నువ్వెవరివో? నాకేమౌతావో!ఈ లోకం ఆడించే వైకుంఠపాళిలో తలమునకలై నీ ఊసే లేకుండా రోజులు గడుస్తాయి. ఏమో అలా ఎలా అసంకల్పితంగా నీకు దూరమౌతానో, జవాబు తెలీని ప్రశ్న!మళ్ళీ ఏ దివ్యలోకం నుంచీ ఊడిపడతావో, ఉన్నట్టుండి చప్పున మనసులో మెదులుతావు. నీ తలపొస్తూనే తనతో పాటు ఇంకిపోయిన కళ్ళలోకి తడిని మోసుకొస్తుంది.నే పట్టలేనంతగుబులు మనసులోనేఇమడలేక [...]
నీలాంటి నువ్వు నాకు ఎదురుపడతావని సరదాకైనా ఊహించలేదు..ఎన్ని ఉదయాలు నువ్వు ఊదిన కొత్త ఊపిరితో నిదుర లేచానో..ఎన్ని తీరిక లేని రోజులు నీతో చెప్పాలనుకున్న మాటలు పేర్చుకుంటూ ఉవ్విళ్ళూరానో.. ఎన్ని మధ్యాహ్నాలు నీతో కూర్చుని కబుర్లాడుతూ ఆకలి సంగతి మరిచానో..ఎన్ని అందమైన సాయంకాలాలకి నువ్వూ, నేనూ కలిసి రంగులద్దామో..ఎన్ని అపరాత్రులు వెన్నెల [...]
ఎప్పుడెప్పుడు గబగబా వారాలు క్షణాల్లా గడిచిపోతాయా అని ఎదురుచూస్తుంటే ఎనిమిది యుగాల్లా గడిచినట్టనిపించిన ఎనిమిది నెలలు..అంతటి భారమైన ఎదురుచూపులకి అద్భుతమైన అర్థాన్నిచ్చిన అపురూప క్షణాలు.. పుట్టి బుద్ధెరిగాక అనుభవైక్యమైన భావాలన్నీ మొత్తం ఒక్కేసారి ఎదురై ఉక్కిరిబిక్కిరి చేసి అసలే భావమూ లేదేమోనన్న వింత సరికొత్త మనఃస్థితిలో.. అప్పుడే పుట్టిన బుజ్జాయిని [...]
​అవునూ.. నాకో సందేహం!అసలు ఈ బ్లాగులూ, ఫేస్ బుక్లూ, గూగుల్ ప్లస్లూ, ట్విట్టర్లూ, ఇంకా బోలెడన్ని రకరకాల సోషల్ నెట్వర్కింగ్/ సామాజిక అనుసంధాన వేదికలు ఎందుకోసం?ప్రతీ మనిషి తన ఆలోచనలు, అభిప్రాయాలు, భావాలతో మొదలుపెట్టి కాదేదీ అనర్హం అన్నరీతిన తమ తమ వ్యక్తిగత ఆసక్తులని బట్టి తన ఇష్టం వచ్చినవన్నీ మిగతా ప్రపంచంచం ముందు ప్రదర్శించుకోవడానికేగా!'ఇష్టం వచ్చినట్టు' అంటే "నేను [...]
​ 2014 జనవరి నుంచి 2015 జనవరి దాకా పదమూడు నెలల పాటు 'కౌముది' సాహిత్య పత్రికలో ధారావాహికగా వచ్చిన 'చంద్రుళ్ళో కుందేలు' పూర్తి నవల 'e-పుస్తకం' గా కౌముది గ్రంథాలయంలో చేర్చబడిందని తెలియచేయడానికి ​సంతోషిస్తున్నాను. కౌముదికి ధన్యవాదాలు.​మొదటినుంచీ ప్రతీ నెలా అనుసరిస్తూ వ్యాఖ్యలు, ఈమెయిల్స్ ద్వారా తమ అభిప్రాయాలు తెలియజేసి ప్రోత్సహించిన వారందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు.​
​​చివరి భాగం ఇక్కడ కౌముది సాహిత్య పత్రిక జనవరి సంచికలో.. అందరికీ 'హేపీ న్యూ ఇయర్!'
మేఘ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది అప్పుడు. ఒకరోజు ఉదయం కాలేజీకి వెళ్ళే తొందరలో అద్దం ముందు నించుని జడ వేసుకుంటుంటే "మేఘా.. నీకోసం ఎవరో వచ్చారు" అంటూ ఒక అమ్మాయి పిలుపు బిగ్గరగా వినిపించింది. ​పూర్తిగా ఇక్కడ కౌముది సాహిత్య సంచిక డిసెంబరు సంచికలో... ​
​ముందు రోజు చెప్పినట్టుగానే తెల్లారి ఉదయం ఆరున్నరకల్లా వచ్చేసాడు అశోక్. నానమ్మ ఇంటికి ప్రయాణం కట్టే ఉత్సాహంలో పూజ అంత ఉదయాన్నే పేచీల్లేకుండా ​​నిద్రలేచింది.​​ఏడింటికల్లా విజిత, పూజలని తీసుకుని శరత్ ఊరికి బయలుదేరాడు. నీలూ, మేఘ దగ్గరుండి అందర్నీ సాగనంపారు.​పూర్తిగా ఇక్కడ కౌముది సాహిత్య పత్రిక నవంబరు సంచికలో...  
ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) వారు జూలై 2014లో అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో ఘనంగా నిర్వహించిన 13 వ 'ఆటా'​ మహాసభల జ్ఞాపక సంచిక 'అక్షర' ని ప్రచురించారు. ​పేరుకి తగ్గట్టే చూడచక్కని డిజైనింగుతో, అందమైన బొమ్మలతో, అద్భుతమైన నాణ్యతతో అచ్చు వేయబడిన 'అక్షర'లో బోలెడన్ని ఆసక్తికరమైన కథలు, కవితలు వ్యాసాలు ఉన్నాయి. నా కథకు వేసిన బొమ్మ చాలా నచ్చేసింది. ​ఇంత చక్కటి జ్ఞాపికలో [...]
చిన్నప్పుడు దసరా పండుగ వస్తుందంటే మహా సంతోషంగా ఉండేది. స్కూలుకి దాదాపు పది రోజుల సెలవులు వస్తాయనేది ఒక కారణమైతే ఈ పది రోజులు గౌరమ్మ సందట్లో ఉల్లాసంగా గడిచిపోతాయనేది ఇంకొక కారణం. గౌరమ్మ అంటే అమ్మవారిని గౌరీదేవిగా ఆడవాళ్ళందరూ పూజించుకోవడం. ఊర్లో ప్రతీ వీధికో, రెండు వీధులకో ఒక గౌరమ్మని పెట్టుకుంటారు. కొందరు వచ్చే మూడేళ్ళు గౌరమ్మని ఎత్తుకుంటాను అని అమ్మవారికి [...]
కోపంగా వెళ్ళిపోయిన నీలూ మరుసటి రోజు తిరిగి వచ్చేసరికి తమ మధ్య జరిగిన వాదోపవాదాలు మర్చిపోయి ఆనందంగా మాట్లాడింది రజని. అప్పటికే రాసి కవర్లో పెట్టి అంటించిన ఉత్తరాన్ని నీలూ చేతిలో పెడుతూ ​“సాధ్యమైనంత త్వరగా శ్రీకాంత్ కి ఇచ్చెయ్యి​” అంది.​సరేనన్నట్టు తలూపి రజని ఇచ్చిన ఉత్తరం తీసుకెళ్ళింది ​నీలూ.​పూర్తిగా ఇక్కడ కౌముది సాహిత్య పత్రిక అక్టోబరు సంచికలో...​ 
నాన్నగారు కిరణ్ తోమాట్లాడుతుండటం ​ఆశ్చర్యంగా చూసింది​మేఘ.“మెయిన్రోడ్మీదఆటోకోసంఎదురుచూస్తున్నప్పుడు​పక్కనే నించున్న ఈ అబ్బాయిలు పరిచయం అయ్యారు. మాటల్లో మీ కాలేజీ పేరు, నీ పేరు చెప్తే మీరంతా​స్నేహితుల​ని చెప్పారు. కిరణ్, ప్రదీప్ అని పేర్లు చెప్పగానే మనింటికి ఫోన్ చేసినప్పుడు మాట్లాడానని గుర్తొచ్చింది. ఆటో దొరకలేదు కానీ అలా కులాసాగా మాట్లాడుకుంటూ [...]
​“హలో..”“హాయ్ మేఘా.. ఎలా ఉన్నావ్? చాలా మాటలు వినపడుతున్నాయి. ఏంటీ హడావుడి?”“బావున్నాను. ఇంతకు ముందు నీతో మాట్లాడిన సిసింద్రీ మా పిన్ని కొడుకు. వాడికి భోగిపళ్ళు పోసే కార్యక్రమం జరుగుతోంది ఇప్పుడు. అదే హడావుడి. నువ్వెలా ఉన్నావ్?”“సూపర్ గా ఉన్నా. నువ్వు పంపిన కార్డ్ అందింది. డాడీ తెచ్చిచ్చారు మధ్యాహ్నం.”“ఏమన్నా అన్నారా?” ఇన్ని రోజుల తన ఆరాటాన్నంతా ఒక చిన్నమాట [...]
మేఘ కాదన్నాక కూడా కిరణ్ ఎదురుపడ్డాడంటే ఇప్పుడేం జరుగుతుందో చూడాలన్న ఉత్సుకత కలిగింది రజనికి. సరిగ్గా అదే కారణంగా ఆందోళన మొదలైంది నీలూకి. మేఘ మనసులో భావాలని ఇదీ అని చెప్పడం కష్టం. కానీ ముగ్గురూ తమ ఉద్దేశ్యాలేవీ ముఖాల్లో కనపడనీయకుండా మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు.​పూర్తిగా ఇక్కడ కౌముది సాహిత్య పత్రిక జూలై సంచికలో... ​
2013 జనవరి నుంచి డిసెంబరు దాకా ఏడాది పాటు కౌముది సాహిత్య పత్రికలో 'జర్మనీయం' శీర్షికన నేను రాసిన వ్యాసాలు అన్నీ కలిపి 'e- పుస్తకం' గా కౌముది గ్రంథాలయంలో చేర్చబడిందని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను.  కౌముదికి ధన్యవాదాలు.
పరీక్ష రాయడానికి వెళ్ళిన రజని ప్రేమలేఖ తీసుకొచ్చాననడం, నీలూ రజని మీద కోపంగా ​అరవడం చూసిన రేవతి ఇద్దరినీ శాంతింపచేసి “మీరిద్దరూ ఇక్కడ పోట్లాడుకుంటే విషయం అందరికీ తెలిసిపోతుంది. అలా పక్కకి వెళ్ళి వివరంగా మాట్లాడుకుందాం పదండి”అంటూ పక్కనే ఖాళీగా ఉన్న క్లాసురూంలోకి తీసుకెళ్ళింది.​పూర్తిగా ఇక్కడ కౌముది సాహిత్య పత్రిక జూన్ సంచికలో... 
​వంగూరి ఫౌండేషన్ అమెరికా వారు నిర్వహించిన జయ నామ సంవత్సర ఉగాది కథల పోటీల్లో బహుమతి పొందిన నా కథ 'పున్నాగపూల జల్లు' ఈ నెల కౌముది మాసపత్రికలో ప్రచురించబడిందని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. చదివి మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తూ..
నడిరాత్రి నిద్రలో మెలకువొచ్చేసరికి ఇంటి పైకప్పుకి ఏటవాలుగా ఉన్న కిటికీ అద్దాల మీద దడ దడమని దురుసుగా దూకుతున్న వాన చినుకుల చప్పుడు. ​ఊరంతా నిద్రలో మునిగి తన ఉనికిని ఎవరూ పట్టించుకోకపోయినా నాకు ఇవ్వడమే తప్ప ఎదురు ఆశించడం తెలీదన్నట్టు నిర్విరామంగా చీకట్లో కురుస్తూనే ఉంది వాన. నిద్ర పూర్తిగా విదిలించుకుని పారిపోయాక కళ్ళు తెరిచి కిటికీ మీద కురుస్తున్న వానధారల [...]
​ఇంటర్మీడియెట్​ చదివే విద్యార్థులను గమనిస్తే ఏదో యుద్ధానికి సిద్ధమవుతున్న సైనికుల్లా కనిపిస్తారు. అప్పటిదాకా స్కూల్లో ఆడుతూ పాడుతూ ఆనందంగా చదువుకున్న వాళ్ళకి ఒక్కసారిగా స్వేచ్ఛ మొత్తం ​కోల్పోయి, జైల్లో ఖైదీల్లాంటి జీవితం ప్రాప్తిస్తుంది. ఇప్పటి రోజుల్లో భావిభారత డాక్టర్లు, ఇంజనీర్లు కావాలంటే ఇదే సరైన మార్గమని ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల, పిల్లల నమ్మకం [...]
ఆ రోజు మేఘనందన పుట్టినరోజు. రోజుటిలా ​కాకుండా బుద్ధిగా ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని అమ్మతో పాటు గుడికి వెళ్ళొచ్చింది. టైము పది దాటిందో లేదో ఒకటే హడావుడి పడుతూ ఇంట్లోకీ బయటికీ పచార్లు చేస్తోంది."ఎందుకే అంత ఆత్రం నీకు? బస్సు ఆలస్యం అయిందేమోలే. ఒక పది నిమిషాలు అటూ ఇటూగా వచ్చేస్తుందిగా. అందాకా కాస్త స్థిమితంగా కూర్చోరాదూ?" మేఘ వాళ్ళమ్మ [...]
నా అంతఃపుర సౌందర్యానికి ధీటైనది ఏడేడు లోకాల్లోనూ లేదని ప్రతీతి. ఘనత వహించిన నా అంతఃపుర సౌధాలు అల్లంత దూరానున్న ఆకాశంతో కరచాలనం చేస్తూ నా వైభవాన్ని సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్తూ ఉంటాయి. తలుపులు, కిటికీలు, గోడలు సర్వమూ రంగురంగుల గాజు అద్దాలతో గొప్ప కళానైపుణ్యం రంగరించి పేర్చిన నా అంతఃపురపు అద్దాల మేడలు చూసేవారి కళ్ళని మిరుమిట్లు గొలుపుతుంటాయి. [...]
నీలూ చెప్పినట్టే గుడికి వెళ్ళడానికి తయారవుతోంది మేఘ. డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని బొట్టు పెట్టుకుంటుంటే తన వెనుకగా ఉన్న తలుపు కాస్త తెరుచుకుని ఆ సందులోంచి కెంజాయ రంగు పట్టులంగా కొద్ది కొద్దిగా కనిపిస్తోంది అద్దంలో.లేచి తలుపు దగ్గరగా వచ్చి “ఎవరదీ.. తలుపు వెనక దాక్కుందీ.. పూజా.. నువ్వేనా?​” అడిగింది మేఘ. వెంటనే తలుపు సందులోంచి కనిపిస్తున్న పట్టులంగా మాయమైపోయి [...]
​మనిషి పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే సహజం.జీవితంలో దాదాపు అన్ని రకాల దశలు దాటి వచ్చి అవసాన దశలో కన్నుమూసిన వారి గురించి బాధపడినా, ఈ భూమ్మీద జీవితాన్ని సంపూర్ణంగా జీవించి నిష్క్రమించారులెమ్మని తలుస్తారు వారితో బంధం ఉన్నవారు. అదే చిన్న వయసులో ఏ జబ్బుల బారినో, అనుకోని ప్రమాదాల బారినో పడి మరణించినవారి గురించి శోకించి శోకించీ చివరికి ఇది కర్మ ఫలితం మన చేతిలో [...]
ఆలోచనలుమనసుని ఎంతగా ఉసిగొలిపి గతకాలపు పంజరంలోనే బంధించాలని చూసినా, రెక్కలిచ్చి ఏవో ఊహాలోకాల విహారానికి తీసుకెళ్ళినా, కాలాధిదేవత ఠంచనుగా మళ్ళీ మనని ​తీసుకొచ్చి వర్తమానపు ఒడిలో దిగబెట్టేస్తుంది.​ అమెరికానుంచి బయలుదేరిన మేఘనందన​ ముందుగా అనుకున్న సమయానికన్నా ఓ రెండు గంటలు ఆలస్యంగా విమానం దిగింది.​పూర్తిగా ఇక్కడ కౌముది సాహిత్య పత్రిక ​​ఫిబ్రవరి [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు