ఈ పుస్తకం చదవటం నాకొక గొప్ప అనుభవం. వేరొక దేశానికి చెందినామె మనదేశంలో జనం గురించీ, ఇక్కడి పరిస్థితుల గురించీ, సాగుతున్న పోరాటాల గురించీ మనకు తెలియని విషయాలు చెపుతూ వుంటే మనకు కలిగేది ఆశ్చర్యమే అయినా, కలగవలసింది ఆశ్చర్యం కాదు. సిగ్గు! - కాళీపట్నం రామారావు అనుకోని పరిస్థితుల్లో బీహారులో జైలు జీవితం గడిపిన బ్రిటీషు పైరురాలు మేరీ టైలర్‌ అనుభవాలకు అక్షరరూపమే ఈ [...]
బషాయి టుడు - మహాశ్వేతాదేవి నవల ... పీడిత, తాడిత జన విముక్తి కోసం నడుంకట్టిన సున్నితమైన వ్యక్తులు నా రచనల్లో కీలక పాత్రధారలుగా కనిపిస్తారు. ... జీవితం అంకగణితం కాదు. మనిషి రాజకీయ క్రీడ కోసం రూపొందలేదు. తన హక్కులన్నీ చెక్కుచెదరకుండా హాయిగా జీవించాలన్న మనిషి తపనను సఫలం చెయ్యాలన్నదే ప్రతి తరహా రాజకీయాలకూ ధ్యేంగా వుండాలని నేను నమ్ముతాను. పార్టీ ప్రయోజనాల పెంపుదలకు [...]
మడి విప్పిన చరిత్రభారతీయ సమాజంలో ఆధిపత్యం-ప్రతిఘటనగురువుగా ద్రోణాచార్యుని ప్రతిభా కౌశలం గురించి, మంత్రిగా కౌటిల్యుని సామర్థ్యం గురించిచరిత్ర పుస్తకాలలో చదివే పిల్లలకు, ఆ ఇద్దరూ వాస్తవానికి ఏ నిర్వచనం ప్రకారం చూసినా మహా కపటులన్న విషయం తెలియజెప్పాలి.సత్యవర్తన, న్యాయం, సర్వజనుల సమానత్వ భావనలకు ప్రాతినిధ్యం వహించే హిందూమతం ఈ దేశపు ప్రత్యేకత అని చెప్పే సమయంలో అది [...]
మడి విప్పిన చరిత్రInherited and Hindutva Threats to Indian Democracyరచన : బ్రజ్ రంజన్ మణితెలుగు అనువాదం : టంకశాల అశోక్పుస్తకావిష్కరణ సభ , చర్చ27 జనవరి 2018 సాయంత్రం 5-30 కి సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాల్ లో
"కొలిమి రవ్వలు గౌరి లంకేశ్ రచనలు"పుస్తకం లోని కొన్ని వ్యాసాలను అంతర్జాల పాటకుల కోసం యునీకోడ్ ఫాంట్ లో  హైదరాబాద్ బుక్ ట్రస్ట్ బ్లాగు లో పొందుపరిచడం జరిగింది.ఈ పుస్తకం లోని మొత్తం వ్యాసాల వివరాలు ఇలా ఉన్నాయి :ఆంగ్లంలో తొలి రచనలు :1. సత్య సాయిబాబా : స్వర్గం వేచి ఉంటుందిలే! 2. ఆపరేషన్‌ శివరాసన్‌ : ముగిసిన వేట? 3. కూర్గ్‌ : ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష 4. సీరియల్‌ కిల్లర్‌ నాగరాజ 5. [...]
పత్రికా స్వేచ్ఛ వర్సెస్‌ కర్ణాటక శాసనసభ( " కొలిమి రవ్వలు గౌరి లంకేశ్ రచనలు " పుస్తకం నుంచి )కర్ణాటకలో శాసనసభ్యులు, జర్నలిస్టుల మధ్య వివాదాలకు సుదీర్ఘ చరిత్రే వుంది.  అత్యంత విలువైన తమ 'పార్లమెంటరీ హక్కుల్ని' జర్నలిస్టులు ఉల్లంఘిస్తున్నారని శాసనసభ్యులు తరచూ ఆరోపిస్తుంటారు. తాజాగా వాళ్ళు రవి బెలెగరె, అనిల్‌ రాజు అనే ఇద్దరు స్థానిక చిన్నపత్రికల సంపాదకుల మీద [...]
మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఓ మంత్రి పోరాటం      కర్ణాటక రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి సతీష్‌ జర్కిహోళి గత రెండేళ్లుగా అంటే 2013 నుంచి అంబేద్కర్‌ వర్థంతి దినమైన డిసెంబర్‌ 6 ను ఒక అసాధారణమైన రీతిలో గడుపుతున్నారు. ఆ రోజును  మూఢవిశ్వాసాల వ్యతిరేక దినంగా పాటించడం కోసం ఆయన నిన్నంతా - పగలు రాత్రీ కూడా - బెళగావి స్మశానంలో గడిపారు.ఓట్ల కోసం ప్రజలను సంతప్తి పరిచే [...]
'మేము ఏకలవ్యుని వారసులం'( " కొలిమి రవ్వలు గౌరి లంకేశ్ రచనలు " పుస్తకం నుంచి ) హుచ్చంగి ప్రసాద్‌ ఒక తిరుగుబాటుదారుడు.       సామాజిక రాజకీయ మార్పు కోసం తిరుగుబాటు చేస్తున్న యువ కవి అతను.       ఇరవైమూడేళ్ళ వయసుకే అతను ఎంతో దుఃఖాన్ని, అణచివేతను, పేదరికాన్ని, లేమిని, బానిసత్వాన్ని అనుభవించాడు. అవి సహజంగానే అతనిలో కోపాన్నీ, కసినీ నింపాయి. అనేకమంది యువకవులలాగా ఆ [...]
జైలులో సంబరాలు  (కొలిమి రవ్వలు గౌరి లంకేశ్ రచనలు పుస్తకం నుంచి ) మత సామరస్యం కర్ణాటక సంస్కృతి మాత్రమే కాదు, అది ఈ రాష్ట్రంలో అధిక సంఖ్యాకుల ఆశయం కూడా అని ఇప్పుడు రుజువైంది. లేకపోతే, డిసెంబర్‌ 7వ తేది ఆదివారం, రాష్ట్రం నలుమూలల నుండి అనేక సంస్థలు కలిసి చిక్కమగళూరులో జరిపిన సామరస్య సదస్సుకూ, అందులో పాలుపంచుకున్నందుకు జైలు పాలైనవారికీ రాష్ట్రమంతటా ఇంత మద్దతు లభించి [...]
(కొలిమి రవ్వలు గౌరి లంకేశ్ రచనలు పుస్తకం నుంచి )కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలుఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్ గౌడతెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మిఅనువాదకులు :వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,  [...]
సీరియల్‌ కిల్లర్‌ నాగరాజ - గౌరి లంకేశ్ ("కొలిమి రవ్వలు గౌరి లంకేశ్ రచనలు " పుస్తకం నుంచి మరొక ఆర్టికిల్)అతను ఇష్టపడేది వాళ్ల చీరలనే.రంగురంగులవీ మెరిసేవీ వెలిసిపోయినవీ మెత్తనివీ ఉల్లిపొర లాంటివీ ముతకవీ పట్టువీ నూలువీ ఏవైనా సరే చీరలు మాత్రమే ఇష్టం అతనికి.చీర కట్టిన అమ్మాయిలనే నాగరాజ కోరుకుంటాడు.ముందు ఆ చీర లాగి పడేస్తాడు.ఆమె ఏ మాత్రం అనుమానించక ముందే దాన్ని మెలి [...]
ఆ భారతదేశం బతికే ఉందని నమ్ముతున్నాను(" కొలిమి రవ్వలు గౌరి లంకేశ్ రచనలు " పుస్తకానికి ప్రముఖ మలయాళీ రచయిత పాల్ జకారియా రాసిన ముందుమాట )గౌరి లంకేశ్‌ తను పుట్టిపెరిగిన భారతదేశాన్ని నమ్మింది.తనకు వారసత్వంగా సంక్రమించిన ప్రజాస్వామ్య వ్యవస్థను నమ్మింది.ఆ రెండిటినీ పూర్తి నియంత్రణలో ఉంచుకునే ఆధిపత్య శక్తులను నిత్యం విమర్శిస్తూ కూడాదేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని [...]
చంపవలెనా... చంపవలదా ! - గౌరీ లంకేశ్ ('కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్ రచనలు' పుస్తకం నుంచి )THE STATE IS NOT GOD.IT HAS NOT THE RIGHT TO TAKE AWAYWHAT IT CANNOT RESTORE WHEN IT WANTS TO.                                                               - Anton Chekhovరాజ్యం దైవం కాదు. తాను పునర్జీవం పోయలేని దాన్ని హరించే హక్కు దానికి లేదు.                     - ఆంటన్‌ చెకోవ్‌మరణశిక్షల గురించి ఆలోచించే వారందరూ జార్జి [...]
సత్యసాయిబాబా : స్వర్గం వేచి ఉంటుందిలే! ("కొలిమి రవ్వలు  - గౌరీ లంకేశ్ రచనలు" పుస్తకం నుంచి )సాయిబాబాకు సంబంధించిన ఏ విషయమూ స్పష్టంగా ఉండదు.అన్నిటి చుట్టూ వివాదాలు ముసిరి ఉంటాయి.ఆయన తాను చెప్పుకుంటున్నట్లు నిజంగా షిర్డీ సాయిబాబా అవతారమా?లేక ఇంద్రజాలికుడు పి.సి. సర్కార్‌ జూనియర్‌ 'సండే' పత్రికలో రాసినట్లు మంచి హస్తలాఘవం గల గారడీవాడు మాత్రమేనా?లేక భక్తులు [...]
అన్ని ఛాందసవాదాల్నీ ఖండించవలసిందే  ("కొలిమి రవ్వలు  - గౌరీ లంకేశ్ రచనలు" పుస్తకం నుంచి )సల్మాన్‌ రష్దీ మొన్నటి జైపూర్‌ సాహిత్య సమ్మేళనానికి రావలసి ఉండడం,  ఛాందసవాదులైన కొందరు దేవబంద్‌ ముస్లింలు దానికి అభ్యంతరం చెప్పడం, ఎవరేమన్నా తాను కచ్చితంగా వస్తానని రష్దీ పట్టుబట్టడం, ఆయన్ని చంపడానికి సుపారి (కిరాయి) హంతకులు బయలుదేరారని పుకార్లు రావడం, చివరికి రష్దీ [...]
తుగ్లక్‌ మోదీ ("కొలిమి రవ్వలు  - గౌరీ లంకేశ్ రచనలు" పుస్తకం నుంచి ) నరేంద్ర మోదీ తన తుగ్లక్‌ బుద్ధి చూపించుకున్నాడు. నల్లడబ్బుకు వ్యతిరేకంగా  సమరం సాగిస్తానన్న మోదీ నిజానికి ఈ దేశంలోని అధికసంఖ్యాకులైనపేద, మధ్యతరగతి ప్రజల పైనే యుద్ధం ప్రకటించాడు. వెయ్యి, అయిదువందల రూపాయల నోట్లు రద్దుచేయడం ద్వారా ఆయన సామాన్య ప్రజల్ని'మోసగాళ్ల'ను చేశాడు. కడుపుకి తిండిలేని పేదలను [...]
'దేశభక్తి కన్నా ఉన్నతమైంది మానవత్వం' జెఎన్‌యూ ప్రాంగణంలో ఫిబ్రవరి 9, 2016న కన్హయ్య కుమార్‌ చేసిన ఉత్తేజపూరితమైన ఉపన్యాసం నన్ను అతని అభిమానిని చేసింది. ఈ యువకుడి హృదయం, మేధస్సు సరైన స్థానంలో ఉన్నాయని నాకనిపించింది. ఎందుకంటే మన దేశం ఎలాంటి స్థితిలో ఉండాల్సిందో అతను మాట్లాడిన ప్రతి మాట నాకు గుర్తు చేసింది. ఒక నెలన్నర తరువాత, ఈ ఉదయం అదే క్యాంపస్‌లో ఉమర్‌ ఖలీద్‌ తన [...]
'మహిళ కావటమే ప్రస్తుతం నాకున్న భద్రత' - గౌరి లంకేశ్‌గౌరి లంకేశ్‌ ను 'లంకేశ్‌ పత్రికె'కి సంపాదకురాలైన రెండు నెలల తర్వాత 2000 మార్చిలో జర్నలిస్ట్‌ ఎం.డి. రితి ఈ ఇంటర్వ్యూ చేశారు.మీ నాన్న వారసత్వాన్ని మీరు తీసుకుంటారని, ఏదో ఒక రోజు 'లంకేశ్‌ పత్రికె'కి సంపాదకురాలు అవుతారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? లేదు. మా నాన్న వారసత్వాన్ని నిజానికి ఎవరూ అందిపుచ్చుకోగలరని నేను [...]
కుల రాజకీయాలు - ఒక ఆత్మహత్య (రోహిత్ వేముల గురించి బెంగళూర్ మిర్రర్ పత్రిక 19 జనవరి 2016 నాటి సంచికలో గౌరి లంకేశ్ రాసిన వ్యాసం. " కొలిమి రవ్వలు -  గౌరి లంకేశ్ రచనలు" పుస్తకం నుంచి ) నేను ఈ వ్యాసం రాస్తుండగా కూడా దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు రోహిత్‌ వేముల మరణం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎవరీ రోహిత్‌? 26 ఏళ్ల  రోహిత్‌ ఎంతో తెలివైన, ఉత్సాహవంతుడైన యువకుడు. [...]
నా చెల్లెలు రేవతి ఆత్మకథ ("కొలిమి రవ్వలు  - గౌరీ లంకేశ్ రచనలు" పుస్తకం నుంచి ఇంకొక వ్యాసం) ఆమె పేరు రేవతి. తెల్లగా, అందంగా ఉండే రేవతిని నేను అయిదారేళ్ళ కింద మొదటిసారి కలిసాను. ఆకుపచ్చ అంచున్న లేత పసుపు రంగు కాటన్‌ చీర కట్టుకుని ఉంది. తల చక్కగా దువ్వుకుని ముడి వేసుకుని ఉంది. నుదుట కుంకుమ, చెవికి కమ్మలు, మెడలో గొలుసు, చేతులకు గాజులు అన్నీ పెట్టుకుని అచ్చమైన మధ్యతరగతి [...]
భాషా మూలాలు - ఇంగ్లీష్‌ మేఘాలు  ("కొలిమి రవ్వలు  - గౌరీ లంకేశ్ రచనలు" పుస్తకం నుంచి ఇంకొక వ్యాసం) చాలామంది 'బెంగుళూరు మిర్రర్‌' పాఠకుల లాగే నేను కూడా ఇంగ్లీష్‌ మీడియంలోనే చదువుకున్నాను. దాని ఫలితంగా (నా మాతభాష కన్నడ అయినప్పటికీ) నేను ఇంగ్లీష్‌లోనే ఆలోచిస్తూ, ఇంగ్లీష్‌లోనే కలలు కంటూ, ఇంగ్లీష్‌లోనే బతుకుతూ, ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతూ పెరిగాను. ఇంగ్లీష్‌ నన్ను [...]
'సొంత దేశం'లోనే  దేవుడు చచ్చిపోతున్నాడు ("కొలిమి రవ్వలు  - గౌరీ లంకేశ్ రచనలు" పుస్తకం నుంచి ఇంకొక వ్యాసం) 'మాది దేవుడికే ఇష్టమైన ప్రదేశం' అని వర్ణించుకునే కేరళ రాష్ట్రంలో ఇటీవల దేవుడి పేరుమీద అనేక మరణాలు సంభవించడం చూస్తున్నాం. భారత దేశంలోనే అతి పెద్ద పుణ్య క్షేత్రాలలో ఒకటైన కేరళలోని శబరిమలలో ఇప్పటివరకు మూడు పెద్ద దుర్ఘటనలు జరిగాయి. 2016 ఏప్రిల్‌ 10 న పుట్టింగల్‌లో [...]
కూర్గ్‌ : ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష   -  గౌరి లంకేశ్ ("కొలిమి రవ్వలు  - గౌరీ లంకేశ్ రచనలు" పుస్తకం నుంచి ఇంకొక వ్యాసం) కూర్గ్‌. దేశం దృష్టిలో ఇదొక అపురూపమైన ప్రాంతం. ఇక్కడి దట్టమైన అడవులు, వరి పొలాలు, తోటలు అన్నీ పోస్ట్‌కార్డు ఫోటోల్లో ఎక్కదగ్గంత అందంగా ఉంటాయి. కాని చుట్టూరా పర్వత శ్రేణులున్న ఈ చిన్న కర్ణాటక జిల్లా ఇకముందు ప్రశాంతంగా వుండే పరిస్థితి కనిపించడం [...]
'నిన్న బసవణ్ణ, నేడు కల్బుర్గి'("కొలిమి రవ్వలు  - గౌరీ లంకేశ్ రచనలు" పుస్తకం నుంచి ఒక వ్యాసం) ఆ సంఘటన 2003 లోనో, 2004 లోనో జరిగింది. దావణగేరె జిల్లాలో ఉన్న మలెబెన్నూర్‌ అనే చిన్న పట్టణంలో కొందరు లింగాయత్‌ యువకులు మైనారిటీ మతానికి చెందిన ఇద్దరు స్త్రీలపై 'జై రామ్‌' అని నినాదాలు చేస్తూ అత్యాచారం జరిపారు. దానిపై పెద్ద గొడవే జరిగింది. ఘర్షణలు, దోపిడీలు కూడా జరిగాయి. మలెబెన్నూరు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు