నీల గ్రహ నిదానము అను అజ కుమార విజయము అను శని దశరథ యుద్ధము (ద్వితీయాంకము) (ప్రథమ దృశ్యము) (దశరథ మహారాజు శయన మందిరం) (తెర తీయగానే సన్నని వెలుగులో దశరథుడు పాన్పు లేదా తూగుటుయ్యాలపై పడుకొని ఉన్నట్లు చూపించి, అతడు కాస్త ఒత్తిగిల్లగానే లైట్లు ఆఫ్ చేయాలి) (తెర వెనుక లైట్లు ఆన్ అవుతాయి) (దుస్వప్నాలు ఒక దాని వెనుక ఒకటిగా షేడో రూపంలో చూపించాలి) 1వ నీడ: ఒక మనిషిని కోతి [...]
తెలుగులో నాటకరచన నల్లపూసైపోతున్న కాలంలో ఎ. శ్రీధర్ గారు చక్కటి నాటకాలు నాటికలను రచిస్తూ, కొత్త రచనలను సాహిత్యలోకానికి పరిచయం చేస్తూ ఉన్నారు. గతంలో వారు రచించిన “చీకటి చకోరాలు” అనే సాంఘిక నాటికను పొద్దులో ప్రచురించాం. ఇప్పుడు వారే రచించిన నాటకం “నీల గ్రహ నిదానము అను అజ కుమార విజయము అను శని దశరథ యుద్ధము” మొదటి భాగాన్ని మీముందుకు తెస్తున్నాం. చదివి మీమీ [...]
ఏప్రిల్ 2010 గడి ఈసారి గడి పూరణలు అతి తక్కువగా వచ్చాయి. బహుశః గడికి వేసవి సెలవుల గాడ్పు తగిలినట్లుంది. గడిని ఉత్సాహంగా నింపి పంపినవారు ఆర్కేడి, కొడీహళ్లి మురళీమోహన్ , భమిడిపాటి సూర్యలక్ష్మి, మాచర్ల హనుమంత రావు, శుభ , విజయ జ్యోతి గార్లు. వీరిలో నాకు తెలిసి చాలామంది ఈమధ్య గడి పూరించడం మొదలెట్టినవారే. అందుకని తప్పొప్పుల మీమాంస చేయదల్చుకొలేదు. కానీ అతి తక్కువ తప్పులతో [...]
-కొడవటిగంటి కుటుంబరావు “నజ్ ద్ర్యోవా! నిజంగా?” “ఏం, అతని బుద్ధే అంత. తన తండ్రిని అమ్మటానికి చూశాడు తెలుసా, మరీ అన్యాయం పేకాటలో పణం పెట్టాడు.” “ఎంతచిత్రమైన విషయాలు చెబుతావమ్మా! నజ్ ద్ర్యోవ్ కు ఈ వ్యవహారంలో జోక్యం ఉంటుందని నేను చచ్చినా ఊహించి ఉండను.” “నేను మటుకు మొదటి నుంచీ అనుకుంటూనే ఉన్నాను.” “నిజంగా, ఈప్రపంచంలో ఎలాటివి జరుగుతాయో! చిచీకవ్ మొదట ఇక్కడికి [...]
ఆ సంఘటన ఇప్పటికి 500 సంవత్సరాలు (1510 జనవరి 23) క్రిందట జరిగింది అయినా దాని నుంచి మనం ఈ నాటికీ పాఠాలు నేర్చుకొని మనుగడని ఎలా సాగించాలో చరిత్ర చెప్తోంది!!!
-భైరవభట్ల కామేశ్వరరావు ఈసారి ప్రత్యేకమైన ద్వ్యర్థి గడిని పూరించే ప్రయత్నం చేసిన అందరికీ ముందుగా అభినందనలు. ద్వ్యర్థి భాగం ఏది అన్నది అందరూ సరిగ్గానే గుర్తించారు. అయితే ఆ భాగంలో రెండు సెట్ల సమాధానాలు సరిగ్గా పూరించినవారు ఎవ్వరూ లేరు. మొదటిసారి కదా కష్టంగానే ఉంటుంది! మొత్తం ఒక సెట్టుని సరిగ్గా పూరించినవారు కోడిహళ్ళి మురళీమోహన్ గారు. వారికి ప్రత్యేక అభినందనలు. [...]
2010 ఏప్రిల్ గడిపై మీ అభిప్రాయాలను, సూచనలను ఇక్కడ రాయండి.
వికృతి ఉగాది పద్యకవిసమ్మేళనంలో సమయాభావం వలన సమర్పించలేకపోయినవి, సంబంధిత కవులు ఆ సమ్మేళనంలో పాల్గొనలేకపోవడం చేత సమర్పించలేకపోయినవీ అయిన కొన్ని మంచి పద్యాలను కొత్తపాళీ గారు ఎంచి పంపించారు. వాటిని ఇక్కడ సమర్పిస్తున్నాం. ————————– దత్తపది: మాలిక, తూలిక, పోలిక, చాలిక -ఉత్పలమాల నాలుగు పాదాల్లోనూ తొలిపదాలుగా ఉపయోగిస్తూ సందీప్: మాలిక కూర్చి నీ సిగన [...]
కవికృతి మూడవ భాగం లోని కవితలపై పవన్ కుమార్ గారి సమీక్ష ———————– స్వాతీ శ్రీపాద -నీకు తెలుసా కవితపై.. ఉపమానాలే కవిత్వం కాదు, ఉపమానం కవితకు ఉత్ప్రేరకం కావాలే కానీ అది కవితకూ పాఠకుడికి మధ్య అడ్డు రారాదు. ఈ ఉపమానాల దొంతరల కింద పడి నలిగిపోతున్న కవితను బయటికి తీస్తే హృద్యంగా ఉంటుంది. —————————————– కత్తి మహేష్ కుమార్ కవితపై.. తర్కం [...]
కొత్తపాళీ:: కనీసం ఇంకో రెండు అంశాల్ని రుచి చూద్దాము. వర్ణనకి ఇచ్చిన రెండో అంశం, ఒక దృశ్యం. అదిలా ఉంది. మీరొక రైల్లో వెళ్తున్నారు. ఎదురుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. వాళ్ళీద్దరూ కనీసం పరిచయస్తులు కూడా కాదు, కానీ ఆ అబ్బాయి కళ్ళల్లో ఆ అమ్మాయి పట్ల ఆరాధన. ఫణి గారి వర్ణనా చాతుర్యం చూద్దాం ఫణి:: చిత్తం. చం. అదియొక రైలు పెట్టె, మరి యందొక బాలుడు యౌవనుండు నా ఎదురుగ నున్నవాడు [...]
రవి (బ్లాగాడిస్తా) మృచ్ఛకటిక నాటకం భారతీయ నాటకమైనప్పటికీ, నాటకశాస్త్ర లక్షణాలను అక్కడక్కడా ఉల్లంఘిస్తూ వ్రాయబడిందని కవి, విమర్శకుల అభిప్రాయం. ఆ లక్షణమే ఈ నాటకానికి వైవిధ్యతను చేకూర్చింది. “కావ్యేషు నాటకం రమ్యం” అన్నది ఆర్యోక్తి. రూపకం, నాటకం అన్నవి ప్రస్తుత కాలంలో పర్యాయపదాలుగా ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ, ప్రాచీన కాలంలో రస, వస్తు, నాయకాది భేదాలను బట్టి రూపక [...]
కత్తి మహేష్ కుమార్: నీ జ్ఞాపకాలతో బరువెక్కిన మనసు సమ సాంద్రత నీళ్ళని కళ్ళలో నింపి కన్నీళ్ళొదిలింది ఆర్కెమెడీస్ సూత్రాన్ననుసరించింది నువ్వెళ్ళిపోయిన చర్య నన్ను జఢుణ్ణి చేసిందేగానీ ప్రతిచర్యకు పురికొల్పలేదు న్యూటన్ సూత్రం తప్పిందా? లేక… నీలేమి శూన్యంలో సూత్రమే మారిపోయిందా! తర్కం తెలిసిన మెదడు మనసు పోకడకు హేతువు కోరింది నీ శూన్యాన్ని… కనీసం [...]
కొత్తపాళీ:: ఈసారి ఇచ్చిన సమస్యల్లో కవులందర్నీ బాగా ఉత్తేజితుల్ని చేసి, చాలా చర్చకి కారణమైనది ఈ సమస్య – రాణ్మహేంద్రవరమ్ము చేరెను రత్నగర్భుని చెంతకున్ విశ్వామిత్ర:: ముందు చేరింది కవులో వస్తువులో తెలియదు గానీయండి కవులకూ కవితా వస్తువులకు కూడా నిలయంట కొత్తపాళీ:: గిరిధర కవీ మీరు వేళ్ళు కదిలించి చాలా సేపయినట్టుంది, మీ పూరణ చెప్పండి గిరి:: ఇదిగో మ.కో “షణ్ముఖా [...]
కొత్తపాళీ:: బాగుంది. ఒక దత్తపది వేసుకుందాం .. మాలిక, తూలిక, చాలిక, పోలిక – ఉత్పలమాల మొదటి పదాలుగా వాడుతూ.. ముందుగా చదువరి గారి పూరణ. చదువరి:: ఒక్క క్షణం.. ఉ. చదువరి గొంతులో ఈ పద్యం వినండి “మాలికలెన్నొ యుండ గజమాలను నా గళసీమ వేసి, నే తూలి కథాకళించ గని తుళ్ళుచు నవ్వితె పెళ్ళివేళ, చా ల్చాలిక” యంచు నల్గు తన స్వామిని మారము సేయు బాలుడన్ పోలికగాంచి భార్య పతి పొంతకు [...]
-సిముర్గ్ అక్కిరాజు భట్టిప్రోలు మంచి కథకుడుగా తెలుగు సాహితీలోకానికి సుపరిచితులు. ఏడాదికో కథకి మించి రాయకపోవడానికి తన బద్ధకమే కారణమని అంటారుగాని, కథలు రాయడం అంత తేలికకాదని గుర్తెరిగినవారు. అంటుకొమ్మ, నందిని, గేటెడ్ కమ్యూనిటీ కథలతో, మనకున్న కొద్దిమంది సమకాలీన ‘మంచి కథకుల’ లిస్టులో చేరిపోయిన అక్కిరాజు లేటెస్టు కథ “రమాదేవి ఎందుకు రమ్మంది” ఆంధ్రజ్యోతిలో 2007, [...]
-అక్కిరాజుభట్టిప్రోలు “రమాదేవి ఎందుకు రమ్మంది?” మరోసారి అలోచనలోకి జారిపోబోయాడు రాజారావు. ఇప్పటికి ఎన్నిసార్లు ఈ ప్రశ్నకి సమాధానం వెతుక్కున్నాడో తనకే తెలీదు. సికిందరాబాదు ఇంకో పావుగంట దూరంలోకి వచ్చేసింది. కంపార్ట్ మెంట్ లో అందరూ మిడిల్ బెర్తులు మడిచేసి, సూట్ కేసులు బయటకు పెట్టి, పిల్లల కాళ్ళకి చెప్పులు లెక్క చూసుకుంటున్నారు. ఈ గొడవలో తన ఆలోచనలు ఇక సాగవని [...]
వికృత నామ ఉగాది పద్య కవితా సదస్సు రెండవభాగంలో మూడు సమస్యలకు రసభరిత పూరణలు చోటు చేసుకున్నాయి. వీటితో పాటు కవుల చమత్కార సంభాషణలు కూడా!
ముందుగా కవికృతి మొదటి భాగంలో ప్రచురించిన కవితపై గరికపాటి పవన్ కుమార్ గారి విశ్లేషణ: భావాలు ఒద్దికగా వచనంలో ఇమడకపోవడం వలన ఈ కవిత పాఠకుడిలో అయోమయాన్ని నింపుతోంది ఉదా 1: డిజిటల్ డోల్బీ ఊయలలొ పురుడు పోసుకుని ఏడువేల ఓల్టుల సమ్మోహన శబ్ద తరంగాల మధ్య ఇప్పుడు మనం తప్పటడుగుల్లోనే వున్నాం.. పురుడు పోసుకొవడం అనే పదాన్ని ఆవిడ పురుడు పోసుకుంది అని తల్లి వైపు నుంచి వాడతాము, [...]
కొత్తపాళీ: అందరికీ పెద్దవారు, ఆచార్యులు, చింతా రామకృష్ణారావు గారు చక్కటి గణపతి ప్రార్ధన పద్యం పంపారు. ఉ: శ్రీ గణ నాయకా! వికృతిఁ జేర్పను వచ్చెదొ? విశ్వతేజ! రా వేగమిటున్. ప్రభా కలిత విశ్వ పరిజ్ఞత కావ్య జాల స ద్యో గుణ సద్విధమ్ మలర; దుర్గుణ బాహ్య మహత్వమొప్ప; రో జూ గనరా! కృపన్ నగుచు శోభిల జేయుమ! ఆది పూజ్యమై! కొత్తపాళీ: ఇందులోనే, ఒక కందము, ఒక తేటగీతి గర్భితమై1 ఉన్నాయని వారు [...]
వికృతి నామ సంవత్సరాది సందర్భం గా పొద్దు పత్రిక నిర్వహించిన వచన కవి సమ్మేళనం లోని కవితలను పాఠకులకు అందిస్తున్నాము. ఈ కవితలపై మీ సద్విమర్శలనూ, విశ్లేషణలనూ ఆశిస్తున్నాం. ఏందుకంటే వీటిపై పత్రిక ఎడిటింగ్ లేకుండా నేరుగా ప్రచురిస్తున్నాం. ఇక పాఠకులే ఎడిటర్లూ,విమర్శకులూ, విశ్లేకులూ అన్నీ! శబ్ద ఖననాన్ని కోరుకుంటున్నా..! -పెరుగు.రామకృష్ణ, నెల్లూరు డిజిటల్ డోల్బీ ఊయలలొ [...]
వికృతి నామ సంవత్సరాది సందర్భంగా పొద్దు రెండు కవిసమ్మేళనాలను నిర్వహించింది. ఒకటి వచన కవితా సదస్సు కాగా రెండోది ఛందోబద్ధ పద్యకవిత్వ సదస్సు. పూర్తిగా అంతర్జాల మాధ్యమంలో జరిగిన ఈ సదస్సులలో కవులు ఎంతో ఆసక్తితో పాల్గొని కవిత్వ ధారలు కురిపించారు. వచన కవుల సమ్మేళనం: వచన కవుల సదస్సును పొద్దు సంపాదకవర్గ సభ్యులు స్వాతి కుమారి గారు నిర్వహించారు. ఈ సదస్సు ఫిబ్రవరి 16 న మొదలై [...]
-తులసీ మోహన్ జ్ఞాపకాలు… వాటికేం!? వచ్చిపోతుంటాయి గాలి వీచినప్పుడో, గులాబీలు పూసినప్పుడో కానీ కంటి నిండా నీళ్ళే వెతుక్కుంటాయి తుడిచే వేళ్ళ కోసం. నిన్నలా నేడుండనివ్వదు ప్రకృతికెంత పౌరుషం! మెరుపు చూపిస్తూనే ముసురు కమ్ముతుంది. సందెపొద్దులు, శ్రావణమేఘాలు మధుర రాత్రులు, మౌనరాగాలు ఎద అంచుల్లో జోడు విహంగాలు ఏదయినా ఏకాంతం కాసేపే తిరిగే ప్రతి మలుపులో కొన్ని తలపులు [...]
-కొవ్వలి సత్యసాయి జనవరి 2010 వివరణలు ముందుగా గడి సులభంగా ఉందని చెప్పినవారందరికీ నా కృతజ్ఞతలు. చాలా సులభంగా ఇచ్చానని అనుకున్నప్పుడల్లా చాలా కష్టంగా ఉందని పూరకులనుకున్నప్పుడు కాస్త ఆశ్చర్యమేసేది. మా ఇస్టూడెంట్ పిలకాయలు ప్రశ్నాపత్రం ఎంత ఈజీగా ఇచ్చాననుకున్నాకష్టంగా ఉందని వగర్చడంగుర్తొచ్చేది. ఒకే కూర్పరి గడి కొన్ని సార్లు చేస్తే దాన్లోని నాడి పట్టుకోవచ్చు. ఆనక [...]
2010 మార్చి గడిపై మీ అభిప్రాయాలను, సూచనలను ఇక్కడ రాయండి.
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు