ఇటీవల ఒక డిగ్రీ కాలేజీలో ఒక సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ నాకు మిత్రురాలు. విద్యార్థులెదుర్కొంటున్న సమస్యల గురించి, ‘ప్రేమ’ దాడుల గురించి ఇంకా వారు ప్రస్తావించే అంశాల మీద ఈ మీటింగులో మాట్లాడాలని, వారిని చర్చల్లో చురుకుగా పాల్గొనేెలా ప్రోత్సహించాలని తను చెప్పింది. ‘జండర్‌ సెన్సిటివిటీ ‘ గురించి కూడా మాట్లాడాలని నేను సూచించాను. నాతో [...]
తెలుగు బాట లో నేనూ నడిచానుఈ నడక నాకు నూతనోత్తేజాన్ని ఇచ్చింది.యువతరం తో కలిసి నడవడంలో మజాయే వేరు.తుళ్ళిపడే సెలయేరుతో కలిసి అడుగులేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది.ఎగిసిపడే కెరటంతో కరచాలనం చేస్తే ఎంత ఉత్తేజంగా ఉంటుందితెలుగుబాట పేరుతో తెలుగు కోసం నడిచిన యువతతో నేనూ భుజం భుజం కలిపినడవడం ఓ అపూర్వమైన అనుభవం.నల్లటి మేఘాలు ఆకాశమంతా కమ్ముకున్న వేళచల్లటి చిరుజల్లులు ప్రియ [...]
నిన్న రాత్రి తొమ్మిది గంటల నుండి ఈ రోజు తొమ్మిది వరకు అంటే ఇరవై నాలుగు గంటల్లో నేను చేసిన పనులు ఒక సారి గుర్తు తెచ్చుకుందామని కూర్చున్నాను. ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను.జొన్న రొట్టె తినేసి ఏదైనా మంచి పుస్తకం చదువుకుంటూ గడిపేద్దామనుకుంటున్న వేళ ఫ్రెండ్ కూతురు ఫోన్ చేసి అమ్మ మీ కోసం చూస్తోంది.ఇంటికొస్తానన్నారట కదా.తను ఆఫీస్ నుండి ఇప్పుడే వచ్చి స్నానం చేస్తోంది [...]
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు కోసం మేం హైదరాబాద్‌లో నడుస్తున్నాం. మీరు కూడా రండి! ఆదివారం, ఆగస్టు 29 - ఉదయం 8:00 గంటల నుండి 9:00 గంటల వరకు ★ తెలుగు తల్లి విగ్రహం నుండి - పీవీ జ్ఞానభూమి వరకు నడక
ఆదివారం రోజు అందరూ ఏం చేస్తారో నాకు తెలియదు. బహుశా ఆలస్యంగా నిద్రలేవడం,ఆలస్యంగా తిండి తినడం అన్నీ ఆరాంగా చేసుకుంటారనుకుంటాను.వారాంతపు ప్రయాణాలూ, సినిమాలూ,బయటి ఫుడ్. మిగిలిన రోజుల కన్నా భిన్నంగా గడపాలని అందరూ అనుకుంటారు. ఆదివారం నా వ్యవహారం కూడా భిన్నంగానే ఉంటుంది. పొద్దున్నే లేచేసి,ప్రాణాయామం చేసేసి, ఓ పది పేపర్లు ముందేసుకుని మా మామిడి చెట్టు కింద [...]
 అబ్బ!ఈ ఫోటోలన్నీ చూస్తుంటే ఎంత సంతోషమో.ఇంతమంది ప్రియ మిత్రులు.ఎంత స్నేహం పంచారో వర్ణించలేను.జీవితం పట్ల ప్రేమని,జీవించే కళని నాలో ప్రోది చేసింది నేస్తాలే.అక్షరాల పట్ల ఆరాధనని,ఆశయాల పట్ల నిబద్ధతని రగిలించింది ప్రియ మిత్రులే. అందరిని ఒక చోట చూస్తుంటే వాళ్ళ మీద ఉప్పొంగే ప్రేమ నన్ను ముంచెత్తుతోంది.ఎడమ నుంచి మొదలు పెడితే సన్నగా రివటలాగా నేను నాతో తొమ్మిదో తరగతిలో [...]
ఈ ఫోటో చూసారా?ఈవిడ మా అత్తగారు.వయసు 86 సంవత్సరాలు.ప్రతి సంవత్సరం ఆగష్ట్ 15,జనవరి 26 న మా ఇంట్లో జెండా ఎగరవేసేటప్పుడు ఆవిడ ఖచ్చితంగా ఉండాలి. నిన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ చేసిన సమయానికి ఆవిడ తయారుగా లేక మిస్ అయ్యారు.పెద్దావిడ కదా మెల్లగా నిద్రలేవడం,స్నానం చెయ్యడం ఏవో కారణాలు. అయితే తాను లేకుండా జెండా పండగ అయిపోయినందుకు అగ్గి మీద గుగ్గిలం అయ్యారంటే [...]
రెండు హృదయాల కలయిక మాత్రమే ప్రేమా? హృదయాల కలయిక అంటే ఏమిటి? ప్రేమ ఇంత సంకుచితమా? పసిమొగ్గల పాలబుగ్గల మీద మన పెదవిముద్ర ప్రేమ కాదా? చెంగున ఎగిరే లేగ దూడని అమాంతంగా పట్టుకుని గుండెకి హత్తుకోవడం ప్రేమ కాదా? విత్తును చల్లి,మొలక తొలిరేక విప్పుకుంటున్నప్పుడు ఉప్పొంగే ఉద్వేగం ప్రేమ కాదా? చెట్టు మీద,పుట్ట మీద,చెలమ మీద మబ్బు మీద, మంచు మీద, మహా సాగరం మీద కెరటం మీద,కాంతి [...]
ఈ రోజు మళ్ళీ మహిళా జైలు చూడ్డానికి వెళ్ళాను. నాతో పాటు హైదరాబాద్ లీగల్ సర్వీసెస్ అధారిటి సెక్రటరీ కూడా ఉన్నారు.ఇద్దరం కలిసి మొత్తం జైలు పరీక్షించాము.బారక్స్,వంట గది,కార్హానా,ఆసుపత్రి(జైల్లో పుట్టిన ముగ్గురు పసివాళ్ళున్నరు)అన్నీ చూసాము.ఖైదీలందరితోను మాట్లాడాం.వాళ్ళ కేసుల గురించి చర్చించాం. చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ళ కేసుల పరిష్కారం కోసం జైల్ అదాలత్ [...]
ఆహా ఏమి ఆ కల,ఎంత అద్భుతమైన కల నువ్వూ నేనూ పక్క పక్కనే నడుస్తున్నాం చేతిలొ చెయ్యేసి భుజం భుజం కలిపి ఆకుపచ్చటి పచ్చిక బయిళ్ళ మీద నేనొక అడుగు ముందుకెయ్య లేదు నువ్వొక అడుగు ముందుకెయ్యలేదు సమానంగా అడుగుల లయలో ఏకబిగిన నడుస్తున్నాం ఏవేవో అడ్డంకులులు ఎవరెవరివో ఆర్తనాదాలు సూట్కేసుల్లోంచి బట్టల్ని కుమ్మరించినట్టు ఆడపిల్లల శవాల దృశ్యాలు హాయిగా ఆడుకునే పసిపిల్లల [...]
ఆకాశం నిండా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. మే నెలలో హఠాత్తుగా ఎదురైన చల్లటి అనుభవం. నిన్నటిదాకా నలభై నాలుగు డిగ్రీల ఉష్ణాగ్రత. ఈ రోజు ఇరవై ఆరు. నిన్నటికి ఇవాల్టికి ఎంత తేడా. బంగాళాఖాతంలో పెనుతుఫాను. ఆ బీభత్సానికి ఎంత చక్కటి పేరు లైలా! క్రితం సంవత్సరం వచ్చిన తుఫాను పేరు ఐలా! ఈ పేర్లు ఎవరు పెడతారో! ప్రళయ విధ్వంశం సృష్టించే ప్రకృతి వైపరీత్యాలకు ఆడవాళ్ళ పేర్లు ఎందుకు [...]
1975 లో నేను మా సీతారామపురం నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చాను.మా నాన్న నన్ను తీసుకొచ్చాడు.మేము రైల్లో వచ్చాము.రైల్లో కూర్చున్నప్పుడు నా ఎదుటి సీట్లో ఒకాయన పొరపాటున కాలు తగిలితే గబుక్కున ఒంగి కాళ్ళు పట్టుకుని మరీ సారీ చెప్పినప్పుడు నేను భయపడి కాళ్ళు వెనక్కి లాక్కున్నాను.అంతవరకు అలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదు. మా నాన్న నేను రైలు దిగి ఆటోలో పాటిగడ్డ కాలనీకి,మా [...]
స్నేహం......మూడు అక్షరాల పదం. ఆ పదాన్ని పలుకుతుంటేనే జుంటితేనే జాలువారుతున్న అనుభూతి అక్షరాలు ఈ అనుభూతిని వ్యక్తీకరించగలవా? మానవ హృదయం నిమిషానికి డెబ్భై రెండు సారు కొట్టుకుంటుందట. లబ్.....డబ్.....ఒకటే లయ. ఈ లబ్ డబ్ లయలో ఇమిడిపోయింది నీ పేరు గుండె గవాక్షం లోకి చొచ్చుకు వచ్చింది నీ స్నేహం నవ్వుల నదిలో పువ్వున వాన నీతో నెయ్యం ఎన్ని అనుభూతుల కలనేత మన స్నేహం ఎన్నింటిని [...]
మొన్న ఒకాయన మీ సీతారాంపురం ఎక్కడ అని అడిగారు.మా ఊరికి ఒక పక్క గోదావరి మరో పక్క సముద్రం ఉంది.నర్సాపురానికికి, మొగల్తూరికి మధ్యలో ఉంది మా ఊరు.మొగల్తూరు అంటే గుర్తొచ్చింది.సినీ స్టార్,ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి రోజూ మేము వెళ్ళే బస్సులోనే కాలేజికి వెళ్ళేవాడు.చిరంజీవి వాళ్ళు పాతకాలవ అనే ఊళ్ళో ఉండే వాళ్ళు.అతను శ్రీ వై ఎన్ కాలేజి,నేను బిజిబిఎస్ వుమన్స్ [...]
ముసురుపట్టిన ఈ సాయంకాలం పదే పదే మా ఊరిని గుర్తుకు తెస్తోంది.ఇలాంటి సాయంకాలాలంటే చిన్నప్పుడు ఎంత ఇష్టంగా ఉండేది. వర్షం మీద ఇష్టం కాదు.ముసురు పట్టిన సాయంకాలాల్లో మాత్రమే చేసే చింతపండు,ఆవపిండి తో చేసే ఘాటైన పులిహోర మీద ప్రేమ.ఇంకేమీ వండే వాళ్ళు కాదు.కంచం నిండా కావలసినంత పులిహోర,ఆవకాయ ముక్క.అంతే.అబ్బ! ఎంత బావుండేది.ముక్కులు ఎగపీల్చుకుంటూ వేడి వేడిగా తిటుంటే నా సామి [...]
కొంతమంది సాహితీ మిత్రులం కలిసి మార్చి నెలలో విశాఖ పట్టణం వెళ్ళేం.ఆ ముందు రోజు భల్లుగూడా వెళ్ళేం.చాలా కష్టపడి కొండలెక్కి గుట్టలెక్కి,అడవిదారిన పడి నడుస్తూ భల్లుగూడా వెళ్ళొచ్చాం.పోలీసుల అత్యాచారాలకు గురైన గిరిజన మహిళలతో మాట్లాడాం.తిండి తిప్పలు లేకుండా అర్ధ రాత్రి వైజాగ్ చేరాం. నిద్రలేని రాత్రి గడిపి ఉదయాన్నే ఊరి మీద పడ్డాం. శ్యామల గారు "మీ స్ఫూర్తితో కారు కొని [...]
కొంతమంది సాహితీ మిత్రులం కలిసి మార్చి నెలలో విశాఖ పట్టణం వెళ్ళేం.ఆ ముందు రోజు భల్లుగూడా వెళ్ళేం.చాలా కష్టపడి కొండలెక్కి గుట్టలెక్కి,అడవిదారిన పడి నడుస్తూ భల్లుగూడా వెళ్ళొచ్చాం.పోలీసుల అత్యాచారాలకు గురైన గిరిజన మహిళలతో మాట్లాడాం.తిండి తిప్పలు లేకుండా అర్ధ రాత్రి వైజాగ్ చేరాం. నిద్రలేని రాత్రి గడిపి ఉదయాన్నే ఊరి మీద పడ్డాం. శ్యామల గారు "మీ స్ఫూర్తితో కారు కొని [...]
నాకు చట్రాలను చూస్తే చచ్చే భయం అలాగని చావంటే భయమేలేదు పుట్టిన క్షణమే చావూ సిద్ధమయ్యే ఉంటుంది అలాగని క్షణక్షణం చావక్కరలేదుగా బతకడం ఎంత సంబరమో కొందరికి చెట్టుని చూస్తే సంబరం పిట్టని చూస్తే రివ్వున ఎగరాలన్నంత ఉత్సాహం ఆకాశంలోని నీలం రంగు అవని అంతా కమ్ముకున్న నల్ల రంగు,ఎర్ర రంగు తొలి వేకువలో తూరుపు సింధూరం సాయం సంధ్యలో కెంజాయ ఆషాడమాసంలో ఉరుముతూ వేంచేసే తొలి [...]
మానవజాతిపై తన పంజాను విసిరి విధ్వంసం సృష్టిస్తున్న వైరస్‌కి పాతికేళ్ళు నిండాయి. ఈ ఇరవై అయిదు సంవత్సరాలలో కోట్లాదిమంది దీని బారిన పడ్డారు. ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోని ఏదో మూల ప్రతిరోజూ ఎవరో మరణిస్తూనే వున్నారు. చికిత్స లేని ఈ వైరస్ సృష్టిస్తున్న విధ్వంసానికి యువత, స్త్రీలు, అమాయక పిల్లలు ఆహుతైపోతున్నారు. ఇదేమీ ప్రకృతి వైపరీత్యం కాదు. ఇంతమంది చనిపోవడానికి [...]
తెల తెల్లటి సంపెగపూలు ఎర్రెర్రటి అనార్ పూలు పాలనురుగులాంటి నక్షత్రపుష్పాలు నల నల్లని మబ్బుతునకలు చల చల్లని చిరుజల్లులు హాయైన వేళ మనసు ఊయలలూగే ఈ వేళ నేస్తం! నీ చేతిలో చెయ్యేసి ఆకాశం అంచుల దాకా నడవాలనిపిస్తుంది. అంతు దరిలేని కబుర్లని కలబోసుకోవాలనిపిస్తుంది.
అభివృద్ధి పేరు మీద జరుగుతున్న విధ్వంశంలో మరో నలుగురు అమాయక రైతు,మత్స్యకారుల బలిదానం జరిగింది.టి వి.లో కనబడిన భయానక,బీభత్స దృశ్యాలు మనస్సును కలిచివేసాయి.గుండెల్లో మంట పుట్టించాయి.పచ్చటి పంట పొలాలతో,మత్స్యకారులకు జీవికనిచ్చే జలాశయాలతో నిండి ఉన్న ప్రాంతాన్ని ధర్మల్ ప్రాజెక్టుకు కట్టబెట్టాలనే దుర్మార్గాన్ని అందరూ వ్యతిరేకించాలి.మా పొలాలను ఇవ్వమనే హక్కు [...]
భారతదేశంలో లైంగిక అసమానతల్ని రూపుమాపే దిశగా, మహిళలపై హింసని నిర్మూలించడం, లింగ వివక్షతపై చైతన్యం కల్గించడం, మహిళా సాధికారతవంటి కార్యక్రమాలతో ఆక్స్‌ఫాం ఇండియా పనిచేస్తోంది. మహిళలపై నానాటికీ పెచ్చరిల్లుతున్న హింస మానవహక్కుల విఘాతంగా పరిణమిస్తున్న నేపధ్యంలో బాధితుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్‌స్టేషన్‌లలో మహిళా సహాయక కేంద్రాలను నెలకొల్పడమన్నది ఒక [...]
నిన్న నేను చంచల్ గూడా లోని మహిళ జైలు కు వెళ్ళాను. నేను అరెస్ట్ అయ్యి వెళ్ళేననుకునేరు. జైలులో ఉన్న మహిళల సమస్య లు తెలుసుకునేందుకు,వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఐ జి ప్రిజన్స్ నాకు అనుమతి ఇచ్చారు. నేను ప్రతి పదిహేను రోజులకు ఒకసారి జైలుకు వెళ్ళొచ్చు. మహిళా ఖైదీలతో మాట్లాడవచ్చు.వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చెయ్యొచ్చు. నిన్న దాదాపు వందమందితో మాట్లాడాను. వాళ్ళ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు