శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 01 - 2018 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - బూతు పురాణమ్ముఁ జదువఁ బుణ్యం బబ్బున్. కందము:  ప్రీతిగ కొందరు కావ్యపు  వ్రాతల రామాయణమ్ము రంకనిరి గదా!  పూత చరిత్రుల కథ నా  'బూతు పురాణమ్ముఁ' జదువఁ బుణ్యం బబ్బున్.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29- 01 - 2018 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు తేటగీతి:  తనదు చీరెల సొమ్ములన్ తరచి చూచి  తమకు లేవని లోలోన కుమిలి తలచు  ఎదర ప్రక్కింటి వారల ఈర్ష్య మరియు  దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు. 
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17- 01 - 2018 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - రణమే యవధానమందు రహి మంగళమౌ కందము: గణములు యతులును తప్పక  వణకక నిచ్చిన సమస్య వాక్చాతురితో  చెణుకులతో సరసపు పూ  రణమే యవధానమందు రహి మంగళమౌ.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 01 - 2018 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - రామునకు మువ్వురు సతు లారతు లొసగిరి తేటగీతి:  పుట్టినదినము వేడుక బూని సేయ హారతిమ్మని జెప్పగా దారలకును దశరథుండట, ముందుగా దరినిజేరి రామునకు, మువ్వురు సతు లారతు లొసగిరి
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 12 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ   దత్తపది: హస్త-చిత్త-స్వాతి-మూల....షడ్రసోపేత భోజనాన్ని వర్ణిస్తూ తేటగీతి:  స్వాతిశయమున తెల్గుభోజనము దినుడు ఆహ!స్తవనీయ మైయుండు నారు రుచుల  చిత్తమందున మరువరు జిహ్వ రుచుల మొత్తమారోగ్య కరమౌను మూలబడరు.
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు