నష్టపరిహారం (ఎక్స్‌గ్రేషియా) చెల్లించడానికేనా!!జరుగుతున్న ఘోరాలకి కారణ'భూతా'లెవరో కనుగొని వారి వారి ఆదాయంలోంచి [...]
ఆయన మా మంచి హెడ్మాస్టర్. నా 6-7 తరగతుల కాలంలో ఆయనతో కలిసి చదువుకునే అదృష్టం కలిగింది. అలా ఎందుకన్నానంటే ఆయన మాతో అంతగా కలిసిపోయేవారు. వాళ్ళబ్బాయి మధుసూదన్ నా సహచరుడే. ఆయన బోధించే ఇంగ్లీషు, సోషలే కాకుండా వాటికి సంబంధించిన ఎన్నో వింతలు విశేషాలను ఎంత ఆహ్లాదంగా వివరించేవారంటే బడి అయిపోయి ఇంటికెళ్ళాక మళ్ళీ రేప్పొద్దున్న బడికెంత తొందరగా పోదామా అనిపించేంత!! ఆయన ఎంతో [...]
లేనిపోని చిక్కులలో పడిపోవడం ఎందుకని అడుగు ముందుకేయనివాడు జన్మలో ఏమీ చేయలేడు. ఎక్కడ తప్పటడుగు వేస్తామో అనుకొని జంకేవాడెవ్వడూ ముందుకు సాగిపోలేడు. పనికి దిగిన తర్వాత తప్పులు చేస్తే చేస్తాం. వాటిని దిద్దుకునేందుకు వీలెప్పుడూ ఉండనే ఉంటుంది. అసలు లోపం లేకుండా ఏదీ ఉండదు. ఏదో వ్రాసినా, చేసినా, అన్నా, ఆడినా, ఏమయినా ఏదో తప్పు రావచ్చు. రాకనూ పోవచ్చు. చిత్తశుద్ధీ, సంకల్పశుద్ధీ [...]
కానీ పదుగురకు పనికివచ్చే పని ఇదీ అనుకుంటే వెంటనే దానికి శ్రీకారం చుట్టడం పనిచేసే వారి లక్షణం. మీనమేషాలు లెక్కించుకుంటూ, తిథివారాలు చూసుకుంటూ కూచోడతను. ముందు పని. తర్వాతే ఏదైనా - ఇదీ క్రియాశీలుని వైఖరి. ఏపనిలో నైనా కష్టనష్టాలు తప్పవు. ఏవో క్లిష్ట సమస్యలు తప్పవు. వాటికి భయపడి వెనుకంజ వేయడం పిరికితనం. సమస్యలు ఎదురైనప్పుడు వాటి పరిష్కారమార్గం చూసుకోవాలి. ముందే [...]
పని చేయని వారు పలువురు. వారికి ఏంచేయాలో తోచదు. పదుగురకు పనికివచ్చేదేదో చేసి చూతాం అన్న ఆలోచనే వీరికి రాదు. కదిలితే కందిపోతామేమో అని కలత చెందిపోతూ ఉంటారు. ఎదిరిని విమర్శించడం, వారినీ కదలకుండా దిగ్భంధనం చేదామని చూడడం - ఇదే వీరి పని. మాటలతో ఏమీ కాదని తెలిసినా వాటితోనే గాలిమేడలు కడుతూంటారు. గంధర్వ నగరాలు నిర్మిస్తూంటారు. ఏం చెప్పినా, పోదురూ అదెక్కడ సాధ్యం? అని [...]
"గఛ్ఛతస్సఖలనం న దోషాయ" - నడిచేవాని కాలు జారితే అందులో తప్పేం లేదు. కదలకుండా మెదలకుండా కూర్చున్నవాని కాలు జారే ప్రసక్తే లేదు. పని చేసేవాడే తప్పులూ చేస్తాడు. పనీపాటా లేనివానికి ఆ అవసరం ఉండదు. కనుకనే ఏదో తప్పు చేస్తామేమో అని ఏ పనీ చేయకుండా చేతులు కట్టుకొని కూర్చోవడం సరికాదు. ముందు పనికి సిద్ధపడాలి. తర్వాత మిగతావన్నీ చూసుకోవచ్చు. చాలామంది తామేమీ చేయకుండా ఏదో చేసేవారిని [...]
నేను, నరసింహారావు, ఎస్సై గారబ్బాయి ప్రకాష్, నాగసుబ్బమ్మ, చిట్టెమ్మ - 4 నుంచి 7 వ తరగతి వరకు (5 కాక) సమఉజ్జీలము.నాగప్రసాద్ అని పోలియో వల్ల కాళ్ళు సచ్చుబడినా, మానసికంగా పూర్తి ఫిట్ నెస్ తో ఒక తెలివైన అబ్బాయుండేవాడు. తన అన్నయ్య రామకృష్ణ అనీ మాకంటే ఒక తరగతి పెద్ద - మేమిద్దరం స్నేహంగా ఉంటే సహించలేకపోయేవాడు. కారణం ఈనాటికీ నాకు అర్థం కాలేదు.ఇంకా, పిచ్చయ్య, నారాయణ, మిరియాల నరేంద్ర, [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు