చిన్నప్పుడు అంటే, ఋతువులని బట్టి వర్షాలొచ్చే రోజులన్నమాట, వర్షాకాలం వచ్చిందంటే ఎన్నెన్నో previleges ఉండేవి. మరీ గట్టిగా వర్షం వస్తే, స్కూలికే పంపేవారు కాదు. అధవా స్కూల్లో ఉన్నప్పుడు ప్రొద్దుటి చివరి పిరీయడ్ లో వర్షం మొదలెడితే “కంటిన్యూ” పెట్టేవారు. అంటే ఇంకో మూడు పీరియడ్లు పాఠాలు చెప్పేసి, స్కూలుగంట కొట్టేసేవారు. హాయిగా ఉండేది, మళ్ళీ స్కూలుకి రావఖ్ఖర్లేదుగా. [...]




