''తెలంగాణ తెలుగు రచయితల మనో ప్రపంచంలోంచి ముస్లింలు గల్లంతు కావడమే వారి దుస్థితిని తెలియజేస్తుంది. తమ సూఫీ విలువలతో స్థానిక జీవన విధానాన్ని, రీతిని ఎంతగానో పరిపుష్టం చేసిన ముస్లిం జన సమూహం తిరిగి తమ ఉనికి గురించి తామే చెప్పుకోవల్సి రావడం విచారకరం.''సీమాంధ్ర పాలక వర్గాల ప్రతినిధిగా 1983లో టిడిపి అధికారం చేపట్టి వలసీకరణకు, వనరుల దోపిడీకి తలుపులు బార్లా తెరిచిన తర్వాత [...]




