రాత్రి ఒక టీవీ అమరావతి బాండ్లు గురించిన చక్కటి అంశాన్ని చర్చకు తీసుకుంది. మూడు ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ముగ్గురూ ఘనాపాటీలే. విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళే. ఎవరి వాదాన్ని వాళ్ళు వినిపించడమో, తమకు తెలిసిన దాన్ని వివరించడమో చేస్తే బాగుండేది. ఎంతసేపటికీ ఎదుటివాళ్ళ వాదాన్ని పూర్వపక్షం చేయడానికే సమయాన్ని వినియోగించుకున్నట్టు అనిపించింది. టీవీలు [...]
ఇంకా ఎందరో వుండి ఉండొచ్చు. కానీ నాకు తెలిసి ముగ్గురే ముగ్గురు నా తరం వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, నేను కలిసి పనిచేసిన వాళ్ళు. ఈ మువ్వురూ ఏనాడూ ఎవరి దగ్గరా నెల జీతం తీసుకుని ఉద్యోగం చేసి ఎరుగరు. ఒకరు సురమౌళి, రెండో వారు గుడిపూడి శ్రీహరి, మూడో వ్యక్తి వేదగిరి రాంబాబు. మొదటి ఇద్దరూ తమ రచనావ్యాసంగంతో పాటు రేడియోలో అప్పుడప్పుడూ ప్రాంతీయ వార్తలు చదివేవాళ్ళు. ఇక రాంబాబు. [...]
భారత ప్రధమ ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మరణించారు. దేశం యావత్తూ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ రోజుల్లో అటల్ బిహారీ వాజ్ పాయ్ ప్రతిపక్ష జన సంఘ్ నాయకుడు. నెహ్రూ కాంగ్రెస్ కూ వాజ పాయ్ జన సంఘ్ కూ అన్ని విషయాల్లో చుక్కెదురు. అయినా  నెహ్రూ  గురించి వాజ్ పాయ్  ఏమన్నారో తెలుసుకుంటే ఆయన హుందాతనం బోధపడుతుంది. Sir, a dream has been shattered, a song silenced, a flame has vanished in the infinite. It was the dream of a world without fear and [...]
అటల్ బిహారీ వాజ్ పాయ్ విదేశాంగ మంత్రి. అప్పటివరకు ఢిల్లీ సౌత్ బ్లాక్ లో ఉంటూ వచ్చిన నెహ్రూ చిత్రపటం కనబడకపోవడాన్ని ఆయన గమనించారు. నెహ్రూ ఫోటోను తక్షణం అక్కడ పెట్టాలని ఆదేశించడం, అది అమలుకావడం జరిగింది. ఈ రోజుల్లో ఈ హుందాతనాన్ని ఊహించగలమా?పార్లమెంటులో ప్రసంగిస్తూ వాజ్ పాయ్ ఆనాటి ప్రధాని నెహ్రూను తీవ్రంగా విమర్శించారు. ఆ సాయంత్రం అటల్ బిహారీ వాజ్ పాయ్ పార్లమెంటు [...]
రాహుల్ గాంధి విలేకరుల గోష్టిలో ఒక సన్నివేశం చోటు చేసుకుంది. విలేకరుల ప్రశ్నల్లో భాగంగా టీవీ 5 ఎక్జిక్యూటివ్ ఎడిటర్ విజయ్ నారాయణ్ రాహుల్ పై ఒక ప్రశ్న సంధించారు, ‘రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ పార్టీకి వంద లేదా అంతకంటే ఎక్కువ స్థానాలు వస్తాయనుకుంటున్నారా’ అని. అంతటితో ఆగకుండా ‘పోనీ, రెండువందలు ప్లస్ రావడానికి ఛాన్సుందా’ అని రెట్టించారు. దాంతో రాహుల్ గాంధీ [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు