ముందుగా ఓ ఒప్పుకోలు. 'చందమామ కథలు,' 'గుంటూర్ టాకీస్' లాంటి వైవిద్యభరితమైన సినిమాలు తీసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు, యాంగ్రీ యంగ్మన్ రాజశేఖర్ హీరోగా సినిమా చేయబోతున్నాడు అనగానే, "అయ్యో, ఇదేంటీ" అనుకున్నాను. గత కొన్నేళ్లుగా, కథ ఏదైనా, దర్శకుడు ఎవరైనా రాజశేఖర్ చేసిన సినిమాలన్నీ దాదాపు ఒకే మూసలో ఉండడమే ఇందుకు కారణం. అయితే, కథలో బలం ఉన్నప్పుడూ, చెప్పదలచిన విషయం మీద [...]
మా కాలనీలో ఓ కుర్రాడిని కుక్క కరిచింది. కుక్కకాటు గురించి అడపా దడపా పేపర్లలోనూ, టీవీల్లోనూ చూడడమే కానీ, ప్రత్యక్ష జ్ఞానం కలిగింది మాత్రం ఇప్పుడే. ఆ వయసు కుర్రాళ్లందరిలాగే ఇంజినీరింగ్ చదువుతున్నాడతను. కాలేజీకి వెళ్లిరావడం, సెలవుల్లో కాలనీ రోడ్డు మీద మిగిలిన కుర్రాళ్లతో కలిసి క్రికెట్ ఆడుకోవడం తెలుసు. నిజానికి అతగాడి గురించి చెడుగా ఏమీ వినలేదు కూడా. వాక్సినేషనూ [...]
తెలుగునాట ఆధునిక సాహిత్యానికి శక కర్తగా చెప్పదగ్గ గురజాడ అప్పారావు పంతులు రాసిన 'కన్యాశుల్కం' నాటకం తొలికూర్పు విడుదలై నూటపతికేళ్ళు. ఇవాళ్టికీ ఈ నాటకం ప్రేక్షకుల, పాఠకుల ఆదరణ పొందడమే కాదు, కాల పరీక్షకి నిలబడి భవిష్యత్తు తరాల ఆదరణనీ చూరగొంటుందన్న నమ్మకం రోజురోజుకీ బలపడుతోంది. "అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష" అని ఈ నాటకంలో అగ్నిహోత్రావధానులు పాత్ర పలుకుతుందో [...]
ఏడంకాల 'కన్యాశుల్కం' నాటకంలో ప్రతీ అంకంలోనూ ప్రస్తావనకి వచ్చే పేరు హెడ్ కనిష్టీబు. పేరు కూడా తెలియని ఈ పాత్ర ప్రత్యక్షంలో కనిపించేది కొన్ని సన్నివేశాల్లోనే అయినా, పరోక్షంలో ఇతడి ప్రస్తావన చాలాసార్లే వస్తుంది. ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోలీసు వ్యవస్థ పనితీరు కంపెనీ పాలనా కాలంలో ఎలా ఉండేదో తెలుసుకోడానికి బహు చక్కగా ఉపయోగ పడే పాత్ర ఇది. [...]
"గవునర్ మెంటూ, దేవుళ్ళూ, బ్రాహ్మలూ వారి నేరాలు వారివి. వాటితో మనకి పనిలేదు. మనభక్తి మనకుండాలి" అంటాడు 'కన్యాశుల్కం' నాటకం పంచమాంకంలో సారాయి దుకాణం సన్నివేశంలో మాత్రమే కనిపించే హవల్దారు అచ్చన్న. ఈ మాజీ సోల్జరు ఉద్దేశం అధికారంలో ఉన్నవాళ్ళ తప్పుల్ని పట్టించుకోనవసరం లేదని. గవర్నమెంటు, దేవుళ్ళు సరే. బ్రాహ్మల్ని ఎందుకు కలిపాడూ అంటే, నాటి సమాజంలో డబ్బుండి, అధికారంతో [...]
ఏదైనా ఒక వ్యవస్థ మీద జనానికి నమ్మకం పోతున్నప్పుడు ఆ వ్యవస్థలో ఏదన్నా అద్భుతం  జరుగుతూ ఉంటుంది. ఆ అద్భుతాన్ని ఆలంబనగా చేసుకుని ప్రజలు మళ్ళీ ఆ వ్యవస్థ మీద నమ్మకం పెంపొందించుకుంటూ ఉంటారు (మన ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లాగా). రామప్పంతులు లాంటి కోర్టు పక్షులు, నాయుడు, భీమారావు లాంటి వకీళ్లు, ఫోర్జరీ కాగితాలు, నకిలీ సాక్షులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోయి మొత్తం [...]
"పంచాంగానికేం ఈ వెధవ పల్లిటూర్లో? సిద్ధాంతి ఆడింది ఆటా. పాడింది పాటా. యంత ద్రోహం చేశాడయ్యా సిద్ధాంతి?" అంటూ సిద్ధాంతి మీద చిందులు తొక్కుతాడు రామప్పంతులు - లుబ్దావధాన్లు పెళ్లి కోసమని తాను పెద్దిపాలెం వెళ్లి లౌక్యుల్ని పిలుచుకుని వచ్చేసరికే ఆ పెళ్ళి కాస్తా అయిపోవడం చూసి. తెల్లవారి నాలుగు ఘడియలకి ముహూర్తమని చెప్పిన సిద్ధాంతి, రామప్పంతులు అటు వెళ్ళగానే శుభ [...]
చదువుకీ, లోకజ్ఞానానికీ సంబంధం లేదు అనడానికి ఉదాహరణ వెంకమ్మ. ఆమె చదువుకోలేదు. కానీ లోకం పోకడని ఆకళింపు చేసుకుంది. తన భర్త ఎంతటి మూర్ఖుడో ఆమెకి బాగా తెలుసు. అతడితో కాపురం చేస్తూనే తనకి కావాల్సినవి సాధించుకుంది. కొడుకుని ఇంగ్లీషు చదివించడం కావొచ్చు, చిన్న కూతురి పెళ్లి సంబంధాన్ని తప్పించడం కావొచ్చు.. అన్నీ వెంకమ్మ ఇష్టప్రకారమే జరుగుతాయి చివరికి. అమాయకపు గృహిణిలా [...]
వెంకటేశానికి చెగోడీలంటే మహా ఇష్టం. గేదె పెరుగన్నా, జామపళ్ళన్నా కూడా ఇష్టమే. గొట్టికాయలు, కోతిపిల్లి కర్ర ఆటల్లో వెంకటేశాన్ని కొట్టేవాడు లేదు. వీటన్నింటికన్నా పొగచుట్టలు కాల్చడం అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. కృష్ణరాయపురం వాసి అగ్నిహోత్రావధానులు కొడుకు వెంకటేశం. తండ్రిలా సంస్కృతం కాకుండా, పట్నంలో ఉండి ఇంగ్లీష్ చదువుకుంటున్నాడు. అసలే ఇంగ్లీషు చదువులు దేశంలో [...]
సత్యమూర్తి అనే పేరుగల మహానుభావుడు అసత్యం తప్ప మరొకటి ఆడకపోవచ్చు. భీముడన్న పేరు కలిగి గాలేస్తే ఎగిరిపోయేంత అర్భకంగానూ ఉండొచ్చు. అందరూ అలాగే ఉంటారా అన్న ప్రశ్న రాకుండా ఉండడం కోసం, పేరుకు తగ్గట్టుగా.. ఇంకా చెప్పాలంటే ఆ పేరు తనకి అతికినట్టు సరిపోయేలా ప్రవర్తించే వ్యక్తి లుబ్ధావధాన్లు. ఈ రామచంద్రపురం అగ్రహారీకుడు ముందు పుట్టాడా, పీనాసితనం ముందుగా పుట్టిందా అని [...]
లౌక్యప్రజ్ఞలో తనని మించిన వాడు లేడని గట్టి నమ్మకం రామచంద్రపురం అగ్రహారీకుడు రామప్పంతులుకి. కానీ, అదేం చిత్రమో, 'కన్యాశుల్కం' నాటకంలో రామప్పంతులు చూపించిన లౌక్య ప్రజ్ఞ అంతా అతగాడికే ఎదురు తిరిగింది. నడివయసుకి వచ్చినా ఇంకా "పడుచు వాణ్ణి" అని చెప్పుకోడం సరదా. పెద్దలిచ్చిన ఆస్తి కరారావుడు చుట్టేసి, వాళ్ళకీ, వీళ్లకీ జుట్లు మూడేసి జీవితం సాగిస్తున్నా హోదాకీ, ఫాయాకీ [...]
రామచంద్రపురం అగ్రహారీకుడు లుబ్దావధాన్లు ఏకైక సంతానం మీనాక్షి. లుబ్దావధాన్లు దగ్గర బాగానే డబ్బున్నా, పేరుకు తగ్గట్టే పరమ లోభి. 'కన్యాశుల్కం' ఆశించి, మీనాక్షికి చిన్నప్పుడే ఓ ముసలి వాణ్ణిచ్చి  పెళ్లి చేశాడు. పెళ్ళైన కొద్ది కాలానికే ఆ వరుడు కన్నుమూయడంతో, ఏ ముచ్చటా తీరకుండానే తల చెడి పుట్టిల్లు చేరింది. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న మీనాక్షి, పుట్టింటికి [...]
సంస్కృత పండితుడూ, విజయనగరం నాటక కంపెనీలో విదూషకుడూ అయిన కరటక శాస్త్రికి ప్రియశిష్యుడు మహేశం. సంస్కృత విద్యార్థి. కరటకుడి మేనల్లుడు వెంకటేశం ఈడువాడు. అవతలున్నది గురువుగారైనా, మరెవరైనా ఎలాంటి శషభిషలూ లేకుండా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడ్డం మహేశం నైజం. అందుకే. "ఈ రోజుల్లో సంస్కృతం చదువు ఎవరికి కావాలి?" అని గురువు గారడిగితే, "దరిద్రులకి కావాలి" అని ఠపీమని [...]
సుబ్బి అనే చిన్నపిల్లకీ, లుబ్ధావధాన్లు అనే ముసలివాడికీ నిశ్చయమైపోయిన పెళ్లిని చెడగొట్టి,  బాల్య వివాహం బారినుంచి సుబ్బిని కాపాడడమే 'కన్యాశుల్కం' నాటకం  ప్రధాన కథ. ఈ పెళ్లిని చెడగొట్టేందుకు ఎవరి స్థాయిలో వాళ్ళు కృషిచేసినా, ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మధురవాణి అనే వేశ్యని గురించి. ఆమె వృత్తి చేత వేశ్య కనుక చేయవలసిన చోట ద్రవ్యాకర్షణ చేస్తుందే తప్ప, [...]
హరిద్వారంలో మఠం కట్టించడమే బైరాగి లక్ష్యం. అందుకోసం ఎక్కడ డబ్బొచ్చినా కాదనకుండా స్వీకరిస్తాడు. కాకపొతే, ఆ మఠం పనులు ఎప్పుడు మొదలవుతాయో, ఎప్పటికి పూర్తవుతాయో నరమానవుడికి తెలియదు. సిద్ధుడు కాబట్టి బైరాగికి మాత్రమే తెలుసు. బైరాగి ఆదీ అంతం లేదు. నాటికి ఆరొందల ఏళ్ళ క్రితం నాటి వేమన బైరాగికి తాత. రెండొందల యాభై ఏళ్ళ క్రితం కాశీలో జరిగిన ఓ సంఘటనకి బైలాగి ప్రత్యక్ష [...]
"నాన్నా, తమ్ముడికి పెళ్ళి చెయ్యాలంటే నా సొమ్ము పెట్టి పెళ్లి చెయ్యండి గాని దానికి కొంప ముంచి లుబ్ధావధాన్లుకి యివ్వొద్దు.." అత్యంత కోపిష్టీ, మూర్ఖుడూ అయిన తండ్రి ఎదుట నిలబడి బుచ్చమ్మ చెప్పిన మాట ఇది. ఇక్కడ "నా సొమ్ము" అంటే, భర్త మరణించిన తర్వాత ఆమెకి అత్తింటి నుంచి మనోవర్తిగా వచ్చిన సొమ్ము. తమ్ముడు వెంకటేశం చదువు ఆగిపోవడం ఆమెకి ఇష్టం లేదు. అలాగని, ఆ చదువు కోసం [...]
ఓ పక్క మాయగుంట కనిపించక రామచంద్రపురం అగ్రహారం మొత్తం అట్టుడికిపోతూ ఉంటే, రామప్పంతులు ఇంటి కొట్టు గదిలో మధురవాణి బృందం తాపీగా ఆడే పేకాటలో మొదటిసారి కనిపిస్తాడు పోలిశెట్టి, తనకి 'భష్టాకారి' ముక్కలు పడ్డాయని బాధపడుతూ. పోలిశెట్టిని చూడడానికి 'కన్యాశుల్కం' నాటకం పంచమాంకం వరకూ ఆగాలి కానీ, అతగాడి ప్రస్తావన మాత్రం చతుర్ధాంకంలోనే వస్తుంది. సుబ్బి పెళ్లి చెడగొట్టడం [...]
'కన్యాశుల్కం' నాటకంలో మొట్టమొదట వినిపించే పేరు పూటకూళ్ళమ్మ. "సాయంకాలమైంది" అంటూ ఆత్మగతం మొదలు పెట్టిన గిరీశం, ఆ వెంటనే "పూటకూళ్ళమ్మకు సంతలో సామాను కొనిపెడతానని నెలరోజుల కిందట యిరవై రూపాయలు పట్టుకెళ్లి డాన్సింగర్లు కింద ఖర్చుపెట్టాను. యివాళ ఉదయం పూటకూళ్ళమ్మకీ నాకూ యుద్ధవై పోయింది. బుఱ్ఱ బద్దలు కొడదామా అన్నంత కోపం వచ్చింది కానీ.." అంటూ కొనసాగిస్తాడు. [...]
ఎంతటి పిశాచన్నైనా పట్టి బంధించే సత్తా, నేర్పూ ఉన్న మాంత్రికుడు పూజారి గవరయ్య. లుబ్ధావధాన్లు పెళ్లాడింది మనిషిని కాదు కామినీ పిశాచాన్ని అని చెప్పడమే కాదు, ఆ పిశాచాన్ని భర్త సహితంగా సీసాలో బంధించిన ప్రజ్ఞాశాలి. రామచంద్రపురం అగ్రహారపు సిద్ధాంతికి చేదోడు వాదోడుగా ఉండడమే కాదు, ఊరూ పేరూ లేని బైరాగి మాయారూపంలో సంచరిస్తుంటే చనువుగా మాట్లాడగల శక్తి కూడా గవరయ్యకే ఉంది. [...]
"యేమండీ రామప్పంతులన్నా, మిగతా ఫీజు ఇప్పించారు కారుగదా?" ఇది 'కన్యాశుల్కం' నాటకం ఆరో అంకంలో ప్రవేశించే వకీలు నాయుడు పాత్ర మొట్ట మొదటి డైలాగు. కేవలం రెండంకాల్లో, కొద్ది సన్నివేశాల్లో మాత్రమే కనిపించే నాయుడు తన 'పార్టీ' కేసు ఓడిపోడానికి తిరుగులేని కృషి చేశాడు!  పద్దెనిమిది వందలు శుల్కమిచ్చి సుబ్బిని పెళ్లి చేసుకుంటాడనుకున్న లుబ్ధావధాన్లు అప్పటికే మాయగుంటని [...]
ఒకే ఒక్క ఆత్మగతంతో ఓ పాత్ర  తాలూకు రూపు రేఖా విలాసాలను అలవోకగా వర్ణించారు మహాకవి గురజాడ అప్పారావు. 'కన్యాశుల్కం' నాటకం ఆరంభ ఘట్టంలో గిరీశం తనలో తాను మాట్లాడుకునే మాటలద్వారా అతడి తాలూకు సమస్త (అవ) లక్షణాలనీ రూపుకట్టారు. నాటకానికి గిరీశమే కథా నాయకుడేమో అన్న సందేహం లేశమాత్రం కలగని విధంగా పూటకూళ్ళమ్మ దగ్గర డబ్బు తీసుకుని డాన్సింగ్ గర్ల్ కింద ఖర్చు పెట్టేయడం మొదలు, [...]
నాటకంలో ఎంత హాస్యమైనా చెల్లుతుందని బాగా తెలిసిన విదూషకుడు కరటకశాస్త్రి. అదే హాస్యాన్ని నటనలోకి తెచ్చినా నెగ్గుకు రాగల భరోసా ఉన్నవాడు. విద్య చేత సంస్కృత పండితుడు, వృత్తి చేత విజయనగరం నాటక కంపెనీలో విదూషకుడూను. క్రియలో అంతవరకూ రాకపోయినా, మాటల్లో అమేషా మెడపట్టుకుని బయటకు తరిమే ఇల్లాలికి మగడు. భర్తకి ఇష్టం ఉండదని తెలిసీ, పెరట్లో కాస్తున్నాయని  రోజూ ఆ ఇల్లాలు [...]
'కన్యాశుల్కం' నాటకాన్ని మొట్టమొదటి సారి చదివినప్పుడు నేను పెద్దగా పట్టించుకోని పాత్రల్లో లుబ్ధావధాన్లు ఇంటి నౌకరు 'అసిరి' పాత్ర ఒకటి. ఓ అర్ధరాత్రి వేళ మూకుట్లో మీనాక్షి పెట్టిన వడపప్పు, కొబ్బరి ముక్కలు తింటున్న రామప్పంతుల్ని'దెయ్యానికెత్తింది తింతున్నావయ్యా?" అని అడిగి హడలగొట్టడం మాత్రం బాగా గుర్తుండిపోయింది. తర్వాత కూడా కొన్నాళ్ల పాటు ప్రధాన పాత్రల తాలూకు [...]
"తాంబోళం ఇచ్చేశాను తన్నుకు చావండి" అంటూ 'కన్యాశుల్కం' నాటకంలో అగ్నిహోత్రావధానులు పలికిన మాట తెలుగు భాషలో జాతీయమై నిలిచిపోయింది. అతగాడి మాటే "ఆడముండలతోనా ఆలోచన?" అన్న ప్రశ్న నూట పాతికేళ్ల క్రితం మన సమాజంలోని కొన్ని కుటుంబాల్లో ఇల్లాలి స్థానం ఏమిటో ఒక్కముక్కలో చెప్పేసింది. కన్యాశుల్కాన్ని తలచుకోగానే తటాలున గుర్తొచ్చే పాత్రల్లో అగ్నిహోత్రావధాన్లు [...]
కోటీశ్వరుడు జగన్నాధరావు కొడుకు కృష్ణ. ఎనిమిదేళ్ల వయసులో 'శమంతకమణి' ని తనకి పుట్టినరోజు కానుకగా ఇమ్మని తల్లిని కోరుకున్నాడు. అందరు తల్లుల్లాగే ఆమె కూడా 'నువ్వు పెద్దయ్యాక ఇస్తా' అని చెప్పింది. వెనువెంటనే జరిగిన ప్రమాదంలో కృష్ణని బతికించి ఆమె కన్నుమూసింది. సవతి తల్లినీ, తనని పట్టించుకోని తండ్రినీ భరిస్తూ పెరిగి పెద్దవాడవుతాడు కృష్ణ. సరిగ్గా పదిహేనేళ్ల తర్వాత [...]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు