ఎన్నిరాత్రులు ... ఎన్ని పగళ్లు ....  ఈ ఎదురుచూపులు ..  నీవు వస్తావని ....  కలలన్నీ ఆవిరిలా  కరిగిపోయాయి ....   నా కన్నీటిని అందులో కలిపేసుకుని.... ఆకాశానికి ఎగిరిపోయాయి .  నిట్టూర్పులు వాకిట్లో దీపాలు పెడుతున్నాయి...  కళ్ళు కలువరేకులై, సూర్యుని తాపానికి తాళలేక వసివాడిపోయాయి ...  ఎన్నిరాత్రులు... ఎన్ని పగళ్లు ....  ఈ ఎదురుచూపులు ..  నీవు వస్తావని ....  ఆశెల బాసలను మోసుకొచ్చే
తెల్లవారుఝామున ఎప్పుడో ... చటక్కున మెలకువ వచ్చేసింది. ఎదురుగా గాజు కిటికీ..... అందులోనించి గుడ్డి దీపాల మసక మసక వెలుతురు.. ఆ వెలుతురులో చమక్కు మంటున్న  నల్లటి చెట్ల చేతుల్లో తెల్లటి గులాబి మొగ్గలు. ఎలా? ఇది ఎలా? కళ్ళు నులుముకుని చూద్దును కదా!.... మంచు పూల వాన.. ఆగుతూ ... కురుస్తూ... చూస్తుండగానే... సన్నని ముత్యాలై.. తళతళ తళుకులీనే తగరపు కాగితాలై.. విరజాజులై.. సన [...]
విజయవాడ ప్రయాణం అనేది చాలా సామాన్యమైన విషయం. బెజవాడేమీ అమ్రీకా కూడా కాదు వెళ్లలేకపోవడానికి. కానీ సంసారసాగరంలో పడ్డాకా మళ్ళీ వెళ్ళాడమే కుదర్లేదు. పాతికేళ్ళ పైగా నేను పెరిగి, తిరిగిన నా బెజవాడని వదిలి పన్నెండేళ్ళు అయ్యింది. మధ్యలో ఏవో పనుల మీద రెండుసార్లు వెళ్లాను కానీ అరపూటో, పూటో ఉండి వెళ్ళిన పనయ్యాకా వెనక్కు వచ్చేసానే తప్ప ఉండటానికి వీలవలేదు. ఇన్నాళ్ళకి [...]
కేవలం ఉత్తర భారత దేశంలోనే కాదు ఇవాళ్టి రోజున దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వేకువ ఝామున, సాయంత్రాల్లోనూ.. వీధి సందు మలుపుల్లో, బజార్లలో, ఫంక్షన్ ప్లేసెస్ లో, సందర్శనా స్థలాల్లో ఓ నాలుగు చెక్రాల చెక్క బండి కనిపిస్తుంది. దాని మీద ఓ పక్కగా చిన్న స్టౌ, ఒక పొయ్యి మీద మరుగుతూన్న టీ పొడి, మరో పొయ్యి మీద మరుగుతున్న పాలు, పక్కనే సీసాల్లో పుదీనా ఆకులు, నిమ్మ చెక్కలూ, టీ [...]
కొన్ని నెలల క్రితం ఓ రోజు ఎఫ్.ఎం వింటూంటే "ఎవడే సుబ్రహ్మణ్యం" షూటింగ్ కబుర్లు చెప్పారొక ఆర్.జె. హిమాలయాల్లో చలిలో ఎన్ని ఇబ్బందులు పడుతూ షూటింగ్ కొనసాగిస్తున్నారో.. ఆ విశేషాల గురించి నానీ ఏం మాట్లాడాడు అవన్నీ చెప్పారు. అసలు మామూలుగానే నాకు హిమాలయాలు, అక్కడ యోగులూ, రహస్యాలూ లాంటి కబుర్లంటే మహా ఇష్టం. సో, హిమాలయాల్లో అంత ఎత్తున, అంత చలిలో ఏం షూటింగబ్బా...? ఏం కథా? అని [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు