శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 12 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - విల్లది రామునకునైన విరువదరమ్మే.  కందము:  చల్లని సాయం సమయము మెల్లగ తుంపరలజల్లు, మిన్నున గనగా  నల్లన సరి విరిసిన హరి   విల్లది, రామునకునైన విరువదరమ్మే?
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 12 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ దత్తపది: మేరీ - యేసు - సిలువ - చర్చి....శ్రీకృష్ణుని స్తుతి మత్తేభము:  కనగా భాసిలు వజ్ర దేహుడు మహా కారుణ్య కాశమ్ముతో  చొనిపెన్ గాభువి శాంతినిండ నదియే సుజ్ఞానమౌ గీతగా  వినుమేరీతిగ నైన మాధవుమదిన్ వేడంగ రక్షించుగా  జనులన్ బ్రోవగ వాడె దిక్కుగదరా చర్చింప నేముండురా!
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 12 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - కుట్మలదంతీ కలిగెను గోరిక నీపై.  కందము:  ఖాట్మండు నుండి నీవే  చాట్మని ఫేస్బుక్కులోన చాటింగిడుచున్ జూట్మిల్ వద్దకు రమ్మన  కుట్మలదంతీ కలిగెను గోరిక నీపై.
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.."పితృవాక్పాలనమె సుతుని వృషలున్ జేయున్"(లేదా...)"పితృ వాక్పాలన మొక్కటే సుతునిఁ బాపిన్ జేయు నెల్లప్పుడున్"
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు