"పద్నాలుగో ఆర్ధిక సంఘం నిబంధనల కారణంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం.." గత కొన్నాళ్లుగా భారతీయ జనతా పార్టీ నాయకులు పదేపదే చెబుతున్న విషయం ఇది. ఆ ఆర్ధిక సంఘానికి సారధ్యం వహించింది ఆంధ్రప్రదేశ్ కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి యాగా వేణుగోపాల రెడ్డి. పూర్తి పేరు కాకుండా, వై.వి. రెడ్డి అనే పొట్టి పేరు ప్రస్తావిస్తే రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఆర్బీఐ) [...]
చరిత్రని అధ్యయనం చేసి కాలం నాటి సామాజిక పరిస్థితులని అర్ధం చేసుకోవడం ఒక ఎత్తైతే, ఆ అధ్యయనం ఆధారంగా కాల్పనిక పాత్రలని సృష్టించి, చారిత్రక నవలరాయడం మరోఎత్తు. అలా రాసిన నవలలో రచయిత ఏపాత్ర పట్లా, ఏ సన్నివేశం విషయంలోనూ ఎలాంటి రాగద్వేషాలకీ లోనుకాకుండా, ఎక్కడా తన గళం కానీ, నినాదాలు కానీ వినిపించకుండా అత్యంత సంయమనాన్ని ఆద్యంతమూ పాటించడం మరో ఎత్తు. 'మంచి నవల' కోసం [...]
ఏం జ్ఞాపకం చేసుకోవాలి శ్రీదేవి గురించి? బాలనటిగా కెరీర్ మొదలు పెట్టి, కథానాయికగా సుదీర్ఘ కాలం కొనసాగి, తల్లిపాత్రలని హుందాగా అంగీకరించి వెండితెరకి వెలుగులద్దిన తార మాత్రమేనా, అంతకు మించి ఇంకేమన్నా ఉందా అన్న ప్రశ్నఉదయం నుంచీ దొలుస్తూనే ఉంది. శ్రీదేవికన్నా ముందు, శ్రీదేవి తర్వాత చాలామంది కథానాయికలున్నారు. కానీ, శ్రీదేవితో సరిసమంగా నటించి, ప్రతిభాషలోనూ తనకంటూ [...]
వెండితెరకి సంబంధించి 'సున్నితత్వం' అనగానే గుర్తొచ్చే పేర్లలో మొదటివరుసలో ఉండే పేరు 'గుల్జార్' ది. సినీ గేయరచయితగా, దర్శకుడిగా హిందీ సినిమా ప్రేక్షకులకి సుపరిచితుడైన గుల్జార్ కథకుడు కూడా. మొత్తం ఇరవై ఎనిమిది కథలతో 'ధువా' గుల్జార్ రాసిన ఉర్దూ కథల సంకలనం కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతిని అందుకుంది. ఈ సంకలనాన్ని భారతీయ భాషల్లోకి అనువదించే ప్రయత్నంలో భాగంగా, [...]
నలభయ్యేళ్ళ నాటి ఈ నవలని ఇవాళ మళ్ళీ ప్రస్తావించుకోడానికి ఏకైక కారణం శ్రీరమణ. భార్యాభర్తల చిలిపి తగువులకి తన మార్కు చమక్కులని అద్ది, మళ్ళీ చదివినా బోర్ కొట్టని విధంగా తీర్చి దిద్దారు. ఇప్పటికైతే, శ్రీరమణ ప్రచురించిన ఏకైక నవల ఇది. మరో నవల రాబోతోందని చాన్నాళ్లుగా ఊరిస్తున్నారు కానీ, వస్తున్న అజ కనిపించడం లేదు. పురాణం సుబ్రహ్మణ్య శర్మ సంపాదకత్వంలోని 'ఆంధ్రజ్యోతి' [...]
చూస్తుండగానే 'పుట్టినరోజు జేజేలు...' పాడుకునే రోజు మళ్ళీ వచ్చేసింది. ఎప్పటిలాగే రాసిన విషయాల కన్నా రాయాల్సినవే ఎక్కువ మిగిల్చిన ఏడాది ఇది. అవును, 'నెమలికన్ను' కి తొమ్మిదేళ్లు నిండాయి. ఎప్పటిలాగే గడిచిన ఏడాది కూడా చదివిన పుస్తకాలు, చూసిన సినిమాల వివరాలే బ్లాగు రాతల్లో సింహ భాగాన్ని ఆక్రమించాయి. మిత్రుల ఆదరణ, ప్రోత్సాహం యధావిధిగా కొనసాగుతున్నాయి. వాళ్ళకే కాదు, [...]
బ్లాకండ్ వైట్ సినిమాల రోజుల్లో మన హీరోలు బీఏ పాసయ్యాక ప్రేమలో పడే వాళ్ళు.. సినిమాలు కలర్ దారి పడుతున్నప్పుడు బీఏ చదువుకుంటూ, పార్ట్ టైం గా ప్రేమ వ్యవహారాలు చక్కబెట్టుకునే వాళ్ళు. ఓ ఇరవయ్యేళ్ళ క్రితం మొదలైన 'యూత్ సినిమాల' ట్రెండ్ పుణ్యమా అని, ఇంటర్మీడియట్లోనూ, కొండొకచో పదో తరగతిలోనూ నాయికా నాయకులు ఒకర్నొకరు ప్రేమించేయడం మొదట్టేశారు. ఇక ఇప్పుడు, మరో అడుగు [...]
సమకాలీన సమాజాన్ని గమనిస్తూ, జీవన శైలిలో వస్తున్న మార్పులని జాగ్రత్తగా రికార్డు చేసుకుని కథ రాసుకుంటే ప్రేక్షకులని థియేటర్లకు రప్పించడం, రెండు గంటల పాటు కూర్చోపెట్టడం సమస్య కాబోదని మరోసారి నిరూపించిన సినిమా 'మెంటల్ మదిలో ...' కొత్త దర్శకుడు వివేక్ ఆత్రేయ తనే రాసుకున్న కథని ఆద్యంతమూ ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ఒక చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ అవ్వడంతో కథనం [...]
ముందుగా ఓ ఒప్పుకోలు. 'చందమామ కథలు,' 'గుంటూర్ టాకీస్' లాంటి వైవిద్యభరితమైన సినిమాలు తీసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు, యాంగ్రీ యంగ్మన్ రాజశేఖర్ హీరోగా సినిమా చేయబోతున్నాడు అనగానే, "అయ్యో, ఇదేంటీ" అనుకున్నాను. గత కొన్నేళ్లుగా, కథ ఏదైనా, దర్శకుడు ఎవరైనా రాజశేఖర్ చేసిన సినిమాలన్నీ దాదాపు ఒకే మూసలో ఉండడమే ఇందుకు కారణం. అయితే, కథలో బలం ఉన్నప్పుడూ, చెప్పదలచిన విషయం మీద [...]
మా కాలనీలో ఓ కుర్రాడిని కుక్క కరిచింది. కుక్కకాటు గురించి అడపా దడపా పేపర్లలోనూ, టీవీల్లోనూ చూడడమే కానీ, ప్రత్యక్ష జ్ఞానం కలిగింది మాత్రం ఇప్పుడే. ఆ వయసు కుర్రాళ్లందరిలాగే ఇంజినీరింగ్ చదువుతున్నాడతను. కాలేజీకి వెళ్లిరావడం, సెలవుల్లో కాలనీ రోడ్డు మీద మిగిలిన కుర్రాళ్లతో కలిసి క్రికెట్ ఆడుకోవడం తెలుసు. నిజానికి అతగాడి గురించి చెడుగా ఏమీ వినలేదు కూడా. వాక్సినేషనూ [...]
తెలుగునాట ఆధునిక సాహిత్యానికి శక కర్తగా చెప్పదగ్గ గురజాడ అప్పారావు పంతులు రాసిన 'కన్యాశుల్కం' నాటకం తొలికూర్పు విడుదలై నూటపతికేళ్ళు. ఇవాళ్టికీ ఈ నాటకం ప్రేక్షకుల, పాఠకుల ఆదరణ పొందడమే కాదు, కాల పరీక్షకి నిలబడి భవిష్యత్తు తరాల ఆదరణనీ చూరగొంటుందన్న నమ్మకం రోజురోజుకీ బలపడుతోంది. "అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష" అని ఈ నాటకంలో అగ్నిహోత్రావధానులు పాత్ర పలుకుతుందో [...]
ఏడంకాల 'కన్యాశుల్కం' నాటకంలో ప్రతీ అంకంలోనూ ప్రస్తావనకి వచ్చే పేరు హెడ్ కనిష్టీబు. పేరు కూడా తెలియని ఈ పాత్ర ప్రత్యక్షంలో కనిపించేది కొన్ని సన్నివేశాల్లోనే అయినా, పరోక్షంలో ఇతడి ప్రస్తావన చాలాసార్లే వస్తుంది. ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోలీసు వ్యవస్థ పనితీరు కంపెనీ పాలనా కాలంలో ఎలా ఉండేదో తెలుసుకోడానికి బహు చక్కగా ఉపయోగ పడే పాత్ర ఇది. [...]
"గవునర్ మెంటూ, దేవుళ్ళూ, బ్రాహ్మలూ వారి నేరాలు వారివి. వాటితో మనకి పనిలేదు. మనభక్తి మనకుండాలి" అంటాడు 'కన్యాశుల్కం' నాటకం పంచమాంకంలో సారాయి దుకాణం సన్నివేశంలో మాత్రమే కనిపించే హవల్దారు అచ్చన్న. ఈ మాజీ సోల్జరు ఉద్దేశం అధికారంలో ఉన్నవాళ్ళ తప్పుల్ని పట్టించుకోనవసరం లేదని. గవర్నమెంటు, దేవుళ్ళు సరే. బ్రాహ్మల్ని ఎందుకు కలిపాడూ అంటే, నాటి సమాజంలో డబ్బుండి, అధికారంతో [...]
ఏదైనా ఒక వ్యవస్థ మీద జనానికి నమ్మకం పోతున్నప్పుడు ఆ వ్యవస్థలో ఏదన్నా అద్భుతం  జరుగుతూ ఉంటుంది. ఆ అద్భుతాన్ని ఆలంబనగా చేసుకుని ప్రజలు మళ్ళీ ఆ వ్యవస్థ మీద నమ్మకం పెంపొందించుకుంటూ ఉంటారు (మన ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లాగా). రామప్పంతులు లాంటి కోర్టు పక్షులు, నాయుడు, భీమారావు లాంటి వకీళ్లు, ఫోర్జరీ కాగితాలు, నకిలీ సాక్షులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోయి మొత్తం [...]
"పంచాంగానికేం ఈ వెధవ పల్లిటూర్లో? సిద్ధాంతి ఆడింది ఆటా. పాడింది పాటా. యంత ద్రోహం చేశాడయ్యా సిద్ధాంతి?" అంటూ సిద్ధాంతి మీద చిందులు తొక్కుతాడు రామప్పంతులు - లుబ్దావధాన్లు పెళ్లి కోసమని తాను పెద్దిపాలెం వెళ్లి లౌక్యుల్ని పిలుచుకుని వచ్చేసరికే ఆ పెళ్ళి కాస్తా అయిపోవడం చూసి. తెల్లవారి నాలుగు ఘడియలకి ముహూర్తమని చెప్పిన సిద్ధాంతి, రామప్పంతులు అటు వెళ్ళగానే శుభ [...]
చదువుకీ, లోకజ్ఞానానికీ సంబంధం లేదు అనడానికి ఉదాహరణ వెంకమ్మ. ఆమె చదువుకోలేదు. కానీ లోకం పోకడని ఆకళింపు చేసుకుంది. తన భర్త ఎంతటి మూర్ఖుడో ఆమెకి బాగా తెలుసు. అతడితో కాపురం చేస్తూనే తనకి కావాల్సినవి సాధించుకుంది. కొడుకుని ఇంగ్లీషు చదివించడం కావొచ్చు, చిన్న కూతురి పెళ్లి సంబంధాన్ని తప్పించడం కావొచ్చు.. అన్నీ వెంకమ్మ ఇష్టప్రకారమే జరుగుతాయి చివరికి. అమాయకపు గృహిణిలా [...]
వెంకటేశానికి చెగోడీలంటే మహా ఇష్టం. గేదె పెరుగన్నా, జామపళ్ళన్నా కూడా ఇష్టమే. గొట్టికాయలు, కోతిపిల్లి కర్ర ఆటల్లో వెంకటేశాన్ని కొట్టేవాడు లేదు. వీటన్నింటికన్నా పొగచుట్టలు కాల్చడం అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. కృష్ణరాయపురం వాసి అగ్నిహోత్రావధానులు కొడుకు వెంకటేశం. తండ్రిలా సంస్కృతం కాకుండా, పట్నంలో ఉండి ఇంగ్లీష్ చదువుకుంటున్నాడు. అసలే ఇంగ్లీషు చదువులు దేశంలో [...]
సత్యమూర్తి అనే పేరుగల మహానుభావుడు అసత్యం తప్ప మరొకటి ఆడకపోవచ్చు. భీముడన్న పేరు కలిగి గాలేస్తే ఎగిరిపోయేంత అర్భకంగానూ ఉండొచ్చు. అందరూ అలాగే ఉంటారా అన్న ప్రశ్న రాకుండా ఉండడం కోసం, పేరుకు తగ్గట్టుగా.. ఇంకా చెప్పాలంటే ఆ పేరు తనకి అతికినట్టు సరిపోయేలా ప్రవర్తించే వ్యక్తి లుబ్ధావధాన్లు. ఈ రామచంద్రపురం అగ్రహారీకుడు ముందు పుట్టాడా, పీనాసితనం ముందుగా పుట్టిందా అని [...]
లౌక్యప్రజ్ఞలో తనని మించిన వాడు లేడని గట్టి నమ్మకం రామచంద్రపురం అగ్రహారీకుడు రామప్పంతులుకి. కానీ, అదేం చిత్రమో, 'కన్యాశుల్కం' నాటకంలో రామప్పంతులు చూపించిన లౌక్య ప్రజ్ఞ అంతా అతగాడికే ఎదురు తిరిగింది. నడివయసుకి వచ్చినా ఇంకా "పడుచు వాణ్ణి" అని చెప్పుకోడం సరదా. పెద్దలిచ్చిన ఆస్తి కరారావుడు చుట్టేసి, వాళ్ళకీ, వీళ్లకీ జుట్లు మూడేసి జీవితం సాగిస్తున్నా హోదాకీ, ఫాయాకీ [...]
రామచంద్రపురం అగ్రహారీకుడు లుబ్దావధాన్లు ఏకైక సంతానం మీనాక్షి. లుబ్దావధాన్లు దగ్గర బాగానే డబ్బున్నా, పేరుకు తగ్గట్టే పరమ లోభి. 'కన్యాశుల్కం' ఆశించి, మీనాక్షికి చిన్నప్పుడే ఓ ముసలి వాణ్ణిచ్చి  పెళ్లి చేశాడు. పెళ్ళైన కొద్ది కాలానికే ఆ వరుడు కన్నుమూయడంతో, ఏ ముచ్చటా తీరకుండానే తల చెడి పుట్టిల్లు చేరింది. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న మీనాక్షి, పుట్టింటికి [...]
సంస్కృత పండితుడూ, విజయనగరం నాటక కంపెనీలో విదూషకుడూ అయిన కరటక శాస్త్రికి ప్రియశిష్యుడు మహేశం. సంస్కృత విద్యార్థి. కరటకుడి మేనల్లుడు వెంకటేశం ఈడువాడు. అవతలున్నది గురువుగారైనా, మరెవరైనా ఎలాంటి శషభిషలూ లేకుండా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడ్డం మహేశం నైజం. అందుకే. "ఈ రోజుల్లో సంస్కృతం చదువు ఎవరికి కావాలి?" అని గురువు గారడిగితే, "దరిద్రులకి కావాలి" అని ఠపీమని [...]
సుబ్బి అనే చిన్నపిల్లకీ, లుబ్ధావధాన్లు అనే ముసలివాడికీ నిశ్చయమైపోయిన పెళ్లిని చెడగొట్టి,  బాల్య వివాహం బారినుంచి సుబ్బిని కాపాడడమే 'కన్యాశుల్కం' నాటకం  ప్రధాన కథ. ఈ పెళ్లిని చెడగొట్టేందుకు ఎవరి స్థాయిలో వాళ్ళు కృషిచేసినా, ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మధురవాణి అనే వేశ్యని గురించి. ఆమె వృత్తి చేత వేశ్య కనుక చేయవలసిన చోట ద్రవ్యాకర్షణ చేస్తుందే తప్ప, [...]
హరిద్వారంలో మఠం కట్టించడమే బైరాగి లక్ష్యం. అందుకోసం ఎక్కడ డబ్బొచ్చినా కాదనకుండా స్వీకరిస్తాడు. కాకపొతే, ఆ మఠం పనులు ఎప్పుడు మొదలవుతాయో, ఎప్పటికి పూర్తవుతాయో నరమానవుడికి తెలియదు. సిద్ధుడు కాబట్టి బైరాగికి మాత్రమే తెలుసు. బైరాగి ఆదీ అంతం లేదు. నాటికి ఆరొందల ఏళ్ళ క్రితం నాటి వేమన బైరాగికి తాత. రెండొందల యాభై ఏళ్ళ క్రితం కాశీలో జరిగిన ఓ సంఘటనకి బైలాగి ప్రత్యక్ష [...]
"నాన్నా, తమ్ముడికి పెళ్ళి చెయ్యాలంటే నా సొమ్ము పెట్టి పెళ్లి చెయ్యండి గాని దానికి కొంప ముంచి లుబ్ధావధాన్లుకి యివ్వొద్దు.." అత్యంత కోపిష్టీ, మూర్ఖుడూ అయిన తండ్రి ఎదుట నిలబడి బుచ్చమ్మ చెప్పిన మాట ఇది. ఇక్కడ "నా సొమ్ము" అంటే, భర్త మరణించిన తర్వాత ఆమెకి అత్తింటి నుంచి మనోవర్తిగా వచ్చిన సొమ్ము. తమ్ముడు వెంకటేశం చదువు ఆగిపోవడం ఆమెకి ఇష్టం లేదు. అలాగని, ఆ చదువు కోసం [...]
ఓ పక్క మాయగుంట కనిపించక రామచంద్రపురం అగ్రహారం మొత్తం అట్టుడికిపోతూ ఉంటే, రామప్పంతులు ఇంటి కొట్టు గదిలో మధురవాణి బృందం తాపీగా ఆడే పేకాటలో మొదటిసారి కనిపిస్తాడు పోలిశెట్టి, తనకి 'భష్టాకారి' ముక్కలు పడ్డాయని బాధపడుతూ. పోలిశెట్టిని చూడడానికి 'కన్యాశుల్కం' నాటకం పంచమాంకం వరకూ ఆగాలి కానీ, అతగాడి ప్రస్తావన మాత్రం చతుర్ధాంకంలోనే వస్తుంది. సుబ్బి పెళ్లి చెడగొట్టడం [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు