సంకల్పం(ఆగస్ట్ నెల "చిత్ర" మాసపత్రిక లో ప్రచురించబడిన కవిత )ఉత్తేజభరితం స్వాతంత్ర్యోద్యమ నేపథ్యంఊహాతీతం నాటి నాయకుల నేతృత్వంతరతమ భేదాలెరుగని తత్వంతలవొగ్గని స్వేచ్చాప్రియత్వంతాము కరిగిపోయి తరువాతితరాలకు వెలుగునిచ్చిన నిస్వార్ధంనిజమైన నాయకత్వమని  నిఖిలలోకమూ మెచ్చిన  సందర్భంషష్టిపూర్తి నాటికి తారుమారయింది చిత్రంమననం చేసుకుంటూనే ఉన్నా మారిపోయింది [...]
“నాకోసంతెచ్చారాఅంకుల్! నాకోసంతెచ్చారా!" కళ్ళల్లోనీళ్ళుమెరుస్తూండగాఅడిగినమాధవ్మొహం... నాన్నతెచ్చియిచ్చినపుస్తకాన్నిఅపురూపంగాతడుముతూమురిసిపోయినమాధవ్మొహమేకళ్ళముందుమెదుల్తోందినాకు.మాధవ్, నేనూచిన్నప్పుడుఒకేస్కూల్లోచదివాం. ఆతర్వాతకాలేజీలువేరైనారోజూకలుసుకునేవాళ్ళం. ఇప్పుడుమళ్ళీఒకేచోటఉద్యోగాలుచేస్తున్నాం. ఈ నలభైఏళ్ళజీవితంలో.. ఊహ తెలిసినప్పటినుంచీ, [...]
జానకి చనిపోయిందన్న వార్త నమ్మడం కష్టంగా వుంది. నలభై ఏళ్ళ సంబంధం మాది. నేను కొత్తగా పెళ్ళి చేసుకుని కాపురానికి వచ్చినపుడు అయిన పరిచయం. నన్ను కాపురానికి దింపడానికి వచ్చినపుడు అమ్మ, పొరుగింట్లో వున్న జానకిని చూసి "మా అమ్మాయిని కాస్త కనిపెట్టి వుండమ్మా" అంటూ నన్ను తనకి అప్పగించి వెళ్ళింది.అలాగేనని మాట యిచ్చిన జానకి ఆమాటని జీవితమంతా నిలబెట్టుకుంది. కొత్త కాపురాన్ని [...]
అన్ని పండగలవంటిది కాదు సుమా ఆరు రుచుల ఉగాదిఅర్ధం చేసుకోగలిగితే యిది ఆనందసౌధానికి పునాది పసితనంలోనే దాని వైశిష్ట్యాన్ని నేను పసికట్టాను పెరిగి పెద్దవుతూ మరెన్నోకొత్తలోతుల్నీ కనిపెట్టానుమామిడి చిగుళ్ళ మంగళ తోరణాలుకోకిల గానాల వేదమంత్రాలుఒకవైపు వేపరెమ్మలు వీచే వింజామరలుమరోవైపు మల్లెకొమ్మలు పట్టే కుసుమాంజలులువీటన్నింటి మధ్య నుండీ రమావాణీ సంసేవితలా అది [...]
 నేను కథారచన మొదలుపెట్టి 20 ఏళ్ళయింది. నా మొదటి కథ 1990 లో ప్రచురించబడిందని చెప్పవచ్చు. .  అంతకు ఒక నాలుగైదు సంవత్సరాల ముందు నుంచీ కవితలు వ్రాయడం.. కాలేజ్ మేగజైన్ కోసం ఒక కథ వ్రాయడం .. అలాగే కాలేజ్ లో ఫ్రెండ్స్ అందరం కలిసి వేయగలిగేలా పాత్రలు సృష్టించి ఒక నాటిక వ్రాయడం వంటివి జరిగినా.. పత్రికకి కథ పంపడం.. అది ప్రచురించబడడం 1990 లోనే జరిగింది.మొదటి పదేళ్ళూ అంటే.. 1990 నుంచి 2000 వరకూ [...]
భారతీయ భాషా పరిషద్, కలకత్తా వారి పురస్కారం  2011 వ సంవత్సరానికి తెలుగులో నా "మహార్ణవం" కథాసంపుటి కి ప్రకటించబడింది. 
గిరిజగా నీరూపు తనివితీరా చూడబోతేసగము దేహము శివునిలో దాచుకుంటావుఅమ్మ కావాలంటూ దిగులుగా నే నిలబడితేగంగవై నా దరికి పరుగుతీస్తావునిలువెల్లా నను తడిమి మురిసిపోతావులక్ష్మిగా భావించి నీ ఒడిని చేరబోతే విశ్వమంతా కళలుగా వ్యాపించిపోతావుఒక్కచోటే నిను నిలపలేక వెర్రిమొహం నే వేస్తేతులసివై నా యింటి ముంగిట నవ్వుతుంటావునిశ్శబ్ద ప్రేమ కవచమై నను చుట్టుకుంటావుభారతిగా నిను [...]
హైదరాబాద్ పుస్తక ప్రదర్శన లో, స్టాల్ No. 156 లో "లేఖిని" రచయిత్రుల పుస్తకాలు లభిస్తాయి.డా. వాసా ప్రభావతి, పొత్తూరి విజయలక్ష్మి,  తురగా జానకీరాణి, శీలా సుభద్రా దేవి, ఇంద్రగంటి జానకీబాల, శారదా అశోకవర్ధన్, కెబి లక్ష్మి, గంటి భానుమతి, మంథా భానుమతి, తమిరిశ జానకి, పోడూరి కృష్ణకుమారి, పోలాప్రగడ రాజ్యలక్ష్మి, సోమరాజు సుశీల, ఉంగుటూరి శ్రీలక్ష్మి,అత్తలూరి విజయలక్ష్మి, స్వాతి [...]
సత్యానికి చేరువగా...                                                 ఎనిమిదవుతూండగా ఫోన్ వచ్చిందిసత్యం దగ్గర్నుంచి, నాన్న మరణవార్తతో. వింటూనే కొయ్యబారిపోయాను. “ఎలా!” అన్న ప్రశ్నకివాడేదో సమాధానంచెప్పాడు గానీఆ సమయంలోనాకేమీ అర్ధంకాలేదు.నేనూ, నా భర్తగౌతం వెంటనేబయల్దేరి వచ్చాం. ఉన్న ఊర్లోనేకాబట్టి [...]
నా బంగారు కొండలు 'ఉఫ్' అంటూ నా కనురెప్పలమీదికి వూదినపుడుఅప్రయత్నంగా నేను కనులార్పుతానుఅదిగో అమ్మ భయపడిందంటూవాళ్ళు కేరింతలు కొడతారుఅతను క్రోధంతో నా శిగ పట్టబోయినపుడుఅనాలోచితంగా చేయి అడ్డు పెడతానుహన్నా నీకసలు భయం లేకుండా పోయిందంటూఅతను ఆక్రోశపడతాడుఅందరికీ తెలిసిన పొడుపు కధనిముసి ముసి నవ్వులతో నాపై సంధిస్తేఆలోచించినట్లు నటించి అలవోకగా విప్పుతానుఅమ్మ ఎంత [...]
(రెండవభాగం)ఒక్కొక్క అంశమూ తీసుకుని రచయిత్రి ఈ ఇద్దరు అమ్మాయిల వ్యక్తిత్వాలని ఎలా ప్రతిబింబించారో చూద్దాం1. జీవితధృక్పథం : ఇందిరవీ, కల్యాణివీ కూడా ఇంచుమిచుగా ఒకేరకమైన పరిస్థితులు. ఆనందరావులాంటి నాన్న వుండడంలోని సమస్యలనీ, ఏదో ఒక తోడంటూ వుండడంలోని అడ్వాంటేజినీ .. రెండిటినీ కూడా పరిగణలోకి తీసుకోకుండా పక్కన పెడితే, ఇద్దరివీ సమస్యామయ జీవితాలే. అయితే ఇందిర తన [...]
ఈ నవలని సమీక్షించేటపుడూ , దీని గురింఛి మాట్లాడేటపుడూ అందరూ ఇందిర గురింఛే మాట్లాడటం, ఆమె వ్యక్తిత్వం తమని చాలా ఆకర్షించిందని అనడం చూశాను నేను. రచయిత్రి ఆ పాత్రని చాలా శ్రద్ధతో తీర్చి దిద్దారనీ, ఈ నవలకి హీరో, హీరోయిన్ కూడా ఇందిరే ననీ కూడా నాతో చాలా మంది అన్నారు.నాకు మాత్రం ఈ నవల చదివినపుడు ఇందిర కన్నా కళ్యాణి పాత్రని రచయిత్రి చాలా జాగ్రత్తగా మలిచారని అనిపించింది. [...]
ఈ నవలని సమీక్షించేటపుడూ , దీని గురింఛి మాట్లాడేటపుడూ అందరూ ఇందిర గురింఛే మాట్లాడటం, ఆమె వ్యక్తిత్వం తమని చాలా ఆకర్షించిందని అనడం చూశాను నేను. రచయిత్రి ఆ పాత్రని చాలా శ్రద్ధతో తీర్చి దిద్దారనీ, ఈ నవలకి హీరో, హీరోయిన్ కూడా ఇందిరే ననీ కూడా నాతో చాలా మంది అన్నారు.నాకు మాత్రం ఈ నవల చదివినపుడు ఇందిర కన్నా కళ్యాణి పాత్రని రచయిత్రి చాలా జాగ్రత్తగా మలిచారని అనిపించింది. [...]
"ఆశ" కథ ఆంగ్లంలోhttp://ruwiray.in/2010/06/18/hope/#more-316
"ఈమాట" లో నా కవిత "సుగమం" http://www.eemaata.com/em/features/poetry/1565.html
10.01.10 ఆంధ్రజ్యోతి లో ప్రచురితమయిన నా కథ "గురుత్వం".http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2010/10-1/story
http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2009/28-6/story
పల్లవి :ఇభాననా నీదు కరుణఎంచలేని నిధిగ తోచుతనివితీరననుభవింపతరగకనది నటులె నిలచుచరణం 1:కరివదనా నీదు తలపుకామాదులనణచి వుంచుకనులపొరలు తొలగచేసికైవల్యపు దారి చూపుచరణం 2:హేరంబా భక్తిగరిమభవసాగరమధిగమింతుమననమే మంత్రముగామాయను నేనడ్డగింతుచరణం 3:శ్రీకరా నీదు స్మరణచంచలమగు మదినిగాచుశ్రీవల్లీరాధికకదిసకలభోగరుచులమించు _______
March కౌముది లో నా కవిత :http://www.koumudi.net/Monthly/2009/march/index.html
అగాధాల అంచులనుంచీఆరాధనార్ణవాల లోతులనుంచీసృజించీ..త్యజించీశోధించీ..మధించీ..నాహృదయాన్ని నీ పాదాలముందుపరిస్తే..అలా అభావంగా చూసి వెళ్ళిపోకుఅందుకోవడమో ఆగ్రహించడమోఅదేదో నా కళ్ళముందే చేయిసిగ్గునీ, సహజ సంకోచాన్నీకనురెప్పల వెనుక దాస్తూఉద్వేగాన్నీ.. ఊపిరాగేంత ఉత్కంఠనీగుండె నిండుగా మోస్తూనా మనసు నీకు తెలియచేస్తే..అలా ముభావంగా నడచిపోకుఅంగీకారంగానో.. [...]
ఎన్ని కలల భారాలునా కనులపై మోపావో!ఏ రస డోలలలో ననుకవితలా వూపావో!నీ పద స్పర్శ ప్రాప్తించిపాపిడిబిళ్ళ పారిజాతమయిందిఅణువణువూ పరవశించిపరికిణీ అంచు హరిచాపమయిందిఏ సంతోష సౌధం వైపునువు వడివడిగా అడుగులు వేశావో!నీ వెనుక రావచ్చునంటూనాకు అనుమతిచ్చావో!నా నడక జలపాతమయినిను వెంబడించిందినా చూపు సోకినంత మేరాఅవని వెన్నెలలు పూచిందిఏ విరహజ్వాలల్లోనను జారవిడిచావో!ఏ మహార్ణవం అవతల [...]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు