ఎంతో ఆత్మీయంగా ఉండే ఇద్దరు మిత్రుల మధ్య ఏ పనుల వత్తిడో, చిన్నపాటి అభిప్రాయబేధమో తలెత్తితే అది క్రమేపీ పూడ్చలేనంత అగాధమవడానికి ఏతావాతా ఎన్నో కారణాలుండొచ్చు. కానీ అన్నింటి కన్నా పెద్ద కారణం మాత్రం అపసవ్యమైన వారిద్దరి ఆలోచనాధోరణే! ఈ ప్రపంచంలో ఒక మనిషి మనకు దగ్గరవ్వాలంటే ఎన్నో మనస్తత్వ విశ్లేషణలు, నిజనిర్థారణలూ అవసరం అవుతున్నాయి. అదే కొద్దిగా తేడా వస్తే చాలు.. [...]
http://computerera.co.in/forum అనే లింకులో కంప్యూటర్ నాలెడ్జ్ ని ఒకరికొకరు షేర్ చేసుకోవాలన్న ఉన్నతాశయంతో రెండేళ్లుగా ఆన్ లైన్ ఫోరమ్ నిర్వహిస్తూ వస్తున్నాం. ఇప్పటికే 7,164 మంది సభ్యులున్న ఈ ఫోరం గురించి ముఖ్యమైన సందర్భాల్లో బ్లాగులో ప్రస్తావించడమూ జరిగింది.ఈ నేపధ్యంలో ఈ పోస్ట్ చెయ్యడానికి ముఖ్య కారణం.. సుమణి వెంకట్ గారు అనే ఇటీవల ఫోరంలో జాయిన్ అయిన ఒక మెంబర్ ఫోరంలో పోస్టులన్నీ గత [...]
అలసిన ఓ నిమిషం కళ్లెదుటి బాహ్యప్రపంచాన్ని బలవంతంగా కనురెప్పల బిగింపుతో తిరస్కరించి కళ్లు మూస్తే ఎన్నో అలజడులు కళ్లల్లో ఎగిరెగిరి పడుతున్నాయి. బాల్యపు "నేను"కీ, యవ్వనానికీ, నిన్నటికీ, ఇప్పటి "నేను"కీ సారూప్యత దొరకబుచ్చుకోలేక మెదడు జ్ఞాపకాల దొంతరుల్ని తిరగేస్తూనే ఉంది. అంతలో ఏ సమూహంలోనో అభిప్రాయాలు ఆరాటపడుతూ మనుషుల నాలుకల్ని తొలుచుకు వచ్చేటప్పుడు "నేనలా.. [...]
"మంచి పుస్తకం" పేరిట ప్రధానంగా చిన్నారులకు ఉపయోగపడే అనేక పుస్తకాలను ప్రచురిస్తున్న సురేష్ గారు తమకు తెలిసిన NGO's కి e-తెలుగు కార్యకలాపాల గురించి, తెలుగు టైపింగ్, బ్లాగింగ్ నేర్పించడంపై ఓ demo ఏర్పాటు చేశారు. దానికి గాను ఈరోజు నేనూ, దూర్వాసుల పద్మనాభం గారు తార్నాకలోని సురేష్ గారి ఆఫీసుకి వెళ్లి వారి కాన్ఫరెన్స్ హాలులో ప్రొజెక్టర్ పై మనం తెలుగు వ్యవస్థాపించడం, తెలుగు [...]
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలన్న లక్ష్యంతో గత ఏడాది కాలంగా "కంప్యూటర్ ఎరా" "సాంకేతిక సహాయం" పేరిట టెక్నికల్ ఛాట్ రూమ్, ఫోరంలను నిర్వహిస్తోందన్న విషయం కొందరికి తెలిసే ఉంటుంది. దానికి సంబంధించి బ్లాగర్ల మీటింగ్ మాదిరిగానే అదే కృష్ణకాంత్ పార్క్ లో ప్రతీ నెలా నాలుగవ ఆదివారం like minded వ్యక్తులతో మీటింగ్ నిర్వహించబడుతుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గం.లకు ఆ [...]
ఈరోజు 1.30 ఆకాశవాణి Rainbow FM ఛానెల్ లో మన e-తెలుగు గురించి ప్రోగ్రాం ఆ స్టేషన్ ఇంఛార్జ్ అయిన మిత్రుడు ప్లాన్ చేసి చదువరి గారినీ, నన్నూ ఆహ్వానించారు. ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుని ఖైరతాబాద్ నుండి AIR స్టేషన్ కి వెళ్లడానికి 20 నిముషాలకు పైగా పట్టింది. ద్వారకా హోటల్ దగ్గరే 1.18 pm అయింది. ట్రాఫిక్కేమో భయంకరంగా ఉంది. మొత్తానికి 1.25 ప్రాంతంలో స్టేషన్ కి చేరుకున్నాం. వెళ్లడమే రికార్డింగ్ [...]
26వ తేదీ నివేదిక:తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం గారూ, దాట్ల శ్రీనివాసరాజు గారూ, నేనూ కలిసి ఈరోజు స్టాల్ వద్దకు వెళ్లాం. వెళ్లూ వెళ్లూ నెక్లెస్ రోడ్ ని తాడేపల్లి గారు కామ్ కోడర్ లో బంధించారు. e-తెలుగు ప్రదర్శన జరిగిన రోజు ఆయన షూట్ చేసిన footageని వీలైనంత హృద్యంగా మలచాలన్నది ఆయన ఆకాంక్ష. స్టాల్ వద్దకు చేరుకునేసరికి అప్పటికే "జీవితంలో కొత్తకోణం" బ్లాగర్ శ్రీనివాసకుమార్ [...]
ఆల్ ఇండియా రేడియో వారి Rainbow FM 101.9 ఫ్రీక్వెన్సీ లోని ఛానెల్ లో ఈ రోజు మధ్యాహ్నం 1.30 - 2.30 కంప్యూటర్లో తెలుగు, e-తెలుగు కార్యకలాపాల గురించి లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. బ్లాగు మిత్రులకు ఎటూ ఈ అంశాలపై అవగాహన ఉంటుంది. మీ మిత్రులకెవరికైనా ఆయా అంశాలపై సందేహాలుంటే 040- 23234821 లేదా 040-23234822 అనే నెంబర్లలో కాల్ చెయ్యమని చెప్పగలరు.ఎగ్జిబిషన్ లో నిన్నటి నివేదిక కొన్ని పెండింగ్ పనులను చూసుకోవలసి [...]
బ్లాగర్లందరూ మరోమారు ఒక చోట చేరిన మరో పండుగరోజు ఈరోజు. ఈరోజు 12 గంటల నుండే ప్రదర్శన ప్రారంభం. నేనూ, భార్గవ్ 1.45కి అక్కడికి చేరుకున్నాం. అప్పటికే దూర్వాసుల పద్మనాభం గారు దుకాణం తెరిచి ఉన్నారు. క్రిస్టమస్ కావడం వల్ల అంత మధ్యాహ్నం కూడా విపరీతంగా జనాలు వచ్చేస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లో తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చేశారు. అలాగే బెంగుళూరు నుండి స్వస్థలం వెళుతూ [...]
హైదరాబాద్ పుస్తక ప్రదర్శన నిర్వాహకులు మనకు స్టాల్ కేటాయించినందుకు ప్రతిగా వారికి ఓ వెబ్ సైట్ రూపకల్పన చేసి ఇస్తామని మొదట్లో తెలియజెప్పడం జరిగింది. ఆ మేరకు చదువరి గారు http://hyderabadbookfair.com/ అనే డొమైన్ ని రిజిస్టర్ చేసి దాట్ల శ్రీనివాసరాజు గారు, వీవెన్ గార్లతో కలిసి ఆ సైట్ కి బుక్ ఫెయిర్ వారు అందించిన కొద్దిపాటి వివరాలతో వీలైనంత వరకూ ఓ రూపం తీసుకువచ్చారు. ఈ నేపధ్యంలో బుక్ [...]
ఓపికగా ప్రతీరోజూ నివేదికను చదువుతున్న మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు. ఎగ్జిబిషన్ మొదటి రోజు నుండి ఇంతవరకూ క్రమం తప్పకుండా వస్తున్న పెద్దాయన దూర్వాసుల పద్మనాభం గారికి కొద్దిగా ఒంట్లో బాలేదని కట్టా విజయ్ గారు ఫోన్ చేసినప్పుడు తెలిపారట. ఆయన నిన్ననే చాలా అసౌకర్యంగా కన్పించారు. అలా ఉండి కూడా ఉదయం నాకు ping చేసి ఏమైనా అవసరం ఉంటే తెలపండి అంటూ చెప్పారు. "ఏమీ అవసరం లేదు [...]
తేదీ 22-12-2008యధాప్రకారం 1.30 గంటలకు కూకట్ పల్లి నుండి ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకోవడానికి రెడీ అవుతుండగా కశ్యప్ గారి సోదరులు భార్గవ్ గారు అప్పటికే అక్కడికి చేరుకున్నానని కాల్ చేసి చెప్పారు. నేను వెళ్లేసరికి 2.15 అయింది. కొద్దిసేపటికి దూర్వాసుల పద్మనాభం గారూ వచ్చారు. నేను వెళుతూ వెళుతూ లాప్ టాప్ లో lekhini.org పేజీని offlineలో సేవ్ చేసుకుని వెళ్లాను. జనప్రవాహం ప్రారంభమైంది. మన స్టాల్ [...]
20వ తేదీ శనివారం 11.30 గంటలకు ఇంటి నుండి బయల్దేరాం చదువరి గారూ, నేనూ! అప్పటికే కశ్యప్ గారి సోదరులు భార్గవ్ గారు (అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూంటారు, గతంలో ఓ బ్లాగు ప్రారంభించి ఈ మధ్య రాయట్లేదు) మన స్టాల్ వద్దకు చేరుకుని ఫోన్ చేశారు. ముందురోజు అనుకున్న ప్రకారం కశ్యప్ గారు LCD పెద్ద మోనిటర్ భార్గవ్ గారితో పంపించారు. చదువరి గారు వస్తూ కొత్తగా రాయించిన మూడు బేనర్లు [...]
20వ తేదీ (శనివారం) ఎగ్జిబిషన్ ఆవరణలోనే డయాస్ పై ఓ ప్రదర్శన ఇచ్చేందుకు కూడా చదువరి గారు, అరుణ గారు ముందే అనుమతి సాధించారు. ఆ ప్రోగ్రామ్ లో 20-30 నిముషాల వీడియో (screencast) ప్రజెంట్ చేద్దాం అనుకున్నాం. 18 నైట్ ఇంటికి రాగానే ఫ్రెషప్ అయి, డిన్నర్ అయిందనిపించి నైట్ 12 గంటల ప్రాంతంలో రికార్డింగ్ కి కూర్చున్నాను. ఓ నాలుగు రోజుల క్రితమే cold, fever వచ్చి తగ్గడం వల్ల, అప్పటివరకూ చలిగాలిలో గడిపి [...]
హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో మన ఇ-తెలుగు తరఫున స్టాల్ పెట్టడానికి అనుమతి దొరకడం, అప్పటికప్పుడు తగిన ఏర్పాట్లు చేసుకోవడం, అందుబాటులో ఉన్నవారందరూ తలా ఒకరోజు వంతులు వేసుకుని స్వచ్ఛంధంగా సేవలు అందించడం.. వగైరా ఈ మూడు రోజుల్లో జరిగిన పరిణామాలను వీలైనంత వివరంగా సమీక్షిస్తాను.14వ తేదీ హైదరాబాద్ బ్లాగర్ల సమావేశంలో నిర్ణయించుకున్న మేరకు కంప్యూటర్ ఎరా స్టాల్ లో కరపత్రాలు [...]
తనకు నచ్చితేనే ఒప్పుకునే తత్వం ఏ మనిషిదైనా! సామాజిక బంధాల్లో ఇలా మనకు నచ్చడం అన్నది ఎల్లప్పుడూ సాధ్యపడదు. ముఖ్యంగా తరాల అంతరాలున్న బంధాల్లో పెద్దల ఇష్టాలకు అనుగుణంగా పిల్లలు సగౌరవంగా గానీ, అయిష్టంగా గానీ.. అలాగే పిల్లల ఆధిపత్యాన్ని నిస్సహాయస్థితిలో కాదనలేక పెద్దలు గానీ ఒక్కోసారి ఒద్దికగా కావచ్చు, తప్పనిసరై కావచ్చు తలవంచక తప్పదు. పిల్లల పరంగా చూస్తే పెద్దల [...]
పచ్చదనాన్ని కప్పుకుని ఆకసాన్నంటే గిరులు ఓ వైపు.. అబ్బురపరిచే లోయలు మరో వైపు.. తాచుపాములా మెలికలు తిరిగే సన్నని దారీ.. కళ్లు విప్పార్చుకుని చూసినా కళ్లల్లో ఇమిడిపోలేనన్ని అందాలు..ఆహ్లాదంగా సాగిన అరకు విహారయాత్ర మిగిల్చిన అనుభవం ఇది. గత నెల 15వ తేదీ నుండి కంప్యూటర్ ఎరా డిసెంబర్ మేగజైన్ ప్రిపరేషన్ వత్తిడిలో బ్లాగుకి దూరంగా ఉన్నాను. అది ప్రింటింగ్ కి పంపిన తర్వాత ప్లాన్ [...]
సహజంగా ప్రతీ మనిషిలోనూ నివురుగప్పిన అసంతృప్తులు చల్లార్చడానికి, వాటిని ప్రకటితం చెయ్యడానికి కొన్ని అంశాలు కావాలి. సామాజిక జాఢ్యాలను ఎండగట్టడం వల్ల కొంతైనా ఈ అసంతృప్తులు బంధవిమోచనం పొంది మనసు కుదుటపడుతుంది. ఈ క్షణం రాజకీయాలను దూషిస్తూ మనం గళం ఎత్తామంటే దానికి మూలం ఆ రాజకీయాలు ఒక్కటే కారణం కాదు, ఇతరత్రా ఎన్నో అసంఘటిత అసంతృప్తులు మనసులో ఇమడలేక ఏదో రూపేణా, ఏదో ఒక [...]
సినీ తారల మాటలు, ఎమోషన్స్ ఎంత వక్రీకరించబడతాయో, ఒక్కోసారి ఎంత వివాదాస్పదం అవుతాయో ఓ చిన్న ఉదాహరణ ప్రస్తావిస్తూ ఈ "సినిమా మనిషి కబుర్లు" సీరియల్ ప్రారంభిస్తాను.ఆరోజు చెన్నైలో దాసరి అరుణ్ కుమార్ "గ్రీకు వీరుడు" ఆడియో ఫంక్షన్ జరుగుతోంది. తెలుగు సినిమా పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ తరలిపోతున్న తరుణం అది. అప్పటికీ 30-40% షూటింగ్ లు, 90 శాతానికి పైగా రికార్డింగ్ లు చెన్నైలో [...]
తళుకుబెళుకుల తారాలోకం అది! ఆ తళుకులకు ఆకర్షింపబడని మిణుగురు పురుగులు ఉండవేమో! మిణుగురులు అంత స్థాయిలో కాకుండా తారల గురించి, సినిమా రంగం గురించి తెలుసుకోవాలని చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. తారాలోకంలోకి ఓ సినిమా పత్రిక సబ్ ఎడిటర్ గా యాధృచ్చికంగా నా ప్రవేశం తటస్థించింది. ఆ పత్రిక పేరు అప్రస్తుతం. పత్రిక పేరుతో ముడిపెడితే మున్ముందు చేసే పోస్టులు స్వేచ్ఛగా [...]
"సమాజంలో మార్పు తెద్దాం.. వ్యవస్థని సమూలంగా కడిగేద్దాం.." ఇటీవల విన్పిస్తున్న నాయకులందరి ఇలాంటి నినాదాలతో ఉప్పొంగిపోతున్నాం... ఇంకేముంది దేశం బాగుపడేరోజు వచ్చేసిందని మురిసిపోతున్నాం. అస్సలు సమాజమంటే..? మీరూ, నేనూ, మన పక్క ఉన్న వ్యక్తుల సమూహమే కదా. మనం ఇదే మాదిరి బాధ్యతారాహిత్యంగా ఉంటుంటే ఎవరో వచ్చి మనతో కూడి ఉన్న సమాజాన్ని ఉద్ధరించగలుగుతారా? అస్సలు మనలో ఎంత వరకూ [...]
"ఫలానా పని సరిగా చెయ్యలేకపోయానే.. ఇలాగైతే బాగుణ్ణు..", "అవునూ అప్పుడలా మాట్లాడి ఉండవలసింది కదూ... ప్చ్ వెధవ బుర్ర టైమ్ కి వెలగదు...", "ఇంతకీ వచ్చేవారం ఏం ప్రోగ్రామ్ పెట్టుకోవాలి...?", "ఆ శ్రీకాంత్ గాడికి ఎంత చెప్పినా విన్పించుకోడు.. వాడి ఖర్మ, ఇక్కడ నాకేదో పట్టినట్లు..!", "షేర్లు పడిపోయాయి కదా మంచి స్క్రిప్ చూసి కొనిపారేస్తే అలా పడుంటాయేమో... ఆలోచించాలి! ", "ఇప్పుడే తాళాలెక్కడో [...]
“నువ్వంటే నాకు చాలా ఇష్టం” – ఆడా మగా ఇద్దరి మధ్య చోటుచేసుకునే ఈ సంభాషణని చదవగానే ఎవరు ఎవరితో ఏ సందర్భంలో ఇలా అన్నారో ప్రస్తావించకపోతే ఇదేదో ప్రేమ వ్యవహారం అనే సందేహమే అధికశాతం మందికి సహజంగా కలుగుతుంది. ఒకే భావాలున్న ఇద్దరు వ్యక్తులు తమ ఆలోచనలను ఒకరిలో మరొకరు చూసుకుంటూ ఉబ్బితబ్బిబ్బయ్యే వేళ ఇలా ఇష్టాన్ని వ్యక్తపరుచుకోపోతే మనసు నిరాశ చెందుతుంది. ఆ ఇద్దరు [...]
ప్రతీ మనిషికీ ఓ పర్సనల్ జోన్ ఉంటుంది. దాన్ని చేధించి వారి అంతరంగానికి సమీపంగా చేరుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. తల్లిదండ్రులు, భార్య, భర్త, పిల్లలు, తోబుట్టువులు, స్నేహితులు ఎవరూ ఒక స్థాయికి మించి ఆ మనిషి యొక్క పర్సనల్ జోన్ లోకి ప్రవేశించలేరు. కానీ కొన్ని మానవ సంబంధాల్లో అవతలి వ్యక్తిపై ఉన్న ప్రేమ, సాన్నిహిత్యం కొద్దీ వారి అంతరంగ ప్రపంచంలోకి చొరబడి వారిని పూర్తిగా [...]
"అందరిలాంటి వ్యక్తిని కాదు నేను" అనుకుంటూ మనకిమనం ప్రత్యేకతను ఆపాదించుకోవడం ద్వారా మనం ఎంతో సంతృప్తిని మూటగట్టుకుంటుంటాం. ఇలా విభిన్నంగా ఉండాలన్న కోరికే ఒక రకంగా మన జీవితానికి జీవం కూడా పోస్తుందేమో! సామాజిక సంబంధాల్లో మనదైన ముద్రని స్థిరీకరించడానికి మనసు ఉవ్విళూరుతుంటుంది. అందుకే ఇంకొకరిని అనుకరించడం మనస్కరించదు. ఎన్నో అనుభవాల కలబోతగా విభిన్నమైన [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు