.రాయటం ఎలా వస్తుంది రాస్తూ ఉ౦డటం వలన.జ్ఞానం ఎలా వస్తుందిప్రశ్నను కూడా ప్రశ్నించడం వలన.శక్తి ఎలా వస్తుందినిన్ను నువ్వు నమ్మడం వలన.మార్పు ఎలా వస్తుంది మలుపులను సైతం ప్రేమిస్తూ ఉ౦డటం వలన.నేర్పు ఎలా వస్తుంది సాధన చేస్తూ ఉ౦డటం వలన.తెగింపు ఎలా వస్తుందితర్కాన్ని మదిస్తూ ఉ౦డుటవలన.గమ్యం ఎలా చేరువవుతుందినీ దిశను గమనిస్తూ ఉ౦డటం వలన.కీర్తి ఎలా వస్తుందిచేస్తున్న ప్రతి పనిని [...]
రెండు కన్నులు ఉన్నా ప్రతిరోజూ నిన్ను చూడలేను...రెండు చెవులు ఉన్నా ప్రతిరోజూ నీ మాట వినలేను...కానీ ...ఉన్నా ఒక్క హృదయంలోనీ నీ గుర్తులు మాత్రం ఎప్పుడు మరువలేను.
పువ్వు రాలిందని కలవరపడకు, వచ్చే వసంతానికి స్వాగతం పలుకు ...కాళరాత్రి చూసి కలతచెందకు,వచ్చే ప్రశాంత శుభోదయం కొరకు వేచి చూడు ...జీవిత పాలసముద్రాన్ని ప్రేమతో చిలుకు,వచ్చే అమృతం కొరకు ఆశతో వేచి చూడు ... కలతచేందే హృదయాలలో వెలుగు నింపు,కష్టాల్లో ఉన్నవారికి ఆనందాన్ని పంచు ...శాశ్వతం కానీ జీవితంలో కక్షలను దరి రానీయకు,క్షణ కాలమైన ఇతరులకు ప్రేమను పంచు ...
రాలిన నీ జ్ఞాపకాల ఆకుల్ని ఏరుకుంటాను.ఏరిన జ్ఞాపకాలు మంచు ముత్యాలై మనసును చల్లబరుస్తుంటాయి.చల్లబడిన మనసుకు ఎటుచూసినా వెన్నెల కాసినట్టు నువ్వే కనబడతావు.అలా భ్రమల జడివానలో తడిచి ముద్దవుతుంటాను.నీ కోసం వేచి చూసే నా వేడి నిట్టూర్పుల సెగల్లో మాడుతుంటాను.కొన్ని క్షణాల్లోనే శిశిర, హేమంత, శరద్, వర్ష, గ్రీష్మాలన్నీ చూస్తాను ...వసంతంలా నువ్వు వస్తావని.
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు